List Of New OTT And Theatre Releases This Week - Sakshi
Sakshi News home page

OTT and Theatre Releases: ఈ వారం థియేటర్‌/ఓటీటీ సందడి చేసే సినిమాలివే!

May 29 2023 5:23 PM | Updated on May 29 2023 6:07 PM

This Week OTT and Theatre Release Movies List - Sakshi

ఈ ఏడాది వేసవిలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు చిత్రాలు  థియేటర్లతోపాటు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. జూన్‌ మొదటి వారంలోనూ చిన్న సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో ఓటీటీలో అలరించే చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 

 దగ్గుబాటి హీరో అహింస

ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్‌ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతి​కా తివారీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

(ఇది చదవండి: చాలా రోజుల తర్వాత అలాంటి చిత్రాన్ని చూశా: రాజమౌళి ప్రశంసలు)

థ్రిల్లింగ్‌ కథతో..

స్టూడెంట్‌గా థియేటర్స్‌కు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు బెల్లకొండ గణేశ్‌. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లకొండ గణేశ్‌ హీరోగా ‘నాంది’ సతీష్‌ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూండెట్‌ సార్‌!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్‌గా నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జూన్‌ 2న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటించారు. 

ఆసక్తి రేకెత్తించే ఐక్యూ

సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ముఖ్య తారలుగా జి.యల్‌.బి. శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్‌ ఆఫ్‌ స్టూడెంట్‌’ అనేది ఉపశీర్షిక. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 2న విడుదల కానుంది.

 కామెడీతో పరేషాన్‌

‘మసూద’ ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా, పావని కరణం హీరోయిన్‌గా రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పరేషాన్‌’. రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్‌ ప్రొడక్షన్స్పై విశ్వతేజ్‌ రాచకొండ, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించారు. ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్ ద్వారా జూన్  2న విడుదలవుతోంది.

క్రైమ్ థ్రిల్లర్‌ చక్రవ్యూహం

సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత సావిత్రి నిర్మిస్తున్న చిత్రం "చక్రవ్యూహం" ది ట్రాప్. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు.  అప్పట్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ  చివరిసారిగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం  చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. 

(ఇది చదవండి: భారీ ధరకు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?)

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

నెట్‌ఫ్లిక్స్‌

    ఫేక్‌ ప్రొఫైల్‌ -వెబ్‌సిరీస్‌-  మే 31
    ఎ బ్యూటిఫుల్‌ లైఫ్‌ -హాలీవుడ్‌- జూన్‌ 1
    న్యూ ఆమ్‌స్టర్‌ డామ్‌ -వెబ్‌సిరీస్- జూన్‌ 1
    ఇన్ఫినిటీ స్టోర్మ్‌ -హాలీవుడ్‌- జూన్‌ 1
    స్కూప్‌ -హిందీ సిరీస్‌- జూన్‌ 2
    మ్యానిఫెస్ట్‌ -వెబ్‌సిరీస్‌- జూన్‌2

జీ 5

    విష్వక్‌ -తెలుగు- జూన్‌ 2

డిస్నీ+ హాట్‌స్టార్‌

    సులైకా మంజిల్‌ -మలయాళం- మే 30

బుక్‌ మై షో

    ఈవిల్‌ డెడ్‌ రైజ్‌ -హాలీవుడ్‌- జూన్‌ 2

జియో సినిమా

    అసుర్‌ 2 -హిందీ సిరీస్‌- జూన్‌ 1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement