బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో చర్చ సందర్భంగా కర్ణాటక ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ తప్పని పరిస్థితుల్లో రేప్ అనివార్యమైనపుడు దానిని ఆస్వాదించాల్సిందే’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్షమాపణ చెబుతున్నట్లు ఆయన తర్వాత ప్రకటించారు. రమేశ్ వ్యాఖ్యలపై బీజేపీ, జాతీయ మహిళా కమిషన్, కొందరు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రమేశ్ వ్యాఖ్యలపై రాహుల్, ప్రియాంక స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
అసెంబ్లీలో గురువారం వరదలపై చర్చ సందర్భంగా రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సభా గౌరవాన్ని దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదని రమేశ్ తర్వాత చెప్పారు. ఈ విషయమై ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పా రు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పారు. ఇకపై జాగ్రత్తగా మాట్లాడతానని ఆయన తర్వాత ట్వీట్‌చేశారు. అంతకుముందు అంజలీ నింబాల్కర్ సహా కొందరు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు రమేశ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయాన్ని శుక్రవారం లోక్‌సభలో లేవనెత్తారు. ఆయన వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు ఖండించారు.
అత్యాచారాన్ని ఆనందించాలన్న రమేశ్ మొత్తం భారతీయ మహిళలకు క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. ఒకపక్క దేశమంతా ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై రేప్ ఘటనపై విచారం వ్యక్తం చేస్తుంటే, ఈయన మాత్రం అత్యాచారాన్ని ఆనందించాలంటున్నాడని పీఏఆర్‌ఐ(పీపుల్ అగనెస్ట్ రేప్ ఇన్ ఇండియా) కార్యకర్త యోగితా భయానా దుయ్యబట్టారు.
ఏంజరిగింది?
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం పంటల బీమాపై చర్చ సందర్భంగా అందరికి మాట్లాడేందుకు స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి అవకాశం ఇవ్వడంపై రమేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదమయ్యాయి. సభలో అందరూ ఒకేసారి మాట్లాడడం ప్రారంభిస్తే ఏమి చేయాలని స్పీకర్ అసహనం వ్యక్తంచేయగా, ‘ఒక సామెత ఉంది. అత్యాచారం తప్పదనుకుంటే దానిని ఆనందించాల్సిందే. ప్రస్తుతం మీరు ఈ స్థితిలోనే ఉన్నారు’ అని రమేశ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అనంతరం ఆయన క్షమాపణలు చెబుతూ, గురువారం సభలో మాట్లాడాల్సిన సభ్యుల సంఖ్య ఇంకా మిగిలేఉండటడంతో స్పీకర్‌కు సమయం గుర్తుచేస్తూ తాను ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు. ఒక ఇంగ్లిస్ సామెతను ప్రస్తావించానని, వేరే ఉద్దేశం ఏమీలేదని స్పష్టంచేశారు.
'There is a saying, When rape is inevitable, lie down and enjoy it': You would not believe an ex-Speaker & Congress MLA says this inside the #KarnatakaAssembly and Speaker laughs it off ... No one objects and it is business as usual @ndtv @ndtvindia #OutrageousRapeComment pic.twitter.com/n8oJ8itVDY
— Uma Sudhir (@umasudhir) December 16, 2021
Comments
Please login to add a commentAdd a comment