
సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయసులో 25ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. సినిమా, సినిమాకి సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. ఆయన గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని హీరో,హీరోయిన్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా మహేశ్ అంత హ్యండ్సమ్‌గా కనిపించడం రహస్యాన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ –లక్ష్మణ్‌లు బయటపెట్టారు.
పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ నటించిన సర్కారు వారి పాట మే12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్‌గా పనిచేసిన రామ్ –లక్ష్మణ్‌లు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ఛార్మింగ్ లుక్ సీక్రెట్‌ను లీక్ చేశారు. “మహేష్ ఇంత అందంగా, కూల్ గా, ఛార్మింగ్ గా కనిపించడానికి కారణం ప్రతి రోజు ధ్యానం చేయడమే.
ఆయన రోజూ మూన్ ద్యానం చేస్తారు. దీనివల్ల చాలా కూల్‌గా కనిపిస్తారు. ఈ మూన్ ధ్యానం వల్ల సుదీర్ఘ కాలంగా చేయడం వలన మహేష్ ఇంత ఛార్మింగ్‌గా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ యోగా, వర్కవుట్స్‌తో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుంటారు. ఇదే ఆయన గ్లామర్‌కి సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment