karnataka assembly
-
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు శాలరీ డబుల్..!
బెంగళూరు: హనీ ట్రాప్ అంశం ఓవైపు కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తున్న వేళ.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఈరోజు(శుక్రవారం) ఓ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. సీఎం, ఎమ్మెల్యేల శాలరీని వంద శాతం హైక్ చేసే బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం రూ. 10 కోట్లు అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. తాజా శాలరీ హైక్ బిల్లు ఆమోదంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతం భారీగా పెరగనుంది. ప్రస్తుతం కర్ణాటక సీఎం జీతం రూ. 75 వేలు ఉండగా, అది ఇప్పుడు రూ. 1 లక్షా యాభై వేలకు చేరనుంది. ఇక మంత్రుల జీతం 108 శాతం హైక్ తో రూ. 60 వేల నుంచి లక్షా పాతికవేలకు చేరింది.ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం రూ. 40 వేల నుంచి రూ. 80 వేలకు చేరనుంది.ఇక వీరందరికీ వచ్చే పెన్షన్ కూడా పెరగనుంది. రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు వీరికి పెన్షన్ లభించనుంది.దీనిపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. శాలరీ వంద శాతం హైక్ చేయడాన్ని సమర్థించారు. సామాన్యుడు ఎలా ఇబ్బందులు పడతాడో చట్ట సభల్లో ఉన్న తాము కూడా అలానే ఇబ్బందులు పడతామనే విషయం గ్రహించాలన్నారు. దీనికి సంబంధింంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు పరమేశ్వరన్. బీజేపీ ఎమ్మెల్యేల నిరసన.. సస్పెన్షన్ఈరోజు చర్చకు వచ్చిన అంశాలతో పాటు పల్లు బిల్లులకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలిపే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారుఆగ్రహంతో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు(Muslim Quota Bill) ప్రతులను చించి స్పీకర్ ముఖంపైకి విసిరి కొట్టారు. దాంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ కు గురయ్యారు. కర్ణాటక అసెంబ్లీని మళ్లీ కుదిపేసిన హనీ ట్రాప్ -
కర్ణాటక అసెంబ్లీని మళ్లీ కుదిపేసిన హనీట్రాప్
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన హనీ ట్రాప్(Honey Trap) వ్యవహారం.. ఇవాళ మళ్లీ అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై శాసనసభలో చర్చించాల్సిందేనని బీజేపీ పట్టుబట్టింది. అయితే ఆ నిరసనలను పట్టించుకోకుండా ముస్లిం కోటా బిల్లును స్పీకర్ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభ ఒక్కసారిగా అలజడి రేగింది. ఆగ్రహంతో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు(Muslim Quota Bill) ప్రతులను చించి స్పీకర్ ముఖంపైకి విసిరి కొట్టారు. ప్రతిగా.. కాంగ్రెస్ సభ్యులు బుక్‌లు, పేపర్లను ప్రతిపక్ష సభ్యులపైకి విసిరారు. ఈ గందరగోళం నడుమ సభను స్పీకర్ కాసేపు వాయిదా వేశారు.The #KarnatakaAssembly has passed a contentious bill that proposes providing 4% reservation to the Muslim community in contracts awarded by the state government. Opposing the move, the BJP MLAs stormed the well of the House and chanted slogans against the ruling Siddaramaiah… pic.twitter.com/0vVrJdpt9f— News9 (@News9Tweets) March 21, 2025పబ్లిక్ కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తెచ్చింది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమంటున్న బీజేపీ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని చెబుతోంది. మరోవైపు సభలో ఇవాళ జరిగిన పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్యే భరత్‌శెట్టి స్పందించారు. ‘‘హనీ ట్రాప్ వ్యవహారంపై చర్చించకుండా.. ముస్లిం కోటా బిల్లును ప్రవేశపెట్టడంపైన సీఎం సిద్ధరామయ్య దృష్టి పెట్టారు. అందుకే మేం నిరసన తెలిపాం. అంతేగానీ మేము ఎవరికీ హాని తలపెట్టలేదు’’ అని అన్నారాయన.ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదు: సీఎం సిద్దుఇంకోవైపు ముస్లిం కోటా నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించుకుంది. సామాజిక న్యాయం, మైనారిటీలకు ఆర్థిక సాధికారకత కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చామని సిద్ధరామయ్య ప్రభుత్వం చెబుతోంది. హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా చర్యలు తీసుకుంటామన్న సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah).. ఇందులో నుంచి ఎవరినీ రక్షించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు.ఇదిలా ఉంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా 48 మంది రాజకీయ నేతలు హనీట్రాప్ బాధితులుగా ఉన్నారంటూ కర్ణాటక మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాశంమైన సంగతి తెలిసిందే. ఇందులో అధికార, విపక్ష సభ్యులతో పాటు జాతీయ స్థాయిలోని నాయకులు కూడా ఉన్నారంటూ బాంబ్ పేల్చారాయన. అయితే ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఈ వలపు వల వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ హస్తమే ఉందని, కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తోంది. -
ఎమ్మెల్యేలూ.. కాసేపు బజ్జోండి!
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తుంటాయి. ఆఫీస్‌కు రాగానే బ్రేక్‌ఫాస్ట్.. కాస్త బోర్ కొడితే సేదతీరడానికి పలు రకాల ఆటలు.. మధ్యాహ్న భోజనం.. ఆ తర్వాత కునుకు వస్తే నిద్ర పోవడానికి బెడ్లు.. మధ్యమధ్యలో టీ, కాఫీ, జ్యూస్‌లు.. ఇలా ఎన్నో రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటాయి. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖదీర్ కూడా ఇటువంటి ఆలోచనే చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో శాసనసభ్యులకు పలు సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ఉదయం సభకు రాగానే బ్రేక్‌ఫాస్ట్.. మధ్యాహ్నం భోజనం.. ఆ తర్వాత కునుకు తీసేందుకు రిక్లైనర్ కుర్చీలు.. రిలాక్సేషన్ కోసం మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఈనెల 3 నుంచి మొదలైన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు 21వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే సమావేశాల సమయంలో చాలా మంది సభ్యులు మధ్యాహ్న భోజనం తర్వాత సభా కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారని స్పీకర్ ఖదీర్ గుర్తించారు. ఆ పరిస్థితిని నివారించేందుకు, హాజరుశాతాన్ని పెంచేందుకు గాను.. సభ్యులు మధ్యలో కాసేపు నిద్రపోవడానికి 15 రిక్లైనర్లను, రెండు మసాజ్ కుర్చీలను అద్దెకు తీసుకున్నారు. ఒక్క సమావేశాలప్పుడు తప్ప మిగతా సమయాల్లో వీటి ఉపయోగం ఉండనందున.. ప్రస్తుతం వాటిని కొనుగోలు చేయకుండా అద్దెకు మాత్రమే తీసుకున్నామని స్పీకర్ చెప్పారు. 15 రిక్లైనర్లను, రెండు మసాజ్ కుర్చీలను అధికార, విపక్ష లాంజ్లలో ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని మసాజ్ కుర్చీలకు ప్రతిపాదన..స్పీకర్ ఖదీర్ మరో అడుగు ముందుకేసి శాసనసభ్యుల కోసం మరిన్ని మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మసాజ్ కుర్చీలతో పాటు సభ్యుల గదులకు స్మార్ట్ లాక్స్ ఏర్పాటు చేయడానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఖదీర్ తెలిపారు. స్మార్ట్ లాక్స్ ఏర్పాటు వల్ల సభ్యులకు భద్రత పెరగడంతో పాటు వారి గదుల్లోకి ఇతరులెవ్వరూ ప్రవేశించే అవకాశం ఉండదని చెప్పారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఎమ్మెల్యేలు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని వివరించారు. వారు చేస్తున్న పనికి ఇవి విలాసాలు కావని.. అవసరాలు మాత్రమేనని చెప్పారు. ఈ సౌకర్యాలకు ఎమ్మెల్యేలు పూర్తిగా అర్హులంటూ తన చర్యలను సమర్థించుకున్నారు. ఈ సదుపాయాల వల్ల సభ్యులు ఇక ఏ కారణంతోనూ బయటకు వెళ్లబోరని అన్నారు. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని పలువురు మంత్రులు, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమర్థించగా.. బీజేపీ నేతలు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఒత్తిడితో పని చేస్తారని, పైగా చాలా మంది సీనియర్ సిటిజన్లు ఉన్నందున ఇలాంటి ఏర్పాట్లు మంచివేనని అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెప్పారు. పాలనా సమస్యలపై దృష్టి పెట్టకుండా.. ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేయడం ఏమిటంటూ బీజేపీ నేత సీటీ రవి విమర్శించారు. -
Comment In X: అసెంబ్లీలో కునుకు తీస్తే.. ఆ కిక్కే వేరబ్బా!
సాధారణంగా.. కీలక సమావేశాల్లో లేదంటే ఉపన్యాసాలు జరుగుతున్న టైంలో మన నేతలు నిద్రపోతూ కనిపించే దృశ్యాలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. అయితే నేతలు ఇక మీదట హుషారుగా పని చేసేందుకు కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly) సమావేశాల టైంలో భోజనం తర్వాత.. సభ్యులు కాసేపు నిద్ర తీసేందుకు ఏర్పాట్లు కలిగించబోతున్నారు. ఈ మేరకు అద్దె ప్రతిపాదిక 15 ‘కునుకు కుర్చీలు’ తెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా నేతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, వాళ్ల పని తీరు మెరుగుపడుతుందని, పైగా సభ్యుల హాజరు శాతం పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.#Karnataka MLAs to get recliners in assembly for quick power naps🙂Speaker UT Khader has approved installing 15 recliners in the Assembly lobby on rent, allowing legislators a quick nap post lunch. Idea is to boost productivity ensuring they stay active for rest of the session… pic.twitter.com/OUMNtVxfuf— Nabila Jamal (@nabilajamal_) February 25, 2025సర్ ఇంగ్లీష్ అంతే!సీనియర్ నేత, తిరువంతపురం ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ట్రంప్-మోదీ భేటీపై ఆయన సానుకూలంగా మాట్లాడడం, బీజేపీ నేతలతో సెల్ఫీ దిగడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని ఊహాజనిత కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆయన వాటన్నింటినీ ఖండించేశారు. అయితే ఆయన ఆంగ్ల పరిజ్ఞానం అత్యంత అరుదు. పలకడానికి కష్టంగా ఉన్న ఇంగ్లీష్ పదాలు తరచూ ఆయన వాడుతుంటారు. అలాగే.. ఆ ఖరీదైన ఇంగ్లీష్‌కు చాలామంది అభిమానులే ఉన్నారు. ఇక.. హిందీ భాషాభిమానంలో బీజేపీని కొట్టేవారు ఈ దేశంలోనే లేరు. అలా.. అమిత్ షా-శశి మధ్య పార్టీ మారడం గురించి చర్చ జరిగితే ఇలా ఉంటుందనే సరదా ప్రయత్నం.. ఈ ఎక్స్ కామెంట్.What say you Shashi T, my old friend? pic.twitter.com/a8sjohnZ71— ParanjoyGuhaThakurta (@paranjoygt) February 25, 2025 సొంత దేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభవమే ఎదురవుతోంది. తీవ్ర స్థాయిలో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే టైంలో జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా.. సోషల్ మీడియాలో జోకులు సైతం పేలుతున్నాయి. ఇక సొంతదేశంలోనే మీమ్ మెటీరియల్‌గా పేరున్న షాహిన్ అఫ్రిదీ(Shaheen Afridi)ని ఇలా.. భారత్‌లోని భాగేశ్వర్ ధామ్‌లో పూరీలు అమ్ముకునేవాడిలా చేసేశారు. Shaheen Afridi Bageshwar Dham mai pooriya nikaal raha 😸 pic.twitter.com/BeTMsC1Lzf— Sachya (@sachya2002) February 25, 2025 Note: ఈ పోస్టులు ఎవరినీ కించపరిచడానికో లేదంటే విమర్శించడానికో కాదు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలియజేయడం కోసమే.. -
కర్ణాటక అసెంబ్లీలో పాక్ నినాదాలు నిజమే!
బనశంకరి: కర్ణాటక అసెంబ్లీ భవనం విధానసౌధ కారిడార్లలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసులో ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూరు ఆర్టీ నగర వాసి మునావర్, బ్యాడగివాసి మహమ్మద్ షఫీనా శిపుడి అనే వారిని నిర్బంధించారు. ఫిబ్రవరి 27వ తేదీన విధానసౌధలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్, ఫలితాల వెల్లడి జరిగింది. ఆ సమయంలో బళ్లారి కాంగ్రెస్ అభ్యర్థి నాసిర్ హుస్సేన్ గెలిచారు. దీంతో ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. విధాన సౌధ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతిపక్ష బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రదర్శనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపారు. నినాదాలు చేసింది నిజమేనని పరీక్షల్లో తేలడంతో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సెంట్రల్ డీసీపీ శేఖర్ తెలిపారు. మంగళవారం కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడతామని చెప్పారు. -
కర్ణాటకలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది
-
చిచ్చు రేపిన వ్యాపారం
కర్ణాటక: ఉద్యోగుల బదిలీల గురించి అధికార, విపక్షాల మధ్య వాగ్వివాదంతో మంగళవారం విధానసభ మార్మోగింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయం విధానసభ ప్రారంభం కాగానే విజయపుర మహానగర పాలికె కమిషనర్ బదిలీపై బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగడంతో స్పీకర్ ఖాదర్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. జీర్ అవర్‌లో బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ పాలికె కమిషనర్ బదిలీ విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బదిలీలు సహజం. ఐఏఎస్, కేఏఎస్ కేడర్ పోస్టులకు అదే కేడర్ అధికారిని నియమించాలి. కానీ విజయపుర మహానగర పాలికె కమిషనర్‌గా అర్హతలేని అధికారిని నియమించారు, వలయ కమిషనర్ కేడర్ కంటే తక్కువ హోదా ఉంది అని యత్నాళ్ దుయ్యబట్టారు. నగరాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేశ్ మాట్లాడుతూ ఆ పోస్టుకు కేఏఎస్ అధికారినే నియమించామని, ఇందులో ఏ కులం అనేది చూడలేదని అన్నారు. యత్నాళ్ మాట్లాడుతూ తనను అణచివేయడానికి ప్రయత్నించిన అధికారిని నియమించారని, అర్హత కలిగిన అధికారిని కాదని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీలతో వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం అభ్యంతరం యత్నాళ్ మాటలపై అభ్యంతరం తెలిపిన సీఎం సిద్దరామయ్య, వ్యాపారమని ఎందుకు చెబుతున్నారు, మేము వ్యాపారం చేస్తున్నామని చెప్పడానికి మీరు హరిశ్చంద్రులా? అనవసరంగా మాట్లాడకండి అని మండిపడ్డారు. దీనిపై జీరో అవర్‌లో చర్చకు అవకాశం లేదని సీఎం చెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వివాదం ప్రారంభించారు. వ్యాపారం చేస్తున్నారు అనే పదం తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి స్పీకర్‌ను కోరారు. మాజీ సీఎం బసవరాజ బొమ్మై మాట్లాడుతూ యత్నాళ్ మాటలను సమర్థించడంతో అధికార– విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అరుపులతో సభలో గందరగోళం ఏర్పడింది. మంత్రి బైరతిసురేశ్ మాట్లాడుతూ మీ వద్దకు వ్యాపారం చేయడానికి అధికారిని పంపించాలా అని ప్రశ్నించడంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి తొలగించాలి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పోస్టుకు రూ.2500 కోట్లు, మంత్రి పదవికి రూ.1000 కోట్లు అని యత్నాళ్ గతంలో బీజేపీపైనే ఆరోపణలు చేశారని ఎద్దేవా చేశారు. మా పార్టీ అయితే 24 గంటల్లో యత్నాళ్ ను బహిష్కరించేదన్నారు. దీనిపై యత్నాళ్ మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై సీబీఐ తో దర్యాప్తు చేయించండని అన్నారు. బొమ్మై జోక్యం చేసుకుంటూ అధికారం ఉందని ఇష్టానుసారం చేయడం సరికాదని మంత్రిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ వ్యాపారం చేస్తున్నారు అనేది రికార్డులు నుంచి తొలగించాలని స్పీకర్‌ను మనవిచేశారు. మీరు లూటీ చేయడంతోనే ప్రజలు మిమ్మల్ని విపక్షంలో కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. గొడవ చెలరేగడంతో స్పీకర్ పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. -
కర్ణాటక అసెంబ్లీలోకి చొరబడ్డ ఆగంతకుడు.. ఎందుకొచ్చాడంటే..
బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ నడుస్తుండగా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ 70 ఏళ్ల సామాన్య వృద్ధుడు నేరుగా అసెంబ్లీలోకి చొరబడి ఏకంగా ఎమ్మెల్యే సీటులోనే కూర్చున్నాడు. సభలోని ఓ ఎమ్మెల్యే అతడిని అనుమానించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు ఆ పెద్దమనిషిని అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని దాటుకుని సామాన్యుడు అసెంబ్లీలోకి చొరబడటంతో అక్కడి భద్రతా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాల నిమిత్తం చట్టాలను తయారు చేసే చట్టసభలను దేవాలయాలుగా పరిగణిస్తూ ఉంటాం. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు మాత్రమే అందులో అడుగుపెట్టే అర్హత ఉంటుంది. అటువంటి చోటుకి సామాన్యులు వెళ్లడమంటే మాటలు కాదు. అలాంటిది అక్కడి భద్రతా వలయాన్ని చేధించుకుని అసెంబ్లీ లోపలికి చొరబడటమే కాకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని దర్జాగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నాడు ఓ ఆగంతకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొలకాల్మోర్ నియోజకవర్గంలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన 70 ఏళ్ల తిప్పేరుద్రప్ప అలియాస్ కరియప్ప మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అసెంబ్లీకి వచ్చి అక్కడి సెక్యూరిటీ వారికి తనని తాను ఒక ఎమ్మెల్యేగా పరిచయం చేసుకుని లోపలికి ఎంటరయ్యాడన్నారు. అసెంబ్లీ లోపల దేవదుర్గ జేడీఎస్ ఎమ్మెల్యే కరియమ్మ సీటులో కూర్చుని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ ప్రకటిస్తుండగా 15 నిముషాల పాటు బడ్జెట్ సమావేశాలను తిలకించాడని, పక్కన ఉన్న మరో జేడీఎస్ ఎమ్మెల్యేకి అతడిపై అనుమానం రావడంతో అక్కడి సెక్యూరిటీకి ఫిర్యాదు చేయగా వారు అతడిని అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారని, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలన్న ఆసక్తితోనే అతడు అసెంబ్లీలోకి చొరబడినట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: మెట్రోలో యువతుల పోల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్.. -
కర్ణాటక అసెంబ్లీలో రగడ
బెంగళూరు: బీజేపీ ఆందోళనలతో మంగళవారం కర్ణాటక విధానసభ వర్షాకాల సమావేశాలు హీటెక్కాయి. ఐదు ఎన్నికల హామీల అమలును అధికార కాంగ్రెస్ పూర్తిగా పక్కనపెట్టేసిందని విమర్శిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హౌజ్వెల్లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో గందరగోళం ఏర్పడి సభ కార్యకలాపాలకు అవాంతరం ఏర్పడింది. బీజేపీ సీనియర్, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప విధాన సౌధలో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏదో చేస్తామని చెప్పి.. ఏం చేయకుండా ఉండిపోయిందని మండిపడ్డారాయన. నెల దాటినా ఎన్నికల హామీల అమలులో జాప్యం దేనికని సూటిగా ప్రశ్నించారు. తామేమీ కొత్తగా ఏదైనా చేయాలని అడగడం లేదని.. కేవలం ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నామని చెప్పారాయన. వారం వేచిచూస్తామని.. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ తరుణంలో సీఎం సిద్ధరామయ్య జోక్యంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకెళ్లి కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ‘మోసం.. మోసం.. కాంగ్రెస్ మోసం’ అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ మాత్రం వాళ్ల నిరసనను రికార్డుల్లోకి ఎక్కించడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో బీజేపీ నిరసనలపై కర్ణాటక మంత్రి పరమేశ్వర స్పందించారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే మూడు అమలు చేస్తున్న విషయం గుర్తించాలని బీజేపీకి ఆయన హితవు పలికారు. ఐదు హామీలను ఒక్కోటిగా చేసుకుంటూ పోతున్నామని, ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయే క్రమంలో ఆలస్యం కావడం సహజమని వ్యాఖ్యానించారాయన. #WATCH | Bengaluru | Heated scenes at the Karnataka Assembly as BJP MLAs storm the well of the House on the issues of the implementation of the five guarantees of the Congress Government in the State. (Source: Vidhana Soudha) pic.twitter.com/CrYgd5i33j — ANI (@ANI) July 4, 2023 ఇదీ చదవండి: ఆ డిప్యూటీ సీఎం అవినీతిపరుడు.. తొలగించండి -
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్
-
ఎన్నికల వేళ రాయచూర్ రైతులు కీలక డిమాండ్లు
-
సరిహద్దుపై మహారాష్ట్రతో ఢీ అంటే ఢీ.. కర్ణాటక అసెంబ్లీలో తీర్మానం
బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఇటీవల తారస్థాయికి చేరింది. తమ భూభాగాన్ని ఇచ్చేదే లేదంటూ ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలోనే సరిహద్దు వివాదంపై కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకే కట్టుబడి ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. సరిహద్దు వివాదాన్ని మహారాష్ట్రనే సృష్టించిందని ఖండించింది. ఈ తీర్మానాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపారు. ‘కర్ణాటక భూభాగం, నీళ్లు, భాష, కన్నడ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. కర్ణాటక ప్రజలు, అసెంబ్లీ సభ్యుల మనోభావాలు ఈ అంశంలో ఒకటి. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి మనమందరం ఐక్యంగా రాజ్యాంగ, చట్టపరమైన చర్యలు తీసుకోవాడనికి కట్టుబడి ఉన్నాం. అనవసరంగా సరిహద్దు వివాదాన్ని సృష్టిస్తున్న మహారాష్ట్ర ప్రజల తీరును ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు సిద్ధమని తెలిపే ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.’ అని సభలో తీర్మానాన్ని చదవి వినిపించారు సీఎం బసవరాజ్ బొమ్మై. అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో సరిహద్దు వివాదంపై మాట్లాడారు సీఎం బొమ్మై. అది కర్ణాటక ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని, ఒక్క అంగుళం కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియంట్ ‘బీఎఫ్.7’ లక్షణాలివే.. -
‘మహా’మేళాకు కర్ణాటక నో.. ఉద్రిక్తత, 144 సెక్షన్ విధింపు
బెళగావి: హద్దుల పంచాయితీతో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తారస్థాయికి చేరుకుంది. ‘మహా’ మేళ నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవటంపై బెళగావి సమీపంలో సోమవారం వందల మంది ఆందోళన చేపట్టారు. కొగ్నోలి టోల్ ప్లాజా వద్దకు ‘మహారాష్ట్ర ఏకీకరణన్ సమితి’(ఎంఈఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు వందల మంది చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బెళగావి ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున బెళగావిలో ప్రతిఏటా సమావేశం నిర్వహిస్తుంది మహారాష్ట్ర ఏకీకరణన్ సమితి. గత ఐదేళ్లుగా సరిహద్దు వివాదంపై ఆందోళనలు చేస్తోంది ఎంఈఏస్. ఈ ఏడాది కూడా శీతాకాల సమావేశల తొలిరోజున భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బెళగావి జిల్లా ప్రధాన కేంద్రంలోని తిలక్‌వాడీ ప్రాంతంలో ఉన్న వ్యాక్సిన్ డిపో గ్రౌండ్ వద్ద ఎంఈఎస్ ఆందోళనకు దిగింది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందల మంది ఎంఈఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తిలక్‌వాడీ రోడ్డులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. అయినప్పటికీ మహారాష్ట్ర వికాస్ అకాడీ(ఎంవీఏ) కార్యకర్తలు బెళగావిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. 5వేల మంది పోలీసులు.. బెళగావిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు 5,000 మంది పోలీసులను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు ఎస్పీలు, 11 మంది ఏఎస్పీలు, 43 మంది డిప్యూటీ ఎస్పీలు, 95 మంది ఇన్స్పెక్టర్లు, 241 మంది ఎస్సైలు ఆందోళనల ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. Belagavi, Karnataka | Members of Maharashtra Ekikaran Samiti and NCP stage protest near Kognoli Toll Plaza near Karnataka-Maharashtra border over inter-state border issue pic.twitter.com/XaPJwEbBKv — ANI (@ANI) December 19, 2022 ఇదీ చదవండి: అసెంబ్లీలో వీర్ సావర్కర్ చిత్రపటంపై రగడ.. నిరసనకు దిగిన ప్రతిపక్షం -
కన్నడ రాజ్యోత్సవ వేడుకలో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ప్రజలు కుల మతాలకు అతీతంగా సమైఖ్యంగా ఉండాలని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈయన ప్రస్తుతం జైలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆ యన ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. కాగా రజనీకాంత్ మంగళవారం బెంగళూరులో జరిగిన దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. కన్నడ రాజోత్సవ దినం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో జరిగింది. పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రజనీకాంత్, జూనియర్ ఎనీ్టఆర్ కలసి పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశి్వనికి అందజేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి రజనీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ కన్నడ భాషలో ప్రసంగించి చప్పట్లు పొందారు. రజనీకాంత్ మాట్లాడుతూ అందరికీ కన్నడ రాజోత్సవ శుభాకాంక్షలు అన్నారు. పునీత్‌రాజ్‌కుమార్ అంత్యక్రియల్లో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. అయితే అది ఆయన నటుడు కావడం వలన కాదని, ఆయన మానవత్వం, సత్ప్రవర్తన కారణంగానే అని అన్నారు. రాజ్‌కుమార్ దైవబిడ్డ అని పేర్కొన్నారు. ఆయన నటించిన తొలి చిత్రం అప్పును తాను విడుదలకు ముందే చూశానని, అది శతదినోత్సవం జరుపుకుందని గుర్తు చేశారు. కాగా ప్రజలందరూ కుల,మతాలకు అతీతంగా, ఐక్యంగా, సంతోషంగా మనఃశ్శాంతిగా జీవించాలని అల్లా, జీసస్, రాజరాజేశ్వరి దేవతను ప్రార్థిస్తున్నానని రజనీకాంత్ పేర్కొన్నారు. కాగా జోరువానలో సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకి కర్ణాటక మంత్రి గొడుగు పట్టడం విశేషం. -
నా దృష్టిలో అతనే కర్ణాటక రత్న.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
కర్ణాటక అసెంబ్లీలో టాలీవుడ్ యంగ్ టైగర్ అదిరిపోయే ప్రసంగమిచ్చారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్ కన్నడ భాషలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పునీత్ రాజ్‌కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు యంగ్ టైగర్. వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అప్పూ.. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన చేసిన సేవలు అద్భుతం. రాజ్‌కుమార్‌తో ఉన్న క్షణాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తాను అప్పూకు ఓ స్నేహితుడిగానే ఇక్కడికి వచ్చా. మీ అందరి అభిమానాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశమిచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు. అప్పూ ఫ్యామిలీ నన్ను ఓ కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు వారికి రుణపడి ఉంటా.' అంటూ కన్నడలో మాట్లాడారు. దీంతో సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
దటీజ్ యంగ్ టైగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఏది చేసినా ఆ ప్రత్యేకతే వేరు.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఆయనను ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. నవంబర్ ఒకటో తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకలో యంగ్ టైగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్) ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌తో పాటు ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధామూర్తి కూడా హాజరయ్యారు. వేదికపై ఉన్న కూర్చీల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను కూర్చోమని నిర్వాహకులు కోరారు. కానీ ఎన్టీఆర్ అక్కడే ఉన్న మరో మహిళతో పాటు సుధామూర్తిని తానే స్వయంగా కూర్చీలను తుడిచి వారిని కూర్చోబెట్టారు. ఆ వీడియోను తీసిన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో యంగ్ టైగర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా స్త్రీ మూర్తులను గౌరవించే విషయంలో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిలేరని మరోసారి నిరూపించారంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన కన్నడ రాజ్యోత్సవ కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేశారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. His Simplicity 🥺🙏❤️#NTRajiniForAppu #NTRatಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ #NTRForAppu #PuneethRajkumar #DrPuneethRajkumar pic.twitter.com/N8b0R5j3Rr — Pradeep K (@pradeep_avru) November 1, 2022 -
జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కర్ణాటక అసెంబ్లీకి రావాలని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రత్యేక ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేయనున్నారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. టాలీవుడ్లోనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాకుండా పునీత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తారక్‌తోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి కూడా కర్ణాటక ప్రభుత్వం అహ్వానాలు పంపింది. ఎన్టీఆర్, రజినీకాంత్‌కు కర్ణాటక చాలా ప్రత్యేకం. సూపర్ స్టార్‌కు మహారాష్ట్ర మూలాలు ఉన్నా కర్నాటకలోనే బస్ కండక్టర్‌గా పనిచేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం కర్నాటక కావడంతో వీరిద్దరిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. -
మత మార్పిడుల నియంత్రణకు ఆర్డినెన్స్
బెంగళూరు: మత మార్పిడుల నిరోధక బిల్లుకు శాసన మండలి మద్దతు లభించకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలో మత మార్పిడులను అరికట్టడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కర్ణాటక మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లు’ గత ఏడాది డిసెంబర్లో కర్ణాటక అసెంబ్లీలో ఆమోదం పొందింది. శాసన మండలిలో మాత్రం ఆమోదం పొందలేదు. పెండింగ్‌లో ఉండిపోయింది. మండలిలో అధికార బీజేపీకి తగిన మెజార్టీ లేకపోవడమే ఇందుకు కారణం. బిల్లు చట్టరూపం దాల్చే అవకాశం ఇప్పట్లో లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వం చివరకు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయానికొచ్చింది. ఈ విషయాన్ని న్యాయ శాఖ మంత్రి జె.సి.మధుస్వామి స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల బెంగళూరు ఆర్చిబిషప్ పీటర్ మచాడో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేయొద్దంటూ కర్ణాటక గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు. ఆర్డినెన్స్ ఆలోచన చాలా బాధాకరమని ఒక ప్రకటనలో ఆక్షేపించారు. ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లు’ను అసెంబ్లీలో క్రైస్తవ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వ్యతిరేకించారు. -
అసెంబ్లీలోనే నిద్రపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా
-
మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం
బెళగావి(కర్ణాటక): వివాదాస్పద మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక శాసన సభ గురువారం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన మత మార్పిడిల సమస్యకు పరిష్కార మార్గంగా ‘కర్ణాటక మత స్వేచ్ఛ పరిరక్షణ బిల్లు–2021’ను తెచ్చినట్లు రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యులు సభలో వ్యతిరేకించారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. నిరసనలు, ఆందోళనల మధ్య సభ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రజావ్యతిరేక, అమానవీయ, చట్టవ్యతిరేక బిల్లును తెచ్చారంటూ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. జేడీ(ఎస్) సైతం బిల్లును తప్పుబట్టింది. ఈ తరహా చట్టం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అమల్లో ఉందని బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి పేర్కొన్నారు. బిల్లు.. మత స్వేచ్ఛను పరిరక్షిస్తూనే బలవంతపు, ఇంకొకరి ప్రోద్భలంతో, తప్పుడు పద్ధతిలో జరిగే మత మార్పిడిలను అడ్డుకుంటుంది. చట్టవ్యతిరేకంగా, నిబంధనలను అతిక్రమిస్తూ మత మార్పిడి జరిగితే నేరంగా పరిగణించి, రూ.25వేల జరిమానా, మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సామూహిక మత మార్పిడి నేరానికి గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. బిల్లు ప్రకారం ఇలాంటి వాటిని నాన్–బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. -
ఎమ్మెల్యే ‘అత్యాచార’ కామెంట్లు.. తీవ్ర దుమారం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో చర్చ సందర్భంగా కర్ణాటక ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ తప్పని పరిస్థితుల్లో రేప్ అనివార్యమైనపుడు దానిని ఆస్వాదించాల్సిందే’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్షమాపణ చెబుతున్నట్లు ఆయన తర్వాత ప్రకటించారు. రమేశ్ వ్యాఖ్యలపై బీజేపీ, జాతీయ మహిళా కమిషన్, కొందరు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రమేశ్ వ్యాఖ్యలపై రాహుల్, ప్రియాంక స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అసెంబ్లీలో గురువారం వరదలపై చర్చ సందర్భంగా రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సభా గౌరవాన్ని దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదని రమేశ్ తర్వాత చెప్పారు. ఈ విషయమై ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పా రు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పారు. ఇకపై జాగ్రత్తగా మాట్లాడతానని ఆయన తర్వాత ట్వీట్‌చేశారు. అంతకుముందు అంజలీ నింబాల్కర్ సహా కొందరు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు రమేశ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయాన్ని శుక్రవారం లోక్‌సభలో లేవనెత్తారు. ఆయన వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. అత్యాచారాన్ని ఆనందించాలన్న రమేశ్ మొత్తం భారతీయ మహిళలకు క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. ఒకపక్క దేశమంతా ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై రేప్ ఘటనపై విచారం వ్యక్తం చేస్తుంటే, ఈయన మాత్రం అత్యాచారాన్ని ఆనందించాలంటున్నాడని పీఏఆర్ఐ(పీపుల్ అగనెస్ట్ రేప్ ఇన్ ఇండియా) కార్యకర్త యోగితా భయానా దుయ్యబట్టారు. ఏంజరిగింది? అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం పంటల బీమాపై చర్చ సందర్భంగా అందరికి మాట్లాడేందుకు స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి అవకాశం ఇవ్వడంపై రమేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదమయ్యాయి. సభలో అందరూ ఒకేసారి మాట్లాడడం ప్రారంభిస్తే ఏమి చేయాలని స్పీకర్ అసహనం వ్యక్తంచేయగా, ‘ఒక సామెత ఉంది. అత్యాచారం తప్పదనుకుంటే దానిని ఆనందించాల్సిందే. ప్రస్తుతం మీరు ఈ స్థితిలోనే ఉన్నారు’ అని రమేశ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అనంతరం ఆయన క్షమాపణలు చెబుతూ, గురువారం సభలో మాట్లాడాల్సిన సభ్యుల సంఖ్య ఇంకా మిగిలేఉండటడంతో స్పీకర్‌కు సమయం గుర్తుచేస్తూ తాను ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు. ఒక ఇంగ్లిస్ సామెతను ప్రస్తావించానని, వేరే ఉద్దేశం ఏమీలేదని స్పష్టంచేశారు. 'There is a saying, When rape is inevitable, lie down and enjoy it': You would not believe an ex-Speaker & Congress MLA says this inside the #KarnatakaAssembly and Speaker laughs it off ... No one objects and it is business as usual @ndtv @ndtvindia #OutrageousRapeComment pic.twitter.com/n8oJ8itVDY — Uma Sudhir (@umasudhir) December 16, 2021 -
కర్ణాటక సర్కారుకు సొంతపార్టీ ఎమ్మెల్యే షాక్.. అసెంబ్లీలోనే ఫైర్
బెంగళూరు: పాడైపోయిన రోడ్లు, గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం చేయడమంటే సవాలుతో కూడుకొని ఉన్నదే. ఆ దారుల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. రోడ్లు సరిగా లేకపోడం కూడా రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది. అయినా నేతలకు చీమ కుట్టిన్నట్లు కూడా ఉండదు. తాజాగా బెంగుళూరులోని రోడ్ల పరిస్థితి కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు దారితీసింది. చెడిపోయిన, గుంతలమయమైన రోడ్ల వల్ల బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రతిపక్షాలతోపాటు అధికార ఎమ్మెల్యే సైతం విమర్శలు గుప్పించారు. బెంగుళూరులో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. అయితే రాష్ట్రంలో బీజీపీ అధికారంలో ఉండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి ప్రభుత్వంపై విమర్శలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక అసెంబ్లీలో శీతాకాల సమావేశాల సందర్భంగా.. బెంగళూరుతో పాటు చుట్టు పక్కల రోడ్ల పరిస్థితి గురించి బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నగరంలో రోడ్లను మెరుగు పరేచేందుకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు. చదవండి: పెళ్లి ఊరేగింపులో అపశృతి.. తృటిలో తప్పింది లేదంటే వరుడికి.. బెంగళూరులోని మహదేవపుర నియోజకవర్గం ఎమ్మెల్యే అరవింద్ లింబావలి మాట్లాడుతూ.. తన నియోజవవర్గంలో బెంగళూరు చుట్టుపక్కల గ్రామాలను అభివృద్ధి చేసేందుకు మంజూరు చేస్తున్న ఆర్థికసాయం నిధులు సరిపోవడం లేదన్నారు. తన నియోజకవర్గంలో అత్యధిక గ్రామలు ఉన్నాయని కానీ తక్కువ నిధులు ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని నేను సీఎంకు కూడా వివరించానని, రోడ్లను పునరుద్ధరిండడానికి కేవలం రూ. 1,000 కోట్లు కేటాయిస్తే సరిపోదన్నారు. వర్షాలు తగ్గడంతో బెంగళూరులో రోడ్లను పునరుద్ధరించాలని అరవింద్ లింబావలి కోరారు.. చదవండి: Sania Mistry: స్లమ్ సెన్సేషన్... ర్యాపర్ సానియా.. ఒక్కసారి వింటే! రోడ్లు వేయడం, రోడ్ల నిర్వహణలో ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం లోపించిందని మండిపడ్డారు. బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు పైప్లైన్లను వేస్తోంది. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్) కూడా రోడ్లను తవ్వుతోంది. వారి మధ్య పూర్తిగా సమన్వయం లోపించింది. వీరి మధ్య కాస్త సమన్వయం ఉంటేనే బెంగళూరు నగరం, రోడ్లు బాగుంటాయన్నారు. బెంగళూరు రోడ్ల పరిస్థితి గురించి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాగా రోడ్ల పరిస్థితిపై బీజేపీ ఎమ్మెల్యేతోపాటు రోడ్డు పనులకు నిధుల మంజూరులో జాప్యంపై జేడీఎస్‌కు చెందిన దాసరహళ్లి ఎమ్మెల్యే ఆర్ మంజునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బైటరాయణపురకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ బైరేగౌడ కూడా మండిపడ్డారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. -
"బెస్ట్ ఎమ్మెల్యే" అవార్డు అందుకున్న మాజీ సీఎం..
Yediyurappa Presented Best Legislator Award: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయిన బీఎస్ యడియూరప్ప 2020-21 సంవత్సరానికి గాను ఉత్తమ శాసనసభ్యుడిగా ఎంపికయ్యాడు. అసెంబ్లీ స్పీకర్ నేతృత్వంలోని.. సీఎం బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, న్యాయశాఖ మంత్రి మధుస్వామిలతో కూడిన కమిటీ ఈ అవార్డుకి యడియూరప్పని ఎంపిక చేసింది. అసెంబ్లీ సభ్యుడిగా ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను యడియూరప్పకి ఈ అవార్డు దక్కిందని కమిటీ పేర్కొంది. పార్లమెంట్లో ఏటా అందించే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల తరహాలో ఈ ఏడాది నుంచి కర్ణాటక శాసనసభ సభ్యులకు(మంత్రులకు కాదు) బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు ఇచ్చే ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు అసెంబ్లీ స్పీకర్ తెలిపారు. ఇవాళ(సెప్టెంబర్ 24) ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. యడియూరప్పకి జ్ఞాపికను బహుకరించారు. కార్యక్రమానికి సీఎం బసవరాజ్ బొమ్మై, శాసనసభ స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డే, శాసనమండలి చైర్మన్ బసవరాజ్ హోరట్టి తదితరులు హాజరయ్యారు. కాగా, యడియూరప్ప 1983లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శాసన మండలి, పార్లమెంట్ సభ్యుడిగా కూడా పని చేసిన ఆయన.. నాలుగు సార్లు సీఎం అయ్యారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ ఏడాది జులై 26న సీఎం పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చదవండి: భార్య రోజూ స్నానం చేయడం లేదు.. విడాకులు కోరిన భర్త! -
సర్..! మీ పంచె ఊడిపోయింది చూసుకోండి...!
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ఓ అంశంపై చర్చ జరుగుతుండగా ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. ప్రతిపక్షనేత సిద్ధరామయ్య ఒక్కసారిగా అసెంబ్లీలో నవ్వులు పూయించాడు. అసలు ఏం జరిగిందంటే... అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ఓ అంశంపై జరుగుతున్న చర్చలో భాగంగా ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తీవ్రస్థాయిలో సిద్దరామయ్య మాట్లాడుతున్న సమయంలో ఆయన పంచె ఊడిపోయింది. అది గమనించకుండా చర్చలో మాట్లాడుతూనే ఉన్నారు. అంతలోనే అటువైపుగా వచ్చిన కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. మెళ్లగా సిద్ధరామయ్య వద్దకు వెళ్లి చెవిలో పంచె ఊడిన విషయాన్ని తెలిపారు. వెంటనే తెరుకున్న సిద్ధరామయ్య అసెంబ్లీలో ‘నా పంచె ఊడిపోయింది’ అని కర్ణాటక ఆర్డీపీఆర్ మంత్రి ఈశ్వరప్పకు తెలిపి.. ‘నాకు కొంత సమయం ఇవ్వు’ అని అడిగారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో నవ్వులు పూశాయి. కోవిడ్-19 తరువాత కాస్త బరువుపెరిగానని సిద్ధరామయ్య నవ్వుతూ స్పీకర్‌కు తెలిపాడు. చదవండి: బీజేపీలోనే రాజకీయ వారసులెక్కువ.. -
ఛీ ఛీ.. అసెంబ్లీలో ఇదేం పాడుపని!
బెంగళూరు: చట్టాలు రూపొందించే చట్ట సభ. ప్రజాస్వామానికి మూలస్తంభం.. ప్రజా సమస్యలపై చర్చించే వేదిక అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఓ ప్రజాప్రతినిధి అశ్లీల వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ దృశ్యాలు బహిర్గతమవడంతో ఆయనపై ప్రజలతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చలు చేయకుండా పాడుపని ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. కర్నాటక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం శాసనమండలిలో చర్చ జరుగుతుండగా ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ సెల్ఫోన్లో అశ్లీల వెబ్సైట్లో వీడియోలు చూస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను ఆ వీడియోలు చూడలేదని ప్రకాశ్ రాథోడ్ చెప్పారు. తాను గ్రామీణాభివృద్ధిపై మంత్రితో మాట్లాడుతున్నానని.. దానికి సంబంధించిన ప్రశ్నల కోసం సెల్ఫోన్లో వెతుకుతున్నానని వివరణ ఇచ్చారు. సెల్ఫోన్లో డేటా నిండిపోవడంతో కొన్ని డిలీట్ చేస్తున్నట్లు రాథోడ్ తెలిపారు. రాథోడ్ చేసిన పనిని బీజేపీ తప్పుపట్టింది. వెంటనే అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. అయితే కర్నాటకలో అసెంబ్లీ అశ్లీల వీడియోలు చూడడం కొత్తేం కాదు. 2012లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉండడం గమనార్హం. -
కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా
సాక్షి, బెంగళూరు : కర్ణాటక శాసనసభ మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు విధానసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి సర్కారుపై బలపరీక్ష చర్చ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి బలపరీక్ష కోసం ప్రవేశపెట్టిన తీర్మానంపై మధ్యాహ్నం వరకూ చర్చ కొనసాగగా....స్పీకర్ సభను భోజన విరామం కోసం మూడింటి వరకూ వాయిదా వేశారు. మరోవైపు 15మంది రెబల్ ఎమ్మెల్యేలు సహా మొత్తం 21మంది సభకు గైర్హాజరు అయ్యారు. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం బీజేపీ పట్టుపట్టగా, సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కుమరస్వామి సర్కార్ మైనార్టీలో పడిందన్న బీజేపీ ఎమ్మెల్యేలు...బల నిరూపణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు వాదనల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులెవరూ విప్‌పై మాట్లాడలేదన్న ఆయన సభకు హాజరు కాకుంటే రెబల్ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించినట్లేనని అన్నారు, పార్టీ నాయకుడిగా విప్ జారీ చేసే హక్కు తనకు ఉందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేల భవితవ్యం తేలేవరకూ విశ్వాస పరీక్ష జరపటం సరికాదని అన్నారు. మరోవైపు తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలన్నింటికీ సమాధానం చెబుతామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. -
అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం
యశవంతపుర (బెంగళూరు): సాధారణంగా సిగరెట్లు, గుట్కా, మద్యం వంటివాటిని చట్టసభల ఆవరణలోకి అనుమతించరు. కానీ అసెంబ్లీ భవనం విధానసౌధలోకి నిమ్మకాలను తీసుకెళ్లడం కూడా నిషిద్ధమే. గురువారం కొందరు వ్యక్తులు నిమ్మకాయలను తీసుకెళ్తుండగా గేట్ల వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా టిఫిన్, లంచ్ క్యారియర్లు, జేబుల్లో నిమ్మకాయలు దొరికితే వెంటనే తీసుకుని చెత్త కుండీలో పడేస్తున్నారు. ఆరోగ్యం సరిగాలేదని, మధ్య మధ్యలో నిమ్మరసం తాగాలని ఉద్యోగులు, సందర్శకులు చెబుతున్నా భద్రతా సిబ్బంది ససేమిరా అంటున్నారు. చేతబడి భయమా దీనికంతటికీ కారణం మూఢనమ్మకాలే. సందర్శకులు, కాంట్రాక్టర్లు మంత్రించిన నిమ్మకాలను తీసుకెళ్లి అధికారులను ప్రభావితం చేసి పనులు చేయించుకుంటారని భద్రత సిబ్బంది అనుమానిస్తున్నారు. దీంతో పాటు చేతబడి చేసిన నిమ్మకాయలను తీసుకెళ్లి మంత్రుల చాంబర్లలో వేస్తారనే భయాలూ ఉన్నాయి. ఇకపై విధానసౌధకు నిమ్మకాయలను తేవడాన్ని నిషేధించినట్లు అధికారులు తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీటిపై అనేక చర్చలు జరిగాయి. ఇది ఎలా ఉన్నా, సీఎం కుమారస్వామి అన్న, ప్రజాపనుల మంత్రి హెచ్డీ రేవణ్ణ నిత్యం చేతిలో నిమ్మకాయను పట్టుకుని ఉంటారు. ఈ నిషేధం ఆయనకు వర్తిస్తుందా? అని సౌధ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. -
అమెరికాలో సీఎం; ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ సర్కారులో మరో సంక్షోభం తలెత్తింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముందుగా ఆనంద్ సింగ్ రాజీనామా చేయగా, మరికొద్ది గంటల తర్వాత మరో ఎమ్మెల్యే రమేశ్ జర్కయాళి కూడా ఆయన బాటలో నడిచారు. వీరిద్దరి రాజీనామాలతో కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ సర్కారు బలం 117కి తగ్గింది. 224 స్థానాలున్న శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 113. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయనగర్ నియోజకవర్గం నుంచి ఆనంద్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తన నియోజవర్గంలోని ప్రభుత్వ భూమిని జిందాల్ సంస్థకు లీజుకు ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఆనంద్ సింగ్ విలేకరులకు తెలిపారు. ఆనంద్ సింగ్ రాజీనామా లేఖ అందిందని స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. రమేశ్ జర్కయాళి రాజీనామా లేఖను స్వీకరించేందుకు స్పీకర్ ఆఫీసు నిరాకరించింది. తన రాజీనామా వెనుక ఎవరి ఒత్తడి లేదని, ఇది తన సొంత నిర్ణయమని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ‘న్యూజెర్సీలో కాలభైరేశ్వర ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఉన్నాను. టీవీ చానళ్లు చూస్తున్నాను. మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పగటి కలలుగానే మిగులుతాయ’ని ఆయన ట్వీట్ చేశారు. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కోరుకోవడం లేదన్నారు. ఒకవేళ సంకీర్ణ సర్కారు తనంతట తాను కూలిపోతే ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఎటువంటి పొరపొచ్చాలు లేవని, ఆనంద్ సింగ్ రాజీనామా తనకు షాక్ కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. కాగా, జనవరిలో ఈగల్టన్ రిసార్టులో కంప్లి ఎమ్మెల్యే గణేశ్‌తో జరిగిన ఘర్షణలో గాయపడిన ఆనంద్ సింగ్ ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. -
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యక్షం
బెంగళూరు: కర్ణాటకలో కొద్ది వారాలుగా కనిపించకుండా పోయిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం అకస్మాత్తుగా అసెం బ్లీలో ప్రత్యక్షమయ్యారు. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్‌కు కాంగ్రెస్ సిఫారసు చేసిన రెండు రోజులకే వారు నలుగురు ప్రత్యక్షం కావడం గమనార్హం.కాంగ్రెస్ సభాపక్ష సమావేశాలకు హాజరు కావాలంటూ ఇచ్చిన ఆ పార్టీ విప్ ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ కొద్ది వారాలుగా రమేశ్ జారకిహోళి, ఉమేశ్ జాదవ్, బి.నాగేంద్ర, మహేశ్ కుమతళ్లి అనే నలుగురు ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారు. ఈనెల 6 నుంచి జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కావట్లేదు. వీరు నలుగురు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నారని భావిస్తున్నారు. వీరిని తమ వైపు తిప్పుకొని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిసెంబర్ 22న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రమేశ్ జారకిహోళిని మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ‘అసంతృప్తితో ఉన్నానన్న విషయా న్ని నేను ఖండించట్లేదు. కానీ ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ఫిబ్ర వరి 24న జరగనున్న నా కుమార్తె పెళ్లి పనుల కోసం ముంబై వెళ్లాను’ అని రమేశ్ చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలు ప్రత్యక్షం కావడంతో అధికార పక్షం కాస్త ఊపిరి పీల్చుకుంది. -
యడ్యూరప్ప నోటివెంట అసలు నిజం..
బెంగళూరు: బలపరీక్షలో బీజేపీనే నెగ్గుతుందని ఆ పార్టీ నాయకులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. ఎలా గెలుస్తారంటే మాత్రం.. ‘రేపు మీరే చూస్తారుగా..’. అని తప్పించుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం అసలు నిజం కక్కేశారు. శుక్రవారం రాత్రి బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నూటికి నూటాఒక్కశాతం బలపరీక్షలో తమదే విజయమన్నారు. అంతటితో ఆగకుండా.. ‘‘అవును. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు లేకుంటే మేమెలా గెలవగలం..’’ అని అనేశారు. రేపు రాష్ట్రంలో సంబురాలు: ‘‘ఊహించినదానికంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. రేపు సాయంత్రం కర్ణాటకలో సంబురాలు జరుగుతాయి. ఆ విజయాన్ని ఆరుకోట్ల కన్నడిగులకు అంకితం చేస్తాం. జేడీఎస్-కాంగ్రెస్‌లది అపవిత్రపొత్తు, వాళ్లు జాతి విద్వేషాలను రెచ్చగొట్టారు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. ప్రజలు బుద్ధిచెప్పినా, దొడ్డిదారిలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదిఏమైనా చివరికి గెలుపుమాదే’’ అని సీఎం యడ్యూరప్ప అన్నారు. -
బలపరీక్షలో గెలిచేది బీజేపీనే! ఎలాగో తెలుసా..
న్యూఢిల్లీ: కర్ణాటక పొలిటికల్ థ్రిల్లర్‌లో నిమిషానికో మలుపు.. సెకనుకో ఊహాగానం! శుక్రవారం నాటి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కర్ణాటక అసెంబ్లీలో శనివారం జరుగనున్న బలపరీక్షలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఎదురుచూస్తున్నవేళ.. జేడీయూ-కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే ఉన్నారని, గవర్నర్‌కు సమర్పించిన 115 సంతకాల్లో ఆ ఎనిమిది మందివి ఫోర్జరీ చేసిఉండొచ్చని ‘రిపబ్లిక్ టీవీ’ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టుకు ఫోర్జరీ సంతకాల జాబితా: కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్ శిబిరంలో లేరు. వారంతా ఢిల్లీలో బీజేపీ నేతల సంరక్షణలో ఉన్నారు. శనివారం బలపరీక్ష సమయానికి వారిని బెంగళూరుకు తరలించనున్నారు. నిజానికి బెంగళూరు ఈగిల్టన్ రిసార్ట్స్, షాంగ్రీ-లా హోటల్ల్లో శిబిరాలు ఏర్పాటేచేసేనాటికే ఆ ఎనిమిది మంది జంప్ అయ్యారట. గవర్నర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలోనూ ఈ ఎనిమిది మంది సంతకాలు చేయలేదట. దీంతో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి సంతకాలను సేకరించి.. ఫోర్జరీ చేశారట. ఆ ఎనిమిది ఫోర్జరీ సంతకాల జాబితానే కాంగ్రెస్, జేడీఎస్‌లు గవర్నర్‌కు, ఆపై సుప్రీంకోర్టుకు పంపాయని ‘రిపబ్లిక్’ కథనంలో వెల్లడించింది. అలా 104కు మరో ఎనిమిది మంది జంప్ జిలానీలు తోడుకాగా బీజేపీ బలం మ్యాజిక్ ఫిగర్(112)కు చేరుకుంటుంది కాబట్టి బలపరీక్షలో యడ్యూరప్ప సునాయాసంగా గెలుస్తారన్నది ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ ఏమంటోంది?: తమ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరిని.. బీజేపీ నేతలు ఢిల్లీలో బంధించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ ఎమ్మెల్యే (ఆనంద్ సింగ్) పేరును కూడా వెల్లడించింది. అయితే, ‘రిపబ్లిక్’ కథనం చెప్పినట్లు 8 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై కాంగ్రెస్ వర్గాలు ఎక్కడా ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం. -
బల నిరూపణకు మేం సిద్దం: యడ్యూరప్ప
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప బల నిరూపణకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం బల నిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాలను బీజేపీ పాటిస్తుందన్నారు. మెజార్టీ సాధించేంతా ఎమ్మెల్యేల మద్దతు తమకుందని స్పష్టం చేశారు. బలపరీక్షలో 100 శాతం నెగ్గుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు అసెంబ్లీ సమావేశం నిర్వహించేలా చీఫ్ సెక్రటరీతో చర్చిస్తానన్నారు. సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నాం.. రేపే బలనిరూపణ చేసుకోవాలనే ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ శోభా కరాండ్లజే అన్నారు. రేపు అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. బల నిరూపణకు తమ పార్టీ సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల పిటిషన్లను విచారించిన జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ భూషణ్, జస్టిస్ బాబ్డేలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ శనివారం బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు బలపరీక్ష జరగనుంది. -
రేపు బలాన్ని నిరూపించుకోండి : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం బల నిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. శుక్రవారం కాంగ్రెస్-జేడీఎస్‌ల పిటిషన్లను విచారించిన జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ భూషణ్, జస్టిస్ బాబ్డేలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును వెలువరించింది. కాంగ్రెస్-జేడీఎస్‌ల తరఫు న్యాయవాది తమకు 116 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందని ధర్మాసనానికి తెలుపగా, బీజేపీ తరఫు న్యాయవాది రోహత్గి తమకూ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కేసును, సర్కారియా కమిషన్ సూచనలను సైతం ప్రస్తావించారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల కూటమి అపవిత్రమైనదని వాదించారు. ఇందుకు ప్రతిగా స్పందించిన అభిషేక్ సింఘ్వీ ఏ పార్టీ అధికారాన్ని చేపట్టాలో? ఏ పార్టీ చేపట్టకూడదో? సుప్రీం కోర్టు నిర్ణయించాలని కోరారు. సర్కారియా కమిషన్ సూచనలకు న్యాయబద్దత లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటును గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాసిన లేఖలను ధర్మాసనం పరిశీలించింది. ఎంతమంది మద్దతు ఉందో వారి వివరాలను ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. పూర్తిగా నంబర్ గేమ్‌పై కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉందని వ్యాఖ్యానించింది. శనివారం బలపరీక్ష నిర్వహిస్తే బావుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు కాంగ్రెస్ తరఫు న్యాయవాది సింఘ్వీ సంసిద్ధత వ్యక్తం చేయగా, బీజేపీ తరఫు న్యాయవాది రోహత్గి వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అంత సమయం ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేల కొనుగోళ్లకు దారి తీసే అవకాశం ఉందని రోహత్గి అభ్యర్థనపై ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనివల్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగాలని తీర్పు నిచ్చింది. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించాలన్న ప్రతిపాదనను సైతం తిరస్కరించింది. ఎమ్మెల్యేలు అందరికీ రక్షణ కల్పించాలిని, బల పరీక్ష సజావుగా సాగాలని కర్ణాటక డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు కాంగ్రెస్-జేడీఎస్‌ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. బల పరీక్ష అయ్యేంత వరకూ బీజేపీ ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు చెప్పారు. అయితే, బల పరీక్షను వీడియో షూట్ చేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించినట్లు వెల్లడించారు. -
కర్ణాటక కాంగ్రెస్‌కు జిగ్నేశ్ దన్ను
సాక్షి, బెంగళూరు: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన ఆ రాష్ట్ర దళిత నేత జిగ్నేశ్ మేవానీ త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న దళితుల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ జిగ్నేశ్‌ను రంగంలోకి దింపనుంది. గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేసిన జిగ్నేశ్ బలమైన దళిత నేతగా ఎదిగారు. తొలి ప్రయత్నంలోనే ఆయన వడగావ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఆయనను ప్రచారానికి తీసుకురావాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకు ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఆయన సీఎం సిద్ధరామయ్యతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. -
ఎమ్మెల్యేలకు బంగారు బిస్కెట్లు!
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ప్రజలు ఎలా పోతే మనకేంటి, మనం బాగున్నామా లేదా? వరుస వర్షాలతో రాష్ట్రం, రాజధాని వణికిపోతున్నా పాలకులు మాత్రం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అడుగేయాలంటే భయపడుతూ ప్రజలు గుంతల రోడ్లపై తిరుగుతుంటే ప్రభుత్వం ఆండబరాలకు పోతోంది. వర్షం వస్తే చాలు మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతుంది. గుంతల రోడ్ల కారణంగా వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా రాష్ట్రం మొత్తం సమస్యలతో సతమతమౌతుంటే, ప్రభుత్వం వీటన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజా ప్రతినిధులకు బంగారు బిస్కెట్లు కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక అసెంబ్లీ(విధాన సౌధా) నిర్మించి 60 ఏళ్లు కావొస్తోంది. ఇందులో భాగంగా 300మంది ప్రజాప్రతినిధులకు బంగారు బిస్కెట్లను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.3కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోంది. ముఖ్యమంత్రి నుంచి ఆమోదం రాగానే సభ్యులందరికీ ఈ బంగారు బిస్కెట్లను అందిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ సిబ్బందికి మాత్రం రూ.6వేలు విలువ చేసే వెండి వస్తువులను ఇవ్వాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం కోసం ఈ నెల 25, 26న ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈకార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించే యోచనలో ఉన్నారు. అయితే ఈ విషయమై సిద్ధరామయ్య ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని అధికారులు వెల్లడించారు. అయితే ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. తీవ్ర వర్షాలతో రాష్ట్రం అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఆడంబరాలకు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో రోడ్లు నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా బంగారు బిస్కెట్లు పంచుకోవడం ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఆ వార్తలు అబద్ధం : స్పీకర్ తన చేతుల మీదుగా బంగారు కాయిన్లు, వెండి పళ్లాలు పంచబోతున్నారన్న వార్తలను అసెంబ్లీ స్పీకర్ కేబీ కొలివాదా ఖండించారు. ‘ ఆ వార్త పచ్చి అబద్ధం. అలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో కూడా తెలీటం లేదు’ అని ఆయన మీడియాతో అన్నారు. అయితే 26 కోట్ల రూపాయిలతో 19 రకాల వస్తువులను మాత్రం పంచబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఓ ప్రతిపాదన పంపినట్లు ఆయన అంగీకరించారు. లెక్కలు ఎలా ఉన్నాయంటే... పూల అలంకరణకు 75 లక్షలు, కాఫీ, టీల ఖర్చు కోసం 35 లక్షలు, తిండి ఖర్చు 3 కోట్ల 75 లక్షలు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాధించిన ఘనతలను ప్రత్యేక డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించటం.. అందుకోసం 3 కోట్లు కేటాయించాలని నిర్ణయం. -
‘కంబళ’ బిల్లుకు ఆమోదం
బెంగళూరు: కరావళి ప్రాంత సాంస్కృతిక క్రీడ కంబళ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించే బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర వేసింది. గతంలో చెప్పినట్లుగానే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లుపై చర్చించి పాస్ చేశారు. దీని ప్రకారం జీవహింస నిరోధక చట్టాల్లో సవరణలు చేస్తారు. దీనికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేకపోలేదు. జల్లికట్టుకు అడ్డుకట్టపడినట్లుగానే కంబళకు కూడా కర్ణాటక హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు మాదిరిగానే కర్ణాటకలో కూడా పెద్ద మొత్తంలో నిరసనలు బయలుదేరాయి. దీంతో ఈ గ్రామీణ క్రీడలో ఎలాంటి జీవహింస ఉండదని,ఆధ్యాత్మిక భావనతో ముడిపడిన కంబళ క్రీడను నిర్వహించుకోవడానికి గతంలోనే ప్రభుత్వం అనుమతిచ్చిందని, దీని నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు త్వరలోనే చట్ట సవరణ బిల్లును తీసుకొస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ మాట ప్రకారం సవరణలు కోరే బిల్లును సోమవారం పాస్ చేసింది. -
ఇదేమి చోద్యం !
సాక్షి, బెంగళూరు: రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సహకార శాఖ మంత్రి హెచ్.ఎస్ మహదేవ ప్రసాద్ తలోదారిలో ప్రయాణిస్తున్నారా?.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇందుకు మంగళవారం జరిగిన సంఘటనలను విపక్షాలతో పాటు రైతుల సంఘాల నాయకులు ప్రస్తావిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా బెళగావిలో రెండో రోజు మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందే శాసనసభలో విపక్ష సభ్యులు కరువుపై చర్చకు పట్టుబట్టాయి. 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తక్షణం వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని పట్టుబట్టారు. కలుగజేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..రైతుల కష్టాలు తమకూ తెలుసన్నారు. సహకార సంఘాల్లో తీసుకున్న పంటరుణాలను మాఫీ చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఈ విషయమై ఇప్పటికే వివిధ మార్గాల్లో నివేదికలు కూడా తెప్పించుకున్నామని పేర్కొంటూ మొదట ప్రశ్నోత్తరాల సమయానికి సహకరించాలని విపక్షాలకు సూచించారు. ఈ సమయంలో స్పీకర్ కోడివాళ కలుగజేసుకోవడంతో కొశ్చన్ అవర్ ప్రారంభమైంది. ఇదిలాఉండగా చెరకు ఫెరుుర్ అండ్ రెమ్యూనిరేటీవ్ (ఎఫ్ఆర్పీ) ధరను పెంచే విషయంతో పాటు బకాయిల చెల్లింపు తదితర విషయాలకు సంబంధించి రైతు సంఘం నాయకులతో సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ బెళగావిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో వ్యసాయ రుణాలను మాఫీ చేస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.9,978 కోట్లు భారం పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ఆర్థికభారాన్ని ప్రభుత్వం మోయలేదని తేల్చిచెప్పారు. అందువల్ల రైతుల రుణాల మాఫీ చేయలేమని స్పష్టం చేశారు. అరుుతే రుణాల వడ్డీలను రీ షెడ్యూల్ చేసే విషయం మాత్రం అలోచిస్తామన్నారు. దీనిపై రాష్ట్ర చెరుకు రైతు సంఘం అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్ స్పందిస్తూ..ఒకే విషయమై బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు విరుద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చర్చలు విఫలం... చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్యూనిరేటీవ్ (ఎఫ్ఆర్పీ) పెంపు విషయంతో పాటు బకారుుల చెల్లింపుపై ప్రభుత్వం, రైతు సంఘం నాయకుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంబన తొలగలేదు. ఎఫ్ఆర్పీని టన్నుకు రూ.3,050 వరకు పెంచాలని రైతు సంఘం నాయకులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు చక్కెర కర్మాగారాల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలనేది వారి మరొక ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ అధ్యక్షతన బెళగావిలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చెరకు రైతు సంఘం నాయకులు, వివిధ ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, చక్కర కర్మాగార యాజమాన్యం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెరుకు ఎఫ్ఆర్పీ పెంచడం సాధ్యం కాదని మహదేవ ప్రసాద్ రైతులతో పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు ’చక్కెర యాజమాన్యం లాబీకి తలొగ్గిన మంత్రికి రైతుల కష్టాలు అర్థం కావడం లేదు. చెరుకు ఎఫ్ఆర్పీ పెంచేంతవరకూ తాము వెనకడుగువేసేది లేదు. వెంటనే బకాయిలను చెల్లించాలి. అప్పటి వరకూ బెళగావిలో వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటాం’ అని పేర్కొంటూ సమావేశం నుంచి అర్థాతరంగా బయటకి వచ్చేశారు. అటుపై మంత్రి మహదేవ్ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ...మంగళవారం జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిసాయన్నారు. ఈ విషమై ఈనెల 24న మరోసారి రైతు సంఘం నాయకులతో చర్చిస్తామన్నారు. సమస్యకు తప్పక పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కరువుపై గళం
సాక్షి,బెంగళూరు: శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే వేడి రాజుకుంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు చట్టసభలను కుదిపేశాయి. సమస్యల పరిష్కారం కోసం బెళగావికి చేరుకుంటున్న రైతుల అరెస్టును ఖండిస్తూ విపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించాయి. ఈ ఏడాది శీతాకాల శాసనసభ సభలు బెళగావిలోని సువర్ణ విధానసౌధలో సోమవారం నుంచి లాంఛనంగా ప్రారంభమయ్యాయి. విధానసౌధలో జగదీష్‌శెట్టర్ మాట్లాడుతూ.... సమస్యలను ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడానికి బెళగావికి వస్తున్న రైతులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడం, మండ్య, మైసూరు వంటి చోట్ల శాంతిభత్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం తుగ్లక్ పాలనను గుర్తుకు తెస్తోందని వ్యంగమాడారు. ఈ సమయంలో అధికార, విపక్షనాయకులు మధ్య వాగ్వాదం చెలరేగింది. అరుునా వెనక్కు తగ్గని బీజేపీ నేతలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేడీఎస్ శాసనసభ్యులు సైతం వారికి మద్దతుగా వెల్‌లోకి దూసుకెళ్లారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలుగజేసుకుని సువర్ణ విధానసౌధ చుట్టూ నిషేదాజ్ఞలు ఉండటం వల్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు రైతులను అదుపులోకి మాత్రమే తీసుకున్నారన్నారు. ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. వారిని వదిలిలేయాలని ఆదేశాలను జారీ చేశామన్నారు. ఎవరి పైనా కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. అయినా విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు స్పీకర్ కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. పరిషత్‌లో కూడా... పరిషత్‌లో కూడా రైతుల అరెస్టుపై విపక్షాలు ప్రభుత్వ చర్యలను తప్పుపట్టాయి. అనంతరం మండలి విపక్షనేత కే.ఎస్ ఈశ్వరప్ప కరువుపై చర్చకు పట్టుబట్టారు. అయితే అక్కడే ఉన్న మండలి నాయకుడు పరమేశ్వర్ అడ్డుచెప్పారు. మొదట ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించాలని అటుపై వివిధ అంశాలపై చర్చలు జరపాలని పేర్కొన్నారు. దీంతో కే.ఎస్ ఈశ్వరప్ప ఆగ్రహం వ్యక్త చేశారు. ‘ప్రభుత్వానికి ప్రజాసమస్యలపై చిత్తశుద్ధిలేదు. అందువల్లే కరువుపై చర్చిచండానికి కాంగ్రెస్ నేతలు సిద్ధంగా లేరు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. జేడీఎస్ ఎమ్మెల్సీలు కలుగజేసుకుని కరువుతో పాటు పెద్దనోట్ల రద్దు వల్ల రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండలి దృష్టికి తీసుకువచ్చారు. గంభీరత దృష్ట్యా మొదట కరువుపై చర్చకు అనుమతివ్వాలని మండలి అధ్యక్షుడు శంకరమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శంకరమూర్తి కలుగజేసుకుని విపక్షనాయకుడు కరువుపై ప్రస్తావించాలని, చర్చ మాత్రం ప్రశ్నోత్తరాల తర్వాత జరుగుతుందని స్పష్టంచేశారు. ఒక్క పైసా కూడా విడుదల కాలేదు... కరువు పరిస్థితులపై కే.ఎస్ ఈశ్వరప్ప మండలిలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 139 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కరువు నివారణకు ప్రతి తాలూకాకు రూ.50 లక్షలు అదంజేశామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. కరువు పరిహారం కోసం ప్రత్యేకంగా రూ.10వేల కోట్ల నిధులను కేటాయించాలి’ అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు రూ.96,834 కోట్లు కాగా అందులో రూ.12,850 కోట్లు ప్రభుత్వ బ్యాంకులు, సహకార సంఘాల్లో తీసుకొన్నవేనన్నారు. ఆ రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో కేంద్రాన్ని తప్పు పట్టడం సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదట తన వాటాను విడుదల చేసి రైతు సంక్షేమం విషయంలో తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ఈశ్వరప్ప ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఈ సమయంలో తిరిగి గందరగోళం చెలరేగినా మండలి అధ్యక్షుడు శంకరమూర్తి కలుగజేసుకోవడంతో సభా కార్యాక్రమాలు సజావుగా కొనసాగాయి. కాగా, అంతకు ముందు ఇటీవల చనిపోయిన ప్రజాప్రతినిధులకు, అప్పులబాధతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు ఉభయ సభల్లో ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. -
సాగునీటికీ కావేరి జలాలు
-
సాగునీటికీ కావేరి జలాలు
బెంగళూరు/న్యూఢిల్లీ: తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేసే క్రమంలో కర్ణాటక అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. తమ రాష్ట్ర సాగునీటి అవసరాలకు నీటి విడుదలపై తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి అన్ని అధికారాలు కట్టబెడుతూ తీర్మానం చేశారు. మంగళవారం మధ్యాహ్నంలోగా తమిళనాడుకు నీటి విడుదలపై సమాచారమివ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో తీర్మానం తెచ్చారు. 4 కావేరి రిజర్వాయర్ల నుంచి తాగునీటికే నీటిని విడుదల చేయాలన్న గత తీర్మానంలో మార్పులు చేస్తూ... సాగునీటి అసవరాలకూ నీరివ్వొచ్చని తాజా తీర్మానంలో పేర్కొన్నారు. తమిళనాడుకు నీటి విడుదలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని పాటిస్తామంటూ పరోక్ష సంకేతాలిచ్చిన సీఎం సిద్ధరామయ్య... తాగునీటి అవసరాలతో పాటు, పంటల్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. కర్ణాటక ఎప్పుడూ కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించలేదని పేర్కొన్నారు. కావేరీ పరివాహకంలో రైతులు నీటి విడుదల చేయాలని కోరుతున్నారని, నీటిని విడుదల చేస్తే కొంత సహజంగా తమిళనాడుకు వెళ్తుందన్నారు. బోర్డు ఏర్పాటుపై ఆదేశించలేరు: కేంద్రం ఈ వివాదంపై కేంద్రం తొలిసారి స్పందించింది. కావేరి నీటి నిర్వహణ బోర్డును(సీడబ్ల్యూఎంబీ) ఏర్పాటు చేయాలని తమను ఆదేశించకూడదని సుప్రీంకోర్టుకు తెలిపింది. కావేరి పరివాహకంలో క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ కోసం సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామంది. వివాదం చట్టసభల పరిధిలో ఉందని, సీడబ్యూఎంబీ ఏర్పాటు ఆదేశాల్ని సమీక్షించడం, వెనక్కి తీసుకోవడమో చేయాలని కోరింది. -
కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ, జేడీఎస్ ఆందోళన
బెంగళూరు: మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి ఆత్మహత్యపై ప్రతిపక్ష బీజేపీతో పాటు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కారు తీరును నిరసిస్తూ... 24గంటల నిరసన చేపట్టింది. బీజేపీ, జేడీఎస్ శాసనసభ్యులు రాత్రంతా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉండి ఆందోళన కొనసాగించారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్ల వల్లే ... కర్నాటకలో ఐపీఎస్ అధికారులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారని నేతలు ఆరోపించారు. మంత్రి కేజే జార్జ్ పేరును బాధితుడు సూసైడ్ నోట్లో ప్రస్తావించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. మంత్రి రాజీనామా చేయడంతోపాటు... కేసును సీబీఐకి అప్పగించేవరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పోలీస్ అధికారి గణపతి ఆత్మహత్య కేసులో బీజేపీ చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిరాకరించారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేజే జార్జ్ మాత్రం బీజేపీ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని... సరైన సాక్ష్యాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
డీఎస్పీ ఆత్మహత్యపై బీజేపీ ఆందోళన
-
సభ జరుగుతుంటే సెల్ఫోన్లతో కాలక్షేపం
కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల నిర్వాకం బెంగళూరు: శాసనసభలోకి సెల్ఫోన్లు తీసుకురాకూడదన్న నిబంధనను ఉల్లంఘించి ఇద్దరు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు సభ జరుతుండగానే తమ సెల్ఫోన్లను చూసుకుంటూ మీడియా కంటబడ్డారు. వారిలో ఔరాద్ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కాంగ్రెస్ చీఫ్ సోనియా తనయ ప్రియాంక ఫొటోను జూమ్ (పెద్దదిగా చేయడం) చేసి చూడటం వివాదాస్పదమవగా మరో ఎమ్మెల్యే యు.బి. బణకార్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడటంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. -
'సచిన్ అంటే క్రికెట్...క్రికెట్ అంటేనే సచిన్'
భారతరత్నలు సాధించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ సైంటిస్ట్ సీఎన్ఆర్ రావు లకు కర్నాటక అసెంబ్లీలో అభినందనలు తెలిపింది. కర్నాటకలో శీతాకాలపు సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్యా మాట్లాడుతూ.. 24 ఏళ్ల పాటు క్రికెట్ రంగంలో కొనసాగి, అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని అన్నారు. 51 టెస్ట్ సెంచరీలు, 49 వన్డే సెంచరీల సాధించారని.. 'సచిన్ అంటే క్రికెట్'.. 'క్రికెట్ అంటే సచిన్' అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ తప్పుకోవడం ఆ రంగానికి తీరని లోటు అన్నారు. నాకు క్రికెట్ ఆడటం రాదు. కాని టెండూల్కర్ ఆడిన ప్రతిసారి చూడటానికి ప్రయత్నిస్తాను అని ఆయన అన్నారు. క్రికెట్ దేవుడు అని కర్నాటక ప్రతిపక్ష నేత జేడీఎస్ నేత హెచ్ డీ కుమార స్వామి అన్నారు. సచిన్ రిటైర్మెంట్ తో దేశ ప్రజలు విచారంలో మునిగారు అని మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ అన్నారు. సచిన్ సాధించిన రికార్డులు క్రికెట్ కు పాపులారిటీని సంపాదించాయని కర్నాటక జనతా పక్ష అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప అన్నారు.