
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ఓ అంశంపై చర్చ జరుగుతుండగా ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. ప్రతిపక్షనేత సిద్ధరామయ్య ఒక్కసారిగా అసెంబ్లీలో నవ్వులు పూయించాడు.
అసలు ఏం జరిగిందంటే... అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ఓ అంశంపై జరుగుతున్న చర్చలో భాగంగా ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తీవ్రస్థాయిలో సిద్దరామయ్య మాట్లాడుతున్న సమయంలో ఆయన పంచె ఊడిపోయింది. అది గమనించకుండా చర్చలో మాట్లాడుతూనే ఉన్నారు.
అంతలోనే అటువైపుగా వచ్చిన కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. మెళ్లగా సిద్ధరామయ్య వద్దకు వెళ్లి చెవిలో పంచె ఊడిన విషయాన్ని తెలిపారు. వెంటనే తెరుకున్న సిద్ధరామయ్య అసెంబ్లీలో ‘నా పంచె ఊడిపోయింది’ అని కర్ణాటక ఆర్‌డీపీఆర్ మంత్రి ఈశ్వరప్పకు తెలిపి.. ‘నాకు కొంత సమయం ఇవ్వు’ అని అడిగారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో నవ్వులు పూశాయి. కోవిడ్-19 తరువాత కాస్త బరువుపెరిగానని సిద్ధరామయ్య నవ్వుతూ స్పీకర్‌కు తెలిపాడు.
చదవండి: బీజేపీలోనే రాజకీయ వారసులెక్కువ..
Comments
Please login to add a commentAdd a comment