తొలుత తటపటాయించా | Hate Story 2 not an ideal debut film: Surveen Chawla | Sakshi
Sakshi News home page

తొలుత తటపటాయించా

Published Tue, Jul 22 2014 11:23 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

తొలుత తటపటాయించా - Sakshi

తొలుత తటపటాయించా

ముంబై : ‘హేట్ 2’ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాలో పాత్ర పోషించే విషయమై తొలుత తటపటాయించానని సుర్వీన్‌చావ్లా చెప్పింది. ఈ సినిమాతోనే చావ్లా బాలీవుడ్‌లో అడుగిడింది. సాజిద్‌ఖాన్ నిర్మించిన ‘హిమ్మత్‌వాలా’ సినిమాలో సుర్వీన్ చిన్న పాత్ర పోషించింది. ‘పెద్ద పెద్ద నటుల సరసన తొలి సినిమా చేయాలని వర్ధమాన నటులు ఆకాంక్షిస్తారు.

 ఏదిఏమైనప్పటికీ ‘హేట్ 2’ సినిమా కొత్తగా బాలీవుడ్‌లో అడుగు పెట్టేవారికి సరైనది కాదు. సాధారణంగా ఈ రంగంలోకి అడుగిడినవారెవరైనా భారీ పతాకం కింద చేయాలని ఆశిస్తారు’ అని అంది. కాగా ‘హేట్ 2’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో సుర్వీన్ చావ్లా, టీవీ నటుడు భానుశాలి నటించారు. ఈ సినిమాలో సుశాంత్... ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో హీరో,హీరోయిన్ల మధ్య తీసిన శృంగార దృశ్యాలు బాలీవుడ్‌లో సంచలనం రేకెత్తించాయి.

 ఈ విషయమై సుర్వీన్ మాట్లాడుతూ అటువంటి దృశ్యాల్లో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదంది. అది వృత్తిలో భాగమని చెప్పింది. ‘సన్నిహిత దృశ్యాలను నేను నిరోధించను. ఎంతో సౌకర్యవంతంగా భావిస్తాను. అయినప్పటికీ రొమాన్స్ అంటే నాకు ఇష్టమే. వాటిని తెర బయటి దృశ్యాలుగా భావించబోను. సినిమాల్లో ఇటువంటి దృశ్యాలు ఉండాలి. ఇటువంటి దృశ్యాల్లో నటించడం ఎంత సులువో అంతే కష్టం కూడా. ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పుడు ఇటువంటి సీన్లలో నటించడం సమస్యే కాదు’ అని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement