invitation card
-
ట్రెండ్: 12 రోజుల్లో పెళ్లి.. పది నిమిషాల్లోనే ముగించేశారు!
తిరుపతికి చెందిన శ్రీనివాస్ కుమారుడు యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన కొడుకు వివాహానికి ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల్లోని బంధుమిత్రులకు ఆహా్వనం పంపేందుకు సన్నాహాలు చేపట్టారు. సమయం కేవలం 12 రోజుల మాత్రమే ఉండడంతో అందరికీ పత్రికలు పంచేందుకు వీలుకాని పరిస్థితి. కుమారుడి సలహా మేరకు బెంగళూరుకు వెళ్లి క్యూర్ స్కానర్‌తో వీడియో వెడ్డింగ్ కార్డులు, ఏటీఎం తరహాలో డిజిటల్ కార్డులు డిజైన్ చేయించారు. కేవలం 10 నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా బంధుమిత్రులకు ఆహ్వానం పలికేశారు. సరికొత్త ట్రెండ్‌తో అందించిన పెళ్లిపిలుపుపై ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.తిరుపతి సిటీ : మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వివాహ, శుభకార్యాలకు ఆహ్వానించే విధానం వినూత్నంగా మారింది. గతంలో వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రులకు పిలవాలంటే కనీసం నెలరోజుల ముందుగా వెడ్డింగ్ కార్డులు ముద్రించి వ్యయ ప్రయాసలకోర్చి గడపగడపకు వెళ్లి పంచాల్సి వచ్చేది. మారుతున్న కాలంతో పాటు అది కాస్తా ఫోన్ కాల్స్, మెసేజ్‌ల రూపంలోకి వచ్చేసింది. డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆధునిక యుగంలో ఆహా్వన పత్రికలు వీడియో వెడ్డింగ్ కార్డుల రూపంలో హల్చల్ చేస్తున్నాయి. మరింత ముందుకు వెళ్లిన అడ్వాన్డ్స్ టెక్నాలజీతో ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ వెడ్డింగ్ కార్డులు వచ్చేశాయి. ఏటీఎం తరహాలో కార్డులు పెళ్లికి బంధుమిత్రులను పిలించేందుకు క్యూఆర్ కోడ్‌తో ప్రింట్ చేసిన ఏటీఎం తరహా కార్డులు ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. వీడియో వెడ్డింగ్ ఇని్వటేషన్స్తో పాటు ఉన్నతస్థాయి బంధుమిత్రుల కోసం విజిటింగ్ కార్డ్స్ రూపంలో ఉండే డిజిటల్ వెడ్డింగ్ కార్డులు పంపుతున్నారు. ఏపీలో తొలిసారి పశి్చమగోదావరి జిల్లాలో ఓ కాంట్రాక్టర్ తన కుమారుడి వివాహం కోసం ఈ తరహా కార్డులను తయారు చేయించారు. ఇందులో కార్డుపై భాగంలో వధూవరుల ఫొటో, పేర్లు, ఆహా్వనించు తల్లిదండ్రుల పేర్లు మాత్రమే ఉంటాయి. వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వివాహనికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. పెళ్లిమండపం అడ్రస్, లొకేషన్ మ్యాప్, పెళ్లి పత్రిక, విందు టైమింగ్స్, ముహూర్త సమయంతో పాటు సంప్రదించాల్సిన వధువు, వరుడి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు పొందుపరిచి ఉంటాయి.ఇప్పుడు ఇదే ట్రెండ్ డిజిటల్ యుగంలో యువత బర్త్ డే, ఎంగేజ్మెంట్, గ్రాడ్యుయేషన్, బేబీ షవర్, ఆఫ్ శారీ ఫంక్షన్స్, గృహప్రవేశాలు వంటి అన్ని శుభకార్యాలకు వీడియో కార్డుల ద్వారా ఆహా్వనాలను వాట్సాప్‌లో పంపుతున్నారు. ఇంటర్నెట్, కంప్యూటర్‌పై అవగాహన ఉన్న ప్రతి వ్యక్తీ ఉచిత టెంప్లెట్స్ను డౌన్లోడ్ చేసుకుని తమకు నచ్చిన డిజైన్లలో ఆహ్వాన పత్రికలను తయారు చేసేస్తున్నారు. కరోనా తర్వాత ఆహా్వనాలను డిజిటల్ పద్ధతిలో పంపేందుకే ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రింటింగ్ కార్డులపై తగ్గిన మోజు వివాహ మహోత్సవంలో ప్రధాన భూమిక పోషించే వెడ్డింగ్ కార్డులు కాలానుగుణంగా రూపు మార్చుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కార్డులతో మొదలైన పెళ్లి పత్రికలు తర్వాత కలర్, యూవీ, లేజర్, ఫొటో ప్రింట్, సౌండ్ సిస్టమ్ కార్డులుగా మారాయి. ఈ ట్రెండ్ కొంతకాలం కొనసాగింది. రూ.2 నుంచి సుమారు రూ.20 వరకు ఒక్కోకార్డు «ప్రింటింగ్ ధర ఉండేది. ప్రస్తుతం నయా ట్రెండ్ మొదలైంది. డిజిటల్ యుగంలో వీడియో వెడ్డింగ్ కార్డులు మార్కెట్‌ను శాసించాయి. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కానర్‌తో రూపొందించిన డిజిటల్ కార్డుల వైపు యువత మొగ్గు చూపుతోంది. దీంతో ప్రింటింగ్ ప్రెస్ దుకాణాలు వెలవెలబోతున్నాయి.విశేషంగా స్పందన మా కాబోయే అల్లుడు లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. మాది కొత్త బంధుత్వం. ఆగస్టు 14న బెంగళూరులోని కల్యాణ మండపంలో సెపె్టంబర్ 2న వివాహం జరిపేందుకు పండితులు ముహూర్తం పెట్టారు. వధువరూలు ఆగస్టు 20న ఇండియాకు వచ్చారు. పదిరోజులు మాత్రమే సమయం ఉంది. బంధుమిత్రులకు ఎలా ఆహా్వనం పంపాలనే ఆలోచనలో పడ్డాం. మా అల్లుడి సలహాతో ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో ఉన్న డిజిటల్ కార్డులను తయారు చేసి అందరికీ వాట్సాప్ ద్వారా పంపించాం. బంధుమిత్రులు ఇబ్బంది లేకుండా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుని కల్యాణ మండపానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. చాలా సంతోషంగా అనిపించింది. – కోటేశ్వరరావు, తిరుపతిప్రింటింగ్ కార్డులు తగ్గాయి గతంలో ప్రతి ఏడాది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో సుమూహూర్తాలు ఉన్నందున పెళ్లికార్డుల ప్రింటింగ్‌కు ప్రజలు ఎగబడేవారు. బిజినెస్ అంతా ఆ మూడు మాసాల్లోనే జరిగేది. నగరంలోని ప్రతి ప్రింటింగ్ ప్రెస్ నిర్విరామంగా పనిచేసేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంత వాసులు మాత్రం అడపాదడపా తక్కువ క్వాంటిటీతో పెళ్లి పత్రికల కోసం వస్తున్నారు. సుమారు 50 శాతానికి పైగా బిజినెస్ తగ్గింది. కంప్యూటర్ కాలం, డిజిటల్ ఫోన్లు రాకతో పత్రికలకు డిమాండ్ భారీగా పడిపోయింది. – వెంకటేశ్వర్లు, ప్రింటింగ్ ప్రెస్ యజమాని, తిరుపతి -
అంబానీ పెళ్లి డేట్ ఫిక్స్.. వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో చూశారా?
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి డేట్ ఖరారైంది. జూలై 12న వీరి వివాహానికి ముహుర్తం నిశ్చయించారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జూలై 12 నుంచి 14 వరకు వీరి వివాహ వేడుక జరగనుంది.అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక బయటకు వచ్చింది. ఎరుపు, బంగారు వర్ణంలో రూపొందించిన వెడ్డింగ్ కార్డులు ఆకట్టుకుంటున్నాయి. వీటిని అతిథులకు పంచే కార్యక్రమాన్ని అంబానీ కుటుంబం ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆహ్వాన పత్రికలో పేర్కొన్నదాని ప్రకారం.. మూడు రోజులపాటు వివాహ వేడుకలు జరుగనున్నాయి. జులై 12న శుభ వివాహంతో వివాహ వేడుక ప్రారంభం కానుంది. ఈవేడుకకు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ వేడుకకు రావాలని అతిథులను కోరారు. జూలై 13న 'శుభ్ ఆశీర్వాద్' సందర్భంగా అతిథులకు డ్రెస్ కోడ్‌ను 'ఫార్మల్ ఇండియన్'గా పేర్కొన్నారు. ఇక జులై 14న జరిగే మంగళ్ ఉత్సవ్ సందర్భంగా డ్రెస్ కోడ్ 'ఇండియన్ చిక్'గా ఉంటుంది. -
అయోధ్య ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక.. ప్రత్యేకతలు ఇవే..!
-
వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!
ఇటీవలకాలంలో యువత తమ సృజనాత్మకతను జోడించి చాలా వినూతనంగా వివాహాలు చేసుకుంటున్నారు. అందర్నీ ఆకట్టుకునేలా ఔరా! అనిపించేలా వివాహాలు జరుపుకుంటున్నారు. కొంతమంది హంగు ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసుకుంటే మరికొంతమంది చాలా సింపుల్‌గా వివాహాలు చేసుకుని అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడోక జంట భావించింది కాబోలు. ఆ నవ దంపతుల వివాహా ఆహ్వాన పత్రికను చూసే ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు విషయమేమిటంటే...ఆ దంపతులు తమ వెడ్డింగ్ కార్డు వెరైటీగా ఉండాలనుకున్నారు కాబోలు. అందుకోసం వారి వివాహా ఆహ్వాన పత్రికనే ఒక ట్యాబ్లెట్ స్టిప్స్ ఆకారంలో రూపొందించారు. ట్యాబ్లెట్ వెనుకవైపు ఉండే విభాగంలో ఆయా ట్యాబ్లెట్‌కి సంబంధించిన వివరాలు మాదిరిగా.. హెచ్చరిక, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి తదితర అంశాలో వారి సమాచారం ఉంది. నిశితంగా చూస్తేనే అది ఆహ్వాన పత్రిక అని తెలుస్తుంది. పైగా చాలా ఫన్నీగా అనిపిస్తోంది కూడా. పెళ్లి పత్రికలో ఎలా అయితే వధువు, వరుడు వివరాలు ఉంటాయో అలానే అన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఇలాంటి ఆలోచన రావడం కూడా గ్రేట్. అంతేకాదండోయ్ వరుడు పేరు ఎళిలరసన్ ఫార్మసీ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా, వధువు వసంతకుమారి నర్సింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రోఫెసర్. తరుచు సోష్ల్ మీడియాలో యాక్టివిగ్ ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ చైర్మన్ హర్ష గోయెంకాను ఎంతగానో ఇంప్రెస్ చేసింది ఈ వివాహ పత్రిక. ప్రజలు చాలా కొత్తదనం కోరుకోవడమే కాదు వినూత్నంగా ఆలోచిస్తున్నారు అని కొనియాడారు. ఇది ఫార్మసిస్ట్ వివాహా ఆహ్వాన పత్రిక అంటూ...ఆ జంట ఆలోచనని ప్రశంసించారు. A pharmacist’s wedding invitation! People have become so innovative these days…. pic.twitter.com/VrrlMCZut9 — Harsh Goenka (@hvgoenka) August 20, 2022 (చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!) -
ఈ పెళ్లికి వెళ్లాలంటే 5వేల గిఫ్ట్ ఇవ్వాలంట, ఇంకా బోలెడు రూల్స్..
సాధారణంగా పెళ్లంటే అతిథులు, బంధువులు, స్నేహితులు ఇలా సపరివారాన్ని పిలవడం ఆనవాయితీ. ఇక పెళ్లి రోజు అతిథులు వచ్చి నాలుగు అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించి, భోజనం తిని వెళ్లాలని కోరుకుంటాం. ఈ తతంగమంతా కామన్. అయితే రొటీన్‌కు భిన్నంగా కావాలనుకున్నాడో ఏమో తెలీదు గానీ ఓ పెళ్లి ఇన్విటేషన్ మాత్రం విచిత్రంగా ప్లాన్ చేశారు. అందులో వివాహానికి వచ్చే అతిథులు ఏం చేయాలి, ఏం చేయకూడదనే రూల్స్ కూడా పెట్టారు. ఆ రూల్స్ కూడా మామూలుగా లేవు. ప్రస్తుతం ఈ ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వెడ్డింగ్ ప్లానర్ వివాహానికి వచ్చే అతిథుల సంఖ్యను నిర్ధారించుకోవడానికి ఓ మెయిల్ పంపించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ అందులో పెళ్లికి హాజరయ్యే వాళ్లు పాటించాల్సిన నియమాలను కూడా జత చేసి పంపాడు. తాజాగా ఈ మెయిల్‌ను రెడిట్‌లో షేర్ చేయగా.. ఆహ్వానం వింతగా ఉండడంతో అది కాస్తా వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆ మెయిల్లో...గుడ్ మార్నింగ్.. వివాహానికి ఎంత మంది అతిథులు వస్తారో తెలుసుకోవడానికి ఈ మొయిల్ చేస్తున్నాను. ఇందులో పెళ్లిలో పాటించాల్సిన రూల్స్ ఉన్నాయి. ముందుగా మీతో పాటు ఎవరైనా వస్తున్నారా అనేది కూడా తెలపగలరు.. అని ఉంది. ఇవే ఆ వెరైటీ రూల్స్: ►పెళ్లికి కనీసం 15 నుంచి 30 నిమిషాల ముందు రావాల్సిందిగా తెలిపాడు. ►తెలుపు, గోధుమ రంగు దుస్తులు వేసుకోకూడదు. ►బేసిక్ బాబ్ స్టైల్, పోనీటెయిల్ తప్ప రకరకాల జడలు వేసుకుని రాకూడదంట. ►ముఖానికి పుల్గా మేకప్ వేసుకోకూడదు. ►వివాహ తతంగాన్ని ఎవరూ రికార్డు చేయకూడదు. ►పెళ్లి కూతురుతో అసలు మాట్లాడొద్దు. ►చివరిగా.. వచ్చే ప్రతి ఒక్కరూ కనీసం 75 డాలర్లు ( సుమారు రూ.5000), అంతకన్నా ఎక్కువ మొత్తం ధర ఉన్న గిఫ్ట్ తీసుకొని వస్తేనే పెళ్లికి అనుమతి ఉంటుంది.... ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే సంప్రదించగలరని కూడా తెలిపాడు. ఈ రూల్స్ చూసి నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇలాంటి పెళ్లిని బాయ్‌కాట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు. -
వాట్సాప్‌లో ఆహ్వాన పత్రిక చక్కర్లు
మిర్యాలగూడ టౌన్ : ఈనెల 11వ తేదీన జరగనున్న 13వ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కొంత మంది యువకులు ఆహ్వాన పత్రిక ముద్రించి వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. ఆహ్వానం...సాధారణ ఎన్నికలు–2019, నూతన సభ్యుల ఉత్సవం, ముహూర్తం 11.04.2019 గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటలు, వేదిక.. మీ ప్రాంతంలోని మీ ఓటు నమోదైన పోలింగ్ కేంద్రం, విన్నపం...ఈ ఎన్నికల ఉత్సవానికి సంబంధించి ఎటువంటి కానుకలు ఇవ్వరాదు...తీసుకోరాదు.. అంటూ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ముద్రించారు. ఈ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఆహ్వాన పత్రికపై సర్వత్రా చర్చ జరుగుతుంది. -
చిలకమ్మా..చెప్పవే రామయ్యకు వస్తున్నామని
రాజానగరం: భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులకు రామచిలుకలతో ‘పిలుపును’ అందించే కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలో గురువారం జరిగింది. శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో 4 రామచిలుకలను 4 వేదాలుగా పూజిస్తూ ‘శ్రీరామ’ నామాన్ని జపించారు. ప్రత్యేకంగా ముద్రించిన రామయ్య కల్యాణోత్సవ ఆహ్వాన శుభలేఖలను చిలుకలకు కట్టి పూజించారు. కోటి తలంబ్రాలతో భద్రాద్రికి పయనమవుతున్న సమాచారాన్ని రామయ్యకు తెలియజే యాలని కోరుతూ చిలుకలను గాలిలోకి విడిచారు. - రాజానగరం