టెక్ కంపెనీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని తెలుసుకదా. తాజాగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ సేవలందించే ఇన్ఫోసిస్ కంపెనీ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో భాగంగా ఈ ఏడాది ‘పవర్ ప్రోగ్రామ్’ విధానాన్ని అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కేటగిరీలో నియమించుకుంటున్న అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల వరకు వేతనం చెల్లిస్తామని పేర్కొంది.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో భాగంగా రిక్రూట్ అయ్యే అభ్యర్థులు ‘పవర్ ప్రోగ్రామ్’ కిందకు వస్తారు. ఈ కేటగిరీలోని వారికి ఏటా రూ.9 లక్షల వరకు వేతనం ఉంటుంది. కంపెనీ అవసరాలకు తగిన ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాలున్నాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్ సామర్థ్యంపై అధిక నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలపై యువత నైపుణ్యం పెంచుకోవాలని చెప్పింది.
ఇదీ చదవండి: రోబోల దండు వచ్చేస్తోంది..!
ఇదిలాఉండగా, టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ విభాగం గ్లోబల్ హెడ్ గిరీష్ నందిమఠ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఏడాది సంస్థ రిక్రూట్‌మెంట్ విధానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నామని చెప్పారు. ‘ప్రైమ్’ కేటగిరీలో నియామకం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు వేతనం అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment