chakravyuha
-
నాపై ఈడీ దాడులు.. చాయ్ బిస్కెట్లతో వెల్కమ్: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై సంచలన ఆరోపణలకు దిగారు. తనపై త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసే అవకాశం ఉందని అన్నారాయన. అందుకు తన చక్రవ్యూహ్ ప్రసంగమే కారణమని చెబుతూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. : రాహుల్ గాంధీనాపై ఈడీ దాడులు జరగొచ్చు. ఓ అధికారి నుంచి నాకు దానిపై సమాచారం వచ్చింది. జులై 29న నేను పార్లమెంటులో చేసిన ‘చక్రవ్యూహం’ స్పీచ్ కొందరికి నచ్చలేదు. ఈడీ విచారణ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.. అదీ ఛాయ్ బిస్కెట్లతో అని ఛమత్కారంగా ఓ సందేశం ఉంచారాయన. Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned. Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024 పార్లమెంట్లో ఈ మధ్య ప్రవేశపెట్టిన.. కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్‌సభ చర్చ జరిగింది. సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై విమర్శలు సంధించారు. దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా, దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రెండోదని తెలిపారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ అభివర్ణించారు. ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ.. ‘‘అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో.. ఇప్పుడు దేశాన్నీ అదే చేయబోతున్నారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారు. ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారు’’ అని రాహుల్ ధ్వజమెత్తారు. -
ఈ వారం థియేటర్/ఓటీటీ అలరించే చిత్రాలివే!
ఈ ఏడాది వేసవిలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు చిత్రాలు థియేటర్లతోపాటు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనూ చిన్న సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో ఓటీటీలో అలరించే చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. దగ్గుబాటి హీరో అహింస ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇది చదవండి: చాలా రోజుల తర్వాత అలాంటి చిత్రాన్ని చూశా: రాజమౌళి ప్రశంసలు) థ్రిల్లింగ్ కథతో.. స్టూడెంట్‌గా థియేటర్స్‌కు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు బెల్లకొండ గణేశ్. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లకొండ గణేశ్ హీరోగా ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూండెట్ సార్!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జూన్ 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఆసక్తి రేకెత్తించే ఐక్యూ సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ముఖ్య తారలుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ స్టూడెంట్’ అనేది ఉపశీర్షిక. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. కామెడీతో పరేషాన్ ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా, పావని కరణం హీరోయిన్గా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూన్ 2న విడుదలవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ చక్రవ్యూహం సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత సావిత్రి నిర్మిస్తున్న చిత్రం "చక్రవ్యూహం" ది ట్రాప్. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ చివరిసారిగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. (ఇది చదవండి: భారీ ధరకు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?) ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే! నెట్‌ఫ్లిక్స్ ఫేక్ ప్రొఫైల్ -వెబ్‌సిరీస్- మే 31 ఎ బ్యూటిఫుల్ లైఫ్ -హాలీవుడ్- జూన్ 1 న్యూ ఆమ్స్టర్ డామ్ -వెబ్‌సిరీస్- జూన్ 1 ఇన్ఫినిటీ స్టోర్మ్ -హాలీవుడ్- జూన్ 1 స్కూప్ -హిందీ సిరీస్- జూన్ 2 మ్యానిఫెస్ట్ -వెబ్‌సిరీస్- జూన్2 జీ 5 విష్వక్ -తెలుగు- జూన్ 2 డిస్నీ+ హాట్‌స్టార్ సులైకా మంజిల్ -మలయాళం- మే 30 బుక్ మై షో ఈవిల్ డెడ్ రైజ్ -హాలీవుడ్- జూన్ 2 జియో సినిమా అసుర్ 2 -హిందీ సిరీస్- జూన్ 1 -
నా కొడుకుపై పద్మవ్యూహం
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య స్థానం నుంచి బరిలో ఉన్న తన కొడుకు నిఖిల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ తదితరులు కలిసి పద్మవ్యూహం పన్నారని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. మహాభారత యుద్ధకాలంలో అర్జునుడి కొడుకు అభిమన్యుడిని చంపేందుకు కౌరవులు పద్మవ్యూహం పన్నినట్లుగా ఈ ఎన్నికల్లో నిఖిల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, ఇతరులు స్వతంత్ర అభ్యర్థి సుమలతతో కుమ్మక్కయ్యారన్నారు. ‘మాండ్యలో జరుగుతున్న పరిణామాలు చేయిదాటి పోయాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న సుమలతకు కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, రైతు సంఘాలు మద్దతిస్తున్నాయి. జేడీఎస్‌ను అణచివేయటానికి వీరంతా చేతులు కలిపారు’ అని శుక్రవారం ఆయన మీడియాతో అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుమలత స్పందించారు. ‘అవును, కాంగ్రెస్ కార్యకర్తలు నావెంటే ఉన్నారు. నన్ను ఓడించటానికి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి పద్మవ్యూహం పన్నారు’ అంటూ తిప్పికొట్టారు. ఎన్నికల సమయంలో ప్రజల మద్దతు పొందేందుకు పాక్‌తో యుద్ధభయాన్ని ప్రధాని మోదీ కల్పిస్తారని రిటైర్డు సైనికాధికారి ఒకరు రెండేళ్ల క్రితమే తనతో చెప్పారని సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా మాటలు గుర్తుంచుకోండి. లోక్‌సభ ఎన్నికలకు ముందు పాక్‌తో సంక్షోభం సృష్టించి, ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించి ఓట్లు పొందేందుకు మోదీ ప్రయత్నిస్తారు’ అని రెండేళ్ల క్రితమే రిటైర్డ్ సైనికాధికారి ఒకరు తనతో చెప్పినట్లు వెల్లడించారు. -
పవర్ స్టార్ ఆట.. యంగ్ టైగర్ పాట
నటుడిగా ఎన్టీఆర్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. నందమూరి యంగ్ జనరేషన్ హీరోల్లో భారీ ఫాలోయింగ్‌తో పాటు అదే స్థాయిలో కలెక్షన్ స్టామినా ఉన్న హీరో ఎన్టీఆర్. ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో పాటు నటనతోనూ అలరించే జూనియర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్నాడు. అయితే ఇప్పటివరకు తెరమీదే అలరించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తన వెనుక కూడా సత్తా చాటుతున్నాడు. ఇటీవల కాలంలో మన తారలు అప్పుడప్పుడు సింగర్స్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అదే బాటలో ఎన్టీఆర్ కూడా గాయకుడి అవతారం ఎత్తాడు. కీరవాణి, దేవీ శ్రీ ప్రసాద్, తమన్ల సంగీత సారధ్యంలో తాను హీరోగా నటించిన సినిమాల్లో పాటలు పాడి మెప్పించాడు. అదే జోరులో ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాడు ఎన్టీఆర్. తన సినిమాలో కాకుండా వేరే హీరో కోసం పాటేస్కున్నాడు. అది కూడా కన్నడ సినిమాలో కావటం మరో విశేషం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'చక్రవ్యూహ'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో, ఓ మాస్ మసాలా పాటను ఎన్టీఆర్ పాడాడు. సోమవారం రాత్రి విడుదలైన ఈ పాటకు కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. గెలయో గెలయో అంటూ సాగే ఈ హుషారైన పాటతో ఎన్టీఆర్ ఈ ఏడాది మరో హిట్ కొట్టాడని అభిమానులు సంబరపడిపోతున్నారు. -
పాట పాడనున్న చందమామ
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న అందాల భామ కాజల్ అగర్వాల్ తనలోని మరో టాలెంట్ చూపించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే హీరోయిన్గా తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సత్తాచాటిన ఈ బ్యూటీ త్వరలోనే గాయని అవతారం ఎత్తనుంది. అది కూడా తనకు అస్సలు పరిచయం లేని ఓ కన్నడ సినిమాలో పాట పాడటానికి అంగీకరించింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా చక్రవ్యూహ కోసం కాజల్ గొంతు సవరించుకుంటోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ పాట పాడాడు. పునీత్ రాజ్ కుమార్ 25వ సినిమా కావటం, పునీత్‌కు తెలుగు నటీనటులతో మంచి స్నేహం ఉండటంతో... ఇలా టాప్ స్టార్స్‌తో పాటలు పాడించి సినిమాకు మరింత ప్రచారం వచ్చేలా చేస్తున్నాడు తమన్. ప్రస్తుతానికి కన్నడంలో సింగర్‌గా కెరీర్ మొదలు పెడుతున్న కాజల్ ముందు ముందు తెలుగు సినిమాలో కూడా పాటలు పాడుతుందేమో చూడాలి. -
ఏవండీ.. ఓ పాట పాడండి!
కాజల్ అగర్వాల్ చాలా క్యూట్‌గా ఉంటారు. ఆమె వాయిస్ కూడా చాలా స్వీట్‌గా ఉంటుంది. అందుకే, సరదాగా ఓ పాట పాడండి అనడిగితే, ‘వామ్మో.. నా వల్ల కాదండి’ అంటారామె. వాస్తవానికి కాజల్‌కి పాటలు పాడటమంటే బోల్డంత ఇష్టం. కానీ, నలుగురిలో ఉన్నప్పుడు ఆ సాహసం చేయరామె. చిన్నప్పుడు అదే పనిగా పాటలు వినడం, పాడటం చేస్తుండేవారు. అది కూడా ఎవరూ లేనప్పుడు. ఇప్పుడు మొదటిసారి కాజల్ నలుగురికీ తన పాటను వినిపించనున్నారు. కన్నడ చిత్రం ‘చక్రవ్యూహ’ కోసం ఆమె ఓ పాట పాడారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా రూపొందుతున్న 25వ చిత్రం ఇది. అందుకని ఈ చిత్రంలో బోల్డన్ని ప్రత్యేకతలు ఉండాలనీ, పునీత్ కెరీర్లో ఓ మైలు రాయిలా నిలిచిపోవాలనీ చిత్రనిర్మాత ఎన్.కె. లోహిత్ అనుకుంటున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ పాటలు స్వరపరిచారు. ఇప్పటికే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఈ చిత్రం కోసం ఓ పాట పాడించేశారు. ఇప్పుడు కాజల్‌తో పాడించారు. ఇది డ్యుయెట్ సాంగ్. హీరో పునీత్ రాజ్‌కుమార్ పాడగా మేల్ వెర్షన్‌ని రికార్డ్ చేశారు. హీరోయిన్ కోసం కాజల్ పాడగా బుధవారం ముంబయ్‌లో రికార్డ్ చేశారు. మరి.. కాజల్ మేడమ్ తెలుగు సినిమాకి ఎప్పుడు పాడతారు? ‘ఏవండీ.. ఓ పాట పాడండి’ అని ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’లో ప్రభాస్, త్రిషను అడిగినట్లుగా.. మనం కాజల్‌ను అడగాలేమో!