21 ఏళ్ల నుంచి చీర కొనలేదు | Sari has not bought since 21 years | Sakshi
Sakshi News home page

21 ఏళ్ల నుంచి చీర కొనలేదు

Published Mon, Jul 31 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

21 ఏళ్ల నుంచి చీర కొనలేదు

21 ఏళ్ల నుంచి చీర కొనలేదు

సుధామూర్తి
న్యూఢిల్లీ: పెద్ద పేరు, కోట్ల ఆస్తి, అంతకుమించిన హోదా. అలాంటి మహిళ 21 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనలేదంటే నమ్మగలరా? నమ్మి తీరాల్సిందే. అలాంటి వ్యక్తే ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి (ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య). ఈమె తన ఆహార్యంలో, మాటతీరులో  ఆర్భాటం చూపించరు. అలాంటి సుధామూర్తి 21 ఏళ్ల క్రితం చివరి సారిగా చీర కొనుక్కున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

కాశీ యాత్రలో తమకు ఇష్టమైనదాన్ని విశ్వేశ్వరుడికి అర్పించాలనేది భక్తుల నమ్మకం. దీంతో తనకు ఇష్టమైన చీరల షాపింగ్‌ను వదిలేసినట్లు సుధామూర్తి తెలిపారు. ‘కాశీలో పవిత్ర స్నానానికి వెళ్లాం. అక్కడ మనకు నచ్చినదాన్ని త్యజించాలి. అందుకే నాకిష్టమైన చీరల షాపింగ్‌ను వదిలిపెట్టాను. ఇప్పుడు కేవలం అత్యవసరమైన వస్తువులను మాత్రమే కొంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement