
మహేశ్ బాబు అంటే చాలామందికి గుర్తొచ్చేది అందం. నాలుగు పదుల వయసులో 25ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. ఇక ఆయనకున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేశ్ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయంటూ మెలికలు తిరిగిపోతుంటారు. ఆయన గ్లామర్ వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు.చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..
ఇదే విషయాన్ని కొందరు ఇంటర్వ్యూల్లో ప్రశ్నించగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానంటూ బదులిచ్చారు మహేశ్. అంతేకాకుండా ప్రతిరోజు ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకుంటాను. జంక్‌ఫుడ్ జోలికి అసలు వెళ్లను. వీటితో పాటు ఎప్పుడూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండటమే నా అందానికి అసలు సీక్రెట్.
చిరునవ్వే నిజమైన అందం. అందుకే మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ఏ తప్పూ చేయకపోవడం, భవిష్యత్తుల్లోనూ చెయ్యను అనే నమ్మకమే మనల్ని ప్రశాంతంగా ఉంచేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు మహేశ్.
చదవండి: మహేశ్ బాబు మేనియా.. థియేటర్స్‌లో 'పోకిరి' రీసౌండ్
Comments
Please login to add a commentAdd a comment