వెరీ... వెరీ సింపుల్! | Surveen Chawla Glamour secret... | Sakshi
Sakshi News home page

వెరీ... వెరీ సింపుల్!

Published Tue, Apr 14 2015 11:40 PM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

వెరీ... వెరీ సింపుల్! - Sakshi

వెరీ... వెరీ సింపుల్!

గ్లామర్ పాయింట్
పంజాబీ సినిమాల్లో నటించి ఆ తరువాత బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది సుర్వీన్ చావ్లా. కోపం తగ్గించుకోవాలని,‘తన శాంతమే తనకు రక్ష’ అని మంచి మాటలు కూడా చెబుతుంటుంది చావ్లా.ఇదిసరే గానీ, ‘స్కిన్ షో’ గురించి ఒక ప్రశ్న వేసి చూడండి.అందమైన అమ్మాయి కాస్తా అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. అప్పటికప్పుడు కారాలు మిరియాలు నూరుతుంది. అంతేనా?‘‘హాలీవుడ్‌లో కనిపించే స్కిన్ షో గురించి కళాత్మక విలువల కోణంలో మాట్లాడతారు. మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం, ఎంత అసహ్యం! అంటారు. మన ద్వంద్వ వెఖరికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఉంటుందా? ఉన్నచోటే ఉంటామంటే కుదరదు. మనం కూడా మారాలి. చూసే దృక్పథాన్ని విశాలం చేసుకోవాలి...’’ అంటూ కారాలు మిరియాల మిక్స్‌తో కూడిన ఉపన్యాసాన్ని దంచుతూనే ఉంటుంది చావ్లా.
 చావ్లా కోపాన్ని నిమిషాల్లో తగ్గించాలని ఉందా? వెరీ సింపులండీ.
 ‘‘మీ గ్లామర్ రహస్యం ఏమిటి?’’ అని ఒక్క ప్రశ్న అడగండి చాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement