Vedha Movie: Shivarajkumar Gets Emotional After Watching Puneeth Video - Sakshi
Sakshi News home page

పునీత్‌ ఏవీ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన శివరాజ్‌ కుమార్‌.. వీడియో వైరల్‌

Published Wed, Feb 8 2023 1:50 PM | Last Updated on Wed, Feb 8 2023 3:38 PM

Vedha movie: Shivarajkumar Gets Emotional After Watching Puneeth Video - Sakshi

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఈ లోకాన్ని విడిచి ఏడాదిన్నర కావొచ్చినా.. అతని అకాల మరణాన్ని మాత్రం అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికీ కన్నడలో ఏ సినిమా ఈవెంట్‌ జరిగినా పునీత్‌ పేరును స్మరించుకుంటున్నారు. ఆయన సినిమాలకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఎమోషనల్‌ అవుతున్నారు. తాజాగా పునీత్‌ని తలచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు ఆయన సోదరుడు, హీరో శివరాజ్‌ కుమార్‌. 

ఆయన నటించిన  వేద సినిమా ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారాయన. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటలో వేద ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఏవీని ప్లే చేశారు. అందులో పునీత్‌ చిన్నప్పటి నుంచి నటించిన చిత్రాలతో సహా చివరి సినిమా వరకు చూపించారు. దాన్ని చూస్తూ ఒక్కసారిగా కన్నీళ్లు పెంటుకున్నాడు శివరాజ్‌ కుమార్‌. వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో పక్కనే ఉన్న బాలకృష్ణ అతన్ని ఓదార్చారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement