
ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే.
ఎంపీగా నియమితులైన సుధామూర్తికి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో 0.83% వాటాకు సమానమైన 3.45 కోట్ల షేర్లు ఉన్నాయి. ప్రస్తుత షేరు ధర రూ.1,616.95 ప్రకారం, సుధామూర్తి షేర్ల విలువ రూ.5,600 కోట్ల వరకు ఉండొచ్చు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్‌లో 1.66 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారుగా రూ.2,691 కోట్లు. 2006లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న సుధామూర్తికి.. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ పురస్కారమూ లభించింది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ భార్య అక్షతామూర్తి ఈమె కుమార్తె.
ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం
‘సుధామూర్తిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. సామాజిక కార్యకలాపాలు, దాతృత్వం, విద్య.. ఇలా పలు విభాగాల్లో ఆమె అందించిన సేవలు అమోఘం. రాజ్యసభ సభ్యురాలిగా దేశ భవిష్యత్తును మార్చడంలో నారీశక్తికి నిదర్శనంగా ఆమె తన వంతు పాత్ర పోషిస్తారని కోరుకుంటున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment