బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌.. భర్త ఎమోషనల్ పోస్ట్! | Sandalwood Actress Milana Blessed With Baby Girl, Actor Post Goes Viral | Sakshi
Sakshi News home page

Milana Nagaraj: బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌.. భర్త ఎమోషనల్ పోస్ట్!

Published Thu, Sep 5 2024 10:40 AM | Last Updated on Thu, Sep 5 2024 10:46 AM

Sandalwood Actress Milana Blessed With Baby Girl, Actor Post Goes Viral

యంగ్ హీరో డార్లింగ్ కృష్ణ తండ్రయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమకు కూతురు పుట్టిందని ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ప్రయాణంలో తన భార్యను చూసి గర్వపడుతున్నానని హీరో ఎమోషనల్ అయ్యారు. ప్రపంచంలో ఇలాంటి బాధను భరిస్తోన్న తల్లులందరికీ నమస్కారం అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా.. లవ్‌ మాక్‌టైల్‌ అనే కన్నడ సినిమాతో డార్లింగ్‌ కృష్ణ, నటి మిలానా నాగరాజ్‌ జంటగా  నటించారు. ఈ సినిమా కన్నడలో సూపర్‌ హిట్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ జంటగా నమ్మ దునియా నమ్మ స్టైల్, చాల్తి అనే సినిమాలలో నటించారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2021లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహా వేడుకలో కన్నడ చిత్రసీమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement