మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్‌లో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. . అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్‌లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి..
సర్కారు వారి పాట
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది.
జయేశ్ భాయ్ జోర్దార్
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయేశ్ భాయ్ జోర్దార్. డైరెక్టర్ దివ్యాంగ్ ఠక్కర్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 13న విడుదలకు సిద్దమైంది. భ్రూణహత్యల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటులు బోమన్ ఇరానీ, రత్నాపాఠక్ షాలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. యశ్‌రాజ్ ఫిలింస్ పతాకాంపై ఆదిత్య చోప్రా, మనీశ్ శర్మలు ఈ సినిమాను నిర్మించారు.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు:
దీ కశ్మీర్ ఫైల్స్
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు.
థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయింది. జీ 5లో మే 13 నుంచి ప్రసారం చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు మేకర్స్. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కశ్మీర్ ఫైల్స్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
విజయ్ ‘బీస్ట్’ మూవీ
దళపతి విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. పూజా హెగ్డే కథానాయిక. భారీ అంచనాలతో ఏప్రిల్ 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. పైగా ఈ సినిమా రిలీజైన మరునాడే కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కావడంతో బీస్ట్ దూకుడుకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది.
అయినప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా బీస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో మే11 నుంచి బీస్ట్ ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలు
మే 12: ది మాట్రిక్స్ రెసరెక్షన్స్ మోడర్స్ లవ్(తెలుగు)
మే 13: మోడర్న్ లవ్ ముంబై(హిందీ సిరీస్)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
మే 13: స్నీకరెల్లా
ఆహా
మే 13: కుతుకు పత్తు(తమిళం)
నెట్‌ఫ్లిక్స్
మే 12: సేవేజ్ బ్యూటీ వెబ్ సిరీస్
Comments
Please login to add a commentAdd a comment