'మొదటిసారి అక్కడే కలుసుకున్నాం'.. ప్రియురాలితో పెళ్లిపై రణ్‌దీప్‌! | Randeep Hooda-Lin Laishram recall how they first met on their wedding bells | Sakshi
Sakshi News home page

Randeep Hooda: థియేటర్లోనే పరిచయం..ప్రియురాలితో పెళ్లిపై రణ్‌దీప్‌!

Published Wed, Nov 29 2023 12:39 PM | Last Updated on Wed, Nov 29 2023 12:56 PM

Randeep Hooda Lin Laishram recall how they first met On their Wedding Bells - Sakshi

బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హుడా పెళ్లిబంధంలోకి అడుగు పెడుతున్నారు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను నవంబర్‌ 29న పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సరదాగా కనిపించారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ప్రియురాలి సంప్రదాయంలోనే వీరి పెళ్లి వేడుక జరగబోతోంది. మరి కొన్ని గంటల్లో మూడుముళ్లతో ఒక్కటి కాబోతున్న ఈ జంట పెళ్లికి ముందు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లిన్ లైష్రామ్ పెళ్లికి ముందు ఎలా కలుసుకున్నారో రణ్‌దీప్‌ గుర్తు చేసుకున్నారు

రణ్‌దీప్‌ మాట్లాడుతూ.. 'వధువు సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం మాత్రమే గౌరవప్రదమని నేను భావించా. మైటీ సంప్రదాయం ప్రకారం ప్రేమ వివాహాల్లో వరుడు చాలా సేపు కూర్చోవాలని విన్నా. ఆ సంప్రదాయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా జీవిత భాగస్వామి సంస్కృతిపై గౌరవంతోనే ఈ రోజు ఇక్కడ ఉన్నా. మణిపురి సంప్రదాయాలను ఆస్వాదిస్తున్నా. నేను, లిన్ మణిపురి సంస్కృతి గురించి మాట్లాడుకునేవాళ్లం. భవిష్యత్తులో మా జంట పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా'  అని అన్నారు.

రణదీప్, లిన్ ప్రేమకథ

లిన్ లైష్రామ్‌తో పరిచయంపై చెబుతూ.. 'మేము చాలా కాలంగా స్నేహితులం. థియేటర్లలో ఉన్నప్పుడే కలిశాం. మా మధ్య మంచి స్నేహం ఉంది. అదే ఇప్పుడు పెళ్లిబంధంగా మారింది' అని అన్నారు. కాగా.. నసీరుద్దీన్ షా థియేటర్ గ్రూప్‌లో రణదీప్‌ను కలిశానని లిన్ తెలిపింది. అక్కడ రణదీప్ తన సీనియర్ అని వెల్లడించింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి.. ఇవాళ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement