Infy
-
నారాయణ మూర్తిని మించిన సేనాపతి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తిని సంపద పరంగా అదే సంస్థకు చెందిన మరో సహవ్యవస్థాపకులు సేనాపతి గోపాలకృష్ణన్ మించిపోయారు. ఇటీవల వెలువడిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం భారత్‌లో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది కంటే 75 ఎక్కువ. వారి సామూహిక సంపద రూ.159 లక్షల కోట్లకు చేరింది. ఈ లిస్ట్‌లో ఈసారి నారాయణ మూర్తి(సందప రూ.36,600 కోట్లు)ని సేనాపతి గోపాలకృష్ణన్ అధిగమించారు. రూ.38,500 కోట్ల నికర సంపదతో ఈ ఘనత దక్కించుకున్నారు.ఇన్ఫోసిస్‌ను 1981లో నారాయణ మూర్తి, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరా, నందన్ నీలేకని, ఎస్డీ శిబులాల్, కే.దినేష్, సేనాపతి గోపాలకృష్ణన్ కలిసి స్థాపించారు. ఇది తరువాతి కాలంలో ఇన్ఫోసిస్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఐటీ సంస్థల్లో ఒకటిగా మారింది. 2023లో 18.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,51,762 కోట్లు ) ఆదాయాన్ని ఆర్జించింది.ఇదీ చదవండి: యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలుసేనాపతి గోపాలకృష్ణన్సేనాపతి గోపాలకృష్ణన్(69) ఇన్ఫోసిస్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతను 2007 నుంచి 2011 వరకు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కంపెనీ విస్తరణ, ఆవిష్కరణల్లో ఇన్ఫోసిస్‌ను ముందుండి నడిపించారు. గోపాలకృష్ణన్ 2011 నుండి 2014 వరకు సంస్థకు వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌లో తన కార్యకలాపాల నుంచి వైదొలిగిన తర్వాత గోపాలకృష్ణన్ కొత్త వ్యాపారాలపై దృష్టి సారించారు. అతను ప్రస్తుతం యాక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. యాక్సిలర్ వెంచర్స్ గుడ్‌హోమ్, కాగాజ్, ఎన్కాష్ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టింది. -
తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై మూర్తి వ్యాఖ్యలు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి గతంలో పని గంటలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. వాటిని వెనక్కి తీసుకోబోనని స్పష్టం చేశారు. అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.ప్రతి ఒక్కరూ వారంలో దాదాపు 70 గంటలపాటు పని చేయాలని నారాయణ మూర్తి గతంలో కామెంట్ చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా చర్చ జరిగింది. తన అభిప్రాయాన్ని మార్చుకున్నారా అని తాజాగా అడిగిన ప్రశ్నలకు మూర్తి స్పందించారు. ‘నన్ను క్షమించండి. నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నా తుదిశ్యాస వరకు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ వారంలో 100 గంటలపాటు పని చేస్తున్నారు. మనం కూడా కష్టపడి చేయడమే తనకు ఇచ్చే ప్రశంస. ఇది దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడంతో ఫలితం ఉండదు. వారంలో ఆరు రోజుల పని దినాలను ఐదు రోజులకు మార్చినప్పుడు తీవ్ర నిరాశ చెందాను. నా జీవితంలో చాలాకాలంపాటు రోజులో 14 గంటలు, వారంలో ఆరున్నర రోజులు పనిచేశాను. ఉదయం 6:30 గంటలకు కార్యాలయానికి చేరుకుని రాత్రి 8:40 గంటల వరకు పని చేసేవాడిని. కష్టపడి పనిచేసేతత్వం భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది’ అని అన్నారు.ఇదీ చదవండి: నెలలో 5.9 శాతం తగ్గిన ఇళ్ల ధరలు!ప్రపంచంలోనే అధికారికంగా వారంలో అధిక పని గంటలున్న దేశాలుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: 52.6 గంటలు(సరాసరి)గాంబియా: 50.8 గంటలుభూటాన్: 50.7 గంటలులెసోతో: 49.8 గంటలుకాంగో: 48.6 గంటలుఖతార్: 48 గంటలుఇండియా: 47.7 గంటలుమౌరిటానియా: 47.5 గంటలులైబీరియా: 47.2 గంటలుబంగ్లాదేశ్: 46.9 గంటలు -
పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య సుధామూర్తి నెట్‌ఫ్లిక్స్ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో స్టార్ గెస్ట్లుగా పాల్గొన్నారు. అందులో తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. నారాయణ మూర్తి తన 25వ వివాహ వార్షికోత్సవం రోజున సుధామూర్తికి శుభాకాంక్షలు తెలపడం మరిచిపోయానన్నారు.‘ఒకరోజు నేను ఆఫీస్‌కు బయలుదేరుతుండగా సుధ ఉదయం నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఏదైనా ప్రత్యేకత ఉందా? అని అడిగింది. ఏమీలేదు అని జవాబిచ్చాను. ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వస్తుండగా మళ్లీ ఈరోజు ప్రత్యేకతేంటో ఆలోచించారా? అని అడిగింది. ఏమీలేదని అదే సమాధానం చెప్పాను. నేను ఆ తర్వాతిరోజు ముంబయిలో ఒక సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి విమానం ఎక్కుతుండగా నా కూతురు అక్షత(బ్రిటన్ మాజీ ప్రధాని రిషీసునాక్ భార్య) నుంచి కాల్ వచ్చింది. ఏం చేస్తున్నారు? అని అడిగింది. ఫ్లైట్ ఎక్కుతున్నాను అని సమాధానం ఇచ్చాను. వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. వేరే విమానం ఎక్కి బెంగళూరు వెళ్లండని చెప్పింది. అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పండని తెలిపింది. మీరు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశానికి హాజరు అవ్వాల్సి ఉంది. వీలైతే మీరు ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకోండి. కానీ అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిందేనని పట్టుపట్టింది’ అని నారాయణమూర్తి చెప్పారు.ఇదీ చదవండి: మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?సుధామూర్తి నవ్వుతూ ‘అది మా 25వ వివాహ వార్షికోత్సవం. కొంత ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. నా భర్త ఆ విషయాన్ని మరిచిపోయేసరికి ఐదు-పది నిమిషాల పాటు కొంత బాధ అనిపించింది. కానీ ఆయన పనితీరు నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి ఇలాంటి విషయాలు అంతగా పట్టించుకోను. కానీ, ఈ విషయంలో నా కూతురు చాలా కలత చెందింది’ అని చెప్పారు. -
ఫ్రెషర్స్‌కు ఏటా రూ.9 లక్షలు వేతనం!
టెక్ కంపెనీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని తెలుసుకదా. తాజాగా ప్రముఖ సాఫ్ట్వేర్ సేవలందించే ఇన్ఫోసిస్ కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా ఈ ఏడాది ‘పవర్ ప్రోగ్రామ్’ విధానాన్ని అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కేటగిరీలో నియమించుకుంటున్న అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల వరకు వేతనం చెల్లిస్తామని పేర్కొంది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా రిక్రూట్ అయ్యే అభ్యర్థులు ‘పవర్ ప్రోగ్రామ్’ కిందకు వస్తారు. ఈ కేటగిరీలోని వారికి ఏటా రూ.9 లక్షల వరకు వేతనం ఉంటుంది. కంపెనీ అవసరాలకు తగిన ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాలున్నాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్ సామర్థ్యంపై అధిక నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలపై యువత నైపుణ్యం పెంచుకోవాలని చెప్పింది.ఇదీ చదవండి: రోబోల దండు వచ్చేస్తోంది..!ఇదిలాఉండగా, టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ విభాగం గ్లోబల్ హెడ్ గిరీష్ నందిమఠ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఏడాది సంస్థ రిక్రూట్మెంట్ విధానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నామని చెప్పారు. ‘ప్రైమ్’ కేటగిరీలో నియామకం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు వేతనం అందిస్తామన్నారు. -
ఎన్నికల బాండ్లు.. ఇన్ఫోసిస్ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందంటే..
ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇన్ఫ్రా, ఫార్మా కంపెనీలతోపాటు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వాటిలో ఐటీ కంపెనీలు ఉండడం విశేషం. తాజాగా ఎస్బీఐ విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాల ప్రకారం.. ఐటీ రంగంలో సియెంట్ కంపెనీ గరిష్ఠంగా రూ.10 కోట్లు విలువ చేసే బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఆ కంపెనీ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందో తెలియరాలేదు. తదుపరి స్థానంలో జెన్సర్ టెక్నాలజీస్ మే 2019లో రూ.3 కోట్లు విలువచేసే వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మూడో స్థానంలో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ 2018 కర్ణాటక ఎన్నికల ముందు దేవెగౌడకు చెందిన జనతాదళ్(సెక్యూలర్) పార్టీకి రూ.1 కోటి విరాళం ఇచ్చినట్లు తెలిసింది. రాజకీయ పార్టీలకు కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఎస్బీఐ ఇటీవల వివరాలు వెల్లడించింది. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులుండవు.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం కంపెనీల వారీగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వివరాలు.. ఫ్యుచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ రూ.1,368 కోట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ.966 కోట్లు క్విక్ సప్లైచెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.410 కోట్లు వేదాంత లిమిటెడ్ రూ.400 కోట్లు హల్దియా ఎనర్జీ రూ.377 కోట్లు భారతి గ్రూప్ రూ.247 కోట్లు ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.224 కోట్లు వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్సిమిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ రూ.195 కోట్లు మదన్‌లాల్ లిమిటెడ్ రూ.185 కోట్లు -
సూధామూర్తి ఆస్తి విలువ ఎంతో తెలుసా..
ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఎంపీగా నియమితులైన సుధామూర్తికి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో 0.83% వాటాకు సమానమైన 3.45 కోట్ల షేర్లు ఉన్నాయి. ప్రస్తుత షేరు ధర రూ.1,616.95 ప్రకారం, సుధామూర్తి షేర్ల విలువ రూ.5,600 కోట్ల వరకు ఉండొచ్చు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్‌లో 1.66 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారుగా రూ.2,691 కోట్లు. 2006లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న సుధామూర్తికి.. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ పురస్కారమూ లభించింది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ భార్య అక్షతామూర్తి ఈమె కుమార్తె. ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం ‘సుధామూర్తిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. సామాజిక కార్యకలాపాలు, దాతృత్వం, విద్య.. ఇలా పలు విభాగాల్లో ఆమె అందించిన సేవలు అమోఘం. రాజ్యసభ సభ్యురాలిగా దేశ భవిష్యత్తును మార్చడంలో నారీశక్తికి నిదర్శనంగా ఆమె తన వంతు పాత్ర పోషిస్తారని కోరుకుంటున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్లో తెలిపారు. -
దిగ్గజ టెక్ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా.. ఎందుకంటే..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్‌రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అందుకు సంబంధించి బీఎస్ఈకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ పంపారు. నీలంజన్‌రాయ్ 2018 నుంచి తన పదవిలో కొనసాగారు. ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే నిబంధనల ప్రకారం రాయ్ మార్చి 31, 2024 వరకు ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఎగా కొనసాగుతారు. ‘ఇన్ఫోసిస్‌లో కాకుండా బయట వృద్ధి చెందేందుకు అవకాశాలను అన్వేషించడానికి, వ్యక్తిగత కారణాల వల్ల కంపెనీకి రాజీనామా చేశాను. నోటీసు పీరియడ్ వరకు ఈ సంస్థలో విధులు నిర్వర్తిస్తాను. నా పదవీకాలంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇన్ఫోసిస్ మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’అని రాయ్ తన రాజీనామా లేఖలో రాశారు. రాయ్ అనంతరం జయేష్ సంఘ్రాజ్కా సీఎఫ్ఓ బాధ్యతలు చేపడుతారని కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త సీఎఫ్ఓగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పింది. జయేష్ ఇన్ఫోసిస్‌లో 18 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఆస్తులు అమ్మనున్న టాప్ ఐటీ కంపెనీ..! ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ..డిప్యూటీ సీఎఫ్ఓగా పనిచేస్తున్న జయేష్ సీఎఫ్ఓగా బాధ్యతలు చేపడుతారు. కంపెనీ ఫైనాన్స్ విభాగంలో చాలా ఏళ్లుగా ఆయన పనిచేస్తున్నారు. కంపెనీని మరింత అభివృద్ధి చెందించడానికి ఆయన అనుభవం ఎంతో అవసరం అవుతుందని అన్నారు. నీలాంజన్ భవిష్యత్తు ప్రయత్నాలు ఫలించాలని ఆశిస్తున్నట్లు సలీల్ చెప్పారు. -
‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. వారంలో 72 గంటలు పనిచేయాలని ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో కొందరు ప్రముఖులు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరు టెక్ సమ్మిట్‌లో నారాయణమూర్తి మాట్లాడారు. ప్రస్తుతం చైనా జీడీపీ 19 ట్రిలియన్లుగా ఉందని, చైనా మోడల్‌ను అధ్యయనం చేసి అక్కడ అవలంబిస్తున్న పద్ధతులను దేశంలో అనుసరించాలని సూచించారు. దాంతోపాటు ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. అయితే అందుకు బదులుగా సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలని ఆయన కోరారు. ఆయన ఉచితాలకు వ్యతిరేకం కాదని పరిస్థితులను అర్థం చేసుకోగలనని అన్నారు. తాను పేద కుటుంబానికి చెందినవాడినని, ఉచిత రాయితీలను పొందిన వారు సమాజానికి తమ బాధ్యతగా కొంత తిరిగి ఇవ్వాలన్నారు. ఉదాహరణకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తే అందుకు బదులుగా పిల్లలను బడికి పంపించి బాగా చదివేలా చూడాలన్నారు. ఏదీ ఉచితంగా ఉండకూడదని, ఏదో రూపకంగా సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు. ఇదీ చదవండి: రూ.12 వేల కోట్ల వ్యాపారాధిపతి.. రూ.200 కోసం బేకరీలో పని..! చైనా జీడీపీ 19 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. భారత్ జీడీపీ మాత్రం 3.4-4 ట్రిలియన్‌లోనే ఉందని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు చైనాలోనూ ఉన్నాయి. కానీ భారత్ కంటే 5-6 రెట్లు జీడీపీ అధికంగా ఉందన్నారు. చైనా మోడల్‌ను అధ్యయనం చేసి, ఉత్పత్తి పెంచి సమాజానికి లబ్ధి చేకూరే విషయాలు ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. -
‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2023’ విజేతలు వీరే..
శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను ఏటా ఇన్ఫోసిస్ ప్రైజ్‌ను అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పరిశోధకులు, శాస్త్రవేత్తలతో ఏర్పాటైన జ్యూరీ ఈ విజేతలను ఎంపిక చేస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ బహుమతులను సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ప్రదానం చేశారు. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో ఈ ప్రైజ్‌ను ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ సచ్చిదా నంద్ త్రిపాఠి అందుకున్నారు. ఈయన సస్టైనబుల్ ఎనర్జీ ఇంజినీరింగ్‌లో చేసిన పరిశోధనలకుగాను ఈ బహుమతి ప్రదానం చేశారు. భారీ స్థాయి సెన్సార్లు ఉపయోగించిన గాలిలోని కాలుష్యాన్ని గుర్తించేలా త్రిపాఠి పరిశోధనలు చేశారు. ఏఐ సహాయంతో ఆ డేటాను విశ్లేషించవచ్చు. దిల్లీలో నానో పార్టికల్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల వల్ల తెలిసింది. హ్యుమానిటీస్‌లో బెంగుళూరు సైన్స్ గ్యాలరీ వ్యవస్థాపక డైరెక్టర్ జాహ్నవి ఫాల్కీకి ఈ బహుమతి లభించింది. ఆమె అనేక వైజ్ఞానిక పరిశోధనలు చేసి ది అటామిక్ స్టేట్ అనే పుస్తకం రాశారు. న్యూక్లియర్ సైన్స్, ఆంథ్రపాలజీకు సంబంధించిన ఎన్నో కథనాలు ప్రచురించారు. ఇదీచదవండి: రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి: ఇన్ఫోసిస్ మూర్తి లైఫ్ సైన్సెస్‌లో ఐఐటీ కాన్పూర్‌లో బయోలాజికల్ సైన్సెస్, బయో ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అరుణ్ కుమార్ శుక్లా ఈ ప్రైజ్ గెలుచుకున్నారు. జీ-ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్ (జీసీసీఆర్)లో ఈ విశేష కృషి చేశారు. మ్యాథమెటిక్ సైన్సెస్‌లో జియోమెట్రీలో పరిశోధనలు చేసినందుకు ప్రొఫెసర్ భార్గవ్ భట్ ఈ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఫిజికల్ సైన్సెస్‌లో కణ జీవశాస్త్రంలో చేసిన కృషికిగాను నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ముకుంద్ తట్టాయ్కు ఈ బహుమతి గెలుపొందారు. సోషల్ సైన్సెస్‌లో కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న కరుణా మంతెనా ఈ ప్రైజ్ గెలుచుకున్నారు. -
రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి.. ఎందుకంటే.. : ఇన్ఫోసిస్ మూర్తి
భారత యువత వారానికి 78 గంటలు పనిచేయాలనే వ్యాఖ్యలు చేసి ఇటీవల ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వార్తాల్లో నిలిచారు. దీనిపై పలువులు ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులకు ఏటా రూ.లక్ష అమెరికా డాలర్లు(రూ.83లక్షలు) చెల్లించాలని మూర్తి అన్నారు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘దేశంలోని ఉపాధ్యాయులు, పరిశోధకులను గౌరవించాలి. వారికి మెరుగైన జీతాలు చెల్లించాలి. అన్ని సౌకర్యాలు అందించాలి. ఐటీ ఎక్స్పర్ట్, ఉపాధ్యాయులు, పరిశోధకుల సహాయంతో దేశం వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రతిదేశం పురోగతికి నాలుగు దశలుంటాయి. మొదటి దశలో దేశంలోని పౌరులు ఎలాంటి ఆవిష్కరణలు చేయరు. కొత్తగా ఏమీ ఆలోచించరు. రెండో దశలో, ఇతర దేశాల ఆవిష్కరణల సహాయంతో ఉత్పత్తులు, సేవలను ప్రారంభిస్తారు. మూడో దశలో, ఒక దేశం ఇతర అభివృద్ధి చెందిన దేశాలవలె ఉన్నత విద్య, పరిశోధనలతో మెరుగైన నాణ్యత, ఉత్పాదకత కోసం ఖర్చు చేస్తారు. దాని ఫలితాలు పొందుతారు. ఇక నాలుగో దశలో ఏ దేశంపై ఆధారపడకుండా స్వతంత్రంగా తమ అవసరాలకు తగ్గట్టు ఆవిష్కరణలు చేస్తారు. ఇతర దేశాల అవసరాలు సైతం తీరుస్తారు. దాంతో దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకోసం విద్య, పరిశోధనలు ఎంతో అవసరం. దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కాలుష్య నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, స్వచ్ఛమైన నీటిని అందించడంలో మొదటి దశలోనే ఉన్నాయి. పేదప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రతి మారుమూల ప్రాంతం నాలుగో దశకు చేరాలని కోరుకుంటున్నాను’అని ఆయన తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను జాతీయ విద్యా విధానంలో భాగం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని మూర్తి అభిప్రాయపడ్డారు. ‘దేశంలో, ప్రపంచవ్యాప్తంగా STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్)రంగంలో నిష్ణాతులైన 10వేల మంది విశ్రాంత ఉపాధ్యాయులను నియమించాలి. వారితో సుమారు 2500 "ట్రైన్ ది టీచర్" కాలేజీలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలి. అందుకోసం వారికి ఏటా లక్ష అమెరికా డాలర్లు(రూ.83లక్షలు) చెల్లించాలి. ఏటా వీరికి రూ.8300కోట్లు, ఇరవై సంవత్సరాలకు రూ.1.66లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. త్వరలో దేశం రూ.415లక్షల కోట్ల జీడీపీ లక్ష్యంగా ఎదుగుతుంది. ఉపాధ్యాయులకు చెల్లించేది దేశానికి పెద్ద ఆర్థిక భారం కావపోవచ్చు’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: చిన్నతనంలో అక్కడే మేం విడిపోయాం: ఆనంద్ మహీంద్రా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ఇండియా 2020 విధానాన్ని 29 జులై 2020న ప్రవేశపెట్టారు. 2030 వరకు దేశం సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. -
వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
వర్క్ ఫ్రం హోమ్ విషయంలో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకూ ఇంట్లోంచే విధులు నిర్వర్తిస్తున్న వారు ఇకపై నెలకు కనీసం పది రోజులపాటు ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎంట్రీ లెవెల్ నుంచి మధ్య స్థాయి ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఇప్పటికే ఈమెయిళ్ల ద్వారా ఉద్యోగులకు తెలియజేసినట్లు తెలిపింది. ‘‘బ్యాండ్ 5, 6 స్థాయుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల (మిడ్-లెవల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ హెడ్లు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు)కు నెలలో 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాలని మెయిల్ పంపారు. కరోనా అనంతరం చాలా కంపెనీలు ఆఫీస్ నుంచి పని చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రిమోట్ వర్క్‌తోపాటు హైబ్రిడ్‌వర్క్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది’ అని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవల కంపెనీ క్యూ2 ఫలితాల సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థలో అందరూ కలిసి ఒకచోట పనిచేయాలని భావిస్తున్నట్లు సలీల్ పరేఖ్ చెప్పారు. సాధారణంగా సౌకర్యవంతమైన విధానానికి తాము మద్దతిస్తామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు కొన్ని రోజులు కార్యాలయంలో పనిచేయడంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్ను పెంపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇటీవల వర్క్ ఫ్రం ఆఫీస్‌కే మొగ్గు చూపింది. దీనివల్ల సంస్థ అసోసియేట్లు, కస్టమర్ల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందని టీసీఎస్ భావిస్తోంది. సంస్థ ఉత్పత్తులను కస్టమర్లకు డెలివరీ చేయాలన్నా, వర్క్ అవుట్‌పుట్ మెరుగుపడాలన్నా వర్క్‌ఫ్రం ఆఫీస్ ద్వారానే సాధ్యం అని చెప్పింది. ఆఫీస్ సంస్కృతి, సహోద్యోగులతో ఎలా వ్యవహరించాలో తెలుస్తుందని, అందుకు సంబంధించి కంపెనీ మెంటార్‌గా వ్యవహరిస్తుందని టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ వివరించారు. -
ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, కాగ్నిజెంట్ భాగస్వామ్యం
ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా జనరేటివ్ ఏఐ సేవలందించేలా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కాగ్నిజెంట్ సీఈవోగా రవికుమార్ నియమితులైన తర్వాత పోటీ కంపెనీలకు చెందిన ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో కాగ్నిజెంట్ వ్యాపారాన్ని, కస్టమర్ల సంఖ్యను వేగంగా పెంచటమే లక్ష్యంగా రవి కుమార్ పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ సిక్కాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ సీఈవో పదవి నుంచి వైదొలిగిన తర్వాత విశాల్ సిక్కా వియానై సిస్టమ్స్‌ను స్థాపించారు. ఇప్పుడు కాగ్నిజెంట్, వియానై సిస్టమ్స్ వినియోగదారులకు నేరుగా జనరేటివ్ ఏఐ సేవలను అందించేందుకు జతకట్టాయి. వియానై సిస్టమ్స్ కు సంబంధించిన హిలా ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫారమ్, కాగ్నిజెంట్ న్యూరో ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు ఏఐ సాంకేతికత ద్వారా వినియోగదారులకు సేవలను అందించనున్నాయి. -
Stock Market: రూ.435కోట్ల విలువైన ఇన్ఫోసిస్ షేర్ల విక్రయం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్, కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కంపెనీలో రూ.435 కోట్ల విలువైన తమ వాటాలను విక్రయించారు. అక్టోబర్ 19న ఓపెన్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లను అమ్మినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు. ఎస్డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్ వద్ద ఉన్న 2,37,04,350 ఇన్ఫోసిస్ షేర్లలో 23,70,435 షేర్లను ఒక్కో షేరుకు రూ.1,433.51 చొప్పున విక్రయించారు. దాని విలువ రూ.339.80 కోట్లు. దాంతో ప్రస్తుతం తన వద్ద 2,13,33,915 ఇన్ఫీ షేర్లు ఉన్నాయి. ఎస్డీ శిబులాల్ కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కలిగిఉన్న 66,79,240 షేర్లలో 6,67,924 షేర్లను రూ.1,432.96 చొప్పున అమ్మారు. దాని విలువ మొత్తం రూ.95.71 కోట్లు. ఇద్దరు విక్రయించిన షేర్ల విలువ దాదాపు రూ.435 కోట్లుగా ఉంది. అయితే ఈ షేర్లను ఎవరు కొనుగోలు చేశారో తెలియరాలేదు. ఎస్డి శిబులాల్ స్వయంగా 58,14,733 షేర్లను కలిగి ఉన్నారు. ఆయన భార్య కుమారి షిబులాల్ వద్ద 52,48,965 షేర్లు, కుమార్తె శృతి శిబులాల్ వద్ద 27,37,538 షేర్లు ఉన్నాయి. -
ఇన్ఫోసిస్ సుధామూర్తి పేరుతో వసూళ్లు.. పూజారి అరెస్ట్!
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్.నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పేరుతో డబ్బు వసూళ్లు చేస్తున్న బెంగళూరుకు చెందిన అరుణ్‌కుమార్(34) అనే పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి బెంగళూరు సమీపంలోని మల్లేశ్వరంలో అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు జయానగర్ పోలీసులు తెలిపారు. అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలోని కన్నడ కూట నుంచి అరుణ్‌కుమార్ రూ.5 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నిర్వహించబోయే కన్నడ కూటాలో సుధామూర్తిని ముఖ్య అతిథిగా తీసుకొస్తానని చెప్పి వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. అయితే సదరు సంస్థ నుంచి ఏప్రిల్‌లో వచ్చిన ఆహ్వానాన్ని సుధామూర్తి తిరస్కరించారు. అయిన్పటికీ ఆమె సమావేశానికి హాజరవుతున్నట్లు ఓ మహిళ ఫొటోలు, వీడియోలను వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాలోని మిల్పిటాస్లో సెప్టెంబరు 26న సేవా ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ సోషల్ మీడియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ డాక్టర్ సుధామూర్తి’ ఈవెంట్‌ను తప్పడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందుకు మరో మహిళ కారణమని తెలిపారు. ఆ ఈవెంట్‌కు టిక్కెట్ ధర రూ.3,330 నిర్ణయించినట్లు చెప్పారు. -
Infy New Campus: సీఎం జగన్ తోడ్పాటు హర్షణీయం: ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్
ఆంధ్రప్రదేశ్‌లో సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్న సీఎం జగన్ చేస్తున్న కృషి హర్షణీయం అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్ రాయ్ అన్నారు. సీఎం జగన్ వైజాగ్‌లోని రుషికొండలో సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలంజన్ రాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విశాఖపట్నం ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు అందిస్తున్న మద్దతుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డిజిటల్ వంటి సాంకేతికతలపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. సంస్థ భవనాన్ని 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1,000 మంది ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ కోసం అన్ని వసతులు కల్పించేలా దీన్ని రూపొందించామన్నారు. -
Q2 Results: ఆదాయవృద్ధి మార్గదర్శకత్వాన్ని తగ్గించనున్న ఇన్ఫోసిస్
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సుమారు రూ.7కోట్లు రెవెన్యూ వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. ఇక కంపెనీ కార్యకలాపాల వల్ల వచ్చిన ఆదాయం రూ.36,538 కోట్ల నుంచి రూ.38,994 కోట్లకు పెరుగుతందని సమాచారం. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాల్లో ఇన్ఫోసిస్ కోత పెట్టనుంది. 2023-24 సంవత్సరానికి గానూ ఆదాయ వృద్ధి 1 - 3.5 నుంచి 1-2.5 శాతంగా ఉండనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో కంపెనీ ఆదాయ అంచనాలను 4-7 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ వద్ద 7.7 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈఓ సలీల్‌పరేఖ్ చెప్పారు. జూన్ త్రైమాసికంలో 17.3 శాతంగా ఉన్న వలసల రేటు 14.6 శాతానికి తగ్గుతుందని తెలుస్తుంది. ఇన్ఫోసిస్ షేర్ ధర గురువారం త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందే 2.8శాతం పడిపోయింది. -
వీసా ట్రెండ్ మార్చేస్తున్న టెక్ దిగ్గజాలు
దేశీయ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ దిగ్గజాలు తమ వ్యూహాలను మార్చేస్తున్నాయి. వైట్ హౌస్ తీసుకురాబోతున్న కఠినతరమైన నిబంధనలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికాలో కొత్త పాలసీలు అమలయ్యే లోపలే తమ యూఎస్ వర్క్ వీసాల్లో మార్పులు తీసుకురావాలని కంపెనీలు నిర్ణయించాయి. తక్కువ అనుభవమున్న ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలు దరఖాస్తు చేయకూడదని తాము నిర్ణయించినట్టు ఐటీ సర్వీసు కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్రిష్ణ కుమార్ నటరాజన్ పేర్కొన్నారు. మొత్తంగా కూడా వీసా దరఖాస్తులను తగ్గించుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. మొత్తంగా ఐటీ ఇంటస్ట్రీలోనూ ఇదే ధోరణిలో కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్ నాలుగేళ్ల కంటే తక్కువ అనుభమున్న ఉద్యోగులకు వీసాలు దరఖాస్తు చేయకూడదని నిర్ణయించిందని పలు రిపోర్టులు వచ్చాయి. ఇదే బాటలో మిగతా కంపెనీలు కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. దేశీయ ఐటీ ఇండస్ట్రికి అమెరికా ఎంతో కీలకమైన మార్కెట్. హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక ఉద్యోగులను ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నామని నటరాజన్ చెప్పారు. ఐటీ కంపెనీలు గతేడాది ఇండియాలో లక్షమందికి జాబ్ ఆఫర్స్ ఇస్తే, ఈ ఏడాది కేవలం 60వేల మందినే తీసుకున్నాయి. ఇక్కడ క్యాంపస్ రిక్రూట్ తగ్గించి, అమెరికాలో లోకల్ టాలెంట్ ను నియమించుకుంటున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోలు కూడా అమెరికాలోనే ఉద్యోగాల నియామకాలను పెంచినట్టు తెలిసింది. ఈ కంపెనీలు గతేడాది వరకు ఇండియన్ గ్రాడ్యుయేట్లనే ఎక్కువగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు తీసుకునేవి. ఈ ఏడాది ఈ ట్రెండ్ ను మార్చేశాయి.