జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఏది చేసినా ఆ ప్రత్యేకతే వేరు.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఆయనను ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. నవంబర్ ఒకటో తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకలో యంగ్ టైగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
(చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్)
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌తో పాటు ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధామూర్తి కూడా హాజరయ్యారు. వేదికపై ఉన్న కూర్చీల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను కూర్చోమని నిర్వాహకులు కోరారు. కానీ ఎన్టీఆర్ అక్కడే ఉన్న మరో మహిళతో పాటు సుధామూర్తిని తానే స్వయంగా కూర్చీలను తుడిచి వారిని కూర్చోబెట్టారు. ఆ వీడియోను తీసిన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో యంగ్ టైగర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎంత ఎత్తు ఎదిగినా స్త్రీ మూర్తులను గౌరవించే విషయంలో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిలేరని మరోసారి నిరూపించారంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన కన్నడ రాజ్యోత్సవ కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేశారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు.
His Simplicity 🥺🙏❤️#NTRajiniForAppu #NTRatಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ #NTRForAppu #PuneethRajkumar #DrPuneethRajkumar pic.twitter.com/N8b0R5j3Rr
— Pradeep K (@pradeep_avru) November 1, 2022
Comments
Please login to add a commentAdd a comment