'సచిన్ అంటే క్రికెట్...క్రికెట్ అంటేనే సచిన్'
'సచిన్ అంటే క్రికెట్...క్రికెట్ అంటేనే సచిన్'
Published Mon, Nov 25 2013 2:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
భారతరత్నలు సాధించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ సైంటిస్ట్ సీఎన్ఆర్ రావు లకు కర్నాటక అసెంబ్లీలో అభినందనలు తెలిపింది. కర్నాటకలో శీతాకాలపు సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్యా మాట్లాడుతూ.. 24 ఏళ్ల పాటు క్రికెట్ రంగంలో కొనసాగి, అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని అన్నారు.
51 టెస్ట్ సెంచరీలు, 49 వన్డే సెంచరీల సాధించారని.. 'సచిన్ అంటే క్రికెట్'.. 'క్రికెట్ అంటే సచిన్' అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ తప్పుకోవడం ఆ రంగానికి తీరని లోటు అన్నారు. నాకు క్రికెట్ ఆడటం రాదు. కాని టెండూల్కర్ ఆడిన ప్రతిసారి చూడటానికి ప్రయత్నిస్తాను అని ఆయన అన్నారు.
క్రికెట్ దేవుడు అని కర్నాటక ప్రతిపక్ష నేత జేడీఎస్ నేత హెచ్ డీ కుమార స్వామి అన్నారు. సచిన్ రిటైర్మెంట్ తో దేశ ప్రజలు విచారంలో మునిగారు అని మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ అన్నారు. సచిన్ సాధించిన రికార్డులు క్రికెట్ కు పాపులారిటీని సంపాదించాయని కర్నాటక జనతా పక్ష అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప అన్నారు.
Advertisement