పవర్ స్టార్ ఆట.. యంగ్ టైగర్ పాట | NTR Sings Gealea Gealea Song for Kannada power star | Sakshi
Sakshi News home page

పవర్ స్టార్ ఆట.. యంగ్ టైగర్ పాట

Published Wed, Mar 9 2016 10:08 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

పవర్ స్టార్ ఆట.. యంగ్ టైగర్ పాట

పవర్ స్టార్ ఆట.. యంగ్ టైగర్ పాట

నటుడిగా ఎన్టీఆర్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. నందమూరి యంగ్ జనరేషన్ హీరోల్లో భారీ ఫాలోయింగ్తో పాటు అదే స్థాయిలో కలెక్షన్ స్టామినా ఉన్న హీరో ఎన్టీఆర్. ఎనర్జిటిక్ డ్యాన్స్తో పాటు నటనతోనూ అలరించే జూనియర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్నాడు. అయితే ఇప్పటివరకు తెరమీదే అలరించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తన వెనుక కూడా సత్తా చాటుతున్నాడు.

ఇటీవల కాలంలో మన తారలు అప్పుడప్పుడు సింగర్స్గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అదే బాటలో ఎన్టీఆర్ కూడా గాయకుడి అవతారం ఎత్తాడు. కీరవాణి, దేవీ శ్రీ ప్రసాద్, తమన్ల సంగీత సారధ్యంలో తాను హీరోగా నటించిన సినిమాల్లో పాటలు పాడి మెప్పించాడు. అదే జోరులో ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాడు ఎన్టీఆర్. తన సినిమాలో కాకుండా వేరే హీరో కోసం పాటేస్కున్నాడు. అది కూడా కన్నడ సినిమాలో కావటం మరో విశేషం.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'చక్రవ్యూహ'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో, ఓ మాస్ మసాలా పాటను ఎన్టీఆర్ పాడాడు. సోమవారం రాత్రి విడుదలైన ఈ పాటకు కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. గెలయో గెలయో అంటూ సాగే ఈ హుషారైన పాటతో ఎన్టీఆర్ ఈ ఏడాది మరో హిట్ కొట్టాడని అభిమానులు సంబరపడిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement