దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్.నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి పేరుతో డబ్బు వసూళ్లు చేస్తున్న బెంగళూరుకు చెందిన అరుణ్‌కుమార్(34) అనే పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి బెంగళూరు సమీపంలోని మల్లేశ్వరంలో అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు జయానగర్ పోలీసులు తెలిపారు.
అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలోని కన్నడ కూట నుంచి అరుణ్‌కుమార్ రూ.5 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నిర్వహించబోయే కన్నడ కూటాలో సుధామూర్తిని ముఖ్య అతిథిగా తీసుకొస్తానని చెప్పి వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. అయితే సదరు సంస్థ నుంచి ఏప్రిల్‌లో వచ్చిన ఆహ్వానాన్ని సుధామూర్తి తిరస్కరించారు. అయిన్పటికీ ఆమె సమావేశానికి హాజరవుతున్నట్లు ఓ మహిళ ఫొటోలు, వీడియోలను వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అమెరికాలోని మిల్‌పిటాస్‌లో సెప్టెంబరు 26న సేవా ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ సోషల్ మీడియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ డాక్టర్ సుధామూర్తి’ ఈవెంట్‌ను తప్పడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందుకు మరో మహిళ కారణమని తెలిపారు. ఆ ఈవెంట్‌కు టిక్కెట్ ధర రూ.3,330 నిర్ణయించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment