Sarkaru Vaari Paata OTT Streaming: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది. కేవలం 12 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదిలో 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన తొలి సినిమాగా ‘సర్కారు వారి పాట’ రికార్డు సృష్టించింది.
చదవండి: మనసులో మాట చెప్పమన్న అషూ, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ సందడి చేస్తుంది. అయినప్పటికీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైం భారీ రేటుకు దక్కించుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఓ ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒప్పందం ప్రకారం పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజుల ముందుగానే ఈ సినిమాను అమెజాన్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ నెల చివరిలో లేదా జూన్ 10న ఈమూవీ ఓటీటీకి రాబోతుందట. లేదా జూన్ 24న నుంచి స్ట్రీమింగ్ కానుందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉంటే పెద్ద సినిమాలు థియేట్రికల్ రన్‌టైం అనంతరం నెల రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తాయి.
చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్’ చూసిన హాలీవుడ్ మూవీ రైటర్, జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు
అందులోనూ సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు కనీసం రెండు నెలలైన పడుతుందని అందరు అభిప్రాయం పడ్డారు. కానీ ఈ మూవీని త్వరలోనే ఓటీటీకి తీసుకువచ్చేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తుందట. ఇందుకోసం నెల రోజుల ముందుగానే డిజిటల్ రిలీజ్‌కు మేకర్స్‌తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. ఈ బజ్ ప్రకారం సర్కారు వారి పాట అతి త్వరలోనే ఓటీటీకి రాబోతుందని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment