కర్ణాటక అసెంబ్లీలో టాలీవుడ్ యంగ్ టైగర్ అదిరిపోయే ప్రసంగమిచ్చారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్ కన్నడ భాషలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పునీత్ రాజ్‌కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు యంగ్ టైగర్.
వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అప్పూ.. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన చేసిన సేవలు అద్భుతం. రాజ్‌కుమార్‌తో ఉన్న క్షణాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తాను అప్పూకు ఓ స్నేహితుడిగానే ఇక్కడికి వచ్చా. మీ అందరి అభిమానాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశమిచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు. అప్పూ ఫ్యామిలీ నన్ను ఓ కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు వారికి రుణపడి ఉంటా.' అంటూ కన్నడలో మాట్లాడారు. దీంతో సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment