777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు దగ్గరైన శాండల్‌వుడ్ హీరో, డైరెక్టర్ రక్షిత్ శెట్టి. తాజాగా ఆయన ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ త్వరలోనే విడుదల కానుంది. ఈ సిరీస్ రిలీజ్ చేసేందుకు దాదాపు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఏ ఓటీటీ వేదికలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో రక్షిత్ శెట్టి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ సినిమాలకు విలువ లేదా అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
రక్షిత్ శెట్టి తన ట్వీట్‌లో రాస్తూ..'జనవరి 2020లో ఏకమ్ సిరీస్ రిలీజ్ చేద్దామనుకున్నాం. కన్నడలో వెబ్ సిరీస్‌కి అదే సరైన సమయం అనిపించింది. ఆ తర్వాక కరోనా మహమ్మారి అంతా తలకిందులైంది. దీంతో మే ఏకం సిరీస్ వాయిదా వేసుకున్నాం. అక్టోబర్ 2021లో ఏకమ్ ఫైనల్ కాపీ చూశాను. అది చూసి థ్రిల్ అయ్యాను. ఆ తర్వాత దాన్ని ప్రపంచానికి చూపించడానికి రెడీ అయ్యాను. కానీ గత రెండేళ్లలో ఏకం సిరీస్ కోసం మేము ప్రయత్నించని ఓటీటీ లేదు. ప్రతిసారీ మాకు నిరాశే ఎదురైంది. ఏదేమైనా కంటెంట్ సత్తాను నిర్ణయించే హక్కు ప్రేక్షకులకు మాత్రమే ఉందని నమ్మాను. అందుకే మా సొంత వేదికపై తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఇది ఒక ప్రయత్నం మాత్రమే. దీనిని అందరు గుర్తించి మెచ్చుకోవాలి.' అని రాసుకొచ్చారు. అయితే కన్నడ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం మొదటిసారి కాదని రక్షిత్ శెట్టి అన్నారు.
కన్నడ పరిశ్రమ కంటెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఎందుకు తీసుకోవడం లేదన్న విషయంపై కన్నడ డైరెక్టర్ అనూప్ భండారి మాట్లాడారు. 2022కి ముందు కన్నడ కంటెంట్ కొనుగోలు చేయడంలో విముఖత ఉన్న మాట నిజమే.. కానీ.. ఆ ఏడాది నుంచే కన్నడ సినిమాకు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. కాంతార, కేజీఎఫ్ లాంటి సినిమాలతో కన్నడ చిత్ర పరిశ్రమకు గుర్తింపు దక్కిందన్నారు.
అయితే కన్నడ సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకం కొంతవరకు కోల్పోయామని గతంలోనే సప్త సాగరాలు దాటే ఎల్లో మూవీ దర్శకుడు హేమంత్ రావు అన్నారు. కన్నడ కంటే మలయాళం, హిందీ, తమిళ, తెలుగు కంటెంట్‌కే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. కన్నడ కంటెంట్‌ను ఎందుకు కొనుగోలు చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా కర్ణాటకతో పాటు మలయాళంలో కూడా మంచి బిజినెస్ చేస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంలో ఒక్క శాండల్‌వుడ్‌లో మాత్రమే వెనక ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో తెలుగు సినిమాలకు వస్తున్న కలెక్షన్స్ కన్నడ చిత్రాలకు రావడం లేదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment