Rana Naidu
-
బాబాయ్- అబ్బాయి క్రేజీ సిరీస్.. సీక్వెల్ వచ్చేస్తోంది!
టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో వచ్చిన వెబ్‌సిరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా గతేడాది రిలీజైన ఈ సిరీస్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ షేర్ చేసింది.రానా నాయుడు.. సీజన్ 2 షూటింగ్ ప్రారంభించినట్లు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి షూటింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే రానా, వెంకటేశ్‌ల మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే సీజన్ 2 ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు ఆదరణ దక్కడంతోనే సీజన్-2ను ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది.కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.Rana Naidu Season 2 is now f̶i̶x̶i̶n̶g̶ filming 🔥#RanaNaiduOnNetflix pic.twitter.com/5Xh5zq8nGU— Netflix India (@NetflixIndia) July 23, 2024 -
2023 రౌండప్: ఈ ఏడాది ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాలు ఇవే!
మనకు ఏ డౌట్ వచ్చినా గూగుల్ మీదే ఆధారపడతాం.. సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలన్నా గూగులమ్మనే ఆశ్రయిస్తాం. దాదాపు అన్ని ప్రశ్నలకు వీలైనన్ని ఎక్కువ సమాధానాలిచ్చుకుంటూ పోతూనే ఉంటుందీ సెర్చ్ ఇంజన్. అలా గూగుల్‌లో ఈ ఏడాది చాలామంది కొన్ని సినిమాల గురించి తెగ వెతికేశారట. 2023లో ఇండియాలో ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్ 10 చిత్రాలివే అంటూ గూగుల్ తాజాగా ఓ జాబితాను రిలీజ్ చేసింది. ఆ సినిమాలేంటి? అందులో సౌత్‌నుంచి ఎన్ని ఉన్నాయి? ర్యాంకులవారీగా ఓ లుక్కేయండి.. ఈ ఏడాదికిగానూ ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్ 10 చిత్రాలు ► 1. జవాన్ ► 2. గదర్ 2 ► 3. ఓపెన్‌హైమర్ ► 4. ఆదిపురుష్ ► 5. పఠాన్ ► 6. ది కేరళ స్టోరీ ► 7. జైలర్ ► 8. లియో ► 9. వారిసు/ వారసుడు ► 10. టైగర్ 3 ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ 10 షోలు, వెబ్ సిరీస్‌లు.. ► 1.ఫర్జి ► 2. వెడ్నస్డే ► 3. అసుర్ ► 4. రానా నాయుడు ► 5. ద లాస్ట్ ఆఫ్ అస్ ► 6. స్కామ్ 2003 ► 7. బిగ్‌బాస్ 17 ► 8. గన్స్ అండ్ గులాబ్స్ ► 9. సెక్స్/ లైఫ్ ► 10. తాజా ఖబర్ చదవండి: Vyooham: ఓటీటీలో వ్యూహం.. అప్పటినుంచే స్ట్రీమింగ్! -
రానా నాయుడులో దుమ్ములేపిన భామ గురించి ఈ విషయాలు తెలుసా?
బుల్లితెరపై కనిపిస్తే.. వెండితెర అవకాశాలు తగ్గుతాయనే మాట అసత్యమని ఇప్పటికే చాలామంది నటీనటులు నిరూపించారు! ఆ జాబితాలో బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా కూడా ఉంది. దశాబ్ద కాలంగా టీవీ సీరియల్స్‌లో నటిస్తూనే అటు సినిమా అవకాశాలనూ అందుకుంటూ.. ఇప్పుడు వెబ్ స్క్రీన్ మీదా స్టార్‌గా వెలిగిపోతోంది. సుర్వీన్ చండీగఢ్‌లో జన్మించింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకుంది. (ఇదీ చదవండి: గతంలో విడాకులు.. అయితే మళ్లీ ప్రేమను పొందే అర్హత లేదా?: నటి) దీంతో మొదట మోడలింగ్ చేసి ఆ తర్వాత నటిగా మారింది. ‘కహీ తో హోగా’ అనే టీవీ సీరియల్‌తో నటిగా కెరీర్ ప్రారంభించింది. అందులో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించడంతో సీరియల్స్‌తోపాటు, సినిమా అవకాశాలూ రావడం మొదలుపెట్టాయి.దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘రంగోలీ’ కార్యక్రమానికి దాదాపు ఐదేళ్లు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.కన్నడంలో విడుదలైన ‘పరమేశ పాన్వాలా’తో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన రెండో చిత్రంతోనే మోహన్‌బాబు, శర్వానంద్ ‘రాజు.. మహారాజు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పలు పంజాబీ, తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించింది. ‘హిమ్మత్వాలా’, ‘క్రియేచర్ 3డీ’, ‘వెల్కమ్ బ్యాక్’ సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది సుర్వీన్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో.. లావుగా ఉంటే అవకాశాలు రావంటూ కొందరు నన్ను బాడీ షేమింగ్ చేశారు. వాటిని పట్టించుకోలేదు. కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నానని తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పార్చ్డ్’ సినిమాలో తన ప్రతిభకు పురస్కారం అందుకుంది. ఆ సినిమాలో తను రకుల్‌తో చేసిన కొన్ని సీన్స్ వివాదస్పదం అయ్యాయి. ‘24’ సీజన్ 2తో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి, అక్కడ కూడా వరుస సిరీస్‌లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం నెట్‌ఫిక్ల్స్‌లో ప్రసారంలో ఉన్న ‘రానా నాయుడు’తో వీక్షకులను అలరిస్తోంది. (ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ.. కంట్రోల్లో లేని బరువు? కలవరపడుతున్న ఇలియానా!) -
ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌లు ఇవే! టాప్ 5లో ఏమున్నాయంటే?
ఓటీటీల రాకతో ఎంటర్టైన్మెంట్ డబుల్ అయిందనే చెప్పాలి. కాలక్షేపం కోసం థియేటర్ దాకా వెళ్లనవసరం లేకుండా గడప దాటకుండానే అరచేతిలో కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. థియేటర్లో రిలీజైన సినిమాలతో పాటు ప్రత్యేకంగా కంటెంట్ క్రియేట్ చేసుకుని మరీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు లేదా కొత్త వెబ్ సిరీస్‌లతో మస్త్ మజా అందిస్తున్నాయి. దీంతో గడిచిన రెండేళ్లలోనే ఓటీటీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారి అభిరుచికి తగ్గట్లుగానే కామెడీ, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని రకాల కంటెంట్‌ను అందిస్తోంది. ఈ సినిమాలు, సిరీస్‌లపై రివ్యూలు ఇచ్చే ఐమ్డీబీ ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. సాక్ర్డ్ గేమ్స్, మీర్జాపూర్, స్కామ్, ద ఫ్యామిలీ మ్యాన్, ఆస్పిరంట్ టాప్ 5 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరి ఇంకా ఏయే సిరీస్‌లు ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నాయి? అవి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో కింది పట్టికలో చూసేయండి. వాటిలో మీకు నచ్చినవాటిని వీకెండ్లో చూసేయండి. ర్యాంక్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 1 సాక్ర్డ్ గేమ్స్ నెట్‌ఫ్లిక్స్ 2 మీర్జాపూర్ అమెజాన్ ప్రైమ్ 3 స్కామ్ 1992 సోనీలివ్ 4 ద ఫ్యామిలీ మ్యాన్ అమెజాన్ ప్రైమ్ 5 ఆస్పిరంట్స్ యూట్యూబ్ 6 క్రిమినల్ జస్టిస్ హాట్‌స్టార్ 7 బ్రీత్ అమెజాన్ ప్రైమ్ 8 కోటా ఫ్యాక్టరీ నెట్‌ఫ్లిక్స్ 9 పంచాయత్ అమెజాన్ ప్రైమ్ 10 పాతాళ్ లోక్ అమెజాన్ ప్రైమ్ 11 స్పెషల్ ఓపీఎస్ హాట్‌స్టార్ 12 అసుర్: వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్ జియో సినిమా 13 కాలేజ్ రొమాన్స్ సోనీలివ్ 14 అఫరన్ జియో సినిమా 15 ఫ్లేమ్స్ అమెజాన్ ప్రైమ్ 16 దిండోరా యూట్యూబ్ 17 ఫర్జి అమెజాన్ ప్రైమ్ 18 ఆశ్రమ్ MX ప్లేయర్ 19 ఇన్సైడ్ ఎడ్జ్ అమెజాన్ ప్రైమ్ 20 ఉందేఖి సోనీలివ్ 21 ఆర్య హాట్‌స్టార్ 22 గుల్లక్ సోనీలివ్ 23 టీవీఎఫ్ పిచర్స్ జీ5 24 రాకెట్ బాయ్స్ సోనీలివ్ 25 ఢిల్లీ క్రైమ్స్ నెట్‌ఫ్లిక్స్ 26 క్యాంపస్ డైరీస్ MX ప్లేయర్ 27 బ్రోకెన్: బట్ బ్యూటిఫుల్ MX ప్లేయర్ 28 జంతారా: సబ్కే నంబర్ ఆయేగా నెట్‌ఫ్లిక్స్ 29 తాజ్ ఖబర్ హాట్‌స్టార్ 30 అభయ్ జీ5 31 హాస్టల్ డేస్ అమెజాన్ ప్రైమ్ 32 రంగ్‌బాజ్ జీ5 33 బందిష్ బందిత్స్ అమెజాన్ ప్రైమ్ 34 మేడ్ ఇన్ హెవన్ అమెజాన్ ప్రైమ్ 35 ఇమ్మాచ్యూర్ అమెజాన్ ప్రైమ్ 36 లిటిల్ థింగ్స్ నెట్‌ఫ్లిక్స్ 37 ద నైట్ మేనేజర్ హాట్‌స్టార్ 38 క్యాండీ జియో సినిమా 39 బిచ్చూ కా ఖేల్ జీ5 40 దహన్: రాఖన్ కా రహస్య హాట్‌స్టార్ 41 జేఎల్ 50 సోనీలివ్ 42 రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్ 43 రే నెట్‌ఫ్లిక్స్ 44 సన్‌ఫ్లవర్ జీ5 45 ఎన్సీఆర్ డేస్ యూట్యూబ్ 46 మహారాణి సోనీలివ్ 47 ముంబై డైరీస్ 26/11 అమెజాన్ ప్రైమ్ 48 చాచా విధాయక్ హై హమారా అమెజాన్ ప్రైమ్ 49 యే మేరీ ఫ్యామిలీ అమెజాన్ మినీ టీవీ 50 అరణ్యక్ నెట్‌ఫ్లిక్స్ View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) చదవండి: పంచెకట్టులో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్ -
విక్టరీ వెంకటేష్ దక్షిణ భారత స్టార్ నుండి పాన్ ఇండియన్ స్టార్ గా...
-
వెంకీ మామ ఈ సిరీస్ మనకొద్దురా రామా..
-
రానా నాయుడు 2 వెంకటేష్ పరిస్థితి ఏంటో?
-
Rana Naidu 2: గెట్ రెడీ..రానా నాయుడు సీజన్-2 వచ్చేస్తోంది
దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానాలు తొలిసారి కలిసి నటించిన వెబ్‌సిరీస్ రానా నాయుడు. ఇటీవల విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ సిరీస్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక వ్యూవర్ షిప్‌లోనూ రానా నాయుడు దూసుకుపోతుంది. ఓటీటీలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న రానా నాయడు ఇప్పుడు సీజన్-2తో వచ్చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఈ మేరకు గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. 'బాధపడకండి, మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగొస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 త్వరలో రాబోతోంది'.. అంటూ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. కాగా కంటెంట్ పరంగా ఈ సిరీస్‌కు మంచి పేరొచ్చినా, అశ్లీలత, అసభ్యకర సన్నివేశాలతో విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. మరి సీజన్-2 ఏ విధంగా ఉండనుందన్నది చూడాల్సి ఉంది. Don’t worry, the Naidus are coming back to sort out all your kiri kiri ♥🔥#RanaNaidu season 2 is coming soon! pic.twitter.com/KVJDrIB5wH — Netflix India (@NetflixIndia) April 19, 2023 -
రానా నాయుడు వెబ్ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం!
టాలీవుడ్ స్టార్స్ విక్టరి వెంకటేశ్, రానా దగ్గుబాటిలు నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇటీవల విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ సిరీస్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక వ్యూవర్ షిప్లో రానా నాయుడు దూసుకుపోతుంది. ఓటీటీలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న రానా నాయడుపై అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో అశ్లీలత ఎక్కువగా ఉందంటూ పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: తండ్రి ఫొటో పట్టుకుని తారకరత్న కొడుకు అలా.. అలేఖ్య పోస్ట్ వైరల్ ఇందులో సెన్సార్‌కు మించి అసభ్య పదాలు, శృంగారపు సన్నివేశాలు అధికంగా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రానా నాయుడు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్పై నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రానా నాయుడు సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లో అభ్యంతకర భాష ఎక్కువగా ఉండటంతో ఈ తెలుగు ఆడియోను తొలగించాలని నెట్‌ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటించనుందట. తెలుగు ఆడియో తొలగించడానికి ప్రధాన కారణం అసభ్య పదాలు ఎక్కువగా ఉండటమే అని తెలుస్తోంది. ఇక మార్చి 10న స్ట్రీమింగ్ అయిన రానా నాయుడు వెబ్ సిరీస్ పది ఎపిసోడ్స్ ఉంది. ఎక్కువ మెుత్తంలో అడల్డ్ కంటెంట్ ఉండటంతో.. నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో నటించినందుకు గాను విక్టరీ వెంకటేష్ దాదాపుగా రూ.12 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం. రానా రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. చదవండి: వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి మేనక కాగా అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' సిరీస్‌లో బాలీవుడ్ నటి మాధురి ధీక్షిత్ను అవమారిచే విధంగా వ్యాఖ్యలు ఉండటంతో రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ మండపడిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆయన నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే రానా నాయుడు విషయంలో నెట్‌ఫ్లిక్స్ జాగ్రత్త పడినట్లు కూడా తెలుస్తోంది. -
రానా నాయుడు వెబ్ సిరీస్ పై విజయశాంతి ఆగ్రహం
-
ఉద్యమాల వరకు తెచ్చుకోకండి: వెబ్‌సిరీస్‌పై విజయశాంతి ఫైర్
థియేటర్లో రిలీజయ్యే సినిమాలకు సెన్సార్ తప్పనిసరి. అసభ్యత, హింస మితిమీరకుండా సెన్సార్ అడ్డుకుంటుంది. కానీ ఓటీటీకి ఎలాంటి పరిమితులు లేవు. ఎటువంటి కంటెంట్ అయినా వాడేస్తోంది. అందులో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లకు షరతులు విధించే సెన్సార్ లేకపోవడంతో అసభ్యమైన సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇటీవల వెంకటేశ్, రానా సైతం ఇలాంటి కంటెంట్‌కే ఓటేస్తూ రానా నాయుడు సిరీస్ చేసిన విషయం తెలిసిందే! ఈ సిరీస్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటి విజయశాంతి 'ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ఓటీటీ సిరీస్ గురించి..' అంటూ రానా నాయుడు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ సిరీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు కూడా కఠినమైన సెన్సార్ విధానం ఉండి తీరాలి. తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నా. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సిరీస్‌ను నటులు, నిర్మాతలు వెంటనే ఓటీటీ నుంచి తొలగించాలని కోరుతున్నా. భవిష్యత్తులో కూడా ఓటీటీ ప్రసారాలలో ప్రజల నుంచి ప్రత్యేకంగా మహిళల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నా. ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది విజయశాంతి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ 'మీరు చెప్పింది అక్షరాలా నిజం మేడమ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
అదేం వెబ్ సిరీస్.. మన సంస్కృతి ఏమైపోతుంది: నటుడు షాకింగ్ రియాక్షన్
ఓటీటీలు వచ్చాక అడల్ట్ కంటెంట్, అభ్యంతరకర సన్నివేశాలతో వెబ్ సిరీస్‌లు ఎక్కువయ్యాయంటూ సీనియర్ నటుడు శివకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. గతంలో సెన్సార్ బోర్డు సభ్యుడిగా పని చేసిన ఆయన తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ.. ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉండాలన్నారు. ఈ మధ్య వెబ్ సిరీస్‌లో అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కువైపోయాయని, రీసెంట్గా ఓ వెబ్ సిరీస్ చూశానంటూ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ గురించి ఆయన చెప్పకనే చెప్పారు. చదవండి: ‘నాటు నాటు సాంగ్ పెడితేనే జెహ్ తింటున్నాడు, అది కూడా తెలుగులోనే’ ‘నిన్నే ఓ వెబ్ సిరీస్ చూశా. మరి దారుణంగా ఉంది. ఆల్ మోస్ట్ అది ఓ బ్లూ ఫిలిమే అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఇలాంటి దారుణమైన సినిమా చూడలేదు. ఇది మన సంసృతి, కల్చర్ కాదు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమానా? అది’ అంటూ పైర్ అయ్యారు. అసలు ఇంట్లో బెడ్ రూమ్, కిచెన్ ఎందుకు ఉంటాయి. భార్య భర్తలు బెడ్రూంలో పడుకుంటారు. బెడ్ రూం తలుపులు తీసి ఉంచడం.. పిల్లలు అది చూడటం ఏంటి? మన సాంప్రదాయం ఇదేనా? ఏమైపోతుంది మన సంసృతి’ అంటూ ఫైర్ ఆయన మండిపడ్డారు. ఇలాంటి వాటి వల్లే పిల్లలు చెడిపోతున్నారన్నారు. చదవండి: ‘కోపంతో పుష్ప 2 సెట్ వీడిన రష్మిక!’ బన్నీనే కారణమంటూ ట్వీట్ ‘దేశం ఆర్థికంగా పతనమైనా తిరిగి కోలుకుంటుంది. కానీ, సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడటం కష్టం. సినిమాల్లో బూతు ఉంటే, థియేటర్స్‌కి వచ్చిన వారికి మాత్రమే అది తెలుస్తుంది. అదే వెబ్ సిరీస్‌లు అలా కాదు. ఇలాంటివి చూడకుండా పిల్లలను నియంత్రించడం కష్టమైపోతోంది. ఈ మధ్య కాలంలో చాలామంది పాడైపోవడానికి కారణం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లే. అందుకే కచ్చితంగా ఓటీటీకి సెన్సార్ ఉండాల్సిందే’ అని శివకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కామెంట్స్ విన్న నెటిజన్లంతా ఆయన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఉద్దేశించే మాట్లాడారంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
వెంకటేశ్ నోట పచ్చిబూతులు.. వినలేకపోతున్నామంటున్న ఫ్యామిలీ ఆడియన్స్
-
కుడి కన్ను కనిపించలేదు, కిడ్నీ కూడా పాడైపోవడంతో.. : రానా
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికీ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు రానా. ఈ క్రమంలో తాజాగా మరో ఇంటర్వ్యూకి హాజరైన ఆయన గతంలో తను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చాడు. 'కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మాట్లాడే అతి తక్కువమందిలో నేను ఒకడిని. ఇదెలా మొదలైందంటే.. ఓ పిల్లవాడు తన తల్లికి కన్ను కనిపించడం లేదని ఎంతో బాధపడ్డాడు. అతడిని చూసి జాలేసింది. ప్రతిదానికి ఓ పరిష్కారం ఉంటుందని నచ్చజెప్పాను. అంతెందుకు, నాకు కూడా ఓ కన్ను కనిపించదని చెప్పాను. చాలామంది ఏదైనా శారీరక అనారోగ్యానికి గురైతే ఎంతో మనోవేదన చెందుతారు. చివరికి వారు కోలుకున్నా సరే నాకు ఇలా జరిగిందేంటి? అని పదేపదే దాని గురించే ఆలోచిస్తారు. అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నాకు కుడి కన్ను సరిగా కనిపించడం లేదని శస్త్రచికిత్స చేయించుకున్నా, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నా. చెప్పాలంటే నేనొక టెర్మినేటర్‌ని(నవ్వుతూ). మరి ఇన్ని చేయించుకున్నా నేను బాగానే ఉన్నాను కదా మరి మీరెందుకు అక్కడే ఆగిపోతున్నారు? అనవసర ఆలోచనలు మానేసి హాయిగా ముందుకు వెళ్లండి' అని చెప్పుకొచ్చాడు. కాగా రాగా 2016లో తన అనారోగ్య సమస్యల గురించి మొదటిసారి నోరు విప్పాడు. కుడి కన్ను ద్వారా సరిగా చూడలేకపోతున్నానని, పైగా కిడ్నీ కూడా పాడైందని చెప్పాడు. అయితే చికిత్స ద్వారా తాను పూర్తి స్థాయిలో కోలుకున్నానన్నాడు.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) -
నెగిటివ్ టాక్ వచ్చినా దూసుకుపోతున్న రానా నాయుడు..రీజన్ ఇదే!
సినీ ప్రేక్షకులకి ఎప్పుడు ఏది నచ్చుతుందో...ఏది నచ్చదో చెప్పటం కష్టం. అలా ఒకరికి నచ్చనది ఇంకొరికి నచ్చుతుంది. మెజార్టీ ప్రేక్షకులకి నచ్చినదే ఫైనల్ రిజల్ట్ అవుతుంది. ఈ విషయం రానా నాయుడు వెబ్ సిరీస్ విషయంలో ప్రూవ్ అయింది. టాలీవుడ్ ఇంతవరకు ఏ అగ్రహీరోలు కానీ...స్టార్ హీరోలు కానీ వెబ్ సిరీస్ లో నటించలేదు. ఫస్ట్ టైమ్ దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేశ్.. రానా కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించారు. నెట్ ఫ్లిక్స్ లో మార్చి 10 నుంచి రానా నాయుడు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ను అమెరికన్ డ్రామా రే డొనోవన్ కి రీమేక్ గా డైరెక్టర్స్ కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ కలిసి తెరకెక్కించారు. తెలుగు హీరోలు ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ కావటంతో రానా నాయుడుకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక వెంకటేశ్ ను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో వెంకటేశ్ తనకున్న ఫ్యామిలీ ఇమేజ్ కు భిన్నంగా ప్లే బాయ్ రోల్ లో కనిపించాడు. ఇక సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో వెంకీ మేనరిజమ్స్ ఆకట్టుకున్నా...బూతులు మాట్లాడటం టాలీవుడ్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక సోషల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ శృతి మించిదంటూ...ఫ్యామిలీ తో ఎలా కలిసి చూడాలంటూ నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. ఇక మీమర్స్‌కి రానా నాయుడు ఒక సోర్స్ గా మారింది. దీంతో రానా నాయుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సోషల్ మీడియా లో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింది..ఈ సిరీస్ ఇంతలా హాట్ టాపిక్ గా మారడానికి మెయిన్ రీజన్ వెంకటేశ్ పచ్చి బూతులు మాట్లాడడమే. వెంకీ తన కెరీర్ లో ఏ సినిమాలో కూడా ఇలాంటి బూతులు మాట్లాడలేదు. దీంతో వెంకటేష్ ని అభిమానించే వాళ్ళ దగ్గర నుండి చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి..పరిస్థితి అర్ధం చేసుకున్న రానా రంగంలో దిగాడు. సిరీస్ ను మెచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నచ్చని వారికి తన హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేశారు.అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ పై మొదట్లో నెగిటివ్ రివ్యూస్ వచ్చినా ...ఇప్పుడు టాక్ మెల్లగా మారుతోంది.కొంతమంది యూత్ ఈ అడల్ట్ కంటెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సిరీస్ చూసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఇండియన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న అన్నీ వెబ్ సిరీస్ ల కంటే రానా నాయుడు టాప్ వన్ పోజిషన్ లో ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ కి 80 మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చినట్టు సమాచారం.ఇక ఈ అడల్ట్ కంటెంట్ లో వెంకటేశ్ నటించేందుకు ఒప్పుకోవడానికి కూడా కారణం నెట్ ఫ్లిక్స్ సంస్థ అందించిన భారీ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది. ఈ సిరీస్ లో నటించేందుకు వెంకటేష్ 12 కోట్ల రూపాయిలు తీసుకున్నాడట. అలాగే రానా కి 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. వీళ్ల కెరీర్ లో బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం వల్లే ఈ బోల్డ్ కంటెంట్ రోల్ లో నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.ఇంకో విషయం ఏంటంటే రానా నాయుడు తెలుగు వెబ్ సిరీస్ కాదు. హిందీలో తీసి దాన్ని తెలుగులో డబ్ చేశారు అంతే. రానా నాయుడు నిదానంగానే ప్రారంభమైన వెళ్లే కొద్దీ స్క్రీన్ ప్లే రేసీగా మారుతుంది. ఇదే ఇప్పుడు రానా నాయుడు వెబ్ సిరీస్ ను ట్రెండింగ్ లో నిలబెట్టిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
మృణాల్ ఠాకూర్‌కు బెదిరింపులు.. అసలేం జరిగింది!
బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసినా సీతారామం సినిమాతోనే ఫేమ్ సంపాదించింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో ఏకంగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే తాజాగా మృణాల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మృణాలు తన ఇన్‌స్టాలో వీడియో షేర్ చేస్తూ.. ' నా ఈ-మెయిల్ ఖాతా హ్యాక్ చేశారు. దీని ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తన వ్యక్తిగత సమాచారం, స్క్రిప్ట్‌లన్నీ అందులోనే ఉన్నాయి.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు అసలేం జరిగిందని షాక్‌కు గురయ్యారు. కానీ అయితే ఇదంతా నిజంగా జరగలేదని తెలుస్తోంది. కేవలం ఓ షో ప్రమోషన్ కోసం దీనిని షూట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోలు రానా , వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో రానా.. సెలబ్రిటీల సమస్యలు తీర్చే పాత్రలో కనిపించారు. తాజాగా మృణాల్ ఠాకూర్ రానానాయుడు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో 'తన మెయిల్ ఖాతా హ్యాక్‌కు గురైందని.. ఏం చేయాలో తెలియక రానా నాయుడుని సంప్రదించానని చెప్పుకొచ్చింది. రానా సాయంతోనే సమస్య పరిష్కారించారని తెలిపింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా అధిగమించాలో తెలియాలంటే రానా నాయుడు చూడాలని సలహా ఇచ్చింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఇప్పటికే ఈ సిరీస్ ప్రమోషన్లలో జాన్వీకపూర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
ఆ పాత్ర నేను చేయాల్సింది.. వెంకటేశ్ ఏం పొడిచారో చూస్తా?..బ్రహ్మానందం
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి తండ్రికొడుకులుగా నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించి ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా బ్రహ్మానందం నటించిన ఓ స్పెషల్ వీడియోని నెట్ఫిక్స్ విడుదల చేసింది. అందులో బ్రహ్మీ తనని తాను ఆస్కార్ నాయుడిగా పరిచయం చేసుకొని నాగ నాయుడు (ఈ సిరీస్‌లో వెంకటేశ్ పోషించిన పాత్ర పేరు) క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ ఇచ్చాడు. కిరీటి దామరాజు డైరెక్టర్‌గా, జబర్దస్త్ అవినాష్ ఆయన అసిస్టెంట్‌గా కనిపించారు. ఈ స్పెషల్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బ్రహ్మానందం ఆడిషన్ చూసి విసుగుచెందిన వెంకటేశ్..చివరకు రానాకు తండ్రిగా తానే నటిస్తానని చెబుతాడు. దీంతో బ్రహ్మీ కోపంతో..‘ఆ క్యారెక్టర్‌కి నా ఏజ్ సరిపోలేదని.. వెంకటేశ్‌ను పెట్టారు. ఓకే.. ఏం పొడిచారో..ఎంత పొడిచారో నేను చూస్తాను. మీరూ.. చూడండి.. వాచ్ రానా నాయుడు. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్’ అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది. -
రానా నాయుడు: వెంకీ ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా?
టాలీవుడ్ హీరోల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైన వ్యక్తి వెంకటేశ్. ఆయన సినిమా వచ్చిందంటే కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది. కానీ తొలిసారి అలాంటి పాత్రలకు చెక్ పెడుతూ రానా నాయుడులో కొత్త రోల్లో కనిపించాడు వెంకీ. ఈ సిరీస్‌లో నాగ నాయుడిగా తండ్రి పాత్రలో నటించాడు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దయచేసి కుటుంబంతో కలిసి చూడొద్దని మొదటి నుంచి యూనిట్ అంతా మొత్తుకుంటోంది. వాళ్లెందుకు అలా చెప్తున్నారో ఒక్క ఎపిసోడ్ చూసినా అర్థమైపోతుంది. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులతో నిండిపోయిందీ సిరీస్. వెంకటేశ్ నోట బూతులు రావడం తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. వెంకీ ఫ్యామిలీమాన్ అయ్యుండి ఇంత దిగజారి సిరీస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను సౌత్ ఆడియన్స్ ఎలా ఇష్టపడతారనుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. బూతులు తప్ప కథ లేదని మండిపడుతున్నారు. ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం, కానీ డిజాస్టర్ అవడం ఖాయం అని రివ్యూలు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇన్నిరోజులు కుటుంబ విలువల గురించి చెప్పారు కదా, ఎంతమంది నిజజీవితంలో పాటించారు? మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే మానేయండి. కానీ నటులు ఎలాంటి పాత్రలు పోషించాలనేది కూడా మీరే నిర్ణయిస్తారా? అని వెనకేసుకొస్తున్నారు. ఊరికే తిడుతున్నారు కానీ సిరీస్ మాత్రం కిరాక్‌గా ఉంది అని పొగుడుతున్నారు. Venky ki intha criticize chestunnaru but do even see him doing a kissing scene in the entire show?? NO!! Yes he uttered cuss word & some filthy dialogues but that's how the character is even in the original!! #RanaNaidu — Sunny Kesh (@Sunnykesh) March 11, 2023 i dont know whats wrong with these film and webseries makers. Too many verbal abusing words being used making speaking foul language look cool and normalizing those words .imagine kids watching speaking same in house with parents and siblings #RanaNaiduOnNetflix #RanaNaidu — kiran kumar (@shiningkiran) March 11, 2023 5 Episodes chusaa story peddaga am ledh. Asalu expect eh cheyale Elati web series thisthadu ani @VenkyMama . Mirzapur chusinatu vundhii 🙏😂.#RanaNaidu https://t.co/mNS2kC6te7 — Rishi Royal 🌐 (@iamNarasim) March 11, 2023 @RanaDaggubati గారు ఫ్యామిలీ కలిసి చూడవలసిన సినిమా కాదు అని ముందుగానే చెప్పారు చాలా సంతోషం 🙏 కానీ ఇలాంటి సొల్లు, చెత్త సినిమాలు తీయకపోయుంటే ఇంకా బాగుండేది కదా. @VenkyMama గారు ఫ్యామిలీ మాన్ అయ్యుండి ఇంత దిగజారి సినిమా తీయాల్సిన అవసరం ఏముంది అర్ధంకాలేదు. #RanaNaidu 🖕🏽 Film — The SAI NIKHIL ✊🏽 (@SaiNikhil1022) March 11, 2023 Sorry to say but fact#DuniyaVijay ela ayithe EP #VeeraSimhaReddy lo alage mana #VenkyMama character kuda alage undi😭#RanaNaidu worst web series I have ever seen Worst Characterization for every actor pic.twitter.com/O3h7fdbIvN — Sanju (@sanjaysudula) March 11, 2023 #RanaNaidu enti ippudu venkatesh anthe ga anthe ga antu regressive content cheskovala life long?? What is this Gatekeeping…. Show was always an adult show and was marketed like that ! All of you are adults only..so stop getting surprised at some adult scenes… — HitWicket! (@WalkingXception) March 11, 2023 -
రానా నాయుడు వెబ్ సిరీస్.. వెంకటేశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
దగ్గుబాటి వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేశ్ పూర్తి విభిన్న పాత్రలో కనిపించారు. అబ్బాయి రానాకు తండ్రిగా నటించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌పై ఫ్యాన్స్‌లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సిరీస్‌లో నటించేందుకు వెంకటేశ్, రానా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న దానిపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌లో నటించేందుకు వెంకటేశ్ దాదాపు రూ.12 తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రానా కూడా రూ.8 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. హిందీలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
‘రానా నాయుడు’ నాకు కొత్త ప్రపంచం: వెంకటేశ్
‘ఒక నటుడిగా కొత్త పాత్రలు చేయాలని ఎప్పుడూ ఉంటుంది. ‘రానా నాయుడు’లో నాగ నాయుడు పాత్రలో కొత్తగా చేయడానికి అవకాశం దొరికింది. ఇలాంటి పాత్రని నేను గతంలో చేయలేదు. సరికొత్తగా ఉండే నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వెంకటేశ్ మాట్లాడుతూ–‘‘రానా నాయుడు’ నాకు కొత్త ప్రపంచం. ఓటీటీలో చేయడం ఇదే మొదటిసారి. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో భావోద్వేగ సన్నివేశాలు చాలా కొత్తగా, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. రానాతో తొలిసారి ఫుల్ లెంత్ స్క్రీన్‌ను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కరణ్, సుపర్ణ్ వర్మలతో పని చేయడం గొప్ప ప్రయాణంలా అనిపించింది’’ అన్నారు. రానా మాట్లాడుతూ– ‘‘రానా నాయుడు’ డార్క్ కామెడీ డ్రామా. ఇలాంటి కథలు సినిమాల్లో చేయడం కష్టం. హైదరాబాద్‌కి చెందిన ఓ కుటుంబం ముంబై వెళ్లి అక్కడ గ్యాంగ్‌స్టర్ పనులు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర అంశాలు ఇందులో ఉంటాయి. ఈ సిరీస్ కోసం బాబాయ్‌తో (వెంకటేశ్) పని చేయడం మర్చిపోలేని అనుభూతి’’అన్నారు. ‘‘వెంకటేశ్, రానాగార్లతో పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ. ‘‘రానా నాయుడు’ వీక్షకులను తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత సుందర్ ఆరోన్. -
‘రానా నాయుడు’ ప్రెస్మీట్లో బాబాయ్, అబ్బాయ్ సందడి (ఫోటోలు)
-
నా పాత్రలో రెండూ ఉంటాయి
‘‘నేను సాధారణంగా మంచి లేదా చెడు పాత్రలు పోషిస్తాను. కానీ, ‘రానా నాయుడు’ లో నేను చేసిన రానా పాత్రలో ఆ రెండూ కలిసి ఉంటాయి’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. వెంకటేష్, రానా తొలిసారి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. కరణ్ అన్షుమాన్– సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. కరణ్ అన్షుమాన్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ– ‘‘రానా నాయుడు’ లో రానా చీకటి జీవితం గడుపుతుంటాడు. కానీ తన కుటుంబాన్ని పో షించడానికి బాగా కష్టపడతాడు. నా పాత్రలో ఎక్కువ కోపం చూపించే సన్నివేశాలున్నాయి. నిజ జీవితంలో నేను ప్రశాంతంగా ఉంటాను. కానీ ఈ సిరీస్‌లో కోపం ప్రదర్శించడం సవాలుగా అనిపించింది. అదృష్టవశాత్తూ మా బాబాయ్‌కి(వెంకటేష్), నాకు ఆఫ్ స్క్రీన్ కూడా మంచి బాండింగ్ ఉండటంతో నటించడం సులభం అయింది. వైరం ఉన్న పాత్రలో మెప్పించడం ఒక సవాల్‌తో కూడుకున్నప్పటికీ రానా, నాగా(వెంకటేష్ క్యారెక్టర్) పాత్రలు, వాటి మధ్య ఉండే ఆవేశం, భావోద్వేగాల పైనే దృష్టిపెట్టాం’’ అన్నారు. -
తరచూ సమంతతో మాట్లాడుతుంటా: రానా
తరచూ స్టార్ హీరోయిన్ సమంతతో మాట్లాడుతుంటానని ఆసక్తికర విషయం చెప్పాడు హీరో, నాగ చైతన్య కజిన్ దగ్గుబాటి రానా. వెంకటేశ్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా రానా ఇటీవల ఓ జాతీయ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను, పలువురు సినీ సెలబ్రెటీల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: సీఎం రేంజ్లో భారీ బందోబస్తు మధ్య అత్తారింటికి మనోజ్.. వీడియో, ఫొటోలు వైరల్ ఇందులో భాగంగా నాగ చైతన్య మాజీ భార్య, స్టార్ హీరోయిన్ సమంతతో ఇప్పటికి తను కాంటాక్ట్‌లో ఉన్నానని చెప్పాడు. ‘సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్టు తెలిసిన వెంటనే ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాను. అంతేకాదు వీలు కుదరినప్పుడల్ల సమంతతో మాట్లాడుతూనే ఉంటా. నటీనటులు తమకు ఉన్న సమస్యల గురించి బయటకు చెప్పాలా? లేదా? అనేది వారి వ్యక్తిగతం. అయితే ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎప్పుడు ఏదో ఓక సమస్య వారిని బాధపెడుతూనే ఉంటుంది. ఎవరి లైఫ్ పూలా పాన్పులా ఉండదు. చదవండి: ఆ వ్యక్తిని చాలా నమ్మాను, కానీ అతడు నా డబ్బు కాజేశాడు: నటి ఆవేదన ఎలాంటి సమస్య అయినా దాన్ని నువ్వు ఎలా అధిగమిస్తావననేది ముఖ్యం. సమస్య వచ్చినప్పటికీ కంటే దాన్ని ఎదుర్కొని ముందు సాగడంలోనే ఆనందం ఉంది’ అంటూ రానా చెప్పుకొచ్చాడు. యాక్షన్, క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో రానా- విక్టరి వెంకటేశ్‌లు తొలిసారి కలిసి నటించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రూపొందింది. ఇందులో బాలీవుడ్ నటీనటులు సుర్వీన్ చావ్లా ఆశిస్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
నమ్రత భర్తగానే మహేశ్‌బాబు తెలుసు: రానా దగ్గుబాటి
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో వెంకీ, రానా తొలిసారి కలిసి నటించారు. కరణ్ అన్షుమాన్ నిర్మించిన ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ క్రమంలో రానా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ప్రస్తుతం చాలా తెలుగు సినిమాలు హిందీలో బాగా వర్కవుట్ అవుతున్నాయి. అంతెందుకు? నా రెండో సినిమా(ఘాజీ) హిందీలోనే చేశా, తర్వాత మాత్రం తెలుగులోనే వరుస సినిమాలు చేశాను. కానీ మనం అనవసరంగా ఇలా సినిమాను భాష పేరుతో వేరు చేసుకుంటున్నాం. త్వరలోనే ఆ సరిహద్దులు కూడా చెరిపోయే రోజు వస్తుంది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన నాకిప్పటికీ గుర్తుంది. చాలాకాలం పాటు నేను బాహుబలి షూటింగ్‌లోనే నిమగ్నమయ్యాను. ఆ సమయంలో బాలీవుడ్‌లోని నా మిత్రుడొకరిని కలిసినప్పుడు బాహుబలి సినిమా గురించి చెప్పాను. అప్పుడతను అందులో హీరో ఎవరని అడగ్గా ప్రభాస్ అని చెప్పాను. దీనికతడు ప్రభాస్ ఎవరు? అని తిరిగి ప్రశ్నించాడు. ఓ క్షణం పాటు అవాక్కైన నేను ప్రభాస్ నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్పి అతడి గురించి వివరించే ప్రయత్నం చేశాను. కానీ ప్రభాస్ సినిమాలు ఏ ఒక్కటీ తను చూడలేదట. అంతేకాకుండా తనకు టాలీవుడ్లో చిన్ను భర్త ఒక్కరే తెలుసన్నాడు. చిన్ను ఎవరో అర్థం కాక నేను ఆలోచనలో పడ్డాను. కాసేపటి తర్వాత చిన్ను అంటే నమ్రత శిరోద్కర్ అని అర్థమైంది. నమ్రత భర్తగా మహేశ్‌బాబు తెలియడమేంటి? అని నేను షాక్ అవ్వాల్సి వచ్చింది. నాలుగైదేళ్లు ఆగు, మా ఆర్మీ అంతా బాలీవుడ్లో ల్యాండ్ అవుతుందని చెప్పాను. ఇటీవల ఆయన్ను కలిసినప్పుడు నేను చెప్పింది జరగడంతో సంతోషం వ్యక్తం చేశాడు' అని చెప్పుకొచ్చాడు రానా. -
రానాతో వార్ అంత సులువు కాదు
‘‘సంక్లిష్టమైనపా త్రలు నన్ను ఆకర్షిస్తాయి. ‘రానా నాయుడు’లో నేను చేసిన నాగనాయుడు అలాంటిపా త్రే. నా వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం ఉన్నపా త్రను పోషించడం సవాలుగా అనిపించినప్పటికీ సంతృప్తిని ఇచ్చింది’’ అని హీరో వెంకటేష్ అన్నారు. కరణ్ అన్షుమాన్– సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో వెంకటేష్, రానా తొలిసారి కలిసి నటించారు. కరణ్ అన్షుమాన్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘వెబ్ సిరీస్‌లో పని చేయడానికి, సినిమాలో చేయడానికి చాలా తేడా ఉంటుంది. వెబ్ సిరీస్‌లో కథ చెప్పే వేగం శైలికి అలవాటు పడటానికి నాకు కొంత సమయం పట్టింది. ఇందులో నెగిటివ్పా త్రను పోషించడం నావరకూ రిఫ్రెషింగ్ చేంజ్. ‘రానా నాయుడు’లో మునుపెన్నడూ చూడనిపా త్రలో నన్ను చూస్తారు. రానాకి ఎదురుగా నిలబడి వార్ చేయడం అంత సులువు కాదు.. నటుడిగా నాకిది ఒక సవాల్. నిజ జీవితంలో మేం బాబాయ్ అబ్బాయ్‌లా కాకుండా స్నేహితుల్లా ఉంటాం. కానీ తెరపై ఒకరంటే ఒకరికి పడని తండ్రీ కొడుకులుగా వార్ ఈక్వేషన్ తీసుకురావడం కష్టం అనిపించింది. ఇది కచ్చితంగా మా ఇద్దరికీ కొత్త ప్రయత్నం’’ అన్నారు.