ఈ పెళ్లికి వెళ్లాలంటే 5వేల గిఫ్ట్‌ ఇవ్వాలంట, ఇంకా బోలెడు రూల్స్‌.. | Viral: Wedding Rules Made For Guests Come With Rs 5500 Gift Or More | Sakshi
Sakshi News home page

ఈ పెళ్లికి వెళ్లాలంటే ఇవి పాటించాల్సిందే.. ముఖ్యంగా ఆ రూల్‌!

Published Sat, Jul 17 2021 6:03 PM | Last Updated on Sat, Jul 17 2021 9:39 PM

Viral: Wedding Rules Made For Guests Come With Rs 5500 Gift Or More - Sakshi

సాధారణంగా పెళ్లంటే అతిథులు, బంధువులు, స్నేహితులు ఇలా సపరివారాన్ని పిలవడం ఆనవాయితీ. ఇక పెళ్లి రోజు అతిథులు వ‌చ్చి నాలుగు అక్షింత‌లు వేసి వధూవరులను ఆశీర్వ‌దించి, భోజ‌నం తిని వెళ్లాలని కోరుకుంటాం. ఈ తతంగమంతా కామన్‌. అయితే రొటీన్‌కు భిన్నంగా కావాలనుకున్నాడో ఏమో తెలీదు గానీ ఓ పెళ్లి ఇన్విటేష‌న్ మాత్రం విచిత్రంగా ప్లాన్‌ చేశారు. అందులో వివాహానికి వ‌చ్చే అతిథులు ఏం చేయాలి, ఏం చేయ‌కూడ‌ద‌నే రూల్స్ కూడా పెట్టారు. ఆ రూల్స్‌ కూడా మామూలుగా లేవు. ప్రస్తుతం ఈ ఆహ్వానం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ఓ వెడ్డింగ్ ప్లాన‌ర్ వివాహానికి వ‌చ్చే అతిథుల సంఖ్య‌ను నిర్ధారించుకోవ‌డానికి ఓ మెయిల్ పంపించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ అందులో పెళ్లికి హాజరయ్యే వాళ్లు పాటించాల్సిన నియమాలను కూడా జత చేసి పంపాడు. తాజాగా ఈ మెయిల్‌ను రెడిట్‌లో షేర్ చేయ‌గా..  ఆహ్వానం వింతగా ఉండడంతో అది కాస్తా వైరల్‌గా మారి నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఆ మెయిల్‌లో...గుడ్ మార్నింగ్‌.. వివాహానికి ఎంత మంది అతిథులు వ‌స్తారో తెలుసుకోవ‌డానికి ఈ మొయిల్‌ చేస్తున్నాను. ఇందులో పెళ్లిలో పాటించాల్సిన రూల్స్‌ ఉన్నాయి. ముందుగా మీతో పాటు ఎవ‌రైనా వ‌స్తున్నారా అనేది కూడా తెలపగలరు.. అని ఉంది. 

ఇవే ఆ వెరైటీ రూల్స్‌:
►పెళ్లికి క‌నీసం 15 నుంచి 30 నిమిషాల ముందు రావాల్సిందిగా తెలిపాడు.
►తెలుపు, గోధుమ రంగు దుస్తులు వేసుకోకూడదు.
►బేసిక్‌ బాబ్‌ స్టైల్‌, పోనీటెయిల్ త‌ప్ప ర‌క‌ర‌కాల జ‌డ‌లు వేసుకుని రాకూడదంట.
►ముఖానికి పుల్‌గా మేక‌ప్ వేసుకోకూడదు.
►వివాహ తతంగాన్ని ఎవ‌రూ రికార్డు చేయకూడదు.
►పెళ్లి కూతురుతో అస‌లు మాట్లాడొద్దు.
►చివ‌రిగా.. వచ్చే ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం 75 డాల‌ర్లు ( సుమారు రూ.5000), అంత‌క‌న్నా ఎక్కువ మొత్తం ధర ఉన్న గిఫ్ట్‌ తీసుకొని వ‌స్తేనే పెళ్లికి అనుమ‌తి ఉంటుంది.... ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే సంప్రదించగలరని కూడా తెలిపాడు. ఈ రూల్స్ చూసి నెటిజ‌న్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇలాంటి పెళ్లిని బాయ్‌కాట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement