
జమ్మికుంట(కరీంనగర్): పెళ్లి అంటే మామూలుగా పత్రిక అచ్చు వేయించి, బంధు మిత్రులకు పంచుతూ ఆహ్వానిస్తుంటారు. కానీ ఓ కుటుంబం ఏకంగా 32 పేజీలతో కూడిన పెళ్లి పత్రికను ముద్రించి, ఆహ్వానించడం పలువురిని ఆకట్టుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుద్దాల శ్రీనివాస్– శ్రీదేవి దంపతుల పెద్ద కూతురు రవళి వివాహం ఈ నెల 23న నిశ్చయించారు.
పెళ్లికి బంధు, మిత్రులను ఆహ్వానించేందుకు 32పేజీలతో కూడిన శుభలేఖను ముద్రించారు. ఇందులో వివాహ విశిష్టతకు సంబంధించిన సంస్కృతి, పెళ్లి చూపులు, పాణిగ్రహణం, జీలకర్రబెల్లం, తలంబ్రాలు వంటి పలు అంశాలను పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment