ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా జనరేటివ్ ఏఐ సేవలందించేలా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కాగ్నిజెంట్ సీఈవోగా రవికుమార్ నియమితులైన తర్వాత పోటీ కంపెనీలకు చెందిన ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు.
ప్రస్తుత తరుణంలో కాగ్నిజెంట్ వ్యాపారాన్ని, కస్టమర్ల సంఖ్యను వేగంగా పెంచటమే లక్ష్యంగా రవి కుమార్ పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ సిక్కాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ సీఈవో పదవి నుంచి వైదొలిగిన తర్వాత విశాల్ సిక్కా వియానై సిస్టమ్స్‌ను స్థాపించారు. ఇప్పుడు కాగ్నిజెంట్, వియానై సిస్టమ్స్ వినియోగదారులకు నేరుగా జనరేటివ్ ఏఐ సేవలను అందించేందుకు జతకట్టాయి. వియానై సిస్టమ్స్ కు సంబంధించిన హిలా ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫారమ్, కాగ్నిజెంట్ న్యూరో ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు ఏఐ సాంకేతికత ద్వారా వినియోగదారులకు సేవలను అందించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment