Stock Market: రూ.435కోట్ల విలువైన ఇన్ఫోసిస్ షేర్ల విక్రయం | Sale Of Infosys Shares Worth Rs 435 Crore | Sakshi
Sakshi News home page

Stock Market: రూ.435కోట్ల విలువైన ఇన్ఫోసిస్ షేర్ల విక్రయం

Published Fri, Oct 20 2023 5:15 PM | Last Updated on Fri, Oct 20 2023 6:36 PM

Sale Of Infosys Shares Worth Rs 435 Crore - Sakshi

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్‌డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్, కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కంపెనీలో రూ.435 కోట్ల విలువైన తమ వాటాలను విక్రయించారు. అక్టోబర్ 19న ఓపెన్ మార్కెట్‌లో ఇన్ఫోసిస్‌ షేర్లను అమ్మినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు.  

ఎస్‌డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్ వద్ద ఉన్న 2,37,04,350 ఇన్ఫోసిస్‌ షేర్లలో 23,70,435 షేర్లను ఒక్కో షేరుకు రూ.1,433.51 చొప్పున విక్రయించారు. దాని విలువ రూ.339.80 కోట్లు. దాంతో ప్రస్తుతం తన వద్ద 2,13,33,915 ఇన్ఫీ షేర్లు ఉన్నాయి. ఎస్‌డీ శిబులాల్ కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కలిగిఉన్న 66,79,240 షేర్లలో 6,67,924 షేర్లను రూ.1,432.96 చొప్పున అమ్మారు. దాని విలువ మొత్తం రూ.95.71 కోట్లు. ఇద్దరు విక్రయించిన షేర్ల విలువ దాదాపు రూ.435 కోట్లుగా ఉంది. అయితే ఈ షేర్లను ఎవరు కొనుగోలు చేశారో తెలియరాలేదు.

ఎస్‌డి శిబులాల్ స్వయంగా 58,14,733 షేర్లను కలిగి ఉన్నారు. ఆయన భార్య కుమారి షిబులాల్ వద్ద 52,48,965 షేర్లు, కుమార్తె శృతి శిబులాల్  వద్ద 27,37,538 షేర్లు ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement