బుల్లితెరపై కనిపిస్తే.. వెండితెర అవకాశాలు తగ్గుతాయనే మాట అసత్యమని ఇప్పటికే చాలామంది నటీనటులు నిరూపించారు! ఆ జాబితాలో బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా కూడా ఉంది. దశాబ్ద కాలంగా టీవీ సీరియల్స్‌లో నటిస్తూనే అటు సినిమా అవకాశాలనూ అందుకుంటూ.. ఇప్పుడు వెబ్ స్క్రీన్ మీదా స్టార్‌గా వెలిగిపోతోంది. సుర్వీన్ చండీగఢ్‌లో జన్మించింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకుంది.
(ఇదీ చదవండి: గతంలో విడాకులు.. అయితే మళ్లీ ప్రేమను పొందే అర్హత లేదా?: నటి)
దీంతో మొదట మోడలింగ్ చేసి ఆ తర్వాత నటిగా మారింది. ‘కహీ తో హోగా’ అనే టీవీ సీరియల్‌తో నటిగా కెరీర్ ప్రారంభించింది. అందులో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించడంతో సీరియల్స్‌తోపాటు, సినిమా అవకాశాలూ రావడం మొదలుపెట్టాయి.దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘రంగోలీ’ కార్యక్రమానికి దాదాపు ఐదేళ్లు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.కన్నడంలో విడుదలైన ‘పరమేశ పాన్‌వాలా’తో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన రెండో చిత్రంతోనే మోహన్‌బాబు, శర్వానంద్ ‘రాజు.. మహారాజు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
పలు పంజాబీ, తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించింది. ‘హిమ్మత్‌వాలా’, ‘క్రియేచర్ 3డీ’, ‘వెల్‌కమ్ బ్యాక్’ సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది సుర్వీన్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో.. లావుగా ఉంటే అవకాశాలు రావంటూ కొందరు నన్ను బాడీ షేమింగ్ చేశారు. వాటిని పట్టించుకోలేదు. కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నానని తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పార్చ్‌డ్’ సినిమాలో తన ప్రతిభకు పురస్కారం అందుకుంది. ఆ సినిమాలో తను రకుల్‌తో చేసిన కొన్ని సీన్స్ వివాదస్పదం అయ్యాయి. ‘24’ సీజన్ 2తో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి, అక్కడ కూడా వరుస సిరీస్‌లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం నెట్‌ఫిక్ల్స్‌లో ప్రసారంలో ఉన్న ‘రానా నాయుడు’తో వీక్షకులను అలరిస్తోంది.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ.. కంట్రోల్‌లో లేని బరువు? కలవరపడుతున్న ఇలియానా!)
Comments
Please login to add a commentAdd a comment