డిజిటల్ యుగంలో పేరెంటింగ్ సవాళ్లతో కూడికున్నది. సుధామూర్తి నవతరం తల్లిదండ్రులకు ఉపయోగపడే తన పేరెంటింగ్ అనుభవాలు, చిట్కాలు షేర్ చేసుకున్నారు. ఇవి పిల్లలను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాడానికి ఉపయోగపడతాయి. సామాజిక సేవ చేస్తూ గృహిణిగా, తల్లిగా సమర్థవంతంగా తన బాధ్యతలను నెరవేర్చారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను మంచిగా ఎలా పెంచాలి అని సతమతమవుతుంటారు. అందులోనూ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులు అయితే ఈ బాధ మరింత వర్ణనాతీతం. అలాంటి వారందికీ ఇన్ఫోసిస్ దిగ్గజం నారాయణమూర్తి భార్య సుధామూర్తి చెప్పే చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటంటే..
ప్రతి ఒక్కరి కలలు వేర్వేరు..
ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల గురించి కలలు కంటుంటారు. తమ పిల్లలు ఒక నిర్థిష్ట ఉద్యోగాన్ని చేయాలని, ఇలా ఉండాలని భావిస్తుంటారు. అయితే పిల్లలు తమ తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్న కలలకు విరుద్ధంగా లేదా మరొక కల ఉండొచ్చు వారికి. ఇక్కడ ప్రతి తల్లిదండ్రులు గుర్తించాల్సింది తమ పిల్లలు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోవడం అత్యంత ముఖ్యం.
అవసరానికి మించి డబ్బు ఇవ్వడం..
చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు విలాసవంతమైన పార్టీలు పెట్టి వారికి బహుమతులు కొనిచ్చి పాడుచేస్తారు. బదులుగా, తల్లిదండ్రులు డబ్బు విలువను పిల్లలు తెలుసుకునేలా చేయాలి. తల్లిదండ్రులు ధనవంతులైతే తమ పిల్లలకు ఇతరులు సహయం చేయడం గురించి చెప్పాలి. అలాగే ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నవారు ఉన్నంతలో డబ్బుని సద్వినియోగం చేసుకోవడం తోపాటు దాని ప్రాధాన్యత గురించి కూడా తెలియజెప్పాలి.
డిమాండ్లను నెరవేర్చవద్దు
పిల్లవాడు ఏదైనా అడిగినప్పుడు, వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చ వద్దు. అది వారికి ఎందుకు అవసరం?, అత్యవసరమైనదా? కాదా? అని ఆలోచించి నెరవేర్చాలి. అలాగే వారికి తక్షణమే డిమాండ్ తీర్చకుండా, ఓర్పుతో నిరీక్షించి డిమాండ్‌ని నెరవేర్చుకోవడం తప్పక నేర్పించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఏది పడితే అది అడగరు, పేరెంట్స్‌ని అర్థం చేసుకునే వీలు ఉంటుంది.
వారితో కమ్యూనికేట్‌గా ఉండండి..
పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఇష్టపడేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండటం చాలా ముఖ్యం. అలాగే వారు చెప్పే ప్రతి విషయాన్ని ఓపిగ్గా వినాలి. ఇలా చేయడం వల్ల వారి మనుసులో ఏం ఉంది, ఏం కోరుకుంటున్నారనేది తెలుస్తుంది. దీని వల్ల తల్లిదండ్రుల వద్ద ఎలాంటి దాపరికలు లేకుండా పిల్లలు ప్రవర్తిస్తారు.
గాడ్జెట్‌లకు దూరంగా ఉండేలా చేయండి..
పిల్లలు గాడ్జెట్‌లకు అలవాటు పడితే అసహనానికి, నిరాశనిస్ప్రుహలకు లోనయ్యే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల గాడ్జెట్‌లకు బదులుగా పుస్తకాలు చదివేలా చేయడానికి ప్రయత్నించండి. దీని వల్ల వారికి చదవడం వల్ల కలిగే వినోదం, ఆనందాన్ని తెలుస్తాయి. పైగా వారిలో భాషా నైపుణ్యాలు పెంపొంది, గొప్ప జ్ఞానం, పఠన శక్తి అలవరచుకునే అవకాశం ఉంటుంది.
గౌరవం విలువ తెలియజేయాలి..
పిల్లలు వారి తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు. వారినే అనుకరిస్తారు కూడా. మనం గౌరవంతో వ్యవహరిస్తే వారు కూడా ఇతరుల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా వారికి సామాజికి స్థితితో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ గౌరవింపబడటానికి అర్హులే అని పిల్లలకు తెలియజేయాలి. క్లీనర్ అయినా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తినైనా అందర్ని ఒకేలా గౌరవించడం నేర్పించాలి.
ఆలోచించి పనికి పూనుకోవడం..
ఏదైనా చేసే ముందు ఆలోచించి సరైనా కాదా అని నిర్థారించుకుని చేయడం నేర్పించాలి. చాలామటుకు పిల్లలు వెంటవెంటనే ఫలితాలు రావాలనుకుంటారు. అలా ఆలోచించడం సరికాదని, ఆలోచించి నిధానంగా చేసే పని సరైనదని తెలియజేయాలి. దానికి సమయం తీసుకున్నా..పర్లేదని తొందరపాటుతో కూడిన నిర్ణయాలు మంచివి కావని తెలియజేయాలి.
ఇతరులతో పోల్చవద్దు
పిల్లలకు తమ వద్ద ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం నేర్పించాలి. సంతృప్తిగా బతకడం నేర్పించాలి. తన స్నేహితుడి వద్ద ఖరీదైన బొమ్మలు ఉన్నా కూడా తన తల్లిదండ్రులు కొనిచ్చే బొమ్మే గొప్పదని తెలియజేయాలి. దానిలోని ఆనందాన్ని ఆస్వాదించడం వారికి నేర్పించాలి. దేన్ని ఇతరులతో పోల్చుకోకూడదని దాని వల్ల అధ్వాన్నంగా తయారవుతామని, ప్రయోజకులం కాలేమని పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి.
సుధామూర్తి చెప్పిన చిట్కాలను ఆచరిస్తే పిల్లలు మంచి ప్రయోజకులు అవ్వడమే గాకుండా కష్ట సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది. పైగా సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవుతారు కూడా.
(చదవండి: నీరు వర్సెస్ పాలు: డ్రై ఫ్రూట్స్‌ని ఎందులో నానబెట్టి తీసుకుంటే మంచిది?)
Comments
Please login to add a commentAdd a comment