Sudhamurthi
-
సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు..పిల్లలను ప్రయోజకులుగా చేయడం ఎలా..?
డిజిటల్ యుగంలో పేరెంటింగ్ సవాళ్లతో కూడికున్నది. సుధామూర్తి నవతరం తల్లిదండ్రులకు ఉపయోగపడే తన పేరెంటింగ్ అనుభవాలు, చిట్కాలు షేర్ చేసుకున్నారు. ఇవి పిల్లలను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాడానికి ఉపయోగపడతాయి. సామాజిక సేవ చేస్తూ గృహిణిగా, తల్లిగా సమర్థవంతంగా తన బాధ్యతలను నెరవేర్చారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను మంచిగా ఎలా పెంచాలి అని సతమతమవుతుంటారు. అందులోనూ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులు అయితే ఈ బాధ మరింత వర్ణనాతీతం. అలాంటి వారందికీ ఇన్ఫోసిస్ దిగ్గజం నారాయణమూర్తి భార్య సుధామూర్తి చెప్పే చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటంటే..ప్రతి ఒక్కరి కలలు వేర్వేరు..ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల గురించి కలలు కంటుంటారు. తమ పిల్లలు ఒక నిర్థిష్ట ఉద్యోగాన్ని చేయాలని, ఇలా ఉండాలని భావిస్తుంటారు. అయితే పిల్లలు తమ తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్న కలలకు విరుద్ధంగా లేదా మరొక కల ఉండొచ్చు వారికి. ఇక్కడ ప్రతి తల్లిదండ్రులు గుర్తించాల్సింది తమ పిల్లలు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. అవసరానికి మించి డబ్బు ఇవ్వడం..చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు విలాసవంతమైన పార్టీలు పెట్టి వారికి బహుమతులు కొనిచ్చి పాడుచేస్తారు. బదులుగా, తల్లిదండ్రులు డబ్బు విలువను పిల్లలు తెలుసుకునేలా చేయాలి. తల్లిదండ్రులు ధనవంతులైతే తమ పిల్లలకు ఇతరులు సహయం చేయడం గురించి చెప్పాలి. అలాగే ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నవారు ఉన్నంతలో డబ్బుని సద్వినియోగం చేసుకోవడం తోపాటు దాని ప్రాధాన్యత గురించి కూడా తెలియజెప్పాలి.డిమాండ్లను నెరవేర్చవద్దుపిల్లవాడు ఏదైనా అడిగినప్పుడు, వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చ వద్దు. అది వారికి ఎందుకు అవసరం?, అత్యవసరమైనదా? కాదా? అని ఆలోచించి నెరవేర్చాలి. అలాగే వారికి తక్షణమే డిమాండ్ తీర్చకుండా, ఓర్పుతో నిరీక్షించి డిమాండ్‌ని నెరవేర్చుకోవడం తప్పక నేర్పించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఏది పడితే అది అడగరు, పేరెంట్స్‌ని అర్థం చేసుకునే వీలు ఉంటుంది. వారితో కమ్యూనికేట్గా ఉండండి..పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఇష్టపడేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండటం చాలా ముఖ్యం. అలాగే వారు చెప్పే ప్రతి విషయాన్ని ఓపిగ్గా వినాలి. ఇలా చేయడం వల్ల వారి మనుసులో ఏం ఉంది, ఏం కోరుకుంటున్నారనేది తెలుస్తుంది. దీని వల్ల తల్లిదండ్రుల వద్ద ఎలాంటి దాపరికలు లేకుండా పిల్లలు ప్రవర్తిస్తారు.గాడ్జెట్లకు దూరంగా ఉండేలా చేయండి..పిల్లలు గాడ్జెట్లకు అలవాటు పడితే అసహనానికి, నిరాశనిస్ప్రుహలకు లోనయ్యే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల గాడ్జెట్లకు బదులుగా పుస్తకాలు చదివేలా చేయడానికి ప్రయత్నించండి. దీని వల్ల వారికి చదవడం వల్ల కలిగే వినోదం, ఆనందాన్ని తెలుస్తాయి. పైగా వారిలో భాషా నైపుణ్యాలు పెంపొంది, గొప్ప జ్ఞానం, పఠన శక్తి అలవరచుకునే అవకాశం ఉంటుంది. గౌరవం విలువ తెలియజేయాలి..పిల్లలు వారి తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు. వారినే అనుకరిస్తారు కూడా. మనం గౌరవంతో వ్యవహరిస్తే వారు కూడా ఇతరుల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా వారికి సామాజికి స్థితితో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ గౌరవింపబడటానికి అర్హులే అని పిల్లలకు తెలియజేయాలి. క్లీనర్ అయినా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తినైనా అందర్ని ఒకేలా గౌరవించడం నేర్పించాలి.ఆలోచించి పనికి పూనుకోవడం..ఏదైనా చేసే ముందు ఆలోచించి సరైనా కాదా అని నిర్థారించుకుని చేయడం నేర్పించాలి. చాలామటుకు పిల్లలు వెంటవెంటనే ఫలితాలు రావాలనుకుంటారు. అలా ఆలోచించడం సరికాదని, ఆలోచించి నిధానంగా చేసే పని సరైనదని తెలియజేయాలి. దానికి సమయం తీసుకున్నా..పర్లేదని తొందరపాటుతో కూడిన నిర్ణయాలు మంచివి కావని తెలియజేయాలి.ఇతరులతో పోల్చవద్దుపిల్లలకు తమ వద్ద ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం నేర్పించాలి. సంతృప్తిగా బతకడం నేర్పించాలి. తన స్నేహితుడి వద్ద ఖరీదైన బొమ్మలు ఉన్నా కూడా తన తల్లిదండ్రులు కొనిచ్చే బొమ్మే గొప్పదని తెలియజేయాలి. దానిలోని ఆనందాన్ని ఆస్వాదించడం వారికి నేర్పించాలి. దేన్ని ఇతరులతో పోల్చుకోకూడదని దాని వల్ల అధ్వాన్నంగా తయారవుతామని, ప్రయోజకులం కాలేమని పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి.సుధామూర్తి చెప్పిన చిట్కాలను ఆచరిస్తే పిల్లలు మంచి ప్రయోజకులు అవ్వడమే గాకుండా కష్ట సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది. పైగా సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవుతారు కూడా.(చదవండి: నీరు వర్సెస్ పాలు: డ్రై ఫ్రూట్స్‌ని ఎందులో నానబెట్టి తీసుకుంటే మంచిది?) -
రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?
మంగళవారం రాజ్యసభలో తొలి ప్రసంగంలో రెండు కీలక అంశాలపై మాట్లాడి అందర్నీ ఆశ్చర్యరిచారు సుధామూర్తి. ముఖ్యంగా తన ప్రసంగంలో సర్వైకల్ వాక్సినేషన్, టూరిజం గురించి హైలెట్ చేశారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తిని రాష్ట్రపతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె సాధారణంగా ప్రసంగంలో మహిళల సాధికారత గురించి ప్రముఖంగా మాట్లాడతారని అందరికీ తెలిసిందే. ఇక రాజ్యసభలో మహిళ ఆరోగ్యంపై మాట్లాడటమే గాక దాని పరిష్కారం గురించి కూడా వివరించి దటీజ్ సుధామూర్తి అని చెప్పకనే చెప్పారు. సోషల్ సర్వీస్‌లో ముందుండే ఆమె రాజ్యసభ ఎంపీ హోదాలో కూడా ఆమె ప్రజా సేవకే పెద్ద పీట వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆమె ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ అంటే ఏంటీ? ఎందుకు వేయించుకోవాలి అంటే..సర్వైకల్ వ్యాక్సినేషన్ని గర్భాశయ కేన్సర్ నిరోధక టీకా అని పిలుస్తారు. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్, దాని వ్యాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన లేదు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఏ వ్యాక్సిన్ వేయాలో, ఎప్పుడు వేయాలో చాలా మంది మహిళలకు తెలియదు. టీకా గురించి సమాచారం లేకపోవడం వల్ల భారతదేశంలో గర్భాశయ కేన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే టీకాతో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 70 నుంచి 80 శాతం వరకు తొలగించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఇస్తేనే ప్రయోజనం ఉంటుంది. బాలికలు ఈ టీకా తీసుకుంటే కేన్సర్ రాకుండా నివారించొచ్చు. వచ్చాక చికిత్స తీసుకుని నయమయ్యేలా చేయడం కంటే ముందుగానే నివారించడం ఉత్తమం. 26 ఏళ్ల తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకుంటే అంతగా ప్రయోజనం ఉండదు. దీన్ని 9 నుంచి 14 ఏళ్ల లోపు తీసుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల ఈ విషయాన్నే సుధామూర్తి రాజ్యసభ ప్రసంగంలో హైలెట్ చేసి మాట్లాడారు. మన దేశం కరోనా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతం చేయగలిగినప్పుడూ ఈ సర్వైకల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా విజయవంతమవుతుందని అన్నారు. కాస్త ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుంటే ప్రతి కుటుంబ ఒక తల్లిని కోల్పోదని సుధామూర్తి అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ..ఓ తల్లి చనిపోతే ఆస్పత్రిలో ఒక మరణంగా నమోదవ్వుతుంది. కానీ ఓ కుటుంబం తల్లిని కోల్పోతుందంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో సర్వైకల్ వ్యాక్సినేషన్‌ను అభివృద్ధి చేశామని, గత 20 ఏళ్లుగా దీనిని ఉపయోగిస్తున్నామని అన్నారు. ఇది చాలా బాగా పనిచేస్తోందని కూడా చెప్పారు. ఈ వ్యాక్సిన ఖరీదు రూ. 1400. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఆ వ్యాక్సిన్‌ను కేవలం రూ. 700 నుంచి రూ. 800లకు అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. పైగా మన దేశంలో జనభా ఎక్కువ కాబట్టి మన ఇంటి ఆడబిడ్డలకు ఈ వ్యాక్సిన్ మేలు చేస్తుందని అన్నారు సుధామూర్తి. కాగా, అందుకుగానూ ప్రధాని నరేంద్రమోదీ సుధామూర్తిని ప్రశంసించారు . పైగా తన తొలి ప్రసంగంలో మహిళల ఆరోగ్యం గురించి మాట్లాడినందుకు ధన్యావాదాలని కూడా చెప్పారు మోదీ. (చదవండి: 'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!..ఏకంగా రోబోటిక్ పాములతో..) -
కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే?
ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ 'సుధామార్తి' (Sudha Muthy) ఇటీవల తన కోడలు 'అపర్ణ కృష్ణన్' (Aparna Krishnan)తో ఎలా ఉంటుంది. కోడలి వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సూధామూర్తి కొడుకు రోహన్ మూర్తి మొదట్లో 'లక్ష్మీ వేణు'ను వివాహం చేసుకున్నాడు. కానీ వీరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత రోహన్ 'అపర్ణ క్రష్ణన్' అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు కొడుకు పెళ్లిని చాలా సింపుల్‌గా చేసినప్పటికీ.. కోడలిని మాత్రం బాగా చూసుకుంటుందని.. అపర్ణ క్రష్ణన్ గతంలో స్వయంగా వెల్లడించింది. తన అత్తగారి గురించి ఎవరైనా అడిగితే.. నాకు ఆమె రోల్ మోడల్ అని, అంతే కాకుండా ప్రతి అత్తకు రోల్ మోడల్ అని చెబుతానని చెప్పింది. సుధామూర్తిని తన కోడలితో సంబంధం ఎలా ఉంటుంది అని అడిగితే, ఏ సమస్య లేదని చెబుతూ.. ఒకరినొకరు అపార్థం చేసుకోవడానికి చాలా సమయం కావాలని. నేను ఎప్పుడూ నా పనిలో బిజీగా ఉంటాను, ఆమె పనిలో ఆమె బిజీగా ఉంటుంది. అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ' సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్‌లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సుధామూర్తి 'కంటెంట్ నాదే కానీ ఇది అపర్ణ బేబీ'ది అని చెప్పింది. ఈ సిరీస్ ప్రారంభించడానికి కోడలి ఆలోచనే కారణమని కూడా వెల్లడించింది. -
ఇన్ఫోసిస్ సుధామూర్తి పేరుతో వసూళ్లు.. పూజారి అరెస్ట్!
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్.నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పేరుతో డబ్బు వసూళ్లు చేస్తున్న బెంగళూరుకు చెందిన అరుణ్‌కుమార్(34) అనే పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి బెంగళూరు సమీపంలోని మల్లేశ్వరంలో అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు జయానగర్ పోలీసులు తెలిపారు. అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలోని కన్నడ కూట నుంచి అరుణ్‌కుమార్ రూ.5 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నిర్వహించబోయే కన్నడ కూటాలో సుధామూర్తిని ముఖ్య అతిథిగా తీసుకొస్తానని చెప్పి వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. అయితే సదరు సంస్థ నుంచి ఏప్రిల్‌లో వచ్చిన ఆహ్వానాన్ని సుధామూర్తి తిరస్కరించారు. అయిన్పటికీ ఆమె సమావేశానికి హాజరవుతున్నట్లు ఓ మహిళ ఫొటోలు, వీడియోలను వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాలోని మిల్పిటాస్లో సెప్టెంబరు 26న సేవా ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ సోషల్ మీడియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ డాక్టర్ సుధామూర్తి’ ఈవెంట్‌ను తప్పడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందుకు మరో మహిళ కారణమని తెలిపారు. ఆ ఈవెంట్‌కు టిక్కెట్ ధర రూ.3,330 నిర్ణయించినట్లు చెప్పారు. -
భర్త గురించి మనసులో మాట చెప్పిన సుధా మూర్తి, తొలి పరిచయం అలా..
'సుధా మూర్తి' ఈ పేరుకి భారతదేశంలో పరిచయమే అవసరం లేదు, ఎందుకంటే ఒక రచయిత్రిగా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా మాత్రమే కాకుండా పరోపకారిగా కూడా చాలా మందికి సుపరిచయమే. అయితే ఈమె ఇటీవల తన భర్త నారాయణ మూర్తితో ఏర్పడిన తొలి పరిచయం గురించి ఒక టీవీ షోలో వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల జరిగిన ఒక ప్రముఖ 'బాలీవుడ్ టాక్ షో'లో సుధా మార్తి పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టండన్, ప్రొడ్యూసర్ గుణీత్ మోంగా కూడా పాల్గొన్నారు. ఈ షోకి సంబంధించిన ఒక టీజర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నారాయణ మూర్తిని మొదటి సారి ఎప్పుడు కలిసారని వ్యాఖ్యాత కపిల్ శర్మ సుధా మూర్తిని అడిగారు. ఈ సందర్భంలో సుధా మూర్తి తన స్నేహితురాలి ద్వారా నారాయణ మూర్తి పరిచయమయ్యారని చెప్పుకొచ్చారు. ప్రసన్న అనే స్నేహితురాలు రోజూ ఒక పుస్తకం తీసుకువచ్చేదని, అందులోని ఫస్ట్ పేజీలో నారాయణ మూర్తి పేరు మాత్రమే కాకుండా పక్కన పెషావర్, ఇస్తాంబుల్ వంటి ప్రదేశాల పేర్లు ఉండేవని చెప్పింది. ఇది చూసినప్పుడు నారాయణ మూర్తి బహుశా ఇంటర్నేషనల్ బస్ కండక్టర్ అయి ఉంటాడేమో అనుకున్నట్లు చెప్పింది. ఒక రోజు నారాయణ మూర్తిని కలవడానికి వెళ్లాలని, కలవడానికి ముందు ఆయన సినిమా హీరోలా ఉంటాడని ఊహించినట్లు చెప్పింది. కానీ డోర్ ఓపెన్ చేయగానే ఎవరీ చిన్నపిల్లాడు? అనిపించిందని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇది విన్న అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. (ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!) సుధా మూర్తి 44 సంవత్సరాల కిందట నారాయణ మూర్తిని వివాహం చేసుకుంది. వీరికి అక్షతా మూర్తి, రోహన్ మూర్తి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్షతా మూర్తి భర్త బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. సుధా మూర్తి గొప్ప మానవతా మూర్తి. ఈమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి గొప్ప పురస్కారాలను అందించింది. -
దటీజ్ యంగ్ టైగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఏది చేసినా ఆ ప్రత్యేకతే వేరు.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఆయనను ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. నవంబర్ ఒకటో తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకలో యంగ్ టైగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్) ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌తో పాటు ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధామూర్తి కూడా హాజరయ్యారు. వేదికపై ఉన్న కూర్చీల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను కూర్చోమని నిర్వాహకులు కోరారు. కానీ ఎన్టీఆర్ అక్కడే ఉన్న మరో మహిళతో పాటు సుధామూర్తిని తానే స్వయంగా కూర్చీలను తుడిచి వారిని కూర్చోబెట్టారు. ఆ వీడియోను తీసిన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో యంగ్ టైగర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా స్త్రీ మూర్తులను గౌరవించే విషయంలో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిలేరని మరోసారి నిరూపించారంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన కన్నడ రాజ్యోత్సవ కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేశారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. His Simplicity 🥺🙏❤️#NTRajiniForAppu #NTRatಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ #NTRForAppu #PuneethRajkumar #DrPuneethRajkumar pic.twitter.com/N8b0R5j3Rr — Pradeep K (@pradeep_avru) November 1, 2022 -
సినిమాలు తీసి నవల రాసింది
41 ఏళ్ల అశ్వినీ తివారీ అయ్యర్ మొన్న కంగనా రనౌత్‌తో ‘పంగా’ తీసింది. నిన్న లాక్డౌన్లో కూచుని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి – సుధామూర్తిల బయోపిక్ కోసం స్క్రిప్ట్ పూర్తి చేసింది. అదే సమయంలో మొదటిసారిగా ఒక నవల రాసి మార్కెట్లోకి ఆగస్టు 1న విడుదల చేస్తోంది. అందరిలానే ఆమెకూ రెండు చేతులే ఉన్నాయి. కాని స్త్రీలు ఇన్ని పనులు చేయగలరు అని సృజనాత్మకంగా ఉండగలరని చెబుతోంది. ‘ది హిడెన్ పవర్స్ ఇన్ ఎవ్రి ఉమన్’ అని నాలుగేళ్ల క్రితం బెంగళూరు టెడ్ఎక్స్ కోసం ఒక ఉపన్యాసం ఇచ్చింది అశ్వినీ తివారీ అయ్యర్. ప్రతి స్త్రీలో ఉండే అంతర్గత శక్తులను ఆ స్త్రీలు తెలుసుకోవాలని, వాటిని ఉపయోగంలోకి తేవాలని ఆమె మాట్లాడింది. ముంబైలో పుట్టి పెరిగిన అశ్వినీ తివారీ అయ్యర్ నిజానికి అడ్వర్టైజ్మెంట్ రంగంలో విశేష గుర్తింపు పొందింది. ‘లియో బర్నెట్’ వంటి అంతర్జాతీయ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్‌గా పని చేసింది. కాని ఆమె తనలో ఒక సినిమా దర్శకురాలు దాగి ఉందని గ్రహించిన మరుక్షణం 2013లో ఆ మంచి ఉద్యోగానికి రాజీనామా చేసి బాలీవుడ్లో పని చేయడం మొదలెట్టింది. ‘నీల్ బత్తి సన్నాట’, ‘బరేలీకి బర్ఫీ’, ‘పంగా’ సినిమాలకు దర్శకత్వం వహించింది. ఆమె దర్శకత్వ ప్రతిభకు అవార్డులు వచ్చాయి. ‘ఏ క్షణమూ ఖాళీగా ఉండటం నాకు నచ్చదు’ అని చెప్పే అశ్వినీ అయ్యర్ గత రెండేళ్లుగా కరోనా వల్ల పని సరిగ్గా జరక్కపోయినా సోనీ లివ్ కోసం ‘ఫాడు’ అనే ప్రేమ కథను తీసింది. ఇన్ఫోసిస్ దిగ్గజాలు సుధామూర్తి, నారాయణమూర్తి జంట జీవిత కథను అధ్యయనం చేసి వారి బయోపిక్కు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంది. అంతేనా? ఒక నవల కూడా రాసేసింది. దాని పేరు ‘మాపింగ్ లవ్’. గణితంలో మేప్‌ల ద్వారా అంచనాలను చేస్తారు. అలా ప్రేమను మేప్ చేయగలమా? అదే ఈ కథాంశం. ‘ఇది నా మొదటి నవల. లాక్డౌన్లో దొరికిన ఏకాంతంలో కూచుని రాశాను. రాయడంలో ఉండే ఆనందాన్ని అనుభవించాను’ అంటుంది అశ్వినీ అయ్యర్. ఈ నవల ఆగస్టు 1న మార్కెట్లోకి రాబోతోంది. అశ్విని తన సినిమా కథాంశాలకు గాని నవలకు గాని స్త్రీల జీవితాన్నే తీసుకుంది. ‘నీల్ బత్తి సన్నాట’లో చిన్న ఊళ్ల స్త్రీలు కనే కలలను ఆమె చూపించింది. ఇక ‘పంగా’ అయితే వైవాహిక జీవితంలో మునిగిపోయిన స్త్రీ తిరిగి తన క్రీడా సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది. ‘స్త్రీలు ఎన్నో చేయగలరు. ఎన్నో చేయాలి’ అంటుంది అశ్వినీ. ‘దంగల్’ దర్శకుడు నితేష్ తివారి ఈమె భర్త. సుధామూర్తితో...,; కంగనా రనౌత్‌తో... -
రాణిగారి కన్నా ఏం తక్కువ
సుధామూర్తి నవ్వుకునే ఉంటారు కూతురు అక్షతను క్వీన్‌తో పోటీకి తెచ్చింది మరి బ్రిటన్ మీడియా! ఎలిజబెత్ రాణి గారి కంటే.. వెయ్యికోట్లు ఎక్కువేనట అక్షత సంపద! నిజమే కావచ్చు కానీ.. ఇప్పటికీ ఆమె.. తల్లిని పాకెట్ మనీ అడిగే కూతురిలానే జీవిస్తున్నారన్నదీ నిజం. నిరాడంబరంగా.. సంపన్నతను ప్రదర్శించని రాణిగా! తల్లి పెంపకంలోని గొప్పతనం అది. ఇన్ఫోసిస్ దంపతులు సుధ, నారాయణమూర్తిల గుర్తింపు ఎన్నేళ్లు గడిచినా, వాళ్ల కంపెనీ ఎన్ని కోట్లు గడిచినా ఎప్పటికీ మారనిదీ, ఒకేవిధమైనదీ! ‘సంపన్నులైన నిరాడంబరులు’ అనేదే ఆ గుర్తింపు. వారిద్దరి నిరాడంబరత్వం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు తమ ఇద్దరు పిల్లల్ని వాళ్లెలా పెంచారన్నదే సరైన కొలమానం అవుతుంది. మూర్తి దంపతులకు మొదట కుమార్తె. తర్వాత కొడుకు. కుమార్తె అక్షత బ్రిటన్‌లో స్థిరపడ్డారు. కొడుకు రోహన్ ఇండియాలోనే ‘హార్వర్డ్ సొసైటీ ఆఫ్ ఫెలోస్’కి టెక్నికల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇన్ఫోసిస్ చైర్పర్సన్ అయిన డెబ్బై ఏళ్ల సుధామూర్తి సోషల్ వర్కర్. కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్ భాషలలో పుస్తకాలు రాశారు. ఒకప్పుడు ఆమె ఇంజినీరింగ్ టీచర్. నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌కి ప్రస్తుతం ఎమెరిటస్ చైర్మన్. పదవీ విరమణానంతర బాధ్యతల్ని నిర్వహించి వెళుతుంటారు. కోట్లల్లో ఆస్తులు ఉన్నా, సింపుల్‌గా ఉంటారు. ఉండకూడదని కాదు. ఈ దంపతుల ఆసక్తులు, అభిరుచులు.. ఆస్తుల సంపాదనకు పూర్తి భిన్నమైనవి. అందుకే ఎప్పుడు వీళ్ల ప్రస్తావన వచ్చినా ‘నిరాడంబరత్వం’ వీరి సుసంపన్నతగా కనిపిస్తుంది. అందుకే వీళ్లమ్మాయి అక్షత ఇప్పుడు బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కన్నా ధనికురాలన్న గుర్తింపు పొందడం పెద్ద విశేషం అయింది. ∙∙ అక్షత (40) పదకొండేళ్ల క్రితం రిషీ సునక్‌ను వివాహమాడి బ్రిటన్ వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో వాళ్లిద్దరూ క్లాస్మేట్స్. ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. రిషి బ్రిటన్‌లోనే పుట్టారు. 2014లో ప్రజా రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం యు.కె.లో అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ ఆయన. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఛాన్స్లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్’ అయ్యారు. అంటే ఆర్థికమంత్రి. ఇద్దరు కూతుళ్లు. కృష్ణ, అనౌష్క. ఆర్థికమంత్రి అయినవారు కుటుంబ వివరాలతోపాటు ఆస్తుల లెక్కల్నీ, వాటి విలువను వెల్లడించాలి. బ్రిటన్ పార్లమెంటుకు కూడా ఆ ఆనవాయితీ ఉంది. ఇటీవల రుషీ తన ఆర్థిక పత్రాలను సమర్పించినప్పుడు యు.కె.లో ఆయన భార్య అక్షత నిర్వహిస్తున్న సొంత వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘క్యాటమరాన్ వెంచర్స్’ ఆస్తులు, ఇన్ఫోసిస్ లో ఆమెకు ఉన్న షేర్లు కలుపుకుని ఆమె సంపద విలువ 480 మిలియన్ పౌండ్లు ఉన్నట్లు బహిర్గతం అయింది. అదేమీ దాచి ఉంచిన సంగతి కానప్పటికీ ‘ది గార్డియన్’ పత్రిక సంపన్నత విషయంలో అక్షత క్వీన్ ఎలిజబెత్‌ను దాటిపోయారని రాయడంలో ప్రపంచ ప్రజల ఆసక్తికి అక్షత ఒక కేంద్రబిందువు అయ్యారు. బహుశా ఈ కేంద్రబిందువును చూసి సుధామూర్తి దంపతులు మురిసిపోయే ఉంటారు. క్వీన్ ఎలిజబెత్ దగ్గర ప్రస్తుతం ఉన్నది 350 మిలియన్ పౌండ్లయితే, అక్షత దగ్గరున్నవి 450 పౌండ్లు. మన కరెన్సీలోమనమ్మాయి దగ్గర రాణి గారి దగ్గర ఉన్న డబ్బు కంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కువ ఉన్నట్లు. అక్షతకు ఇంకా అమెజాన్ ఇండియాలో, బ్రిటన్‌లోని ఆరు కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ∙∙ ‘రాణిగారి గారి కన్నా అక్షత సంపన్నురాలు’ అనే మాట వినేందుకు గొప్పగా ఉన్నా ఇంకా తల్లిదండ్రులను పాకెట్ మనీ అడిగే అమ్మాయిలానే సాధారణంగా ఉంటారు అక్షత! ‘డబ్బుకు మనం సొంతదారులం కాదు. సంరక్షకులం మాత్రమే. నువ్వు విజయం సాధించినప్పుడు ఆ విజయంలో సమాజం నీకిచ్చిన సహకారం కూడా ఉంటుంది కనుక ఆ సహకారాన్ని తిరిగి నువ్వు సమాజానికి ఇచ్చేయాలి’ అని తను టాటా ఉద్యోగిగా ఉన్నప్పుడు జేఆర్డీ టాటా చెప్పిన మాటను సుధామూర్తి గుర్తుంచుకుని పాటించారు. తన పిల్లలకూ నేర్పించారు. ఆమె జీవితంలోని రెండు సందర్భాలు కూడా అక్షతను, రోహన్‌ను నిరాడంబరంగా పెంచేందుకు ప్రేరణ అయ్యాయి. తెరిపి లేకుండా ఏకధారగా వర్షం కురుస్తుంటే ఇల్లు తడిసి, కప్పు కారిపోతున్నా.. ‘వానా వానా వల్లప్ప’ అని పాడుకుంటూ సంతోషంతో నృత్యం చేసిన ఒక నిరుపేద కుటుంబం, తమిళనాడు స్వామిమలై సమీపంలోని ఒక ఆలయంలో అంధుడైన ఒక పూజారి తను ఇచ్చిన ఐదు వందల నోటును తడిమి చూసుకుని ‘అంత డబ్బు తనకు అక్కర్లేదు’ అని తిరిగి ఇచ్చేస్తూ, ఐదు పావలా బిళ్లలను మాత్రమే అడిగి తీసుకోవడం సుధామూర్తిని ఆశ్చర్యంలో ముంచెత్తిన సందర్భాలు ఆ రెండూ. కొడుకు బడికి వెళ్తున్నప్పుడు చాలాకాలం పాటు ఆమె ఇచ్చిన పాకెట్ మనీ 5 రూపాయలు! ‘అయిదా!’ అని రోహన్ మూతి బిగిస్తే, ‘ఇది కూడా లేని వాళ్లు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు’ అని సుధామూర్తి చెప్పేవారట. తగ్గట్లే ఇద్దరు పిల్లలూ ఎంత ఆస్తిపరులైనా, అమ్మానాన్న పిల్లల్లానే ఉన్నారు. రాణిగారి కంటే ధనికురాలిగా ఊహించని కొత్త గుర్తింపు పొందిన అక్షత.. తల్లి పెంపకంలో చిన్నప్పటి నుంచీ సంపన్నతను ప్రదర్శించని రాణిగానే పెరిగారు. -
కోతుల కాలేజ్‌లో.. తనొక్కతే ఆడపిల్ల
‘‘అమ్మాయిలు ధైర్యంగా ఉంటే, తమకు ఇష్టమైన రంగంలో ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొనైనా గట్టిగా నిలబడవచ్చు’’ స్త్రీ శక్తికి సుధామూర్తి ఒక ఎగ్జాంపుల్. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా, ఉదార హృదయురాలైన సంపన్న మహిళగా మీకు ఆవిడ తెలిసే ఉంటారు. ఆమె జీవితంలో చాలా స్ట్రగుల్ ఉంది. అందులో కొంతభాగాన్నైనా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మహిళలం తెలుసుకోవాలి. సుధ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు కాలేజీలో తను ఒక్కతే అమ్మాయి. తండ్రిని తీసుకుని సీటు కోసం సుధ కాలేజీకి వెళ్లినప్పుడు ప్రిన్సిపాల్ ‘కష్టం అవుతుంది కులకర్ణి గారూ’ అన్నారు. సుధ తండ్రి కులకర్ణి.. డాక్టర్. ‘‘డాక్టర్ సాబ్.. మీ అమ్మాయి ఇంటెలిజెంట్ అని నాకు తెలుసు. మెరిట్ కారణంగా సీటును ఇవ్వక తప్పడం లేదు. కానీ తనిక్కడ చదవడం కష్టమౌతుందని నా భయం. కాలేజీ మొత్తానికీ తనొక్కతే ఆడపిల్ల. ఇక్కడ లేడీస్ టాయ్‌లెట్స్ లేవు. లేడీస్ రెస్ట్రూమ్ కూడా లేదు. ఇక రెండో సంగతి. ఇక్కడి బాయ్స్! వయసు కదా, వాళ్లను అదుపు చెయ్యడం ఇబ్బందవుతుందేమో’’అన్నారు ప్రిన్సిపాల్. సుధ వెనక్కు తగ్గలేదు. తనకు ఇంజినీరింగ్ అంటే ఇష్టం.పైగా తండ్రి సపోర్ట్ ఉంది. ఏమాత్రం సంకోచం లేకుండా కాలేజ్‌లో చేరింది. ప్రిన్సిపాల్ చెప్పినట్లే సుధ కాలేజ్ ఎంట్రీ.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లయింది.. బాయ్స్‌కి. ఆమెను చూసి విజిల్స్ వేసేవారు. కన్నడంలో పాటలేవో పాడేవారు. ఫస్ట్ బెంచ్ ఖాళీగా ఉండేది. అక్కడ కూర్చోడానికి లేకుండా ఇంకు పోసేవారు. అలా సుధ చాలా ఇక్కట్లు పడ్డారు. తొలి పరీక్షలో సుధ యూనివర్సిటీ ఫస్ట్ రావడంతో అబ్బాయిల వెర్రి వేషాలకు బ్రేక్ పడింది. ‘‘అమ్మాయిలు ధైర్యంగా ఉంటే, తమకు ఇష్టమైన రంగంలో ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొనైనా గట్టిగా నిలబడవచ్చు’’ అని ఆనాటి సంగతులు కొన్నింటిని ‘త్రీ థౌజండ్ స్టిచెస్’ అనే తన పుస్తకంలో రాసుకున్నారు సుధామూర్తి. సాధారణ వ్యక్తులు, అసాధారణ జీవితాలు అనే అర్థం వచ్చే ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ పుస్తకం గత ఏడాది జూలైలో విడుదలైంది. పెంగ్విన్ వాళ్లు అనుమతి ఇవ్వడంతో ఇందులోని విశేషాంశాలు ఇప్పుడు పత్రికల్లో కనిపిస్తున్నాయి. సుధ రచయిత్రి, సోషల్ వర్కర్ కూడా. -
21 ఏళ్ల నుంచి చీర కొనలేదు
సుధామూర్తి న్యూఢిల్లీ: పెద్ద పేరు, కోట్ల ఆస్తి, అంతకుమించిన హోదా. అలాంటి మహిళ 21 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనలేదంటే నమ్మగలరా? నమ్మి తీరాల్సిందే. అలాంటి వ్యక్తే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి (ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య). ఈమె తన ఆహార్యంలో, మాటతీరులో ఆర్భాటం చూపించరు. అలాంటి సుధామూర్తి 21 ఏళ్ల క్రితం చివరి సారిగా చీర కొనుక్కున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాశీ యాత్రలో తమకు ఇష్టమైనదాన్ని విశ్వేశ్వరుడికి అర్పించాలనేది భక్తుల నమ్మకం. దీంతో తనకు ఇష్టమైన చీరల షాపింగ్‌ను వదిలేసినట్లు సుధామూర్తి తెలిపారు. ‘కాశీలో పవిత్ర స్నానానికి వెళ్లాం. అక్కడ మనకు నచ్చినదాన్ని త్యజించాలి. అందుకే నాకిష్టమైన చీరల షాపింగ్‌ను వదిలిపెట్టాను. ఇప్పుడు కేవలం అత్యవసరమైన వస్తువులను మాత్రమే కొంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెప్పారు.