రెండేళ్ల కిందటే రహస్యంగా పెళ్లి.. సర్‌ప్రైజ్‌ చేసిన నటి! | Surveen Chawla got married in 2015, kept it secret | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 28 2017 3:57 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Surveen Chawla got married in 2015, kept it secret - Sakshi

న్యూఢిల్లీ: ఆమె రెండేళ్ల కింద గప్‌చుప్‌గా పెళ్లి చేసుకుంది. మూడో కంటికి తెలియకుండా అత్యంత సన్నిహితుల మధ్య ఆమె పెళ్లి జరిగింది. ఇప్పుడు ఆ విషయాన్ని బయట ప్రపంచానికి వెల్లడించి బాలీవుడ్‌ నటి సుర్వీన్‌ చావ్లా అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేసింది. 'హేట్‌స్టోరీ-2'లో హాట్‌హాట్‌గా నటించిన ఈ అమ్మడు.. తన ప్రియుడు అక్షయ్‌ ఠాకూర్‌ను 2015లో పెళ్లి చేసుకుంది. 2015 జూలై 18న అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఇటలీలో క్రిస్టియన్‌ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నారు. ఇటీవల విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ కూడా ఇటలీలోని టస్కనీ పట్టణంలో అట్టహాసంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా మీడియాతో మాట్లాడిన సుర్వీన్‌ తన పెళ్లయిపోయిందోచ్‌ అంటూ ప్రపంచానికి వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే అప్పట్లో తమ పెళ్లి గురించి వెల్లడించలేదని తెలిపింది. ఇప్పుడు భారతీయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నామని, ఈ డిసెంబర్‌లోనే చేసుకోవాలని భావించినా తమ కుటుంబంలో ఓ విషాద ఘటన వల్లే, వచ్చే ఏడాది భారతీయ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నామని సుర్వీన్‌ మీడియాతో తెలిపింది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement