ఏవండీ.. ఓ పాట పాడండి! | Kajal Aggarwal to debut as singer with for Puneeth Rajkumar's Chakravyuha | Sakshi
Sakshi News home page

ఏవండీ.. ఓ పాట పాడండి!

Published Wed, Jan 6 2016 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

ఏవండీ.. ఓ పాట పాడండి!

ఏవండీ.. ఓ పాట పాడండి!

కాజల్ అగర్వాల్ చాలా క్యూట్‌గా ఉంటారు. ఆమె వాయిస్ కూడా చాలా స్వీట్‌గా ఉంటుంది. అందుకే, సరదాగా ఓ పాట పాడండి అనడిగితే, ‘వామ్మో.. నా వల్ల కాదండి’ అంటారామె. వాస్తవానికి కాజల్‌కి పాటలు పాడటమంటే బోల్డంత ఇష్టం. కానీ, నలుగురిలో ఉన్నప్పుడు ఆ సాహసం చేయరామె. చిన్నప్పుడు అదే పనిగా పాటలు వినడం, పాడటం చేస్తుండేవారు. అది కూడా ఎవరూ లేనప్పుడు. ఇప్పుడు మొదటిసారి కాజల్ నలుగురికీ తన పాటను వినిపించనున్నారు.

కన్నడ చిత్రం ‘చక్రవ్యూహ’ కోసం ఆమె ఓ పాట పాడారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా రూపొందుతున్న 25వ చిత్రం ఇది. అందుకని ఈ చిత్రంలో బోల్డన్ని ప్రత్యేకతలు ఉండాలనీ, పునీత్ కెరీర్‌లో ఓ మైలు రాయిలా నిలిచిపోవాలనీ చిత్రనిర్మాత ఎన్.కె. లోహిత్ అనుకుంటున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ పాటలు స్వరపరిచారు. ఇప్పటికే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఈ చిత్రం కోసం ఓ పాట పాడించేశారు.

 ఇప్పుడు కాజల్‌తో పాడించారు. ఇది డ్యుయెట్ సాంగ్. హీరో పునీత్ రాజ్‌కుమార్ పాడగా మేల్ వెర్షన్‌ని రికార్డ్ చేశారు. హీరోయిన్ కోసం కాజల్ పాడగా బుధవారం ముంబయ్‌లో రికార్డ్ చేశారు. మరి.. కాజల్ మేడమ్ తెలుగు సినిమాకి ఎప్పుడు పాడతారు? ‘ఏవండీ.. ఓ పాట పాడండి’ అని ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’లో ప్రభాస్, త్రిషను అడిగినట్లుగా.. మనం కాజల్‌ను అడగాలేమో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement