SD Shibulal
-
Stock Market: రూ.435కోట్ల విలువైన ఇన్ఫోసిస్ షేర్ల విక్రయం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్, కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కంపెనీలో రూ.435 కోట్ల విలువైన తమ వాటాలను విక్రయించారు. అక్టోబర్ 19న ఓపెన్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లను అమ్మినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు. ఎస్డీ శిబులాల్ కుమారుడు శ్రేయాస్ శిబులాల్ వద్ద ఉన్న 2,37,04,350 ఇన్ఫోసిస్ షేర్లలో 23,70,435 షేర్లను ఒక్కో షేరుకు రూ.1,433.51 చొప్పున విక్రయించారు. దాని విలువ రూ.339.80 కోట్లు. దాంతో ప్రస్తుతం తన వద్ద 2,13,33,915 ఇన్ఫీ షేర్లు ఉన్నాయి. ఎస్డీ శిబులాల్ కోడలు భైరవి మధుసూధన్ శిబులాల్ కలిగిఉన్న 66,79,240 షేర్లలో 6,67,924 షేర్లను రూ.1,432.96 చొప్పున అమ్మారు. దాని విలువ మొత్తం రూ.95.71 కోట్లు. ఇద్దరు విక్రయించిన షేర్ల విలువ దాదాపు రూ.435 కోట్లుగా ఉంది. అయితే ఈ షేర్లను ఎవరు కొనుగోలు చేశారో తెలియరాలేదు. ఎస్డి శిబులాల్ స్వయంగా 58,14,733 షేర్లను కలిగి ఉన్నారు. ఆయన భార్య కుమారి షిబులాల్ వద్ద 52,48,965 షేర్లు, కుమార్తె శృతి శిబులాల్ వద్ద 27,37,538 షేర్లు ఉన్నాయి. -
ఇన్ఫీ షేర్లను భారీగా విక్రయించిన కో-ఫౌండర్
సాక్షి,ముంబై : ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్డీ షిబులాల్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ ఎత్తున ఇన్ఫోసిస్ షేర్లను విక్రయించారు. జూలై 22-24 తేదీలలో కంపెనీకి చెందిన 85 లక్షల షేర్లను విక్రయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ అమ్మకానికి సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్యవర్తిత్వం వహించగా, వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని దాతృత్వం, పెట్టుబడి కార్యకలాపాలకు వినియోగించనున్నామని షిబులాల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. షిబులాల్ కుమారుడు శ్రేయాస్ 40 లక్షల షేర్లను విక్రయించారు. ఈ అమ్మకం ద్వారా ఇన్ఫోసిస్ లిమిటెడ్‌లో అతని వాటా 0.56 శాతం నుంచి 0.09 శాతానికి చేరింది. షిబూలా అల్లుడు గౌరవ్ మంచంద 18 లక్షల షేర్లను (0.04 శాతం) విక్రయించగా, మనవడు మిలన్ షిబులాల్ మంచంద 15 లక్షల షేర్లు (0.03 శాతం) విక్రయించారు. గౌరవ్ వాటా ఇప్పుడు 0.32 శాతంగా ఉండగా, మిలన్ వాటా 0.33 శాతంగా ఉంది. మరోవైపు షిబూలాల్ భార్య కుమారి ఇన్ఫోసిస్ 12 లక్షల షేర్లను (0.03 శాతం) విక్రయించడంతో ఆమె వాటా ఇప్పుడు 0.22 శాతంగా ఉంది. ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ తో కలిసి స్థాపించిన ఆక్సిలర్ వెంచర్స్ ద్వారా టెక్నాలజీ స్టార్టప్ లలో షిబులాల్ పెట్టుబడులు పెట్టారు. అలాగే సరోజిని దామోదరన్, అద్వైత్ ఫౌండేషన్ ద్వారా విద్య, సాంఘిక సంక్షేమం లాంటి వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కాగా 1981లో 250 అమెరికా డాలర్లతో ఎస్డి షిబులాల్‌తో పాటు ఎన్ఆర్ నారాయణ మూర్తి, నందన్ నీలేకని, క్రిస్ గోపాల క్రిష్ణన్, కే దినేష్, ఎన్ఎస్ రాఘవన్ కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించారు. షిబులాల్ 2011- 2014 వరకు ఇన్ఫోసిస్ సీఎండీగా పనిచేశారు. అంతకుముందు 2007-2011 వరకు సంస్థ సీఓఓగా ఉన్నారు. -
ఇన్ఫీ ప్రమోటర్లకు జాక్‌పాట్!
వాటాల అమ్మకంతో రూ.6,500 కోట్లు... ⇒3.26 కోట్ల షేర్లను విక్రయించిన నలుగురు సహ వ్యవస్థాపకులు... ⇒జాబితాలో నారాయణ మూర్తి, శిబులాల్, నీలేకని, దినేశ్ ⇒ఇంకా కంపెనీలో 5.2% మేర వాటా.. ⇒దీని విలువ దాదాపు 18,000 కోట్లు.. ⇒5% పైగా పడిపోయిన షేరు విలువ.. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు అదిరిపోయే లాభాలను సొంతం చేసుకున్నారు. కంపెనీని స్థాపించిన దాదాపు 35 ఏళ్ల తర్వాత భారీస్థాయిలో వాటాలను విక్రయించడం ద్వారా నలుగురు ప్రమోటర్లు, వాళ్ల కుటుంబ సభ్యులు ఏకంగా రూ.6,500 కోట్ల మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. సహ వ్యవస్థాపకులైన ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఎస్డీ శిబులాల్, నందన్ నీలేకని, కె.దినేశ్‌లు సోమవారం ఈ భారీ డీల్‌తో స్టాక్ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచారు. కంపెనీ సీఈఓగా తొలిసారి బయటివ్యక్తి విశాల్ సిక్కా పగ్గాలు చేపట్టడం.. బోనస్ షేర్ల జారీ నేపథ్యంలో వాటాలను విక్రయించడం గమనార్హం. ఇంత భారీ అమ్మకం కారణంగా ఇన్ఫీ షేరు ధర 5% పైగా పతనమైంది. బెంగళూరు: ఇన్ఫోసిస్... దేశీ స్టాక్ మార్కెట్లో సోమవారం ఒక కుదుపు కుదిపింది. కంపెనీ సహ వ్యవస్థాపకులైన ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఎస్డీ శిబులాల్, నందన్ నీలేకని, కె. దినేశ్.. వాళ్ల కుటుంబ సభ్యులు తమ వాటాల్లో కొంత భాగాన్ని బల్క్ డీల్ ద్వారా విక్రయించారు. 3.26 కోట్ల షేర్లను అమ్మడం ద్వారా దాదాపు రూ.6,500 కోట్ల మొత్తం లభించింది. ఒక్కో షేరును రూ.1,988 చొప్పున విక్రయించినట్లు సమాచారం. బీఎస్ఈలో శుక్రవారం నాటి ముగింపు ధర రూ.2,069తో పోలిస్తే ఇది 4 శాతం మేర తక్కువ కావడం గమనార్హం. ఈ భారీ డీల్‌ను విదేశీ బ్రోకరేజి దిగ్గజం డాయిష్ బ్యాంక్ పూర్తి చేసింది. ఇంత భారీ స్థాయిలో షేర్లు చేతులుమారడంతో కంపెనీ షేరు ధర భారీగా పడింది. ఒకానొకదశలో 5 శాతం పైగా పడిపోయి రూ.1,958 స్థాయికి దిగజారింది. చివరకు 4.88 శాతం నష్టపోయి... రూ.1,968 వద్ద స్థిరపడింది. కాగా, కంపెనీ మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే సుమారు రూ.12,000 కోట్లు ఆవిరైంది. ఇంకా 5.2 శాతం వాటా.... ఈ నలుగురు ప్రమోటర్లు, వాళ్ల కుటుంబీకులకు ఇప్పటిదాకా కంపెనీ మొత్తం ఈక్విటీలో 12.4 కోట్ల షేర్లు(సుమారు 8 శాతం వాటా) ఉన్నాయి. తాజాగా విక్రయించిన 3.26 కోట్ల షేర్లు.. మొత్తం కంపెనీ ఈక్విటీలో సుమారు 2.8 శాతం వాటాకు సమానం. అంటే ఇంకా 5.2 శాతం వాటా ఈ నలుగురు సహ వ్యవస్థాపకులు(ప్రమోటర్లు), వాళ్ల కుటుంబీకులకు ఉన్నట్లు లెక్క. దీని విలువ సోమవారం షేరు ముగింపు ధరతో చూస్తే... సుమారు రూ.18,000 కోట్ల పైమాటే కావడం గమనార్హం. కాగా, 1981లో కంపెనీని స్థాపించిన ఏడుగురు సహ వ్యవస్థాపకుల(అశోక్ అరోరా, క్రిష్ గోపాలకృష్ణన్, ఎన్ఎస్ రాఘవన్‌లతో కలిపి) మొత్తం వాటా ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి దాదాపు 15.9%. దీనిలో ఇప్పుడు నలుగురు ప్రమోటర్ల వాటా అమ్మకాన్ని(2.8 శాతం) తీసేస్తే.. 13.1 శాతంగా లెక్కతేలుతోంది. ఇక ఈ సెప్టెంబర్ చివరికి విదేశీ ఇన్వెస్టర్లకు 42.67% వాటా, దేశీ సంస్థల(డీఐఐ)కు 14.68%, కార్పొరేట్లు.. రిటైల్ ఇన్వెస్టర్లు, ఇతరులకు 26.93% వాటాలు ఉన్నాయి. కొత్త సీఈఓ రాకతో... గడిచిన రెండేళ్లుగా ఐటీ రంగంలోని ఇతర పోటీ కంపెనీలతో పోలిస్తే ఇన్ఫోసిస్ అటు వ్యాపారపరంగా.. ఇటు స్టాక్ మార్కెట్లో షేరు విలువ పరంగా కూడా వెనుకబడిన సంగతి తెలిసిందే. దీంతో మాజీ చైర్మన్ ఎన్ఆర్ నారాయణ మూర్తి మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడం.. ఆయన కుమారుడు రోహన్ మూర్తిని తనకు సహాయకుడిగా నియమించుకోవడం జరిగాయి. అయితే, ఈ చర్యలపై ఇన్వెస్టర్లతో పాటు అటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సుమారు 14 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఇన్ఫోసిస్‌ను వదిలిపెట్టారు కూడా. ఈ నేపథ్యంలో సీఈఓ వేట ప్రారంభించిన కంపెనీ.. జర్మనీ ఐటీ దిగ్గజం శాప్(ఎస్ఏపీ)కి చెందిన మాజీ ఎగ్జిక్యూటివ్.. విశాల్ సిక్కాను సారథిగా నియమించింది. నారాయణమూర్తితో పాటు అప్పటి సీఈఓ శిబులాల్, క్రిస్ గోపాల కృష్ణన్ కూడా కంపెనీ పదవుల నుంచి వైదొలిగారు. కాగా, ఆగస్టులో సిక్కా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ఫీ షేరు ఇప్పటిదాకా 20 శాతం పైగానే దూసుకెళ్లింది. షేరు ధర ఆల్‌టైమ్ గరిష్టమైన రూ.4,400 స్థాయిని కూడా అందుకుంది. రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా అనూహ్యంగా ఒక్కో షేరుకి మరో షేరును బోనస్‌గా కంపెనీ ప్రకటించడం తెలిసిందే. ఇటీవలే ఈ బోనస్ ఇష్యూ అమల్లోకి రావడంతో షేరు విలువ సగమైంది. విశ్లేషకులు ఏమంటున్నారు... సహ వ్యవస్థాపకుల వాటా విక్రయం వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ‘కార్పొరేట్ నైతిక నియమావళి(గవర్నెన్స్) విషయంలో అత్యున్నత ప్రమాణాలను ఇన్ఫీ నెలకొల్పింది. ఇది ఇకపైనా కొనసాగనుంది. కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఈ ప్రమోటర్లు, వాళ్ల కుటుంబీకులెవరూ పాలుపంచుకోవడం లేదు. అందువల్ల భారీగా షేర్ల విక్రయం వల్ల స్టాక్ ధరపై తక్షణం కొంత ప్రభావం ఉన్నప్పటికీ.. కంపెనీ మూలాలు పటిష్టంగానే ఉన్నందున భవిష్యత్తుకు ఢోకా లేదు’ అని బ్రోకరేజి సంస్థ ప్రభుదాస్ లీలాధర్ అభిప్రాయపడింది. టీసీఎస్‌తో పోలిస్తే ఇన్ఫోసిస్ కాస్త వెనుకబడినప్పటికీ.. సిక్కా ఆగమనంతో మళ్లీ పునర్వైభవం దిశగా అడుగులేస్తోందని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ మాయురేష్ జోషీ అన్నారు. వ్యవస్థాపకుల వాటా విక్రయంవల్ల కంపెనీ ఫండమెంటల్స్‌పై ప్రభావమేమీ ఉండబోదని చెప్పారు. -
ఇన్ఫోసిస్ ఫలితాలు ఓకే..
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల బోణీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికం(2014-15, క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,886 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.2,374 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన లాభం 21.5 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ. 11,267 కోట్ల నుంచి రూ.12,770 కోట్లకు పెరిగింది. వార్షికంగా 13.3 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీలో ఇటీవలే భారీగా యాజమాన్యపరమైన మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో కంపెనీ సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్ చిట్టచివరి ఆర్థిక ఫలితాల ప్రకటన ఇది. త్రైమాసికంగా తగ్గింది...: గతేడాది ఆఖరి క్వార్టర్(క్యూ4)తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో(త్రైమాసిక ప్రాతిపదికన) ఇన్ఫీ లాభాలు 3.5 శాతం తగ్గాయి. క్యూ4లో రూ.2,992 కోట్ల లాభం నమోదైంది. కాగా, మొత్తం ఆదాయం కూడా 0.8 శాతం(క్యూ4లో రూ.12,875 కోట్లు) స్వల్పంగా తగ్గింది. అయితే, డాలరు రూపంలో ఏప్రిల్-జూన్ ఆదాయం 1.95 శాతం పెరిగి 2.133 బిలియన్ డాలర్లకు చేరింది. గెడైన్స్ యథాతథం...: ప్రస్తుత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లను గతంలో ప్రకటించిన మాదిరిగానే యథాతథంగా కొనసాగించింది. క్యూ4 ఫలితాల సందర్భంగా డాలరు రూపంలో ఆదాయ గెడైన్స్‌ను 7-9 శాతంగా కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఇదే గెడైన్స్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇక రూపాయి ప్రాతిపదికన గెడైన్స్ 5.6-7.6 శాతంగా ఉండొచ్చని వెల్లడించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 60 చొప్పున ప్రాతిపదికగా తీసుకున్నట్లు ఇన్ఫీ తెలిపింది. విశ్లేషకుల అంచనాలకు పైనే... బ్రోకరేజి కంపెనీలకు చెందిన విశ్లేషకులు క్యూ1లో ఇన్ఫీ ఆదాయం సగటున రూ.12,814 కోట్లు, నికర లాభం రూ.2,667 కోట్లుగా అంచనావేశారు. ఈ అంచనాల కంటే మెరుగ్గానే ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ1లో 5 మల్టీమిలియన్ డాలర్ కాంట్రాక్టులు ఇన్ఫోసిస్ దక్కించుకుంది. వీటి విలువ 70 కోట్ల డాలర్లు. ఇక ఈ కాలంలో మొత్తం 61 క్లయింట్లు కొత్తగా జతయ్యారు. ఇన్ఫీ నిర్వహణ మార్జిన్ క్రితం క్యూ1తో పోలిస్తే 23.5 శాతం నుంచి 25.1 శాతానికి మెరుగుపడింది. జూన్ చివరినాటికి కంపెనీ వద్దనున్న నగదు తత్సంబంధ నిల్వలు కాస్త తగ్గి రూ.29,748 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మార్చిచివరికి ఈ మొత్తం రూ.30,251 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్-జూన్ కాలంలో సబ్సిడరీలతో సహా కంపెనీలో కొత్తగా 11,506 మంది ఉద్యోగులు చేరారు. అయితే, కంపెనీని 10,627 మంది వీడటంతో నికరంగా 879 మందికి మాత్రమే జతైనట్లు లెక్క. దీంతో జూన్ చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,61,284కు చేరింది. ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతానికి ఎగబాకింది. క్రితం ఏడాది క్యూ1లో ఈ రేటు 16.9 శాతం కాగా, క్యూ4లో 18.7%. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 1 శాతం లాభపడి రూ. 3,326 వద్ద స్థిరపడింది. మార్పులు... చేర్పులు.. కొత్త సీఈఓ, ఎండీగా విశాల్ సిక్కా నియామకానికి ఆమోదం కోసం ఈ నెల 30న అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. క్యూ1లోనే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎస్. గోపాలకృష్ణన్‌లు పదవుల నుంచి వైదొలిగారు. అయితే, అక్టోబర్ 10 వరకూ వాళ్లు ఈ పదవుల్లో తాత్కాలికంగా కొనసాగనున్నారు. అక్టోబర్ 11 నుంచి గౌరవ చైర్మన్‌గా నారాయణ మూర్తి వ్యవహరిస్తారు. అదే రోజు నుంచి కేవీ కామత్ బోర్డు చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా, ఈ మార్పుల సందర్భంగానే ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డెరైక్టర్ యూబీ ప్రవీణ్ రావు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా పదోన్నతి పొందారు. మార్పును స్వాగతిస్తున్నా: శిబులాల్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్... తన ఆఖరి ఫలితాల ప్రకటనలో కొంత వేదాంత ధోరణితో మాట్లాడారు. శిబులాల్ స్థానంలో శాప్ మాజీ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కాకు వచ్చే నెల 1న బాధ్యతలను అప్పగించనున్న సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాల క్రితం తనతోపాటు మొత్తం ఏడుగురు కలసి ఏర్పాటు చేసిన ఇన్ఫీ ఇప్పుడు 8 బిలియన్ డాలర్ల ఆదాయార్జనగల కంపెనీగా ఎదిగింది. కాగా, ఇప్పటిదాకా కంపెనీ సీఈఓలుగా ఏడుగురు సహవ్యవస్థాపకులే కొనసాగారు. తొలిసారి సిక్కా రూపంలో బయటివ్యక్తి పగ్గాలు చేపట్టనుండటం విశేషం. ‘అత్యంత పటిష్టమైన మూలాలతో ఉన్న కంపెనీని విడిచివెళ్తున్నా. బలమైన యంత్రాంగాన్ని ఉపయోగించుకుని సిక్కా కంపెనీని మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన టీమ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మార్పులనేవి జీవితంలో ఒక భాగమేనని నేను భావిస్తా. అయితే, నా ప్రయాణం చాలా గొప్పగానే సాగింది. గడచిన మూడేళ్లుగా మేం ఎదుర్కొంటున్న అనేక కఠిన పరిస్థితుల నుంచి ఇప్పుడు బయటికొస్తున్నాం. ఇంటాబయటా ముఖ్యంగా సిబ్బంది వలసల నుంచి క్లయింట్లను అట్టిపెట్టుకోవడం ఇలా పలు సవాళ్లను మేం దీటుగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఈ సవాళ్లన్నీ తొలగినట్టే. ఇన్ఫీని వీడుతున్నందుకు నేనేమీ చింతించడం లేదు. జరిగిపోయిన విషయాలపై అతిగా అలోచించే వ్యక్తిని కూడా కాదు. కంపెనీ మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మా నుంచి ఒక్క క్లయింట్ కూడా జారిపోలేదు. యూరప్‌లో కీలకమైన లోడ్స్టోన్ను కొనుగోలు చేయడం మేం తీసుకున్న వ్యూహాత్మకమైన నిర్ణయం. అంతేకాదు.. 2012-13తో పోలిస్తే గతేడాది మా ఆదాయం రెట్టింపుస్థాయిలో పెరగడం కూడా గమనించాల్సిన విషయం. మా కంపెనీలో అట్రిషన్ రేటు పెరగడం కొంత ఆందోళనకరమైన అంశమే. అయితే, ఐటీ పరిశ్రమలో నిపుణులైన సిబ్బందికి డిమాండ్ అధికంగాఉందన్న పరిస్థితిని ఇది తెలియజేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 22,000 ఫ్రెషర్లకు కంపెనీ క్యాంపస్ ఆఫర్లు ఇచ్చింది. వ్యాపారపరిస్థితికి అనుగుణంగా వీళ్లను దశలవారీగా నియమించుకుంటాం’ అని శిబులాల్ ప్రస్తుత కంపెనీ పరిస్థితిని వివరించారు. -
ఉత్పాదకత, ఉన్నత ఆలోచనలు
వీటిపై దృష్టిపెట్టి సాహసోపేతంగావ్యవహరించండి * ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఉద్బోధ * ఇన్ఫీకి మరోసారి గుడ్‌బై బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నెగ్గుకురావాలంటే వ్యక్తిగత ఉత్పాదకతపైనా, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్‌పైనా మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సూచించారు. ప్రతి ఇన్ఫోసియన్ (ఇన్ఫోసిస్ ఉద్యోగి) గొప్పగా ఆలోచించాలని, సాహసోపేతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కంపెనీ సీఈవో పగ్గాలను విశాల్ సిక్కాకి అప్పగించిన నేపథ్యంలో నారాయణమూర్తి శనివారం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి మరోసారి వైదొలిగారు. 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా షేర్హోల్డర్లు, ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వీడ్కోలు ప్రసంగంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. గడచిన ఏడాది కాలంగా తాను చేపట్టిన చర్యలతో కంపెనీ వ్యయాలు, రిస్కులు తగ్గగలవని, అమ్మకాలు మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్లు వైదొలగడంపై.. ఇటీవలి కాలంలో సీనియర్ల వలసకు కారణాలపై స్పందిస్తూ.. కొందరు ఉన్నత లక్ష్యాల సాధన కోసం వెళ్లగా, మరికొందరు సమర్థమైన పనితీరు కనపర్చలేక వైదొలిగారని మూర్తి వ్యాఖ్యానించారు. ‘దాగి ఉన్న ఆణిముత్యాలను వెలికితీసి సంస్థను నిలబెట్టే అవకాశాన్ని వారికి కల్పించాలని, పనితీరు సరిగ్గా లేని వారిని.. వారు ఉండాల్సిన చోటుకి మార్చాలనే లక్ష్యంతో నేను ముందుకు సాగాను’ అని చెప్పారు. యోగ్యులైన వారిని లీడర్లుగా తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ పనితీరు కనపర్చే వారిని ప్రోత్సహించేందుకు త్వరలో ఫాస్ట్ ట్రాక్ కెరియర్ ప్రోగ్రామ్‌లు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మూర్తి తెలిపారు. రోహన్ మూర్తిపై.. ‘కొత్త ఆలోచనలు గలవారు, యథాతథ స్థితిని అంగీకరించని వారు, తెలివైనవారు నాకు సహాయంగా ఉండాలనుకున్నాను. అందుకే రోహన్‌ను వెంట తెచ్చుకున్నాను. టెక్నాలజీ ఊతంతో మార్కెట్లో ఇన్ఫోసిస్ విభిన్నంగా ఉండగలిగేలా.. చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టే బాధ్యతను అతనికి అప్పగించాను’ అంటూ కుమారుడు రోహన్ మూర్తిపై నారాయణ మూర్తి వివరణ ఇచ్చారు. మూర్తి సహాయకుడిగా రోహన్ మూర్తి పదవీ కాలం కూడా శనివారంతో ముగిసింది. అనుబంధ సంస్థకు ప్రొడక్టుల వ్యాపారం.. ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్, సొల్యూషన్స్ (పీపీఎస్) వ్యాపారాన్ని దాదాపు రూ. 480 కోట్లకు తమ అనుబంధ సంస్థ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కి బదలాయించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అయితే, ఇందులో బ్యాంకింగ్ సర్వీసుల సాఫ్ట్వేర్ పినాకిల్ ఉండదని సంస్థ పేర్కొంది. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఎడ్జ్వెర్వ్ను ఇన్ఫీ ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది. మూడేళ్లలో రెండోసారి వీడ్కోలు.. మూడు దశాబ్దాల క్రితం స్థాపించిన ఇన్ఫోసిస్ నుంచి మూర్తి 2011 ఆగస్టులో వైదొలిగిన సంగతి తెలిసిందే. 65 ఏళ్లు నిండటంతో కంపెనీ నిబంధనల ప్రకారం ఆయన తప్పుకున్నారు. అయితే, ఆ తర్వాత ఇన్ఫీ పనితీరు అంతంత మాత్రంగా మారుతుండటంతో కంపెనీ బోర్డు ఒత్తిడి మేరకు గతేడాది జూన్ 1న మూర్తి మరోసారి సంస్థ పగ్గాలు చేపట్టారు. సహకరించేందుకు తన కుమారుడు రోహన్ మూర్తిని కూడా ఆయన వెంట తెచ్చుకోవడం వివాదాస్పదమైంది. తాజాగా ప్రముఖ టెక్నోక్రాట్ విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈవోగా నియమితులైన నేపథ్యంలో కంపెనీ నుంచి వైదొలగాలని మూర్తి నిర్ణయించుకున్నారు. దీంతో మూడేళ్లలో రెండోసారి ఇన్ఫీకి గుడ్‌బై చెప్పినట్లయింది. వాస్తవానికి ఆయన 2013 జూన్ 1 నుంచి అయిదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగాల్సి ఉంది. ‘కొత్త మేనేజ్మెంట్కి బాధ్యతల బదలాయింపు సులభంగా జరిగేందుకు, టెక్నాలజీ రంగంలో ఇన్ఫోసిస్‌ను దిగ్గజంగా తీర్చిదిద్దే క్రమంలో సిక్కాకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో నేను ముందుగానే వైదొలుగుతున్నాను’ అని ఏజీఎంలో నారాయణ మూర్తి చెప్పారు. అక్టోబర్ 10 దాకా ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత నుంచి చైర్మన్ ఎమెరిటస్‌గా కొనసాగుతారు. -
ఇన్ఫోసిస్ లో ఏం జరుగుతోంది!
దేశ టెక్నాలజీ రంగంలో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ లిమిటెడ్ అగ్రస్థానమేనని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎన్నో ఐటీ కంపెనీలకు మార్గదర్శకంగా నిలిచిన ఇన్పోసిస్ కంపెనీ ఇటీవల కాలంలో కొన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ఫోసిస్ ను కొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. గతంలో ఎంతో ఘనకీర్తిని సంపాదించుకున్న ఇన్పోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి చైర్మన్ స్థానం నుంచి తప్పుకున్న తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవల కాలంలో సీనియర్లే కాక యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఇన్పోసిస్ ను భారీ సంఖ్యలో వదిలి వెళ్లినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 12 నెలల కాలంలో 12 మంది సీనియర్లు తమ పదవుల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమవుతోంది. జనవరి-మార్చి మధ్యకాలంలోనే 8996 మంది ఉద్యోగులు ఇన్పోసిస్ ను వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. వివిధ కారణాలతో గత 12 నెలల్లో దాదాపు 36 వేలకు పైగానే ఐటీ దిగ్గజానికి టాటా చెప్పనట్టు తెలుస్తోంది. మార్చి 2015 సంవత్సరంలో ఇన్పోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.డీ శిబులాల్ కూడా రిటైరయ్యేందుకు సిద్దమవుతున్నారు. ఇన్పోసిస్ కంపెనీ వదిలేసి వెళ్తున్న ఉద్యోగులను ఆపేందుకు ఏడు శాతం మేరకు జీతాలను పెంపు చేశారు. ఐనా కంపెనీ నుంచి ఉద్యోగుల వెళ్లడం మాత్రం తగ్గుముఖం పట్టలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. 1981లో నారాయణ మూర్తితో పాటు ఇన్పోసిస్ ను స్థాపించిన ఎన్ఎస్ రాఘవన్, ఎస్ గోపాలకృష్ణన్, నందన్ నీలెకని, శిబులాల్, కే.దినేష్ రాజీనామాలు సమర్పించిన వారిలో ఉన్నారు. వారేకాకుండా సినియర్ ఎగ్జిక్యూటివ్స్ అశోక్ వేమూరి, బాసబ్ ప్రధాన్ లు కూడా ఇన్పోసిస్ కు గుడ్ బై చెప్పారు. లోకసభ ఎన్నికల్లో పోటి చేసేందుకుగాను బాలకృష్ణన్ తప్పుకున్నారు. ఇన్పోసిస్ ను వదిలి వెళ్లే జాబితాలో తాజాగా 19 ఏళ్లపాటు సేవలందించిన సేల్స్, మార్కెటింగ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ త్రికూటం తన పదవికి రాజీనామా చేయడం ఉద్యోగుల్లో మరింత అభద్రతభావాన్ని పెంచే దిశగా దారి తీసినట్టు తెలుస్తోంది. ఐతే యువ ఉద్యోగులు కంపెనీని విడిచి వెళ్లడానికి వారానికోసారి కొత్త విధానాల్ని ఉద్యోగులపై రుద్దడం ప్రధాన కారణమని వినిపిస్తోంది. ఉద్యోగులను సంప్రదించకుండానే 8.8 పనిగంటల నుంచి 9.25 గంటలకు పెంచడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైనట్టు సమాచారం. పనిగంటల పెంపు కూడా ఉద్యోగుల్లో అభద్రతాభావాన్ని పెంచడమే కాకుండా కంటి తుడుపు చర్యగా జీతాలను పెంపు చేయడం కూడా ఉద్యోగులను సంతృప్తి పరచలేకపోయింది. ముఖ్యంగా ప్రశ్నించిన ఉద్యోగులను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించినట్టు తెలుస్తోంది. ఇన్పోసిస్ లో కొనసాగుతున్న అప్రజాస్వామిక విధానాలను బహిరంగంగా మాజీ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు ఇంటర్నెట్ వెబ్ సైట్లు, బ్లాగ్ ల్లో స్పందిస్తున్నారు. ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులు ఎలాంటి ప్రోడక్టవిటీ లేకుండా సేవలందించడం కూడా దిగువ తరగతి ఉద్యోగుల్లో నిరాసక్తత పెంచినట్టు తెలుస్తోంది. 13 ఏళ్లకు పైబడి అనుభవం ఉన్న ఉద్యోగులందరిని తొలగించినా.. కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపబోదని యువ ఉద్యోగులు వివిధ బ్లాగుల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇన్పోసిస్ లో చోటు చేసుకుంటున్న పలు పరిస్థితులపై వీడియోల రూపంలో, ఇంటర్నెట్ బ్లాగుల్లో కథనాలు భారీగానే పబ్లిష్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులెదుర్కొంటున్న ఇన్పోసిస్ లో పరిస్థితులు సానుకూలంగా మారుతాయనే అభిప్రాయాన్ని పలువురు ఆశిస్తున్నారు. -
ఇన్ఫీలో మరో వికెట్ డౌన్...
బెంగళూరు: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో మరో వికెట్ పడింది. కంపెనీని ఒక స్థాయికి తీసుకొచ్చిన సీనియర్లు వరుసగా సంస్థను వీడుతున్నారు. తాజాగా కంపెనీ ప్రెసిడెంట్, బోర్డ్ సభ్యుడు కూడా అయిన బి.జి.శ్రీనివాస్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వచ్చే నెల 10 నుంచి అమల్లోకి వస్తుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. ప్రస్తుత సీఈఓ ఎస్.డి. శిబులాల్ తర్వాత కంపెనీ సీఈవో రేసులో ఉన్న శ్రీనివాస్ రాజీనామా చేయడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో కొత్తగా ప్రెసిడెంట్ పదవిని సృష్టించి, దానిని శ్రీనివాస్‌కు కట్టబెట్టారు. సీఈవో ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు కారణాలను కంపెనీ కానీ శ్రీనివాస్ కానీ వెల్లడించలేదు. మరో వైపు ఇన్ఫోసిస్ తనకు అద్భుతమైన అవకాశాన్నిచ్చిందని శ్రీనివాస్ కృత జ్ఞతలు వ్యక్తం చేశారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలోనే అత్యధిక వేతనం (రూ.7.52 కోట్లు) పొందిన శ్రీనివాస్ త్వరలో మరో ఐటీ సేవల కంపెనీకి సీఈవో, ఎండీ కానున్నట్లు సమాచారం. 10 మంది ఔట్... శ్రీనివాస్ రాజీనామా పట్ల ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. కంపెనీ వృద్ధిలో శ్రీనివాస్ పాత్ర ఎంతో ముఖ్యమైనది, కీలకమైనదని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో శ్రీనివాస్ చేపట్టే అన్ని ప్రయత్నాల్లో ఆయనను విజయం వరించాలని మూర్తి ఆకాంక్షించారు. 2013, జూన్ 1న మూర్తి ఇన్ఫోసిస్‌లో మళ్లీ ప్రవేశించారు. తన తనయుడు, రోహన్ మూర్తిని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా నియమించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ఫోసిస్ నుంచి 10 మంది సీనియర్లు వైదొలిగారు. కాగా శ్రీనివాస్ రాజీనామా ఇన్ఫోసిస్ షేర్‌పై స్వల్పకాలంలో ప్రతికూల ప్రభా వం చూపించగలదని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. బుధవారం రాత్రి నాస్డాక్లో ఇన్ఫోసిస్ ఏడీఆర్ 4% పైగా క్షీణించింది. -
కొత్త సీఈఓ అన్వేషణలో ఇన్ఫోసిస్
బెంగళూరు: ఇన్ఫోసిస్ సారథ్య బాధ్యతలను ఎన్.ఆర్.నారాయణ మూర్తి గతేడాది తిరిగి చేపట్టిన తర్వాత కంపెనీకి గుడ్‌బై చెబుతున్న ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు డెరైక్టర్లతో సహా తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్‌లు వివిధ కారణాలతో వైదొలిగారు. తాజాగా, కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎస్.డి.శిబులాల్ అదే బాటపట్టారు. శిబులాల్ వారసుడి కోసం అన్వేషిస్తున్నట్లు కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే పదవి నుంచి వైదొలగుతానని శిబులాల్ (59) చెప్పడమే ఇందుకు కారణమని తెలిపింది. కేరళలోని అలెప్పీలో జన్మించిన ఆయనకు వచ్చే ఏడాది మార్చి 1వ తేదీకి 60 ఏళ్ల నిండనున్నాయి. తన పదవీ కాలం పూర్తి కావడానికి (మార్చి 2015) ముందు, లేదా కొత్త వ్యక్తి ఈ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమైనపుడు తాను తప్పుకుంటానని శిబులాల్ గతంలోనే వెల్లడించారని కంపెనీ పేర్కొంది. శిబులాల్ వారసుడి కోసం డెరైక్టర్ల బోర్టులోని నామినేషన్ల కమిటీ అన్వేషణ ప్రారంభించిందని ఇన్ఫోసిస్ తెలిపింది. సంస్థలో ఈ పదవికి అర్హత కలిగిన వారిని నామినేషన్ల కమిటీ షార్ట్‌లిస్ట్ చేస్తుందనీ, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో పేరొందిన డెవలప్మెంట్ డెమైన్షన్స్ ఇంటర్నేషనల్ సహాయం తీసుకుంటామనీ పేర్కొంది. ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారిలో తగిన వారిని గుర్తించడంలో కమిటీకి సహకరించేందుకు ఎగాన్ జెండర్ అనే ఎగ్జిక్యూటివ్ సెర్చ్ కంపెనీని ఇన్ఫోసిస్ నియమించింది. ముందుగానే రిటైర్ కావాలని శిబులాల్ ఎందుకు కోరుకుంటున్నారన్న ప్రశ్నకు కంపెనీ ప్రతినిధి జవాబు నిరాకరించారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ (జనవరి - మార్చి) ఆర్థిక ఫలితాలను త్వరలో (ఈ నెల 15న) ప్రకటించనున్నందున ప్రస్తుతం మౌనం పాటిస్తున్నామని ఆయన చెప్పారు. ఇన్ఫోసిస్‌లో ఉన్నతమైన సీఈఓ పీఠం కోసం కంపెనీ అధ్యక్షులిద్దరూ (బి.జి.శ్రీనివాస్, యు.బి.ప్రవీణ్ రావు) రేసులో ఉన్నారని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి గత జనవరిలోనే సూచనప్రాయంగా వెల్లడించారు. అధ్యక్షులుగా శ్రీనివాస్, ప్రవీణ్ రావులు మూడు నెలల క్రితమే ప్రమోట్ అయ్యారు.