అంబానీ పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. వెడ్డింగ్‌ కార్డు ఎలా ఉందో చూశారా? | Anant Ambani Radhika Merchant wedding invitation card out | Sakshi
Sakshi News home page

అంబానీ పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. వెడ్డింగ్‌ కార్డు ఎలా ఉందో చూశారా?

Published Thu, May 30 2024 10:00 PM | Last Updated on Fri, May 31 2024 3:12 PM

Anant Ambani Radhika Merchant wedding invitation card out

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి డేట్ ఖరారైంది. జూలై 12న వీరి వివాహానికి ముహుర్తం నిశ్చయించారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జూలై 12 నుంచి 14 వరకు వీరి వివాహ వేడుక జరగనుంది.

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక బయటకు వచ్చింది. ఎరుపు, బంగారు వర్ణంలో రూపొందించిన వెడ్డింగ్‌ కార్డులు ఆకట్టుకుంటున్నాయి. వీటిని అతిథులకు పంచే కార్యక్రమాన్ని అంబానీ కుటుంబం ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 

ఆహ్వాన పత్రికలో పేర్కొన్నదాని ప్రకారం..  మూడు రోజులపాటు వివాహ వేడుకలు జరుగనున్నాయి. జులై 12న శుభ వివాహంతో వివాహ వేడుక ప్రారంభం కానుంది. ఈవేడుకకు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ వేడుకకు రావాలని అతిథులను కోరారు. జూలై 13న 'శుభ్ ఆశీర్వాద్' సందర్భంగా అతిథులకు డ్రెస్ కోడ్‌ను 'ఫార్మల్ ఇండియన్'గా పేర్కొన్నారు. ఇక జులై 14న జరిగే మంగళ్ ఉత్సవ్ సందర్భంగా డ్రెస్ కోడ్ 'ఇండియన్ చిక్'గా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement