కన్నడలో పాటపాడిన ఎన్టీఆర్ | ntr becomes singer for a kannada film chakravyuh | Sakshi
Sakshi News home page

కన్నడలో పాటపాడిన ఎన్టీఆర్

Dec 19 2015 9:06 AM | Updated on Sep 3 2017 2:15 PM

కన్నడలో పాటపాడిన ఎన్టీఆర్

కన్నడలో పాటపాడిన ఎన్టీఆర్

ఈ జనరేషన్ యంగ్ హీరోలు... హీరోగానే కాక ఇతర రంగాల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిహీరోలు నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతుండగా మరి కొంత ఇతర విభాగాలలో...

ఈ జనరేషన్ యంగ్ హీరోలు... హీరో గానే కాక ఇతర రంగాల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతుండగా మరికొందరు ఇతర విభాగాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే బాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింగర్గా తన టాలెంట్ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు తన సినిమాల్లోనే పాట పాడిన ఎన్టీఆర్, తాజాగా ఇతర హీరోల సినిమాల్లో కూడా పాటలు పాడటం మొదలు పెట్టాడు. అది కూడా పరభాషలో కావటం మరో విశేషం.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న చక్రవ్యూహ్ సినిమాలో ఓ పాట పాడాడు టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్. ఈ సినిమా నిర్మాత ఎస్కె లోహిత్ తనకు మిత్రుడు కావటంతో, సినిమా ప్రమోషన్ పరంగా కూడా ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో, కన్నడలో పాట పాడటానికి అంగీకరించాడు జూనియర్. అంతేకాదు ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బివియస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement