Infy crisis
-
Stock Market: రూ.435కోట్ల విలువైన ఇన్ఫోసిస్ షేర్ల విక్రయం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్, కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కంపెనీలో రూ.435 కోట్ల విలువైన తమ వాటాలను విక్రయించారు. అక్టోబర్ 19న ఓపెన్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లను అమ్మినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు. ఎస్డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్ వద్ద ఉన్న 2,37,04,350 ఇన్ఫోసిస్ షేర్లలో 23,70,435 షేర్లను ఒక్కో షేరుకు రూ.1,433.51 చొప్పున విక్రయించారు. దాని విలువ రూ.339.80 కోట్లు. దాంతో ప్రస్తుతం తన వద్ద 2,13,33,915 ఇన్ఫీ షేర్లు ఉన్నాయి. ఎస్డీ శిబులాల్ కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కలిగిఉన్న 66,79,240 షేర్లలో 6,67,924 షేర్లను రూ.1,432.96 చొప్పున అమ్మారు. దాని విలువ మొత్తం రూ.95.71 కోట్లు. ఇద్దరు విక్రయించిన షేర్ల విలువ దాదాపు రూ.435 కోట్లుగా ఉంది. అయితే ఈ షేర్లను ఎవరు కొనుగోలు చేశారో తెలియరాలేదు. ఎస్డి శిబులాల్ స్వయంగా 58,14,733 షేర్లను కలిగి ఉన్నారు. ఆయన భార్య కుమారి షిబులాల్ వద్ద 52,48,965 షేర్లు, కుమార్తె శృతి శిబులాల్ వద్ద 27,37,538 షేర్లు ఉన్నాయి. -
ఇన్ఫీ సంక్షోభం : మళ్లీ బాంబు పేల్చిన మూర్తి
బెంగళూరు : ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్మన్ నారాయణమూర్తి మళ్లీ బాంబు పేల్చారు. ఇన్ఫోసిస్‌లో నెలకొన్న సంక్షోభానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేందుకు బోర్డుతో మూర్తి సంధికి వచ్చినట్టు వస్తున్న రిపోర్టులను ఆయన ఖండించారు. తను లేవనెత్తిన ఆందోళనలపై వెనక్కి తగ్గేది లేదని మూర్తి ఉద్ఘాటించారు. ఇన్ఫోసిస్ సంక్షోభానికి ఫుల్ స్టాప్ చెబుదామనుకున్న మూర్తి, బోర్డుతో సంధికి వచ్చారని పలు రిపోర్టులు వచ్చాయి. బోర్డు సభ్యులు కంపెనీ సమస్యలను, ఆందోళలను సరియైన రీతిలో పరిష్కరించాల్సిందేనని, వారు మంచి పారదర్శకతను అందించాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ చెప్పారు. వారందరూ ఎంతో సమగ్రత కలిగి మంచి ఉద్దేశ్యమున్న సభ్యులు, కానీ మంచి వ్యక్తులు కూడా ఏదో ఒక సందర్భంలో తప్పుచేస్తారని పేర్కొన్నారు. ఇలాంటి వాటిలో ఇదీ ఒకటి. మంచి నాయకత్వమంటే షేర్ హోల్డర్స్ ఆందోళనలన్నింటిన్నీ విని, సరియైన నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. దీనిపై బోర్డు సభ్యులు త్వరలో నిర్ణయం తీసుకుని కార్పొరేట్ పాలన మెరుగుపరిచి కంపెనీ భవిష్యత్ మంచిగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు. కానీ తాను లేవనెత్తిన ఆందోళనలపై మాత్రం సరియైన నిర్ణయం తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. (చదవండి: ఇన్ఫీలో లుకలుకలకు ఫుల్ స్టాప్?)