Puneeth Raj kumar
-
కాంతార హీరోగా రిషబ్ శెట్టి కాదు.. ఫస్ట్ అనుకున్నది ఎవరంటే?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్ కూడా విడుదల చేశారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ శెట్టి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కాంతార మూవీకి మొదట హీరోగా తాను చేయాలని అనుకోలేదని తెలిపారు. ఈ చిత్రంలో శివ పాత్రను పోషించడానికి శెట్టి మొదటి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను సంప్రదించినట్లు వెల్లడించారు. రాజ్‌కుమార్‌కు ఈ స్క్రిప్ట్‌ను వినిపించినప్పుడు ఎంతో ఉత్సాహంగా విన్నారని.. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయాడని రిషబ్ వివరించారు. ఓ రోజు నాకు ఫోన్ చేసి నా కోసం ఎదురు చూస్తే సినిమా ఏడాది ఆలస్యం కావొచ్చని నాతో అన్నారని తెలిపారు. అయితే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఊహించని విధంగా అక్టోబర్ 29, 2021న బెంగళూరులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి రెండు రోజుల ముందు కలుసుకున్నానని రిషబ్ గుర్తు చేసుకున్నారు. తన సినిమా కాంతార గురించి ఆయన ఆరా తీశారని చెప్పుకొచ్చారు. సినిమా పట్ల రాజీ పడవద్దని నాకు సూచించారు. షూట్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను రాజ్‌కుమార్‌కు చూపించినట్లు వెల్లడించారు. ఫోటోలు చూసిన రాజ్‌కుమార్ చాలా సంతోషంగా వ్యక్తం చేశారని.. నీ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పాడని రిషబ్ శెట్టి తెలిపారు. -
RCB ఓటములకు పునీత్ రాజ్‌కుమార్ సతీమణి కారణమంటూ విమర్శలు
దేశవ్యాప్తంగా ఐపీఎల్ హంగామా నడుస్తోంది. ప్రతి మ్యాచ్ ప్రేక్షకులల్లో హీట్‌ను పెంచుతుంది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే ఈ మ్యాచ్‌లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారనే విషయం తెలిసిందే. గత సీజన్లో మాదిరి ఈసారి కూడా RCB జట్టు పెద్దగా రాణించడంలేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒక్కసారి మాత్రమే జట్టు గెలిచింది. RCB జట్టు ఓటములకు ప్రధాన కారణం కన్నడ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశ్విని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమైంది. తొలిరోజు జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. ఆ తర్వాత పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. మూడో మ్యాచ్ కోల్‌కతా జట్టుతో తలపడి ఓడిపోయింది. ఆపై లక్నో జట్టుతో కూడా ఆర్సీబీ ఓడిపోయింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన RCB ఒక్కటి మాత్రమే గెలిచింది. మూడింటిలో ఓడిపోయింది. ప్రస్తుతం (ఏప్రిల్ 6) ఆర్సీబీ రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. జట్టు ఇలాంటి స్థితికి చేరుకోవడానికి ప్రధాన కారణం అశ్విని అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్‌లో కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒక్కసారైనా ట్రోఫీ అందుకోవాలని ఆర్సీబీ జట్టు పోరాడుతుంది. ఆ కల ఇప్పటి వరకు నెరవేరలేదు. కనీసం ఈసారైనా ఆర్సీబీ బాగా ఆడి చాంపియన్‌గా నిలవాలని ఆ జట్టు అభిమానులంతా ఆశించారు. కానీ పేలవమైన ఆటతీరుతో జట్టు వైఫల్యం దిశగా వెళ్తుంది. దీంతో ఆర్సీబీ జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఆర్సీబీ జట్టు వైఫల్యం వెనుక ఉన్న కారణాన్ని దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశ్వినిపై ఆ జట్టు అభిమానులు నెట్టారు. ఐపీఎల్ ప్రారంభ సమయంలో ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ జరిగింది. అందుకు ముఖ్య అతిథిగా అశ్విని పాల్గొన్నారు. ఆ జట్టు సభ్యుల కొత్త జర్సీలను కూడా ఆమెనే రివీల్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు ఒక దురదృష్టవంతురాలిని అతిథిగా పిలవడం ఏంటి అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు చేశారు. భర్తలేని వ్యక్తితో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్లే ఇప్పుడు ఆ జట్టు వైఫల్యం చెందుతుందని వారు చెబుతున్నారు. (ఆర్సీబీ జర్సీతో పునీత్ రాజ్‌కుమార్ పాత చిత్రం) ఆర్సీబీ అన్‌బాక్స్ కార్యక్రమంలో అశ్విని పునీత్ రాజ్ పాల్గొనడాన్ని ఆ జట్టు ఫ్యాన్స్ కొందరు తప్పుబట్టారు. భర్తను కోల్పోయిన అశ్విని ఈ శుభకార్యక్రమంలో పాల్గొనడం దురదృష్టకరమని పోస్టులు పెట్టారు. అశ్వినిని తప్పు పడుతూ ఒక నెటిజన్ వీడియో కూడా విడుదల చేశాడు. ఇది చూసిన చాలామంది అభిమానులు సదరు వ్యక్తిని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో అతను పోస్ట్ తొలగించాడు. అశ్వినిపై ఇలాంటి పోస్ట్‌లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు ఫిర్యాదు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్న పునీత్ రాజ్‌కుమార్ 2021లో వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. ಅಶ್ವಿನಿ ಪುನೀತ್ ರಾಜಕುಮಾರ್ ಅವರು ಎನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅರ್ಥ ಆಯ್ತಾ? Any idea what Ashwini Puneeth Rajkumar is doing here? Find out more at the RCB Unbox event on 19th March. Last few tickets remaining!@Ashwini_PRK #ArthaAytha #RCBUnbox #PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/AmKTYC8mUJ — Royal Challengers Bengaluru (@RCBTweets) March 14, 2024 View this post on Instagram A post shared by Karnataka portfolio | ಕರ್ನಾಟಕ ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ (@karnatakaportfolio_) -
తమ్ముడి ఏవీ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన శివరాజ్ కుమార్.. వీడియో వైరల్
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి ఏడాదిన్నర కావొచ్చినా.. అతని అకాల మరణాన్ని మాత్రం అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికీ కన్నడలో ఏ సినిమా ఈవెంట్ జరిగినా పునీత్ పేరును స్మరించుకుంటున్నారు. ఆయన సినిమాలకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా పునీత్‌ని తలచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు ఆయన సోదరుడు, హీరో శివరాజ్ కుమార్. ఆయన నటించిన వేద సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారాయన. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటలో వేద ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ ఏవీని ప్లే చేశారు. అందులో పునీత్ చిన్నప్పటి నుంచి నటించిన చిత్రాలతో సహా చివరి సినిమా వరకు చూపించారు. దాన్ని చూస్తూ ఒక్కసారిగా కన్నీళ్లు పెంటుకున్నాడు శివరాజ్ కుమార్. వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో పక్కనే ఉన్న బాలకృష్ణ అతన్ని ఓదార్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 💔💔#ShivaRajKumar gets emotional about #PuneethRajkumar at #Vedha Pre Release Event ♥️♥️#PuneethRajkumarLivesOn #NandamuriBalakrishna #TeluguFilmNagar pic.twitter.com/a1WiMDD6YV — Telugu FilmNagar (@telugufilmnagar) February 8, 2023 -
దటీజ్ యంగ్ టైగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఏది చేసినా ఆ ప్రత్యేకతే వేరు.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఆయనను ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. నవంబర్ ఒకటో తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకలో యంగ్ టైగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్) ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌తో పాటు ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధామూర్తి కూడా హాజరయ్యారు. వేదికపై ఉన్న కూర్చీల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను కూర్చోమని నిర్వాహకులు కోరారు. కానీ ఎన్టీఆర్ అక్కడే ఉన్న మరో మహిళతో పాటు సుధామూర్తిని తానే స్వయంగా కూర్చీలను తుడిచి వారిని కూర్చోబెట్టారు. ఆ వీడియోను తీసిన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో యంగ్ టైగర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా స్త్రీ మూర్తులను గౌరవించే విషయంలో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిలేరని మరోసారి నిరూపించారంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన కన్నడ రాజ్యోత్సవ కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేశారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. His Simplicity 🥺🙏❤️#NTRajiniForAppu #NTRatಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ #NTRForAppu #PuneethRajkumar #DrPuneethRajkumar pic.twitter.com/N8b0R5j3Rr — Pradeep K (@pradeep_avru) November 1, 2022 -
దివంగత స్టార్ హీరో ట్రైలర్ రిలీజ్.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
కన్నడ స్టార్, దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చిత్రం 'గంధడగుడి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ప్రధాని మోదీకి ట్వీట్ చేసింది చిత్రబృందం. దీనిపై మోదీ కూడా స్పందించారు. పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసుకుంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ రాస్తూ 'పునీత్ రాజ్‌కుమార్ మన మధ్య లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. పునీత్ అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వారు. గంధడగుడి సినిమా ప్రకృతి మాతకు, కర్ణాటక ప్రకృతి సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు నివాళి' అంటూ ట్వీట్ చేశారు. కన్నడలో పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్ అకస్మాత్తుగా మరణించారు. Appu lives in the hearts of millions around the world. He was brilliance personified, full of energy and blessed with unparalleled talent. #GandhadaGudi is a tribute to Mother Nature, Karnataka's natural beauty and environmental conservation. My best wishes for this endeavour. https://t.co/VTimdGmDAM — Narendra Modi (@narendramodi) October 9, 2022 -
తెలుగులో విడుదల కానున్న పునీత్ రాజ్‌కుమార్ సూపర్ హిట్ చిత్రం
కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన చిత్రాల్లో చక్రవ్యూహ ఒకటి. శాండల్‌వుడ్‌లో భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు సివిల్ ఇంజినీర్‌గా తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అయితే సంచలన సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో చందన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు మరియు దీనిని T.N.సూరిబాబు నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. -
ఓ ప్రత్యేక ఈవెంట్లో పునీత్ రాజ్ కుమార్ వేడుకలు.. ఎప్పుడంటే..?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వేడుకలను ఒక ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించబోతున్నారు. కన్నడ సినీ పరిశ్రమ, కర్ణాటకలోని రాజకీయ నాయకులు దివంగత నటుడి వేడుకలను నవంబర్ 16న జరపనున్నారు. ఈ రోజంతా కన్నడ చిత్ర పరిశ్రమ రోజంతా మూసివేస్తారు. 3 గంటలపాటు జరిగే ఈ ఈవెంట్లో ఎవరెవరూ హాజరవుతాలో చూడాలి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ)తో పాటు శాండల్ వుడ్ ఫిల్మ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల సంఘాలు 'పునీత్ నామన' పేరుతో ఈ వేడుకలను నిర్వహించనున్నాయి. అయితే కొవిడ్ కారణంగా అతిథుల జాబితాలో పరిమితులు ఉండనున్నట్లు సమాచారం. నిర్వాహకులు పొరుగు రాష్ట్రాలు, వారి చిత్ర పరిశ్రమ, ఛాంబర్ల నుంచి సభ్యులను కూడా ఆహ్వానించారు. పలు నివేదికల ప్రకారం ఈ కార్యక్రమానికి 1500 మంది హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నాయకులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. కన్నడ సినీ పరిశ్రమ సభ్యులు పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రత్యేక నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి నాగేంద్ర ప్రసాద్ రచించగా, గురుకిరణ్ స్వరపరచిన ప్రత్యేక గీతాన్ని ఆలపించనున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మరణించినప్పటి నుంచి ప్రతిరోజూ దాదాపు 30,000 మంది అభిమానులు ఆయన స్మారకాన్ని సందర్శిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో కన్నడ నాట విషాదఛాయలు అలుముకున్నాయి. -
పునీత్‌కు కన్నీటి వీడ్కోలు
-
పునీత్ అస్తమయం.. శోక సంద్రంలో అభిమానగణం
-
పునీత్ ఔదార్యాన్ని చూడలేక విధికి కన్నుకుట్టింది
సాక్షి, హైదరాబాద్:కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు పునీత్ ఆకస్మిక మరణంపై టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేస్తున్నారు. దీంతో మిస్ యూ అప్పూ ట్రెండింగ్‌లో ఉంది.(Puneeth Rajkumar: పునీత్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ..వైరల్) బెంగళూరులో విక్రమ్ ఆసుపత్రి వెలుపల వందలాదిగా అభిమానులు హృదయవిదారకంగా రోదించిన దృశ్యాలు ఆయన గొప్పదనానికి అద్దం పట్టాయి. ముఖ్యంగా పునీత్ రాజ్‌కుమార్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఒక్కసారిగా బారికేడ్‌ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారంటే వారి అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది నిజం కాకుండా ఉంటే బావుండు అంటూ కంట తడి పెడుతున్నారు ఈ సందర్భంగా అభిమానులపై పునీత్ పంచిన ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. ఆయనొక జెమ్...ఆయన లేని లోటు తీరదంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఔదార్యానికి, సేవాతత్పరతకు సంబంధించిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. అక్టోబర్ 29 శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. A man with golden heart 💓 45 Free Schools 26 Orphanages 16 Old age homes 19 Goshala lu 1800 Students Education 2 Eyes were Donated Finally 1 Man He is #PuneethRajkumar ❣️🙏 Miss u so much sir 😞#PuneetRajkumar @PuneethRajkumar pic.twitter.com/GT3gFhYUEJ — Gani Thor (@gani_thor) October 29, 2021 45 Free Schools 26 Orphanages 16 Old age homes 19 Goshala lu 1800 Students Education 2 Eyes were Donated Finally 1 Man He is @PuneethRajkumar 💔 Still You are alive in our hearts 😥 pic.twitter.com/DdZ7vc7U6y — TRSsm (@Aditya22526310) October 29, 2021 45 Free Schools 26 Orphanages 16 Old age homes 19 Goshala lu 1800 Students Education 2 Eyes were Donated Finally 1 Man He is #PuneethRajkumar ❣️🙏 pic.twitter.com/QdAv1MncrP — 𝙱𝚑𝚎𝚎𝚜𝚑𝚖𝚊 𝚃𝚊𝚕𝚔𝚜 (@BheeshmaTalks) October 29, 2021 -
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం.. కర్ణాటకలో హైఅలర్ట్
-
తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు
బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. పునీత్ ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. పునీత్ మరణవార్త ఆయన అభిమానులతో పాటు.. కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. పునీత్ మృతి నేపథ్యంలో కన్నడ నాట హై అలర్ట్ ప్రకటించారు. ఇక అభిమానుల సందర్శనార్థం పునీత్ పార్థీవ దేహాన్ని బెంగళూరు కంఠీరవ స్టేడయంలో ఉంచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పునీత్ రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్టేడియం వద్దకు తరలిస్తున్నారు. కాగా, పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు శనివారం తండ్రి సమాధి దగ్గరే నిర్వహించనున్నారు. పునీత్ కూతురు అమెరికాలో ఉంది. చదవండి: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు.. -
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు అస్వస్థత
-
ఐసీయూలో కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్
-
కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు..
Kannada Super Star Puneeth Rajkumar Passed Away: ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. (పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహం) పునీత్ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. కాగా 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్... 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. భారతీయ సినిమాకు, మరీ ముఖ్యంగా కన్నడ సినిమాకు ముఖ్య అధ్యాయం రాజ్‌కుమార్. నట సార్వభౌముడు, బంగారు మనిషి, కన్నడ కంఠీరవ, కింగ్ ఆఫ్ రొమాన్స్.. ఇలా కన్నడ సినిమా ఆయన్ను ముద్దుగా పిలుచుకుంది. రాజ్‌కుమార్‌కు ఉన్న ఐదుగురు సంతానంలో ఆఖరివాడు లోహిత్. 1975 మార్చి 19న చెన్నైలో రాజ్‌కుమార్–పార్వతమ్మలకు జన్మించాడు లోహిత్. ఆరు నెలల పసికందుగా ఉన్నప్పుడే తండ్రి రాజ్‌కుమార్ నటించిన ‘ప్రేమద కానికే’ (1976) చిత్రంలో తొలిసారి తెరపై మెరిశాడు. లోహిత్ పేరుతోనే తెరకు పరిచయమయ్యాడు. అయితే అప్పటికే అలాంటి పేరుతో ఓ బాలనటుడు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతుందని పునీత్‌గా మార్చారు. రెండో సినిమా ‘సన్నాది అప్పన్నా’ (1997) నుంచి పునీత్ రాజ్‌కుమార్‌గా మారిపోయాడు లోహిత్. ఆ తర్వాత ‘తాయిగే తక్క మగ’ (1978), ‘వసంత గీత’ (1980), ‘భూమిగే బంద భగవంత’ (1981), ‘భాగ్యవంత’ (1982) సినిమాల్లో నటించాడు. ‘భాగ్యవంత’తోనే తొలిసారి గాయకుడిగానూ మారాడు. అదే ఏడాదిలో తన తండ్రితో కలసి చేసిన ‘చాలుసివ మొడగళ్లు’కి గానూ కర్నాటక ప్రభుత్వం ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందించింది. ఆ తర్వాత ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేశాడు. అలాగే సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘ఎరడు నక్షత్రగళు’ చిత్రంలో బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాకు ఉత్తమ బాలనటుడిగా కర్నాటక ప్రభుత్వం నుంచి రెండో అవార్డు అందుకున్నాడు. ఇక ‘బెట్టద హూవు’ (1985) చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. 1988లో తన పెద్దన్నయ్య శివ రాజ్‌కుమార్ చేసిన ‘శివ మెచ్చిడ కన్నప్ప’ చిత్రంలో బాల కన్నప్ప పాత్ర చేశాడు. బాలనటుడిగా పునీత్ చేసిన చివరి చిత్రం ‘పరశురామ’ (1989). బాలనటుడిగా పునీత్ కెరీర్ వైభవంగా సాగింది. వ్యాపారం టు వెండితెర హీరో కొడుకు హీరోనే అవ్వాలా.. వద్దు.. మనం రూటు మార్చుదాం అనుకున్నారు పునీత్. అందుకే వ్యాపారాలు చేశారు. అయినా సినిమా నేపథ్యం వదులుతుందా? తప్పక సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకు కదా.. అభిమానులు కోరితే రావాల్సిందే. తండ్రి కూడా ‘ఒకసారి ట్రై చెయ్’ అన్నారు. తండ్రి మాట కాదనని కొడుకు... అందుకే హీరో అవ్వాలని ఫిక్సయ్యాడు. తొలి సినిమా పేరే ముద్దు పేరుగా... హీరో అవ్వాలనుకున్న తర్వాత పునీత్ తన నటన, డ్యాన్సింగ్ స్కిల్స్ మీద దృష్టి పెట్టాలనుకోలేదు. ఫిట్నెస్ మీదే దృష్టి పెట్టారు. అప్పటికి కాస్త బొద్దుగా ఉన్న పునీత్ తగ్గాలనుకున్నారు. అప్పుడు ఆరంభించిన కఠినమైన ఫిట్నెస్ ట్రైనింగ్ చనిపోయే రోజు ఉదయం వరకూ కొనసాగింది. ఇక పునీత్‌ని హీరోగా పరిచయం చేసే ఛాన్స్ మన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి దక్కింది. 2002లో పునీత్‌ని హీరోగా పరిచయం చేస్తూ ‘అప్పుు’ తెరకెక్కించారు పూరి. రవితేజ ‘ఇడియట్’ సినిమాకు ఇది ఒరిజినల్. పునీత్ కోసం çపూరి రాసిన కథ రాజ్‌కుమార్ కుటుంబానికి నచ్చింది. బాక్సాఫీస్ బంపర్ హిట్‌తో రాజ్‌కుమార్ కుటుంబానికి కావాల్సిన మ్యాజిక్‌ని పూరి చేశారు. అయితే సినిమా నేపథ్యం ఉండి, అది కూడా మాస్ హీరో ఇమేజ్ ఉన్న కుటుంబం నుంచి పరిచయమయ్యే హీరోలకు మొదటి సినిమా అంటే.. అప్పటివరకూ ఆ ఫ్యామిలీ సాధించిన ఇమేజ్‌ని, వాళ్లు చేసిన సినిమాలను ముందుకు తీసుకెళ్లడమే. ఆ వారసత్వానికి కొనసాగింపులాగా అన్నమాట. బోలెడంత ఫాలోయింగ్‌తో పాటు బండెడు ఒత్తిడి, అంతులేని అంచనాలు ఉంటాయి. వీటన్నింటినీ దాటడం సులువు కాదు. అభిమానులను, ప్రేక్షకులను సంతృప్తిపరచడం అంతకన్నా సులువు కాదు. కానీ వీటన్నింటినీ సునాయాసంగా దాటేశారు పునీత్. అభిమానులకు ‘అప్పు’... కన్నడ సినిమా బాక్సాఫీస్‌కి ‘పవర్‌స్టార్’ అయిపోయారు. తొలి సినిమా అప్పటినుంచి ప్రేక్షకులు ‘అప్పు’ అని పునీత్‌ని పిలవడం మొదలుపెట్టారు. రీమేక్ స్పెషలిస్ట్ పునీత్ కెరీర్ గ్రాఫ్‌ని గమనిస్తే ఎక్కువగా రీమేక్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రీమేక్స్. పునీత్‌ని హీరోగా లాంచ్ చేయడంతో పాటు సూపర్‌స్టార్ ఇమేజ్‌కి పునాదులు వేసింది పూరీ కథలే అని చెప్పొచ్చు. 2004లో పునీత్ చేసిన ‘వీర కన్నడిగ’ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్. తెలుగులో ‘ఆంధ్రావాలా’గా ఎన్టీఆర్ హీరోగా పూరి, ఇదే చిత్రాన్ని కన్నడంలో ‘వీర కన్నడిగ’ పేరుతో మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘అమ్మా నాన్న ఓ తమ్మిళ అమ్మాయి’ చిత్రం ‘మౌర్య’ రీమేక్‌లో నటించారు పునీత్. ఈ చిత్రానికి ఎస్. నారాయణ్ దర్శకుడు. 2006లో ‘ఒక్కడు’ చిత్రాన్ని ‘అజయ్’ టైటిల్‌తో పునీత్‌తో తెరకెక్కించారు మెహర్ రమేష్. కన్నడ భాషలోనూ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్. పునీత్ రాజ్‌కుమార్‌ని ‘పవర్‌స్టార్’ని చేసింది ఈ చిత్రం. ఆ తర్వాత ‘రెyీ , దూకుడు’ చిత్రాలను ‘రామ్’ (2009), ‘పవర్’ (2015) అనే టైటిల్స్‌తో రీమేక్ చేశారు పునీత్. అలాగే తమిళ సినిమాలు ‘నాడోడిగళ్’, ‘పోరాళి’, ‘పూజై’, చిత్రాలను ‘హుద్గరు’, ‘అన్నా బాండ్’, అంజనీపుత్ర’గా రీమేక్ చేశారు. హీరోగా దాదాపు 30 చిత్రాల్లో నటించారు. వసూల్ రాజ్ పునీత్ సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొట్టేస్తుండేవి. ఇక మంచి టాక్ అంటే రికార్డులు సృష్టిస్తాయి. 2017లో రిలీజ్ అయిన ‘రాజకుమార’ కన్నడ బాక్సాఫీస్ హిస్టరీలోనే అత్యంత వసూళ్లు సాధించిన చిత్రంగా పేరు పొందింది. డ్యాన్సింగ్ డైనమైట్.. సూపర్ సింగర్ పునీత్ డ్యాన్స్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన డ్యాన్సులు ప్రేక్షకులకు మజా ఇచ్చేవి. అలాగే ఆయన సినిమాల్లో స్టంట్స్ కూడా ప్రత్యేకంగా ఉండేవి. నటనతో పాటు తండ్రిలా అద్భుతంగా పాడటాన్ని కూడా పునీత్ పుణికి పుచ్చుకున్నారు. తొలి చిత్రం ‘అప్పు’లో ‘తాలిబన్ అల్లా అల్లా’ అనే పాటను పాడారు. ఆ తర్వాత ‘వంశీ, జాకీ’ వంటి సినిమాల్లో పాటలు పాడారు. తన సోదరుడు శివ రాజ్‌కుమార్ చేసిన ‘లవకుశ, మయిలారీ’ చిత్రాల్లోనూ పాడారు. తన సొంత బ్యానర్లో కాకుండా బయట ఎవరి సినిమాలో పాట పాడినా సరే ఆ పారితోషికం విరాళంగా ఇచ్చేసేవారు పునీత్. బుల్లితెర హోస్ట్‌గా.. కన్నడ సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చేయడంతో పాటు బుల్లితెరపై కూడా హోస్ట్‌గా అలరించారు పునీత్. 2012లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కన్నడ వెర్షన్ ‘కన్నడ కోట్యాదిపతి’కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే ‘ఫ్యామిలీ పవర్’ అనే కన్నడ షోను కూడా హోస్ట్ చేశారు. నిర్మాతగా... మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలతో దూసుకెళ్తున్నప్పటికీ నిర్మాతగా తన టేస్ట్‌ని చూపించుకున్నారు పునీత్. 2019లో కన్నడ చిత్రం ‘కవలుదారి’తో నిర్మాతగా మారారు. ఆ ఏడాది కన్నడంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమాను ‘కపటధారి’గా రీమేక్ చేశారు సుమంత్. ఆ తర్వాత ‘మాయాబజార్ 2016, లా, ఫ్రెంచ్ బిర్యానీ’ చిత్రాలు నిర్మించారు. ‘లా, ఫ్రెంచ్ బిర్యానీ’ చిత్రాలను కోవిడ్ వల్ల నేరుగా అమెజాన్‌లో విడుదల చేశారు పునీత్. ప్రస్తుతం ‘ఫ్యామిలీ ప్యాక్, వన్ కట్ టూ కట్ యాన్ ఫ్లవర్ ఈజ్ కేమ్’ అనే సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. రెండు రోజుల్లో ప్రకటిస్తానని... 2021లో వచ్చిన ‘యువరత్న’ పునీత్ తెరపై కనిపించిన చివరి సినిమా. కరోనా లాక్డౌన్ వల్ల ఆయన నటించిన తాజా చిత్రం ‘జేమ్స్’ విడుదల ఆలస్యం అయింది. ఇటీవల ‘ద్విత్వా’ అనే సినిమాని ప్రకటించారు. అలాగే నవంబర్ 1న తన రెండు కొత్త చిత్రాలపై ప్రకటన చేస్తానని ఈ మధ్య పునీత్ ట్వీట్ కూడా చేశారు. ఈలోపు ఇలా జరిగిపోయింది. సేవా పునీత్ పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కించిత్ గర్వం లేకుండా పెద్దవారిని గౌరవిస్తూ అజాత శత్రువుగా, అందరికీ ప్రియమైనవాడిగా పునీత్ రాజ్‌కుమార్ కీర్తి పొందారు. మృదుస్వభావి, మితభాషి అనిపించుకున్నారు. పునీత్ మంచి నటుడు, డ్యాన్సర్, సింగర్... ఇలా వృత్తిపరంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యక్తిగతంగా ‘మంచి మనిషి’. సేవా కార్యక్రమాలు చాలా చేశారు. దాదాపు 26 అనాథాశ్రమాలు, 45 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలకు పునీత్ సాయం అందిస్తూ వచ్చారు. ‘శక్తిధామ’ అనే సంస్థ ఆధ్వర్యంలో చదువుకుంటున్న దాదాపు 1800 మంది స్టూడెంట్స్‌కు పునీత్ సాయంగా ఉంటున్నారు. వరదలు వచ్చినప్పుడు 5 లక్షలు, కరోనా సమయంలో కర్నాటక ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల విరాళాన్ని పునీత్ ఇవ్వడం జరిగింది. ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా సహాయాలు చేయాలనే ప్లాన్స్ పునీత్‌కి ఉండేవి. అయితే విధి ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. ‘‘గతంలో ఏం జరిగిందో గుర్తుండదు.. ముందు ఏం జరుగుతుందో తెలియదు... ఏమి తిన్నామో.. ఎక్కడ పడుకున్నామో అన్నీ మరచిపోతాం.... అంతా విధి.. మనదేమీ లేదు...’’ ఒక సినిమాలో పునీత్ చెప్పిన డైలాగ్ ఇది. నిజమే... విధి మన చేతుల్లో ఉండదు. అయితే మరణించాక కూడా జీవించడం మన చేతుల్లో ఉంటుంది. పునీత్ రాజ్‌కుమార్ తాను చేసిన మంచి పనుల్లో జీవించే ఉంటారు. పునీత్ కళ్లు ప్రపంచాన్ని చూస్తాయి. నేత్రదానం చేయాలన్న ఆయన ఆకాంక్షను కుటుంబ సభ్యులు నెరవేర్చారు. పునీత్ మనసు ఉన్నతం... మనిషి పునీతం... ఆయనకు లేదు మరణం. -
యంగ్ హీరోకి గిఫ్ట్‌గా కాస్ట్లీ సైకిల్
-
యంగ్ హీరోకి గిఫ్ట్‌గా కాస్ట్లీ సైకిల్
బొమ్మనహళ్లి : కన్నడ నటుడు, హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ 55వ పుట్టిన రోజు వేడుకలను బుధవారం సదాశివనగరలోని స్వగృహంలో కుటుంబ సభ్యుల, అభిమానుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాను హిరోగా నటించిన లీడర్ సినిమా స్టిల్‌తో చేసిన కేక్‌ను కట్ చేశారు. ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా పునిత్ రాజ్‌కు శివరాజ్‌కుమార్ రూ.3లక్షల విలువైన బీఎండబ్ల్యూ సైకిల్‌ను బహుమతిగా అందజేశారు. -
రోగ్ ఆడియో రిలీజ్‌కు టాప్ స్టార్స్
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ రోగ్. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమాను తెరకెక్కించాడు పూరి. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ఇడియట్ లాంటి హిట్ అవుతుందన్న నమ్మకంతో ఈ సినిమాకు మరో చండిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్‌ను జోడించాడు. తెలుగు కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టైలర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఇప్పుడు ఆడియో రిలీజ్‌ను మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇషాన్ ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు కావటంతో లాంచింగ్ భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఆడియో వేడుకకు పలువురు టాప్ స్టార్స్‌ను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కన్నడ టాప్ హీరోలు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, సుదీప్‌లు ఈ ఆడియో ఈవెంట్‌కు హాజరయ్యేందుకు అంగీకరించారు. వీరితో పాటు టాలీవుడ్ హీరోలను కూడా ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇషాన్ సరసన మన్నార చోప్రా, ఏంజెలా క్రిస్లిన్జ్కిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. విన్నర్, సింగం 3 సినిమాల్లో విలన్‌గా నటించిన థాకూర్ అనూప్ సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, హీరోయిన్లు మార్పు తో పాటు ఇతర కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. భారీ గా ప్లాన్ చేసిన ఈ ఆడియో ఈవెంట్ ఈ నెల 9న బెంగళూరు ప్యాలెస్‌లో జరగనుంది. -
బాలీవుడ్లో జూనియర్ పాట
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్‌తో పాటు గాయకుడిగా కూడా మంచి హవా కొనసాగిస్తున్నాడు. ఇటీవల తన సినిమాల్లో వరుసగా పాటలు పాడేస్తున్న జూనియర్, తాజాగా ఓ కన్నడ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ కోసం పాట పాడాడు. ఈ పాటకు టాలీవుడ్‌తో పాటు సాండల్ వుడ్లో కూడా మంచి స్పందన వచ్చింది. ఇప్పడు అదే జోష్‌లో మరో మిత్రుడి కోసం పాట పాడటానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్‌కు మంచి సంబందాలున్నాయి. ఎన్టీఆర్ డ్యాన్స్‌కు తను ఫ్యాన్ అని చెప్పుకునే హృతిక్, నాన్నకు ప్రేమతో సినిమా టైంలో కూడా ఎన్టీఆర్‌ను తెగ పొగిడేశాడు. ఇప్పుడు అదే అనుబంధంతో తను రూపొందిస్తున్న ఓ ఆల్భమ్ కోసం ఎన్టీఆర్‌తో పాట పాడించాలని భావిస్తున్నాడు. విశాల్ శేఖర్లు సంగీతం అందిస్తున్న ఈ ఆల్బమ్‌తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్‌గా జరగనుందట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా ఎన్టీఆర్ బాలీవుడ్ లో పాట పాడటం కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. -
పవర్ స్టార్ ఆట.. యంగ్ టైగర్ పాట
నటుడిగా ఎన్టీఆర్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. నందమూరి యంగ్ జనరేషన్ హీరోల్లో భారీ ఫాలోయింగ్‌తో పాటు అదే స్థాయిలో కలెక్షన్ స్టామినా ఉన్న హీరో ఎన్టీఆర్. ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో పాటు నటనతోనూ అలరించే జూనియర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్నాడు. అయితే ఇప్పటివరకు తెరమీదే అలరించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తన వెనుక కూడా సత్తా చాటుతున్నాడు. ఇటీవల కాలంలో మన తారలు అప్పుడప్పుడు సింగర్స్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అదే బాటలో ఎన్టీఆర్ కూడా గాయకుడి అవతారం ఎత్తాడు. కీరవాణి, దేవీ శ్రీ ప్రసాద్, తమన్ల సంగీత సారధ్యంలో తాను హీరోగా నటించిన సినిమాల్లో పాటలు పాడి మెప్పించాడు. అదే జోరులో ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాడు ఎన్టీఆర్. తన సినిమాలో కాకుండా వేరే హీరో కోసం పాటేస్కున్నాడు. అది కూడా కన్నడ సినిమాలో కావటం మరో విశేషం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'చక్రవ్యూహ'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో, ఓ మాస్ మసాలా పాటను ఎన్టీఆర్ పాడాడు. సోమవారం రాత్రి విడుదలైన ఈ పాటకు కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. గెలయో గెలయో అంటూ సాగే ఈ హుషారైన పాటతో ఎన్టీఆర్ ఈ ఏడాది మరో హిట్ కొట్టాడని అభిమానులు సంబరపడిపోతున్నారు. -
పవర్‌స్టార్ ఆడియో రిలీజ్‌కు ఎన్టీఆర్ చీఫ్‌గెస్ట్
పవర్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆడియో రిలీజ్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వనించారు. పవర్ స్టార్ అంటే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. సాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. పునీత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ చక్రవ్యూహ ఆడియో రిలీజ్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు చిత్రయూనిట్. ఈ ఆడియోకు ఎన్టీఆర్‌ను ఆహ్వానించటం వెనుక మరోకారణం కూడా ఉంది. పునీత్ రాజ్ కుమార్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, ఓ పాట కూడా పాడాడు. ఇప్పటికే నాన్నకు ప్రేమతో సినిమాలో 'ఐ వన్నా ఫాలో ఫాలో' పాటతో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టిస్తున్న జూనియర్, కన్నడ ఇండస్ట్రీలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగా ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతున్న చక్రవ్యూహ ఆడియో రిలీజ్‌కు ముఖ్య అతిథిగా హజరవుతున్నాడు ఎన్టీఆర్. -
కన్నడలో పాటపాడిన ఎన్టీఆర్
ఈ జనరేషన్ యంగ్ హీరోలు... హీరో గానే కాక ఇతర రంగాల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతుండగా మరికొందరు ఇతర విభాగాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే బాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింగర్‌గా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు తన సినిమాల్లోనే పాట పాడిన ఎన్టీఆర్, తాజాగా ఇతర హీరోల సినిమాల్లో కూడా పాటలు పాడటం మొదలు పెట్టాడు. అది కూడా పరభాషలో కావటం మరో విశేషం. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న చక్రవ్యూహ్ సినిమాలో ఓ పాట పాడాడు టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్. ఈ సినిమా నిర్మాత ఎస్కె లోహిత్ తనకు మిత్రుడు కావటంతో, సినిమా ప్రమోషన్ పరంగా కూడా ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో, కన్నడలో పాట పాడటానికి అంగీకరించాడు జూనియర్. అంతేకాదు ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివియస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.