ఎలా నటించడానికైనా రెడీ! | Surveen Chawla Says My Husband Wouldnt Mind If I Go Nude On Screen | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 22 2018 8:07 AM | Last Updated on Sun, Apr 22 2018 8:07 AM

Surveen Chawla Says My Husband Wouldnt Mind If I Go Nude On Screen - Sakshi

తమిళసినిమా: ఎలాంటి గ్లామర్‌ పాత్రల్లో నటించడానికైనా రెడీ. అందుకు నా భర్త పూర్తి సపోర్టు అని అంటోంది నటి సుర్విన్‌చావ్లా. ఈ ఉత్తరాది భామ నటుడు అర్జున్‌ నటించిన జైహింద్‌–2, మూండ్రపేర్‌ మూండ్రు కాదల్‌ తమిళ చిత్రాల్లో నటించింది. హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న సుర్విన్‌చావ్లా 2015లో పెళ్లి చేసుకుంది. ఆ విషయాన్ని చాలా గొప్యంగా ఉంచి ఆలస్యంగా అంటే ఇటీవలే బహిరంగ పరిచింది. వివాహానంతరం నటనను కొనసాగిస్తున్న ఈ అమ్మడు ఇటీవల ఒక భేటీలో సంచలన వ్యాఖ్యలు చేసింది.

నటన, వివాహం వంటి విషయాల గురించి నటి సుర్విన్‌చావ్లా వివరిస్తూ నాకు పెళ్లి అయ్యిందని చెప్పగానే సినీ వర్గాలు, ప్రేక్షకులు షాక్‌ అయ్యారని, అలా ఎందుకయ్యారో తనకూ అర్థం కావడం లేదని అంది. వివాహానంతరం నటీమణులకు క్రేజ్‌ తగ్గిపోతుందనేది ఒకప్పటి మాట అని, ఇప్పుడు పలువురు నటీమణులు వివాహానంతరం కథానాయికలుగా రాణిస్తున్నారని అంది. ఇంకా చెప్పాలంటే పెళ్లిని, నటనను కలిపి చూడకూడదని అంది. ఇతర రంగాల లాగానే సినిమా రంగం అని, పెళ‍్లైన మహిళలు ఉద్యోగం చేయగా లేనిది, హీరోయిన్లు నటించడంలో తప్పేంటని ప్రశ్నించింది.

మంచి భర్త లభిస్తే నటీమణులు నటనను సంతోషంగా కొనసాగించవచ్చునని పేర్కొంది. వివాహం అనేది సరైన సమయంలో చేసుకోవాలని, నేను అదే పని చేశానని చెప్పింది. సినిమాల్లో నేను సహ నటుడితో ముద్దు సన్నివేశాల్లో నటించినా, నగ్నంగా నటించినా నా భర్త అభ్యంతరం చెప్పరని, ఆయన నుంచి నాకు అంత మద్దతు ఉందని చెప్పింది. మంచి పాత్రలు లభిస్తే నటించమని అంటారని, అంతగా అర్థం చేసుకునే భర్త లభించడం నా అదృష్టం అని నటి సుర్విన్‌చావ్లా చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement