Surveen Chawla
-
రానా నాయుడులో దుమ్ములేపిన భామ గురించి ఈ విషయాలు తెలుసా?
బుల్లితెరపై కనిపిస్తే.. వెండితెర అవకాశాలు తగ్గుతాయనే మాట అసత్యమని ఇప్పటికే చాలామంది నటీనటులు నిరూపించారు! ఆ జాబితాలో బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా కూడా ఉంది. దశాబ్ద కాలంగా టీవీ సీరియల్స్‌లో నటిస్తూనే అటు సినిమా అవకాశాలనూ అందుకుంటూ.. ఇప్పుడు వెబ్ స్క్రీన్ మీదా స్టార్‌గా వెలిగిపోతోంది. సుర్వీన్ చండీగఢ్‌లో జన్మించింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకుంది. (ఇదీ చదవండి: గతంలో విడాకులు.. అయితే మళ్లీ ప్రేమను పొందే అర్హత లేదా?: నటి) దీంతో మొదట మోడలింగ్ చేసి ఆ తర్వాత నటిగా మారింది. ‘కహీ తో హోగా’ అనే టీవీ సీరియల్‌తో నటిగా కెరీర్ ప్రారంభించింది. అందులో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించడంతో సీరియల్స్‌తోపాటు, సినిమా అవకాశాలూ రావడం మొదలుపెట్టాయి.దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘రంగోలీ’ కార్యక్రమానికి దాదాపు ఐదేళ్లు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.కన్నడంలో విడుదలైన ‘పరమేశ పాన్వాలా’తో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన రెండో చిత్రంతోనే మోహన్‌బాబు, శర్వానంద్ ‘రాజు.. మహారాజు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పలు పంజాబీ, తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించింది. ‘హిమ్మత్వాలా’, ‘క్రియేచర్ 3డీ’, ‘వెల్కమ్ బ్యాక్’ సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది సుర్వీన్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో.. లావుగా ఉంటే అవకాశాలు రావంటూ కొందరు నన్ను బాడీ షేమింగ్ చేశారు. వాటిని పట్టించుకోలేదు. కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నానని తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పార్చ్డ్’ సినిమాలో తన ప్రతిభకు పురస్కారం అందుకుంది. ఆ సినిమాలో తను రకుల్‌తో చేసిన కొన్ని సీన్స్ వివాదస్పదం అయ్యాయి. ‘24’ సీజన్ 2తో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి, అక్కడ కూడా వరుస సిరీస్‌లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం నెట్‌ఫిక్ల్స్‌లో ప్రసారంలో ఉన్న ‘రానా నాయుడు’తో వీక్షకులను అలరిస్తోంది. (ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ.. కంట్రోల్లో లేని బరువు? కలవరపడుతున్న ఇలియానా!) -
కాస్టింగ్ కౌచ్: దక్షిణాది అగ్ర దర్శకుడిపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
దక్షిణాది పరిశ్రమకు చెందిన నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడు తనని వేధించాడని బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మొదటి సారి కాదని బాలీవుడ్, సౌత్ పరిశ్రమలో దాదాపు అయిదు సార్లు తాను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లు ఆమె ఆరోపించారు. ఇటీవలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ‘ఏ పరిశ్రమలో అయిన క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నేను కూడా దాని బాధితురాలినే. ఒక్కసారి కాదు 5 సార్లు ఈ సంఘటనను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమలో మూడుసార్లు నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది’ అని ఆమె చెప్పుకొచ్చారు. ‘అక్కడ పేరు మోసిన ఓ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహిత తన సినిమా ఆఫర్ ఇచ్చాడు. దీంతో నేను ఆడిషన్స్‌కి వెళ్లాను. ఒక రోజంతా ఆడిషన్‌లోనే ఉన్నాను. దీంతో నాకు కాస్తా జబ్బు చేయడంతో ఆ రోజు రాత్రి తిరిగి ముంబై వెళ్లిపోయాను. నేను ముంబై వచ్చాక ఆ దర్శకుడు ఫోన్ చేసి ‘మీకు ఆరోగ్యం బాగలేదు కదా నన్ను ముంబయికి రమ్మంటారా?’ అని అడిగారు. నేను వద్దని చెప్పి ఫోన్ పెట్టేశాను. అయినా అతడు పదే పదే ఫోన్ చేసి విసిగించారు. దీంతో అతడిపై తనకు అనుమానం వచ్చిందని’ ఆమె వ్యాఖ్యానించారు. ‘అలా కొన్ని రోజులకు మళ్లీ అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి మాట్లాడగా ఈ సారి ఆయన మాట్లాడకుండా మరో వ్యక్తితో ఫోన్ మాట్లాడించారని చెప్పారు. ‘ఆ వ్యక్తి మాట్లాడుతూ ‘సినిమా తెరకెక్కించడానికి చాలా సమయం పడుతుంది. డైరెక్టర్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. ఇది కేవలం సినిమా పూర్తయ్యే వరకే’ అని అనడంతో అతడి మాటల్లోని భావం నాకు అర్థమైంది. దీంతో నా టాలెంట్ నచ్చితే అవకాశం ఇవ్వండి.. లేకపోతే అవసరం లేదు అని గట్టిగా సమాధానమిచ్చి ఫోన్ కట్ చేశాను’ అని చెప్పారు. అనంతరం ఆమె ఈ కాస్టింగ్ కౌచ్ దక్షిణాదిలోనే కాదని బాలీవుడ్‌లోనూ ఉందని పేర్కొన్నారు. ఇక్కడ ఓ నిర్మాత తన కాళ్లు ఎలా ఉన్నాయో చూడాలన్నారని, మరొకరమో నా శరీరభాగాల్లోని ప్రతి అణువు తనకు తెలియాలంటూ అసభ్యంగా మాట్లాడారంటూ సుర్వీన్ చావ్లా వివరించారు. కాగా తెలుగులో ఆమె ‘రాజు మహారాజు’లో నటించారు. చదవండి: సౌత్ నిర్మాత రాత్రంతా గదిలో ఉండమన్నాడు : నటి ముద్దు సీన్ రిహార్సల్ అంటూ దారుణంగా ప్రవర్తించేవాడు: హీరోయిన్ -
సినిమా వరకే... తర్వాత ఆపేద్దామన్నాడు!
‘‘నా కెరీర్లో ఐదుసార్లు క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొన్నాను. రెండు సార్లు బాలీవుడ్లో మూడుసార్లు సౌత్ ఇండస్ట్రీలో’’ అని పేర్కొన్నారు బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా. టెలివిజన్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు సుర్వీన్. తెలుగులో ‘రాజు మహారాజు’ హిందీలో ‘హమ్ తుమ్ షబానా, అగ్లీ, హేట్ స్టోరీ 2, పార్చడ్, తమిళంలో ‘మూండ్రు పేర్ మూండ్రు కాదల్, పుదియ తిరుప్పంగళ్’ సినిమాల్లో నటించారామె. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి సుర్వీన్ చెబుతూ – ‘‘టీవీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ సినిమాల్లో నా ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. సౌత్‌లో ఓ చిత్రదర్శకుడు ‘నీ శరీరంలోని ప్రతి భాగాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నాడు. అప్పటి నుంచి అతని ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశాను. ఇంకోసారి ఓ నేషనల్ అవార్డు పొందిన దర్శకుడుకి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్లాను. ఆ ఆడిషన్లో అనవసరమైన డైలాగ్స్ చెప్పించి, ఏదో ఏదో చేయించాడు. ఆరోగ్యం బాలేదని ముంబై తిరిగొచ్చాను. ‘నీ ఆరోగ్యం బాలేదు కదా. నేను కూడా ముంబై రానా?’ అని ఫోన్ చేసి అడిగించాడు. చాలా చీప్‌గా అనిపించింది. ‘నో థ్యాంక్యూ’ అన్నాను. అతనికి తమిళం తప్ప వేరే భాష రాదు. వేరే అతనితో మాట్లాడించాడు. ‘సినిమాకు చాలా టైమ్ పట్టేలా ఉంది. సార్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కేవలం సినిమా జరిగేవరకే.. ఆ తర్వాత ఆపేయొచ్చు’ అన్నాడు. నేను చాలా అమాయకంగా ‘ఏం ఆపేయాలి’ అని అడిగా. ‘కేవలం సినిమా జరిగేవరకే.. ఆ తర్వాత ఆపేయొచ్చు’ అని మళ్లీ రిపీట్ చేశాడు. ‘మీరు రాంగ్ డోర్‌ని తడుతున్నారు. ఒకవేళ మీ సార్ నేను టాలెంటెడ్ అనుకుంటే నేను పని చేయడానికి సిద్ధమే’ అన్నాను. ఆ సినిమా ఇప్పటి వరకూ జరగలేదు. రెండేళ్ల క్రితం బాలీవుడ్లో ‘నీ ఎద ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను’ అని ఒక దర్శకుడు, ‘నీ తొడలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నాను’ అని మరొక దర్శకుడు కోరారు. వాళ్ల ఆఫీసుల నుంచి వెంటనే బయటకు వచ్చేశాను’’ అని పేర్కొన్నారు. ‘‘నిజానికి నా బరువు 56 మాత్రమే. అయినప్పటికీ ‘లావుగా ఉన్నావు’ అంటూ అదోలా చూసేవాళ్లు’ అని కూడా సుర్వీన్ వాపోయారు. -
‘తన రాక ఓ అద్భుతం’
‘ఇప్పుడు చిన్న చిన్న షూలను నింపేందుకు మా దగ్గర తన బుజ్జి బుజ్జి పాదాలు ఉన్నాయి! తన అద్భుతమైన రాకతో మా చిన్న కుటుంబం సంపూర్ణమైంది! మా ముద్దుల కూతురు ఇవాను మా జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నాం’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ సుర్విన్ చావ్లా షేర్ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 15న ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె ప్రస్తుతం మాతృత్వపు లాలిత్యాన్ని అనుభవిస్తున్నారు. ఇందులో భాగంగా తన కూతురి పాదాలతో కూడిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. తొలిసారిగా తనను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా 2015లోనే వ్యాపారవేత్త అక్షయ్ టక్కర్‌ను పెళ్లాడిన సుర్విన్ రెండేళ్ల వరకు తన పెళ్లికి సంబంధించిన విశేషాలను గోప్యంగా ఉంచారు. 2017లో తాను వివాహితను అని ప్రకటించిన ఆమె... ‘ పెళ్లి చేసుకున్నంత మాత్రాన వృత్తిగత జీవితంలో ఎటువంటి మార్పులు రావని నా నమ్మకం. పెళ్లి చేసుకున్న తర్వాత నా అందం, శారీరక సౌందర్యంలో ఎటువంటి మార్పు రాలేదు. పెళ్లైనంత మాత్రాన అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందనే గుడ్డి నమ్మకాన్ని పటాపంచలు చేయడానికే ఇన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాను’ అని చెప్పుకొచ్చారు. ఇక ఏక్తా కపూర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన పలు టీవీ సీరియళ్లలో నటించిన సుర్విన్.. హేట్‌స్టోరి 2, పర్చేద్ వంటి బాలీవుడ్ సినిమాలతో గుర్తింపు పొందారు. View this post on Instagram We now have her tiny feet to fill the tiny shoes! Blessed by her wonderful arrival in our little family! Welcoming our daughter Eva💝 @akshaythakker A post shared by Surveen Chawla (@surveenchawla) on Apr 19, 2019 at 8:56am PDT -
ఎలా నటించడానికైనా రెడీ!
తమిళసినిమా: ఎలాంటి గ్లామర్ పాత్రల్లో నటించడానికైనా రెడీ. అందుకు నా భర్త పూర్తి సపోర్టు అని అంటోంది నటి సుర్విన్‌చావ్లా. ఈ ఉత్తరాది భామ నటుడు అర్జున్ నటించిన జైహింద్–2, మూండ్రపేర్ మూండ్రు కాదల్ తమిళ చిత్రాల్లో నటించింది. హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న సుర్విన్‌చావ్లా 2015లో పెళ్లి చేసుకుంది. ఆ విషయాన్ని చాలా గొప్యంగా ఉంచి ఆలస్యంగా అంటే ఇటీవలే బహిరంగ పరిచింది. వివాహానంతరం నటనను కొనసాగిస్తున్న ఈ అమ్మడు ఇటీవల ఒక భేటీలో సంచలన వ్యాఖ్యలు చేసింది. నటన, వివాహం వంటి విషయాల గురించి నటి సుర్విన్‌చావ్లా వివరిస్తూ నాకు పెళ్లి అయ్యిందని చెప్పగానే సినీ వర్గాలు, ప్రేక్షకులు షాక్ అయ్యారని, అలా ఎందుకయ్యారో తనకూ అర్థం కావడం లేదని అంది. వివాహానంతరం నటీమణులకు క్రేజ్ తగ్గిపోతుందనేది ఒకప్పటి మాట అని, ఇప్పుడు పలువురు నటీమణులు వివాహానంతరం కథానాయికలుగా రాణిస్తున్నారని అంది. ఇంకా చెప్పాలంటే పెళ్లిని, నటనను కలిపి చూడకూడదని అంది. ఇతర రంగాల లాగానే సినిమా రంగం అని, పెళ్లైన మహిళలు ఉద్యోగం చేయగా లేనిది, హీరోయిన్లు నటించడంలో తప్పేంటని ప్రశ్నించింది. మంచి భర్త లభిస్తే నటీమణులు నటనను సంతోషంగా కొనసాగించవచ్చునని పేర్కొంది. వివాహం అనేది సరైన సమయంలో చేసుకోవాలని, నేను అదే పని చేశానని చెప్పింది. సినిమాల్లో నేను సహ నటుడితో ముద్దు సన్నివేశాల్లో నటించినా, నగ్నంగా నటించినా నా భర్త అభ్యంతరం చెప్పరని, ఆయన నుంచి నాకు అంత మద్దతు ఉందని చెప్పింది. మంచి పాత్రలు లభిస్తే నటించమని అంటారని, అంతగా అర్థం చేసుకునే భర్త లభించడం నా అదృష్టం అని నటి సుర్విన్‌చావ్లా చెప్పుకొచ్చింది. -
రెండేళ్ల కిందటే రహస్యంగా పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన నటి!
న్యూఢిల్లీ: ఆమె రెండేళ్ల కింద గప్‌చుప్‌గా పెళ్లి చేసుకుంది. మూడో కంటికి తెలియకుండా అత్యంత సన్నిహితుల మధ్య ఆమె పెళ్లి జరిగింది. ఇప్పుడు ఆ విషయాన్ని బయట ప్రపంచానికి వెల్లడించి బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా అభిమానుల్ని సర్ప్రైజ్ చేసింది. 'హేట్‌స్టోరీ-2'లో హాట్‌హాట్‌గా నటించిన ఈ అమ్మడు.. తన ప్రియుడు అక్షయ్ ఠాకూర్‌ను 2015లో పెళ్లి చేసుకుంది. 2015 జూలై 18న అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఇటలీలో క్రిస్టియన్ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నారు. ఇటీవల విరాట్ కోహ్లి, అనుష్క శర్మ కూడా ఇటలీలోని టస్కనీ పట్టణంలో అట్టహాసంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన సుర్వీన్ తన పెళ్లయిపోయిందోచ్ అంటూ ప్రపంచానికి వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే అప్పట్లో తమ పెళ్లి గురించి వెల్లడించలేదని తెలిపింది. ఇప్పుడు భారతీయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నామని, ఈ డిసెంబర్లోనే చేసుకోవాలని భావించినా తమ కుటుంబంలో ఓ విషాద ఘటన వల్లే, వచ్చే ఏడాది భారతీయ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నామని సుర్వీన్ మీడియాతో తెలిపింది. -
వెరీ... వెరీ సింపుల్!
గ్లామర్ పాయింట్ పంజాబీ సినిమాల్లో నటించి ఆ తరువాత బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది సుర్వీన్ చావ్లా. కోపం తగ్గించుకోవాలని,‘తన శాంతమే తనకు రక్ష’ అని మంచి మాటలు కూడా చెబుతుంటుంది చావ్లా.ఇదిసరే గానీ, ‘స్కిన్ షో’ గురించి ఒక ప్రశ్న వేసి చూడండి.అందమైన అమ్మాయి కాస్తా అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. అప్పటికప్పుడు కారాలు మిరియాలు నూరుతుంది. అంతేనా?‘‘హాలీవుడ్లో కనిపించే స్కిన్ షో గురించి కళాత్మక విలువల కోణంలో మాట్లాడతారు. మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం, ఎంత అసహ్యం! అంటారు. మన ద్వంద్వ వెఖరికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఉంటుందా? ఉన్నచోటే ఉంటామంటే కుదరదు. మనం కూడా మారాలి. చూసే దృక్పథాన్ని విశాలం చేసుకోవాలి...’’ అంటూ కారాలు మిరియాల మిక్స్‌తో కూడిన ఉపన్యాసాన్ని దంచుతూనే ఉంటుంది చావ్లా. చావ్లా కోపాన్ని నిమిషాల్లో తగ్గించాలని ఉందా? వెరీ సింపులండీ. ‘‘మీ గ్లామర్ రహస్యం ఏమిటి?’’ అని ఒక్క ప్రశ్న అడగండి చాలు! -
కామెడీ చేయడం... పెద్ద ట్రాజెడీ!
లైఫ్ బుక్ చిన్నప్పటి నుంచి నృత్యం అంటే ఇష్టం. నేనే సొంతంగా నృత్యరీతులు సమకూర్చుకునేదాన్ని. సినిమాల్లోకి రావాలనే ఆలోచన మాత్రం ఉండేది కాదు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత సినిమాల వైపు గాలి మళ్లింది. నటి కావాలనుకున్నాను. అలా తొలిసారిగా ఒక పంజాబీ సినిమాలో నటించాను. తొలిసారిగా ముంబయిలోకి అడుగు పెట్టినప్పుడు కాస్త భయపడ్డాను. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. అనవసరంగా రిస్క్ చేశానా? అనిపించింది. అయితే కుటుంబసభ్యులు ధైర్యం చెప్పారు. అలా భయానికి దూరంగా ఉండగలిగాను. భాష తెలియని చిత్రాల్లో నటిస్తున్నప్పుడు...అనువాదకుడి సహాయంతో నేను చెప్పబోయే డైలాగు గురించి తెలుసుకుంటాను. భావాన్ని పూర్తిగా జీర్ణం చేసుకుంటేగానీ నటించడానికి ప్రయత్నించను. గ్లామర్ ప్రపంచంలోకి వచ్చాక చాలా విషయాలు తెలిశాయి. చూసేదంతా నిజం కాదు... ప్రేక్షకులకు నటుల గ్లామర్ మాత్రమే కనిపిస్తుంది. అయితే రాత్రనక, పగలనక వారు పడే కష్టం చాలా తక్కువమందికి మాత్రమే తెలుస్తుంది. ‘సినిమా ఫీల్డ్‌లోకి వెళితే చాలు మహారాణిలా బతకవచ్చు’ అని వెళ్లక ముందు అనిపిస్తుంది. తరువాత మాత్రం ‘కష్టం’ అనేది అవగాహనలోకి వస్తుంది.. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దిగులు ఉన్నా...వీటినేమీ పట్టించుకోకుండా సదా పెదవుల మీద చిరునవ్వుతో కనిపించాలి. ఎంత కష్టం! అన్నిట్లోకి హాస్యం పండించడం చాలా కష్టం అనేది నా అభిప్రాయం. నటించే వాళ్లు నవ్వగానే సరిపోదు కదా! కొన్నిసార్లు ఎంత నవ్వించడానికి ప్రయత్నించినా-‘‘ఏడ్చినట్లే ఉంది’’లాంటి కామెంట్లు వినిపిస్తాయి. అందుకే అంటాను ‘కామెడీ చేయడం...పెద్ద ట్రాజెడీ’ అని! ఒకవిధంగా చెప్పాలంటే భోజనప్రియురాలిని. మూడు పూటలా లాగించేస్తాను. చిరుతిండికి మాత్రం చాలా దూరంగా ఉంటాను. ఇంటి తిండిలో ఉన్న తృప్తి ఎంత ఖరీదైన హోటల్లో తిన్నా ఉండదు. - సుర్వీన్ చావ్లా, హీరోయిన్, (హేట్‌స్టోరీ-2 ఫేం) -
బికినీ వేస్తే తప్పేంటి?
బికినీ దుస్తులు ధరించడానికి అభ్యంతరం ఏముందంటోంది ఉత్తరాది భామ సుర్విన్ చావ్లా. కోలీవుడ్‌లో మూండ్రు పేర్ మూండ్రు కాదల్ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ పుదియ తిరుప్పంగళ్ చిత్రంలో నటించారు. తాజాగా అర్జున్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న జైహింద్-2 లో హీరోయిన్ ఈ అమ్మడే. బాలీవుడ్లో హిమ్మత్ వాలా చిత్రంలో చిన్న వేషంలో మెరిసిన సుర్విన్ చావ్లా ప్రస్తుతం దక్షిణాది చిత్రాలనే నమ్ముకుందట. దీని గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ అర్జున్ జైహింద్-2 చిత్రంలో హీరోయిన్గా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారని చెప్పింది. ఈ చిత్రం తన నటనకు కచ్చితంగా ప్రశంసలు లభిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇటీవలే తెరపైకొచ్చిన హేట్ స్టోరీ - 2 చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. ఇందులో హీరో జైతో సన్నిహిత సన్నివేశాల్లో నటించడం గురించి అడుగుతున్నారని, అయితే నటుడు జై తనకు ఇంతకు ముందే తెలుసునని అందువల్ల రొమాన్స్ సన్నివేశాల్లో పెద్దగా ఇబ్బంది పడలేదని చెప్పింది. అలాంటి సన్నివేశాల్లో బికినీ దుస్తులు ధరించి నటించడానికి సంకోచించలేదని చెప్పింది. కథలో అది ఒక భాగం అవడంతో బికినీ దుస్తులు ధరించడానికి నో చెప్పలేదని, అయినా అందులో తప్పేముందని సుర్విన్ చావ్లా అంటోంది. -
తొలుత తటపటాయించా
ముంబై : ‘హేట్ 2’ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాలో పాత్ర పోషించే విషయమై తొలుత తటపటాయించానని సుర్వీన్చావ్లా చెప్పింది. ఈ సినిమాతోనే చావ్లా బాలీవుడ్లో అడుగిడింది. సాజిద్‌ఖాన్ నిర్మించిన ‘హిమ్మత్వాలా’ సినిమాలో సుర్వీన్ చిన్న పాత్ర పోషించింది. ‘పెద్ద పెద్ద నటుల సరసన తొలి సినిమా చేయాలని వర్ధమాన నటులు ఆకాంక్షిస్తారు. ఏదిఏమైనప్పటికీ ‘హేట్ 2’ సినిమా కొత్తగా బాలీవుడ్లో అడుగు పెట్టేవారికి సరైనది కాదు. సాధారణంగా ఈ రంగంలోకి అడుగిడినవారెవరైనా భారీ పతాకం కింద చేయాలని ఆశిస్తారు’ అని అంది. కాగా ‘హేట్ 2’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో సుర్వీన్ చావ్లా, టీవీ నటుడు భానుశాలి నటించారు. ఈ సినిమాలో సుశాంత్... ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో హీరో,హీరోయిన్ల మధ్య తీసిన శృంగార దృశ్యాలు బాలీవుడ్లో సంచలనం రేకెత్తించాయి. ఈ విషయమై సుర్వీన్ మాట్లాడుతూ అటువంటి దృశ్యాల్లో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదంది. అది వృత్తిలో భాగమని చెప్పింది. ‘సన్నిహిత దృశ్యాలను నేను నిరోధించను. ఎంతో సౌకర్యవంతంగా భావిస్తాను. అయినప్పటికీ రొమాన్స్ అంటే నాకు ఇష్టమే. వాటిని తెర బయటి దృశ్యాలుగా భావించబోను. సినిమాల్లో ఇటువంటి దృశ్యాలు ఉండాలి. ఇటువంటి దృశ్యాల్లో నటించడం ఎంత సులువో అంతే కష్టం కూడా. ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పుడు ఇటువంటి సీన్లలో నటించడం సమస్యే కాదు’ అని వివరించింది. -
తొలుత తటపటాయించా
‘హేట్ 2’ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాలో పాత్ర పోషించే విషయమైతొలుత తటపటాయించానని సుర్వీన్చావ్లా చెప్పింది. ఈ సినిమాతోనే చావ్లా బాలీవుడ్లో అడుగిడింది. సాజిద్‌ఖాన్ నిర్మించిన ‘హిమ్మత్వాలా’ సినిమాలో సుర్వీన్ చిన్న పాత్ర పోషించింది. ‘పెద్ద పెద్ద నటుల సరసన తొలి సినిమా చేయాలని వర్ధమాన నటులు ఆకాంక్షిస్తారు. ఏదిఏమైనప్పటికీ ‘హేట్ 2’ సినిమా కొత్తగా బాలీవుడ్లో అడుగు పెట్టేవారికి సరైనది కాదు. సాధారణంగా ఈ రంగంలోకి అడుగిడినవారెవరైనా భారీ పతాకం కింద చేయాలని ఆశిస్తారు’ అని అంది. కాగా ‘హేట్ 2’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో సుర్వీన్ చావ్లా, టీవీ నటుడు భానుశాలి నటించారు. ఈ సినిమాలో సుశాంత్... ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఈ సినిమాలో హీరో,హీరోయిన్ల మధ్య తీసిన సన్నిహిత దృశ్యాలు బాలీవుడ్లో సంచలనం రేకెత్తించాయి. ఈ విషయమై సుర్వీన్ మాట్లాడుతూ అటువంటి దృశ్యాల్లో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదంది. అది వృత్తిలో భాగమని చెప్పింది. ‘సన్నిహిత దృశ్యాలను నేను నిరోధించను. ఎంతో సౌకర్యవంతంగా భావిస్తాను. అయినప్పటికీ రొమాన్స్ అంటే నాకు ఇష్టమే. వాటిని తెర బయటి దృశ్యాలుగా భావించబోను. సినిమాల్లో ఇటువంటి దృశ్యాలు ఉండాలి. ఇటువంటి దృశ్యాల్లో నటించడం ఎంత సులువో అంతే కష్టం కూడా. ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పుడు ఇటువంటి సీన్లలో నటించడమనేది నాకు ఓ ఇష్యూ కాదు. -
ఇట్లు ప్రేమతో మూవీ స్టిల్స్