Glamour secret
-
మహేశ్ బాబు అందం వెనకున్న సీక్రెట్ ఇదే..
మహేశ్ బాబు అంటే చాలామందికి గుర్తొచ్చేది అందం. నాలుగు పదుల వయసులో 25ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. ఇక ఆయనకున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేశ్ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయంటూ మెలికలు తిరిగిపోతుంటారు. ఆయన గ్లామర్ వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు.చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే.. ఇదే విషయాన్ని కొందరు ఇంటర్వ్యూల్లో ప్రశ్నించగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానంటూ బదులిచ్చారు మహేశ్. అంతేకాకుండా ప్రతిరోజు ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకుంటాను. జంక్‌ఫుడ్ జోలికి అసలు వెళ్లను. వీటితో పాటు ఎప్పుడూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండటమే నా అందానికి అసలు సీక్రెట్. చిరునవ్వే నిజమైన అందం. అందుకే మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ఏ తప్పూ చేయకపోవడం, భవిష్యత్తుల్లోనూ చెయ్యను అనే నమ్మకమే మనల్ని ప్రశాంతంగా ఉంచేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు మహేశ్. చదవండి: మహేశ్ బాబు మేనియా.. థియేటర్స్‌లో 'పోకిరి' రీసౌండ్ -
అంతా పాజిటివ్!
‘‘పదేళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడూ అలానే ఉన్నావ్.. ఏం చేస్తున్నావ్’’ అని చెక్కు చెదరని అందం, మంచి శరీరాకృతితో ఉండేవాళ్లను షేపులు మారిపోయినవాళ్లు అడగడం కామన్. శ్రీయను ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. పన్నెండేళ్ల క్రితం వెండితెరకు పరిచయమైనప్పుడు ఎంత సన్నగా ఉన్నారో ఇప్పుడూ ఆమె అలానే ఉన్నారు. బహుశా కడుపు మాడ్చుకుంటారేమో అనుకుంటే పొరపాటే. నచ్చివన్నీ హాయిగా లాగించేస్తారు. మరి.. కత్తిలాంటి శ్రీయ శరీరాకృతి వెనక ఉన్న రహస్యం ఏంటి? అంత అందంగా కనిపించడానికి ఆమె ఏం చేస్తారు?.. తెలుసుకుందాం. వర్కవుట్ సినిమా హీరోయిన్ కాకముందు నుంచే శ్రీయ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు. వర్కవుట్స్ చేసేవారు. దాంతో ఫిట్నెస్ గురించి ఆమెకు మంచి అవగాహన ఉంది. రోజూ ఒకే రకం వ్యాయాయాలు చేయరు. ఒకరోజు కార్డియో ఎక్సర్సైజ్, మరుసటి రోజు స్విమ్మింగ్, ఆ మర్నాడు బ్యాడ్మింటన్లాంటి ఏదైనా గేమ్.. ఇలా రోజు మార్చి రోజు ఒక్కోటి చేస్తారు. వీటితో పాటు యోగా కంపల్సరీ. రోజూ కనీసం 45 నిముషాలైనా యోగా చేయడం శ్రీయ అలవాటు. ఆ 45 నిముషాల్లో రకరకాల ఆసనాలు వేస్తారు. ఫైనల్‌గా కాసేపు ధ్యానం చేస్తారు. చిన్నప్పుడు కథక్ నేర్చుకున్నారామె. అప్పుడప్పుడూ డ్యాన్స్ చేస్తుంటారు. అది కూడా మంచి వ్యాయామమే అంటారు శ్రీయ. వర్కవుట్స్‌లో భాగంగా శ్రీయ ఒక్కటి మాత్రం చేయనే చేయరు. అదే ‘వెయిట్ లిఫ్టింగ్’. అవి తనకు నప్పవని శ్రీయ ఫీలింగ్. అందుకే బరువులకు దూరంగా ఉంటారు. డైట్ ట్రావెల్ చేసేటప్పుడు ఒక రకమైన డైట్, ఇంట్లో ఉన్నప్పుడు మరో రకమైన డైట్ తీసుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఉదయం గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్‌తో శ్రీయ తన డైట్ మొదలుపెడతారు. బ్యాడ్ కొలస్ట్రాల్‌ను కట్ చేసే సామర్థ్యం ఆరెంజ్ జ్యూస్‌కి ఉందని అంటారు. ఆ తర్వాత ఎగ్ ైవైట్తో మసాలా ఆమ్లెట్ లేకపోతే దోసె తీసుకుంటారు. ఇవి రెండూ కాకపోతే పనీర్ పరోటా తింటారు. ప్రతి రెండు గంటలకోసారి ఏదో ఒకటి తినడం శ్రీయ అలవాటు. ఆమె తల్లి శెనగలతో రుచికరమైన కట్లెట్స్ తయారు చేస్తారట. అవి ఆరోగ్యానికి మంచిదని శ్రీయ చెబుతారు. ఇంట్లో ఉన్నప్పుడు ఈ కట్లెట్స్ కంపల్సరీ. లంచ్, డిన్నర్‌కు అమ్మ ఏది చేసి పెడితే అది తింటానంటున్నారు. శ్రీయకు డార్క్ చాక్లెట్ ఇష్టం. ఫ్రిడ్జ్‌లో అవి ఉండేలా చూసుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు లాగించేస్తారు. అవుట్డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు మాత్రం బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్, డ్రై ఫ్రూట్స్ మిక్స్‌ను పాలల్లో కలిపి తింటారు. లంచ్‌కు రోటీలు, గ్రిల్డ్ ఫిష్ లేక చికెన్ తీసుకుంటారు. సాయంత్రం సలాడ్స్ తింటారు. డిన్నర్లో తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకుండా చూసుకుంటారు. రాత్రి ఎనిమిది లోపే డిన్నర్ పూర్తి చేసేస్తారు. అదే ఆరోగ్యానికి మంచిదని అంటారామె. బ్యూటీ టిప్స్ రోజ్ వాటర్ చాలా మంచిదని శ్రీయ అంటారు. రోజు మొత్తంలో నాలుగైదు సార్లు రోజ్ వాటర్‌తో మొహం కడుక్కుంటారు. ఆ నీళ్లల్లో గ్లిజరిన్ కలుపుకుని కడక్కుంటే ఫేస్ బాగా క్లీన్ అవుతుందని అంటారు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం శెనగపిండి, పసుపు, పెరుగు కలిపి ఫేస్‌ప్యాక్‌లా పెట్టుకుంటారు. మార్కెట్లో లభించే సౌందర్య సాధనాలన్నింటికన్నా ఇదే బెస్ట్ అంటారామె. శ్రీయకు ముంబయ్‌లో సొంత స్పా ఉంది. అప్పుడప్పుడు అక్కడికెళ్లి బాడీ మసాజ్ చేయించుకుంటారు. బాడీ రిలాక్స్ కావడానికి మసాజ్ మంచి పద్ధతి అని సలహా ఇస్తున్నారామె. బయటికి అందంగా కనిపించాలంటే లోపల ఆనందంగా ఉండాలని శ్రీయ అంటారు. అందుకే వీలైనంత ప్రశాంతంగా ఉంటారు. దాదాపు కోపం రాదట. శ్రీయకు ఓ మేనల్లుడు ఉన్నాడు. పేరు ధ్రువ్. వీలు కుదిరినప్పుడల్లా ఈ బుడతడితో ఆడుకుంటారు. అప్పుడు చాలా రిఫ్రెష్ అయిపోతానంటున్నారు. నెగటివ్ ఫీలింగ్స్‌కి దగ్గరకు రానివ్వననీ, తన అందం, ఆరోగ్యానికి పాజిటివ్ మైండ్‌సెట్ కారణమని శ్రీయ పేర్కొన్నారు. -
అలాంటివాడే కావాలి!
పరిచయం అవసరం లేని నటి శ్రీయ. ‘ఇష్టం’తో ఆమె ఎంట్రీ ఇచ్చి నప్పుడే అందరూ ఇష్టపడిపోయారు. ఆమె అందాన్ని, నటనను చూసి ‘సంతోషం’ ప్రకటించారు. మా అభిమాన నటి ‘నువ్వే నువ్వే’ అంటూ తేల్చి చెప్పేశారు. నేటికీ సక్సెస్ఫుల్ నటిగా సాగిపోతోన్న శ్రీయ చెప్పిన కబుర్లివి. తన గ్లామర్ సీక్రెట్స్, ఫుడ్ హ్యాబిట్స్, తాను మనువాడబోయే వాడిలో ఉండాల్సిన క్వాలిటీస్... అన్నీ చదివి ఎంజాయ్ చేయండి! మీ గ్లామర్ సీక్రెట్? వ్యాయామం. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా తెల్లవారు జామునే లేచి తప్పకుండా యోగా చేస్తాను. ఒకవేళ నటిని కాకుండా ఉన్నా ఇలాగే చేసేదాన్ని. ఎందుకంటే ఫిట్నెస్ అందరికీ ముఖ్యమే. మీ ఫుడ్ హ్యాబిట్స్? పొద్దున్నే పరాఠా, ఎగ్ వైట్‌తో ఆమ్లెట్, ఆరెంజ్ జ్యూస్... మధ్యాహ్నం పప్పు, వెజిటబుల్ కర్రీతో రోటీ,... రాత్రికి గ్రిల్డ్ ఫిష్తోనో, గ్రిల్డ్ చికెన్తోనో డిన్నర్. ఐస్‌క్రీమ్, స్వీట్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్లను. అందానికి మీరిచ్చే నిర్వచనం? అందమంటే మనసు. మనసు, ఆలోచనలు మంచిగా ఉండాలి. అప్పుడు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. అది మనల్ని అందంగా కనబడేలా చేస్తుంది. ఇండస్ట్రీలో మీకు పోటీ ఎవరు? పోటీ అన్న మాటే నాకు నచ్చదు. ప్రతి ఒక్కరికీ తమ ప్రతిభకు తగ్గ అవకాశాలు వస్తాయి. మనకంటే ఒకరికి తక్కువ వస్తే మనం ఎక్కువయినట్టు కాదు. మనకంటే ఒకరికి ఎక్కువ వస్తే మనం తక్కువయి పోయినట్టూ కాదు. ఎవరి టాలెంట్ వాళ్లది. ఎవరి అవకాశాలు వాళ్లవి. మిమ్మల్ని సంతోషపెట్టేది? పని. ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి. ఖాళీగా ఉంటే పిచ్చి పడుతుంది నాకు. మరి బాధపెట్టేది? అంధులను చూస్తే చాలా బాధగా ఉంటుంది. అన్నీ సరిగ్గా ఉంటేనే ఒక్కో సారి మనం మేనేజ్ చేసుకోలేక కష్టపడు తుంటాం. అలాంటిది పాపం వాళ్లు ఎలా జీవితాన్ని సాగిస్తారా అని దిగులు కలుగు తుంది. అందుకే నేను ముంబైలో ‘శ్రీ స్పందన’ అనే స్పా పెట్టి, విజువల్లీ చాలెంజెడ్ పీపుల్‌నే స్టాఫ్‌గా పెట్టాను. తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు? సినిమాలు చూస్తుంటాను. పుస్తకాలు చదువుతాను. ‘గాన్ విత్ ద విండ్’ నా ఫేవరేట్ బుక్. అలాగే ఫ్రీ టైమ్‌లో డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటాను. మీరు కథక్ డ్యాన్సర్ కదా? అవును. చిన్నప్పట్నుంచీ నాకు డ్యాన్స్ అంటే ప్రాణం. కథక్, రాజస్థానీ ఫోక్ డ్యాన్స్ నేర్చుకున్నాను. సినిమాల్లో పలు రకాల డ్యాన్సులు చేస్తుంటాను కానీ పూర్తి స్థాయి క్లాసికల్ డ్యాన్స్ చేసే పాత్ర వస్తే బాగుణ్ననిపిస్తూ ఉంటుంది. అలాగే హృతిక్‌తో డ్యాన్స్ చేయాలని కోరిక. ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళ స్థానం ఎలా ఉంది? బాగానే ఉంది. అందుకేగా మేమంతా ఇక్కడ ఉన్నాం. అయినా కష్టసుఖాలనేవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. అన్నిచోట్లా ఉంటాయి. అసలు సమస్యే లేని రంగం కావాలంటే ఎక్కడా కనిపించదు. మన పని మనం చేసుకుని పోతూ ఉంటే ఎటువంటి ఇబ్బందులూ రావు. నా వరకూ నాకెప్పుడూ చేదు అనుభవాలు ఎదురు కాలేదు. మహిళా సాధికారత గురించి మీ అభిప్రాయం? మగవాడు లేకుండా మహిళ లేదు. మహిళలు లేకుండా పురుషులూ లేరు. ఎవరూ ఎవరికంటే ఎక్కువా కాదు, తక్కువా కాదు. ఇద్దరూ సమానమే. పురుషులు, స్త్రీలు ఇద్దరూ కలిస్తేనే ఏదైనా సాధ్యపడుతుంది. మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. నేను మొదట్నుంచీ చాలా యాక్టివ్. అందరితోనూ త్వరగా కలిసిపోయేదాన్ని. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఈజీగా నా ఫ్రెండ్స్ అయిపోయేవారు. ఇప్పటికీ నా స్కూల్ ఫ్రెండ్స్ నాతో టచ్‌లోనే ఉన్నారు. ఎవరినైనా ప్రేమించారా? లేదు. మనం ఎవరిని ప్రేమిస్తాం, ఎవరిని పెళ్లాడతాం అనేది రాసిపెట్టి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మనకు ఎదురు పడతారు. అప్పుడు ప్రేమ, పెళ్లి అన్నీ ఆటోమేటిగ్గా జరిగిపోతాయి. ఎలాంటివాణ్ని కోరుకుంటారు? ఆడవాళ్లను గౌరవించేవాడై ఉండాలి. భార్యకీ ఒక వ్యక్తిత్వం ఉంటుందని గుర్తించాలి. మానసికంగా, ఆధ్యాత్మి కంగా పరిణతి గలవాడికే నా ఓటు. చివరిగా... మీ సక్సెస్ సీక్రెట్? క్రమశిక్షణ. ఏ కళలో నిష్ణాతులు కావాలన్నా సాధన చేయాలి. ఆ సాధనే క్రమశిక్షణను నేర్పుతుంది. సమయాన్ని వృథా చేయకుండా ఒక రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుంటే చాలు... అనుకున్నది నూటికి నూరుపాళ్లూ చేయగలుగుతాం. అప్పుడు ఎవరినైనా విజయం తప్పక వరిస్తుంది. -
వెరీ... వెరీ సింపుల్!
గ్లామర్ పాయింట్ పంజాబీ సినిమాల్లో నటించి ఆ తరువాత బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది సుర్వీన్ చావ్లా. కోపం తగ్గించుకోవాలని,‘తన శాంతమే తనకు రక్ష’ అని మంచి మాటలు కూడా చెబుతుంటుంది చావ్లా.ఇదిసరే గానీ, ‘స్కిన్ షో’ గురించి ఒక ప్రశ్న వేసి చూడండి.అందమైన అమ్మాయి కాస్తా అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. అప్పటికప్పుడు కారాలు మిరియాలు నూరుతుంది. అంతేనా?‘‘హాలీవుడ్లో కనిపించే స్కిన్ షో గురించి కళాత్మక విలువల కోణంలో మాట్లాడతారు. మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం, ఎంత అసహ్యం! అంటారు. మన ద్వంద్వ వెఖరికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఉంటుందా? ఉన్నచోటే ఉంటామంటే కుదరదు. మనం కూడా మారాలి. చూసే దృక్పథాన్ని విశాలం చేసుకోవాలి...’’ అంటూ కారాలు మిరియాల మిక్స్‌తో కూడిన ఉపన్యాసాన్ని దంచుతూనే ఉంటుంది చావ్లా. చావ్లా కోపాన్ని నిమిషాల్లో తగ్గించాలని ఉందా? వెరీ సింపులండీ. ‘‘మీ గ్లామర్ రహస్యం ఏమిటి?’’ అని ఒక్క ప్రశ్న అడగండి చాలు! -
అలా అనుకుంటే పొరపాటు!
‘‘కడుపు మాడ్చుకుని, నోటికి రుచించని పదార్ధాలను బలవంతంగా తినడం, గంటల తరబడి వ్యాయామం చేయడం.. ఇలాంటి ప్రక్రియల వల్ల అందం మరింత ఇనుమడిస్తుంది అనుకుంటే... పొరపాటు’’ అంటున్నారు అందాల భామ కాజల్ అగర్వాల్. ‘‘మీ గ్లామర్ రహస్యమేంటి?’’ అని ఇటీవల ఈ ముద్దుగుమ్మను అడిగితే... తన అందం వెనకున్న చిట్కాను చెబుతూ, ఆరోగ్యం విషయంలో కొన్ని ఆసక్తికమైన విషయాలు చెప్పారామె. ‘‘ఫలానా ఫుడ్ తీసుకుంటే... ఇందులో ఇన్ని కేలరీలు ఉంటాయి. ఇన్ని గంటలు వ్యాయామం చేస్తే కానీ వాటిని కరిగించుకోలేం... ఇలాంటి మాటలు నాకు అస్సలు నచ్చవ్. నా వరకూ నాకు నచ్చిన పదార్థాలను కడుపునిండా లాగించేస్తాను. పైగా రోజుకి 8 గంటలు నిద్ర పోతాను. ఇంట్లో నిద్ర పోవడం కుదరకపోతే... లొకేషన్లో కేరవాన్లోకెళ్లి అయినా సరే... సమయం దొరికినప్పుడల్లా కునుకు తీస్తుంటాను. కానీ... ఇప్పటివరకూ నేను బరువు పెరగలేదు. దానికి కారణం క్రమం తప్పని వ్యాయామం. నా అందానికి కారణం ఏంటని అడిగితే... నేను చెప్పే సమాధానం ఒక్కటే. రుచికరమైన ఆహారాన్ని కడుపునిండా లాగించడం... ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవడం... క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ఇలా చేసి చూడండి, మీ అందం అంతకంత పెరగకపోతే అప్పుడు అడగండి’’ అంటూ కాజల్ చిన్న సైజ్ ఉపన్యాసం ఇచ్చారు.