
బెంగళూరు: బలపరీక్షలో బీజేపీనే నెగ్గుతుందని ఆ పార్టీ నాయకులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. ఎలా గెలుస్తారంటే మాత్రం.. ‘రేపు మీరే చూస్తారుగా..’. అని తప్పించుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం అసలు నిజం కక్కేశారు. శుక్రవారం రాత్రి బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నూటికి నూటాఒక్కశాతం బలపరీక్షలో తమదే విజయమన్నారు. అంతటితో ఆగకుండా.. ‘‘అవును. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు లేకుంటే మేమెలా గెలవగలం..’’ అని అనేశారు.
రేపు రాష్ట్రంలో సంబురాలు: ‘‘ఊహించినదానికంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. రేపు సాయంత్రం కర్ణాటకలో సంబురాలు జరుగుతాయి. ఆ విజయాన్ని ఆరుకోట్ల కన్నడిగులకు అంకితం చేస్తాం. జేడీఎస్-కాంగ్రెస్‌లది అపవిత్రపొత్తు, వాళ్లు జాతి విద్వేషాలను రెచ్చగొట్టారు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. ప్రజలు బుద్ధిచెప్పినా, దొడ్డిదారిలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదిఏమైనా చివరికి గెలుపుమాదే’’ అని సీఎం యడ్యూరప్ప అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment