దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సుమారు రూ.7కోట్లు రెవెన్యూ వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. ఇక కంపెనీ కార్యకలాపాల వల్ల వచ్చిన ఆదాయం రూ.36,538 కోట్ల నుంచి రూ.38,994 కోట్లకు పెరుగుతందని సమాచారం.
అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాల్లో ఇన్ఫోసిస్ కోత పెట్టనుంది. 2023-24 సంవత్సరానికి గానూ ఆదాయ వృద్ధి 1 - 3.5 నుంచి 1-2.5 శాతంగా ఉండనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో కంపెనీ ఆదాయ అంచనాలను 4-7 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
కంపెనీ వద్ద 7.7 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈఓ సలీల్‌పరేఖ్ చెప్పారు. జూన్ త్రైమాసికంలో 17.3 శాతంగా ఉన్న వలసల రేటు 14.6 శాతానికి తగ్గుతుందని తెలుస్తుంది. ఇన్ఫోసిస్ షేర్ ధర గురువారం త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందే 2.8శాతం పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment