jai hind 2
-
ఎలా నటించడానికైనా రెడీ!
తమిళసినిమా: ఎలాంటి గ్లామర్ పాత్రల్లో నటించడానికైనా రెడీ. అందుకు నా భర్త పూర్తి సపోర్టు అని అంటోంది నటి సుర్విన్‌చావ్లా. ఈ ఉత్తరాది భామ నటుడు అర్జున్ నటించిన జైహింద్–2, మూండ్రపేర్ మూండ్రు కాదల్ తమిళ చిత్రాల్లో నటించింది. హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న సుర్విన్‌చావ్లా 2015లో పెళ్లి చేసుకుంది. ఆ విషయాన్ని చాలా గొప్యంగా ఉంచి ఆలస్యంగా అంటే ఇటీవలే బహిరంగ పరిచింది. వివాహానంతరం నటనను కొనసాగిస్తున్న ఈ అమ్మడు ఇటీవల ఒక భేటీలో సంచలన వ్యాఖ్యలు చేసింది. నటన, వివాహం వంటి విషయాల గురించి నటి సుర్విన్‌చావ్లా వివరిస్తూ నాకు పెళ్లి అయ్యిందని చెప్పగానే సినీ వర్గాలు, ప్రేక్షకులు షాక్ అయ్యారని, అలా ఎందుకయ్యారో తనకూ అర్థం కావడం లేదని అంది. వివాహానంతరం నటీమణులకు క్రేజ్ తగ్గిపోతుందనేది ఒకప్పటి మాట అని, ఇప్పుడు పలువురు నటీమణులు వివాహానంతరం కథానాయికలుగా రాణిస్తున్నారని అంది. ఇంకా చెప్పాలంటే పెళ్లిని, నటనను కలిపి చూడకూడదని అంది. ఇతర రంగాల లాగానే సినిమా రంగం అని, పెళ్లైన మహిళలు ఉద్యోగం చేయగా లేనిది, హీరోయిన్లు నటించడంలో తప్పేంటని ప్రశ్నించింది. మంచి భర్త లభిస్తే నటీమణులు నటనను సంతోషంగా కొనసాగించవచ్చునని పేర్కొంది. వివాహం అనేది సరైన సమయంలో చేసుకోవాలని, నేను అదే పని చేశానని చెప్పింది. సినిమాల్లో నేను సహ నటుడితో ముద్దు సన్నివేశాల్లో నటించినా, నగ్నంగా నటించినా నా భర్త అభ్యంతరం చెప్పరని, ఆయన నుంచి నాకు అంత మద్దతు ఉందని చెప్పింది. మంచి పాత్రలు లభిస్తే నటించమని అంటారని, అంతగా అర్థం చేసుకునే భర్త లభించడం నా అదృష్టం అని నటి సుర్విన్‌చావ్లా చెప్పుకొచ్చింది. -
‘జై హింద్ 2’ఆడియో ఆవిష్కరణ
-
అర్జున్ పైకొస్తాడని అప్పుడే అనుకున్నా : కోడి రామకృష్ణ
‘‘అర్జున్ దర్శక, నిర్మాతల హీరో. తనతో ఐదు సినిమాలు చేశాను. ‘మా పల్లెలో గోపాలుడు’ చిత్రం ద్వారా అర్జున్‌ని నేను పరిచయం చేసినప్పుడు తను గొప్ప నటుడవుతాడని, పైకొస్తాడని అనుకున్నా. అది నిజమైంది. నటుడిగానే కాకుండా మంచి దర్శక, నిర్మాత అని కూడా అనిపించుకున్నాడు’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పారు. అర్జున్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జై హింద్ 2’. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న కోడి రామకృష్ణ బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఆడియో సీడీని నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించి, నటుడు బ్రహ్మానందంకి ఇచ్చారు. అర్జున్ మాట్లాడుతూ- ‘‘ఓ స్టార్ హోటల్లో చెఫ్‌గా పని చేస్తున్న నారాయణ్ కృష్ణన్‌గారు ఉద్యోగాన్ని వదిలేశారు. సమాజ సేవ చేయాలనే ఆకాంక్షతో ఆక్షయ ట్రస్ట్ ప్రారంభించారు. ఆయన రియల్ హీరో అనిపించి, ఈ వేడుకకు పిలిచాం. ఈ చిత్రం కూడా సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది. విద్యా వ్యవస్థ నేపథ్యంలో సాగే చిత్రం. అర్జున్ జన్యా మంచి పాటలు స్వరపరిచారు. నా గత చిత్రాల్లోని ఫైట్స్ అన్నీ ఒక ఎత్తయితే ఈ చిత్రంలోని ఫైట్స్ అన్నీ మరో ఎత్తు’’ అని చెప్పారు. ఈ వేడుకలో మురళీమోహన్, బీవీయస్‌యన్ ప్రసాద్, సి. కల్యాణ్, ‘దిల్’ రాజు, బ్రహ్మానందం తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఐశ్వర్య, అంజన.