సాక్షి, చెన్నై: ప్రజలు కుల మతాలకు అతీతంగా సమైఖ్యంగా ఉండాలని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈయన ప్రస్తుతం జైలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆ యన ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. కాగా రజనీకాంత్ మంగళవారం బెంగళూరులో జరిగిన దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు.
కన్నడ రాజోత్సవ దినం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో జరిగింది. పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రజనీకాంత్, జూనియర్ ఎనీ్టఆర్ కలసి పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశి్వనికి అందజేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి రజనీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ కన్నడ భాషలో ప్రసంగించి చప్పట్లు పొందారు. రజనీకాంత్ మాట్లాడుతూ అందరికీ కన్నడ రాజోత్సవ శుభాకాంక్షలు అన్నారు.
పునీత్‌రాజ్‌కుమార్ అంత్యక్రియల్లో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. అయితే అది ఆయన నటుడు కావడం వలన కాదని, ఆయన మానవత్వం, సత్‌ప్రవర్తన కారణంగానే అని అన్నారు. రాజ్‌కుమార్ దైవబిడ్డ అని పేర్కొన్నారు. ఆయన నటించిన తొలి చిత్రం అప్పును తాను విడుదలకు ముందే చూశానని, అది శతదినోత్సవం జరుపుకుందని గుర్తు చేశారు. కాగా ప్రజలందరూ కుల,మతాలకు అతీతంగా, ఐక్యంగా, సంతోషంగా మనఃశ్శాంతిగా జీవించాలని అల్లా, జీసస్, రాజరాజేశ్వరి దేవతను ప్రార్థిస్తున్నానని రజనీకాంత్ పేర్కొన్నారు. కాగా జోరువానలో సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకి కర్ణాటక మంత్రి గొడుగు పట్టడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment