‘ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ 2023’ విజేతలు వీరే.. | The Winners Of Infosys Prize 2023 | Sakshi
Sakshi News home page

‘ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ 2023’ విజేతలు వీరే..

Published Wed, Nov 15 2023 8:55 PM | Last Updated on Wed, Nov 15 2023 9:28 PM

The Winners Of Infosys Prize 2023 - Sakshi

శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను ఏటా ఇన్ఫోసిస్ ప్రైజ్‌ను అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పరిశోధకులు, శాస్త్రవేత్తలతో ఏర్పాటైన జ్యూరీ ఈ విజేతలను ఎంపిక చేస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ బహుమతులను సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ప్రదానం చేశారు. 

ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో ఈ ప్రైజ్‌ను ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ సచ్చిదా నంద్ త్రిపాఠి అందుకున్నారు. ఈయన సస్టైనబుల్ ఎనర్జీ ఇంజినీరింగ్‌లో చేసిన పరిశోధనలకుగాను ఈ బహుమతి ప్రదానం చేశారు. భారీ స్థాయి సెన్సార్లు ఉపయోగించిన గాలిలోని కాలుష్యాన్ని గుర్తించేలా త్రిపాఠి పరిశోధనలు చేశారు. ఏఐ సహాయంతో ఆ డేటాను విశ్లేషించవచ్చు. దిల్లీలో నానో పార్టికల్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల వల్ల తెలిసింది. హ్యుమానిటీస్‌లో బెంగుళూరు సైన్స్ గ్యాలరీ వ్యవస్థాపక డైరెక్టర్ జాహ్నవి ఫాల్కీకి ఈ బహుమతి లభించింది. ఆమె అనేక వైజ్ఞానిక పరిశోధనలు చేసి ది అటామిక్ స్టేట్ అనే పుస్తకం రాశారు. న్యూక్లియర్ సైన్స్, ఆంథ్రపాలజీకు సంబంధించిన ఎన్నో కథనాలు ప్రచురించారు. 

ఇదీచదవండి: రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి: ఇన్ఫోసిస్ మూర్తి

లైఫ్ సైన్సెస్‌లో ఐఐటీ కాన్పూర్‌లో బయోలాజికల్ సైన్సెస్, బయో ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అరుణ్ కుమార్ శుక్లా ఈ ప్రైజ్‌ గెలుచుకున్నారు. జీ-ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్ (జీసీసీఆర్‌)లో ఈ విశేష కృషి చేశారు. మ్యాథమెటిక్‌ సైన్సెస్‌లో జియోమెట్రీలో పరిశోధనలు చేసినందుకు ప్రొఫెసర్‌ భార్గవ్ భట్‌ ఈ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఫిజికల్ సైన్సెస్‌లో కణ జీవశాస్త్రంలో చేసిన కృషికిగాను నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ముకుంద్ తట్టాయ్‌కు ఈ బహుమతి గెలుపొందారు. సోషల్‌ సైన్సెస్‌లో కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న కరుణా మంతెనా ఈ ప్రైజ్‌ గెలుచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement