dhoti
-
ఈ హీరోయిన్‌కు 50 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా? (ఫోటోలు)
-
సర్..! మీ పంచె ఊడిపోయింది చూసుకోండి...!
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ఓ అంశంపై చర్చ జరుగుతుండగా ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. ప్రతిపక్షనేత సిద్ధరామయ్య ఒక్కసారిగా అసెంబ్లీలో నవ్వులు పూయించాడు. అసలు ఏం జరిగిందంటే... అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ఓ అంశంపై జరుగుతున్న చర్చలో భాగంగా ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తీవ్రస్థాయిలో సిద్దరామయ్య మాట్లాడుతున్న సమయంలో ఆయన పంచె ఊడిపోయింది. అది గమనించకుండా చర్చలో మాట్లాడుతూనే ఉన్నారు. అంతలోనే అటువైపుగా వచ్చిన కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. మెళ్లగా సిద్ధరామయ్య వద్దకు వెళ్లి చెవిలో పంచె ఊడిన విషయాన్ని తెలిపారు. వెంటనే తెరుకున్న సిద్ధరామయ్య అసెంబ్లీలో ‘నా పంచె ఊడిపోయింది’ అని కర్ణాటక ఆర్డీపీఆర్ మంత్రి ఈశ్వరప్పకు తెలిపి.. ‘నాకు కొంత సమయం ఇవ్వు’ అని అడిగారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో నవ్వులు పూశాయి. కోవిడ్-19 తరువాత కాస్త బరువుపెరిగానని సిద్ధరామయ్య నవ్వుతూ స్పీకర్‌కు తెలిపాడు. చదవండి: బీజేపీలోనే రాజకీయ వారసులెక్కువ.. -
మహాత్ముడు కొల్లాయి గట్టింది ఎందుకు?
గాంధీజీ నిర్ణయం తీసుకున్నారు! అంతే, రాత్రి పది గంటలప్పుడు గుండు గీయించుకున్నారు. మర్నాడు చేనేత కార్మికుల సభలో కొల్లాయి గుడ్డతో ప్రసంగించారు. అది 1921 సెప్టెంబర్ 22. సరిగ్గా వందేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. మోకాళ్ళు దాటని గోచీ, పైన తువ్వాలు. ఇంతే ఆహార్యం! చలికాలం అవసరమనుకుంటే నూలు శాలువా. కన్ను మూసే దాకా అలాగే కొనసాగారు. ఖాదీ తనకు ‘ఐడియా’, ‘ఐడియల్’ అని గాంధీజీ పేర్కొంటారు. పలు భాషలు, సంస్కృతుల భారత దేశానికి ఆయన దుస్తులు గొప్ప ‘కమ్యూనికేషన్’గా పనిచేశాయి. 1921 జూలై 31న బొంబాయిలో అధికారికంగా ప్రారంభించిన విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్‌కి ముగిసిపోవాలి. అయితే అది తృప్తిగా సాగడం లేదు. తగినంత ఖద్దరు దొరకడం లేదని తెలిసింది. ఖరీదు ఎక్కువ కావడంతో కొనడం కష్టం అని కూడా చెప్పారు. దానికి గాంధీజీ, ‘ఖాదీ చాలి నంత దొరక్కపోతే కొల్లాయితో సరిపుచ్చుకోండి’ అంటూ ఉపన్యసించారు. సరిగ్గా ఈ దశలో గాంధీజీ వ్యక్తిగా వంద రెట్లు, కాదు వెయ్యి రెట్లు ఎదిగారు. బిహార్ చంపారణ్య ప్రాంతంలో నీలిమందు పండించే రైతుల కష్టాల పరిష్కారానికి దోహదపడింది గాంధీజీ నాయకత్వం వహించిన తన తొలి భారత దేశపు ఉద్యమం. అహ్మదాబాద్ జౌళి కార్మికుల కోర్కెలకు మద్దతుగా నిలిచింది రెండో పెద్ద ఉద్యమం. ఈ రెండూ గుడ్డలకు సంబంధించినవే. 1918లో జరిగిన జౌళి కార్మిక ఉద్యమంలో రెండు వారాలు గడిచింది. నిరసన తెలిపే కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఓ రోజు గాంధీజీ, అనసూయబెన్ వచ్చారు. సమ్మె కార్మికులెవరూ చెట్టుకింద లేరు. కారణం ఏమిటి అని ఆరా తీశారు. ఓ కార్మికుడు చెప్పాడు: వారికి పోయేదేముంది? కార్లో వస్తారు, ఇంటికెళ్లి భోంచేస్తారు అనే అభిప్రాయముందని! గాంధీజీ మనసు కల్లోలమై, దీర్ఘాలోచనల్లో పడింది. దాని ఫలితమే తన తొలి నిరాహారదీక్ష. 1918 మార్చి 15న ప్రారంభమైంది. ఫలితంగా వారం రోజుల్లో పరిష్కారం లభించింది. ‘త్రికరణ శుద్ధి’ అని అంటామే, దాన్ని సంపూర్తిగా కలిగిన నాయకుడు గాంధీజీ. మోకాళ్లు దాటని గోచీ, లేదా కొల్లాయి కట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? గాంధీజీ మూడవ తరగతి రైలు బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ గుండా రాయలసీమ ప్రాంతపు రైతులను చూశారని, అదే స్ఫూర్తి అని అక్కిరాజు రమాపతిరావు తన ‘దుర్గా బాయి దేశ్‌ముఖ్’ మోనోగ్రాఫ్‌లో పేర్కొన్నారు. మోప్లాల తిరుగుబాటు విషయం తెలిసి మహమ్మ దాలీతో మలబారు ప్రయాణమయ్యారు గాంధీజీ. కానీ వాల్తేరులో మహమ్మదాలీని అరెస్టు చేయడమే కాక, గాంధీజీ మలబారు పర్యటనను కూడా బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. దీనితో గాంధీజీ తన పర్య టనను కుదించుకుని, మదురై వెళ్ళారు. తిరుచురాపల్లి నుంచి మదురైకి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు – తను కొల్లాయి కట్టుకోనంత వరకు రైతులకు ఆ ప్రబోధం చేయకూడదని నిర్ణయించు కున్నారు. తనతో పాటు ప్రయాణం చేస్తున్న రాజాజీకి చెబితే నచ్చలేదు. కానీ గాంధీజీ స్థిర నిర్ణయానికి వచ్చేశారు. విదేశీ వస్త్ర బహిష్కరణకు ఇది తోడ్పడుతుంది. ఖద్దరు ధరించాలనే నియమానికి ప్రతీక అవుతుంది. ఖద్దరు లోటును కొంత పరిష్కరిస్తుంది. మన దేశపు శీతోష్ణస్థితుల్ని బట్టి కూడా గోచీ ధరించడం ఇబ్బంది కాదు. మన సంస్కృతి కూడా మగవాళ్లను తమ శరీరం పూర్తిగా కప్పుకోమని నిర్దేశిం చదు. ఇన్ని కారణాలతో గాంధీజీ యాభై రెండేళ్ళ వయసులో, స్వాతంత్య్రోద్యమం తొలి రోజుల్లో కొల్లాయి గట్టడం ప్రారంభించారు. దేశంలోని ఎందరో దరిద్ర నారాయణులకు ప్రతీక అయ్యారు. కోటానుకోట్ల భారతీయులకు ఆరాధ్యుడయ్యారు. డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి మొబైల్ : 94407 32392 (నేడు గాంధీజీ కొల్లాయి ధారణ శత వసంతాల వేడుక) -
రెండు చీరల కట్టు.. ఆధునికంగా ఆ‘కట్టు’
ఎన్ని మోడ్రన్ డ్రెస్సులు వచ్చినా చీరకట్టుకే మన అమ్మాయిలు ఓటేస్తున్నారు. సంప్రదాయ వేడుకకు, ఇండోవ్రెస్టన్ స్టైల్ పార్టీలకు చీరతోనే సింగారించుకుంటున్నారు. అందుకే, చీరకట్టులోనూ ఎన్నో వినూత్నమార్పులు వచ్చాయి. రెడీమేడ్‌గా వేసుకునే ధోతీ శారీ, ప్యాంట్, పలాజో వంటి శారీస్‌తో పాటు రెండు చీరలతోనూ వినూత్న స్టైల్ తీసుకువస్తున్నారు. పండగలకు, వివాహ వేడుకలకు ఓస్టైల్, వెస్ట్రన్ పార్టీలకూ మరో స్టైల్‌తో ఇలా చీరకట్టులో మెరిసిపోతున్నారు. పెప్లమ్ శారీ కలంకారీ పెప్లమ్ బ్లౌజ్‌తో ప్లెయిన్ శారీ కట్టుకు ఆధునికత జతగా చేరింది. ఏ విధమైన ఇతరత్రా హంగులు లేకుండా చూడగానే వావ్ అనిపించే కళ నేటి కాలపు అమ్మాయిల ఛాయిస్‌గా మారింది. శారీ విత్ దుపట్టా స్టైల్ కంచిపట్టు చీరతో పాటు కంచిపట్టు దుపట్టా కూడా ఎంచుకొని వేడుకలకు ఇలా రెడీ అవ్వచ్చు. రెండు విభిన్నరంగుల కాంబినేషన్‌తో ఈ స్టైల్ తీసుకురావచ్చు. ఎడమ, కుడి భుజాల మీదుగా తీసిన కొంగులు మూలంగా యువరాణీ కళ కనువిందుచేస్తుంది. ప్యాంట్ శారీ ఒకే కలర్, ప్రింట్ కాంబినేషన్లో ప్యాంట్‌కు జత చేసిన పవిట కొంగుతో ఈ డ్రెస్ నవతరం అమ్మాయిలను ఆకర్షిస్తుంది. ఏవిధమైన హంగులు లేకుండా ధరించడానికి సులువుగా ఉండే స్టైల్ ఇది. ఇది ధోతీ శారీకి దగ్గరగా ఉన్నా ప్యాంట్ కావడంతో స్టైల్ భిన్నంగా ఉంటుంది. కాటన్, సిల్క్ ఇతర ప్యాటర్న్లలోనూ ఇవి రెడీమేడ్‌గా లభిస్తున్నాయి. రెండు చీరల కట్టు పూర్తి కాంట్రాస్ట్ చందేరీ చీరలను ఎంచుకొని ఒక రంగు చీరను ఒకవైపుకు లెహంగా కుచ్చిళ్లు సెట్ చేసుకొని, మరోవైపు మరో చీరతో కుచ్చిళ్లు తీసి, భుజం మీదుగా పవిట కొంగు తీయాలి. దీనిని బ్యాలెన్స్ చేసుకోలేం అనుకునేవారు బెల్ట్ లేదా వడ్డాణంతో నడుము దగ్గర సెట్ చేసుకోవచ్చు. బ్లౌజ్‌ను బట్టి, ఈ శారీ అలంకరణ ఆధునికంగానూ, సంప్రదాయంగానూ మార్చుకోవచ్చు. ధోతీ శారీ పండగలకు, పుట్టిన రోజు వేడుకలకు సింపుల్‌గా, గ్రేస్‌గా కనిపించాలంటే ఈ స్టైల్ సరిగ్గా నప్పుతుంది. ధరించడమూ సులువు. పవిట కొంగు ధోతీకి జత చేసి రావడంతో ఇది ధోతీ శారీ డ్రెస్‌గానూ మార్కులు కొట్టేసింది. లంగా ఓణీ స్టైల్లో చీర కట్టు రెండు భిన్నమైన రంగులు తీసుకొని ఒకవైపు ఒక చీర పచ్చ, రెండవ వైపు గులాబీ రంగు చీర కుచ్చిళ్లను సెట్ చేస్తూ లంగాఓణీ మోడల్ వచ్చేలా కట్టుకోవడం. ఈ కట్టు సంప్రదాయ వేడుకలకు సరైన ఎంపిక అవుతుంది. -
గాంధీజీ రాయలసీమ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ..
గాంధీజీ ఒకసారి మూడో తరగతి రైలుపెట్టెలో రాయలసీమ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ రైలు కిటికీలోంచి పొలాలు దున్నుకుంటున్న రైతులను చూసి, వారు మొలచుట్టూ ఒక ఖద్దరు వస్త్రాన్ని మాత్రమే ధరించి, తక్కిన శరీరమంతా నిరాచ్ఛాదనగా చెమట లోడుస్తూ ఎండలో కష్టపడుతూ కనపడగా– రత్నగర్భ నా దేశంలో ప్రజలందరికీ తినటానికి తిండి, కట్టడానికి బట్టలేక పోవటం ఎంత దురదృష్టకరం, దుఃఖకరం అని బాధపడి తాను కూడా ఈ దేశ దౌర్భాగ్య చిహ్నంగా మొలకు అంగవస్త్రం మాత్రమే ధరించాలని కృతనిశ్చయుడైనట్లూ, స్వాతంత్య్రం వచ్చినదాకా అర్ధనగ్నంగానే జీవించాలని నిర్ణయించినట్లూ భోగరాజు పట్టాభిసీతారామయ్య రచించిన సమకాలీన భారతదేశ చరిత్రలో ప్రసక్తమైంది. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు కూడా స్వీయ చరిత్ర (జీవిత నౌక)లో తాను ఇంగ్లండు మొదటిసారి వెళ్లినప్పుడు ఏదో గొప్ప హోటలులో గాంధీజీని యాదృచ్ఛికంగా చూసినప్పుడు మిస్టర్ మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ ఫుల్‌సూట్‌లో, నెక్‌టైతో సహా కనపడిన ఉదంతం ప్రస్తావించారు. ఆ సూట్ చాలా ఖరీదైనదిగా కూడా ఆంధ్రకేసరి అభిప్రాయపడ్డారు. కాబట్టి స్వరాజ్యోద్యమ తీవ్ర కాంక్ష కలిగించినవారు బక్కచిక్కిన తెలుగు రైతులు అనుకోవద్దా?! స్వరాజ్య ఫలసిద్ధి ఉద్యమంలో తెలుగువారి పాత్ర గణనీయమైనది; వ్యక్తులు, సంస్థలు, ఉద్యమాలు తెలుగునాట స్వరాజ్య సంపాదన ఉద్యమాన్ని ముమ్మరం చేశాయి. భారతదేశ స్వతంత్ర పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగు వారికే కాక అఖిల భారతదేశానికి మాననీయుడు. ఒకప్పుడు అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులు న్యాపతి సుబ్బారావు, కార్యదర్శి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అప్పుడు అఖిల భారత కాంగ్రెసు కార్యస్థానం బెజవాడకు వచ్చింది. తెలుగునాట గాంధీ మైదానాలెన్నో ఉన్నవి. ‘హిందూ’ పత్రిక సంస్థాపనంలో న్యాపతి సుబ్బారావు పంతులు సహ భాగస్వామి. అయినా ‘హిందూ’ పత్రిక ఆ విషయం ప్రస్తావించదు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతికి తెలుగు వారంటే గొప్ప ఆదర్శం. తెలుగు భాషనాయన ‘సుందర తెలుంగు’ అని ప్రస్తావించాడు. ఆయన ఒక్కడే కాదు భగవాన్ రమణ మహర్షి ‘తెలుగు మధురమైన భాష, మీ పిల్లలకు నేర్పండి’ అని ఉద్బోధించాడు. ఈ విధంగా తెలుగువారు అనేక త్యాగాలు చేసి, సంస్థలు నిర్మించి, జైళ్ల పాలై స్వరాజ్యోద్యమంలో పాల్గొన్నారు. పెదనందిపాడు రైతుల సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, సైమన్ కమిషన్‌ను వెనక్కి వెళ్లిపోవల్సిందన్న గర్జన, పల్నాటి మించాలపాటి పన్నుల నిరాకరణ తెలుగువారు స్వరాజ్యోద్యమంలో నిర్వహించిన పాత్ర స్మరణీయమైనవి. వాటి గూర్చి ఇటువంటి ఉత్తేజకర సంగతులు తెలుసుకుందాం. తెలుగువారిలో గాంధీలు, తిలక్‌లు, బోసులు, నెహ్రూల పేర్లు ఉన్నంతగా భారతదేశం ఇతర ప్రాంతాలలో ఉన్నాయో, లేదో?! – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవం సందర్భంగా) -
ధోతీ కట్టుకున్నాడని రైల్లోనుంచి దింపేశారు!
లక్నో : ధోతీ ధరించిన కారణంగా ఓ వృద్ధుడిని రైల్లోనుంచి కిందకు దింపేశారు సిబ్బంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎతవా నగరంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ బరబంకీకి చెందిన రామ్ అవధ్ దాస్(82) ఎతవా నుంచి ఘజియాబాద్ వెళ్లటానికి శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్ రిజర్వ్ చేసుకున్నాడు. గురువారం ఉదయం ఘజియాబాద్ వెళ్లటానికి ఎతవా రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌కు చేరుకోగానే అందులోకి ఎక్కాడు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆయనదగ్గరకు చేరుకున్న రైల్వే సిబ్బంది రామ్ అవధ్ దాస్ వేసుకున్న దుస్తులను, అతని వాలకాన్ని చూసి కిందకు దింపేశారు. వారి ప్రవర్తనతో కలత చెందిన పెద్దాయన కిందకు దిగి వేరే బోగిలోకి ఎక్కబోయేలోగా రైలు కదిలి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన రామ్ అవధ్ దాస్ సిబ్బంది ప్రవర్తనపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. రామ్ అవధ్ దాస్ మాట్లాడుతూ.. ‘‘ నాకు టిక్కెట్ ఉన్నా రైల్వే సిబ్బంది, టిక్కెట్ కలెక్టర్ నన్ను బోగిలోకి అనుమతించలేదు. వారి తీరుతో నాకు చాలా బాధకలిగింది. నేను వేసుకున్న (ధోతీ)దుస్తులు వారికి నచ్చకపోవటం వల్లే నన్ను కిందకు దించేశారు. మనం ఇంకా బ్రిటీష్ పాలనలో ఉన్నామా? అనిపించింద’’ని తెలిపారు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు.. ‘‘అతడు పొరపాటున వేరే బోగిలోకి ఎక్కటం మూలానే సిబ్బంది అతన్ని కిందకు దింపేశారు. వాళ్లు అతన్ని కించపరచలేదు. అతడు వేరే బోగిలోకి ఎక్కే సమయంలో రైలు కదిలి వెళ్లిపోయింద’’ని వెల్లడించారు. -
మావా! సుందరం మావా!!
‘‘ద్రౌపదమ్మ తిరునాళ్లకి పోవాలిరా పాండురంగా! మరవమాకు. వచ్చే మూడో శనివారం రథంలాగుడు, ఆదివారం అగ్గి తొక్కేది’’. పంచె ఎగగట్టుకుంటూ మీసాలు లాగుకుంటూ మేనల్లుడు పాండురంగంతో సుందరం మావ చెప్పినాడు. ‘‘పుత్తూరు తిరునాళ్లకి మావ తోడుగా పోయిరారా కొడకా! ద్రౌపదమ్మని మొక్కితే సెడ్డాగిడ్డా కొట్టకపోతాది. బాగుపడతావ్’’ అని అరస్తా సెప్పింది అమ్మ అనసూయమ్మ. నల్లంగా, జెండామానులగా వుంటాడు సుందరం మావ. అయిదారు ఊర్లల్లో అందరితోనూ అడ్డంగా మాట్లాడతాడు. అందరూ సమానమే! ‘అందరూ కుడిసేత్తో తిని ఎడంసేత్తో కడుక్కొనేటోళ్లేకదా’ అని ఎగిరెగిరి చెబుతాడు. ‘అందరూ ఎట్లా సమానమవుతారని?’ ఊర్లో నోర్లంతా మావని తిడతా వుంటాయి. అయినా అమ్మకి మావ భలే మంచోడు. ఎంతయినా తోడబుట్టినోడు కదా, సందు పోనిస్తదా ఏంటి? ‘మేనమామ మాట మల్లెలమూట’ అంటంది అమ్మ. ‘మేనమామ మాట సద్దిమూట’ అనికూడా అంటంది. ‘మావ సెప్పినట్టు వినరా కొడకా, సుఖపడతవ్’ అంటుంది. మావ ‘నీ మంచి కోరేటోడేగానీ నీకు సీమంత సెడ్డ సేయడురా కొడకా’ అంటుంది. ‘ఇంట్లో దేముడి ఫోటోలు తీసేసి మావ ఫోటోలు పెడ్తాంరా కొడకా’ అని రెండు మూడు సార్లు చెప్పింది కూడా. అట్టాంటి మావతో మేనల్లుడు తిరునాళ్లకి బయలుదేరినాడు. చేంద బావి నీళ్లు తలపైన పోసుకొని ముఖంపైన మురుగడి విభూది పెట్టి పాలమంగళం పంచె కట్టి రెడీ అయినాడు. జేబులో సిల్లరేసుకొని రంగురంగుల సొక్కా వేసుకొని వచ్చీరాని మీసాలను దువ్వెనతో దువ్వి పూలరంగడి లెక్కన రాసపల్లి నుంచి బయలుదేరినాడు. దారిన పోతావుంటే నల్లరంగన్న, ఎర్రరంగన్న, పొడల పాలాయన, మెల్లకన్ను మునిలక్ష్మి, బొజ్జనత్తం బండారామన్నలు పలకరించినారు. నిలబడి అవీయివీ మాట్లాడినారు మావా అల్లుళ్లు.నరసింహన్న కూతురు భాగ్యలక్ష్మి సింగారంగా కొప్పునిండా కనకాంబరాలు పెట్టి ఎదురువచ్చినాది. ఆయమ్మి చీరకట్టేది కొత్తో ఏమో! చీరని ఒంటికి కట్టుకోలా. ఒంటికి చుట్టుకున్నట్టుగా వుంది. గట్టిగా నవ్వితే నడుంనుంచి చీర బొడ్డు కిందికి జారిపోయేట్టు గట్టిగా తుమ్మితే ఊడి పడిపోయేట్టుగా కట్టి వుండాది. చీర కట్టడాలు అమ్మలక్కలు నేర్పిస్తే కదా పాపం. ఆయమ్మిని పలకరిద్దామని పాండురంగం నిలిచినాడు. ఆయమ్మి వాడిని చూసీచూడనట్టుగా దాటుకొని వెళ్లిపోయింది.‘ఎంతయినా పెండ్లి కావాల్సిన పిల్లకదా! ....కొంచెం బలుపు వుంటాదిలే’ అనుకొని గమ్మున నడిచినాడు.రెడ్డోళ్ల బావికాడికి పోయేసరికి మీసాలాయన కొడుకు జ్యోతిరాజు గాడు కానవచ్చినాడు. చెరుకుగడలు ముందుర వేసుకొని కసాకసా నమలతా వుండాడు. పలకరిస్తే పలకలేనంతగా నోటితోనే గానుగ ఆడిస్తావుండాడు.పోతాపోతా బావి ప్రక్కన మునగసెట్టు కాడ నిలిచినాడు సుందరం మావ. జ్యోతిరాజుకి కానరాకుండా నాలుగు మునగకాయలు కోసినాడు.‘‘మునగ కాయలు మనకి దేనికి మావా! మన కయ్యికాడ దండిగా వుండాయి కదా’’ అని పాండురంగం చెప్పినాడు. ‘మన తోటలో మునక్కాయ మనకి రుచిగా ఉండదురోయ్! ఊళ్లోళ్ల మునక్కాయలైతే భలే మంచి రుచగా వుంటుంది’ అని చిన్నగా చేతి సంచిలో మూటకట్టినాడు. నవ్వుకుంటూ ఊళ్లోవాళ్ల గురించి, సినిమావాళ్ల గురించి మాట్లాడతా ఇరవై నిమిషాల్లో రెండు మైళ్లు నడిచినారు. ఇద్దరూ జేబుల్లో పోసుకొచ్చిన బఠాణీలు, ఉప్పుశెనగలు తింటా శాంతి సినిమా టాకీసు కాడికి చేరుకున్నారు. అక్కడ ధర్మరాజుల గుడి పెద్దలు చల్ల మజ్జిగ పంచతా వుండారు. ఇసుకలో నల్ల కుండలు పెట్టి కుండలకు తెల్లగుడ్డలు చుట్టి గుడ్డ ఎండినప్పుడల్లా తడి చేస్తా వుండారు. తెల్ల మజ్జిగ, చల్ల మజ్జిగ చూసి సుందరం మావ నిలబడలేక పోయినాడు. రెండు సత్తు గ్లాసుల నిండా తాగినాడు. కొత్తమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపలు వేసి తిరగమాత వేసి ఉప్పఉప్పగానీళ్లమజ్జిగ చేసి వుండారు. మీసాలకంటిన మజ్జిగని నాలికతో లాక్కొని ఉప్పంగా కమ్మగా వుండేసరికి మళ్లా రెండు గ్లాసులు తాగినాడు. మజ్జిగ పోసేటోళ్లు సినిమా చూసినట్లు చూస్తావుండారు. పాండురంగడికి మజ్జిగ తాగను మనసుకిరాలేదు. మజ్జిగ బాగలేక కాదు. మజ్జిగపోసే అమ్మి నల్లగా వుండాది. నల్లపిల్ల మజ్జిగ ఇస్తే చల్లగా వుండదా ఏమిటి? అట్లనికాదు. ఆ పిల్ల ముక్కుపుడక బిరడాకి చీమిడి అంటి వుండాది. అది చూడను సగించలా. అందుకు తాగలేదు పాండురంగడు. మావ ఏమో తాగింది తాగిందే ... అట్టాయిట్టా నడుచుకుంటూ ద్రౌపదమ్మ గుడికాడికి చేరినారు. రథం కదులుతోంది. జనాలు దండిగా చేరి వున్నారు. చిన్న తాగేలివాళ్లు తప్పట్లు, తాళాలతో భజనలు చేస్తున్నారు. పచ్చికాపల్లం స్వామి పద్యాలు పాడుతున్నాడు. రామగిరి కళాబృందం మేళతాళాలతో పాటలు పాడుతోంది. గెరామణి గ్రూపు డాన్సు వాళ్లు రంగులేసుకొని సినిమా పాటలు మైకులో పాడతా వుండారు.కుర్రకారు ‘జజ్జనక జజ్జనక’ డ్యాన్సులు వేస్తున్నారు. పతంగులు ఎగుర వేస్తున్నారు. కదిరిమంగళం వాళ్లు కోలాటం చేస్తావుండారు. బుగ్గ అగ్రహారం వాళ్లు బూరలు ఊదుతున్నారు. గూలూరు వెంకటయ్య దాయాదులు రంగునీళ్లు చల్లుతున్నారు. తొరూరు నారాయణ స్వామి మనుషులు జనాలపైన, రథంపైన పూలు విసురుతున్నారు. అత్తరు సాయిబు పన్నీరు చల్లతా వుండాడు. రథానికి కట్టిన చామంతి మాలలు గాలికి ఉయ్యాలలలాగా ఊగుతున్నాయి. రథం నాలుగు దిక్కులా వున్న బొమ్మగుర్రాలు దూకడానికి సిద్దంగా వున్నట్లుగా వున్నాయి. రథం చుట్టూ కట్టిన రంగురంగు చీరలు గాలికి రెపరెపలాడుతున్నాయి. గోవిందనామంతో హోరెత్తుతోంది. రథం ముందు తిక్కశంకరుడు పులి అడుగులు వేస్తున్నాడు. కోటిగాడు కేరింతలు కొడుతున్నాడు. రథాన్ని జనాలంతా ‘‘హైలెస్సా హైలెస్సా’’ అంటూ లాగుతున్నారు.కదులుతున్న రథానికి పట్టు చీరలు కట్టినోళ్లు కర్పూర హారతులిస్తున్నారు. భలే పసందుగా వుంది వాతావరణం. రథంపైన మిరియాలు విసిరితే చర్మవ్యాధులు రావని ఊరిజనం నమ్మకం. తీట, గజ్జి, తామర, తెల్లపొడ, నల్లపొడ, చుండ్రు, మొటిమలు, చెమటకాయలు, పులిపురి కాయలు దగ్గరికి రావని అంటారు. ఉంటే పోతాయని కూడా చెబుతారు.ఇంటి నుంచి మూట కట్టుకొచ్చిన మిరియాలను మావా అల్లుల్లిద్దరూ చల్లినారు. దూరం నుంచే రథానికి దండాలు పెట్టినారు. ఇంక ఇంటికి వెళ్దామని పోతా పోతా తుంబూరాహోటల్ దగ్గర ఆగినారు. రవ్వ ఇడ్లీలు ఇక్కడ బాగుంటాయని, తిందామని చెప్పిన సుందరం మావ నేరుగా హోటల్లోకి దూరినాడు. చక్కగా చేతులు కడుక్కొని కుర్చీలాక్కొని కూర్చొని టేబుల్‌పైన దరువేస్తూ ఒక ప్లేటు ఇడ్లీకి అర్డరిచ్చినాడు. ‘ఇద్దరికీ ఒక ప్లేటు ఇడ్లీ ఎట్టా సరిపోతుందో’ పాండురంగడికి అర్థంకాక అట్టాయిట్టా చూసినాడు. సినిమా పుస్తకం దొరికితే బొమ్మలు చూస్తా వుండిపోయినాడు. సుందరం మావ ఒక ఇడ్లీ పక్కన పెట్టి గిన్నెల గిన్నెల సాంబారు పోసుకొని పిసికి పిసికి తినినాడు. అట్లనే రెండో ఇడ్లీ కూడా సగం తినేసినాడు. మిగిలిన సగం ఇడ్లీని రెండుగా చేసి అటూ ఇటూ చూసినాడు. సప్లయిరుగానీ, వంటవాళ్లుకానీ, గల్లా మనిషి కానీ చూడటం లేదని నిర్ధారణకు వచ్చినాడు. వెంటనే తలలోని ఒక నల్ల వెంట్రుకను గభీమని పెరికి ఇడ్లీ ముక్కల మధ్యలో దూర్చినాడు. అవేశంగా లేచి సప్లయిర్లనీ హోటలోళ్లనీ అరవసాగినాడు. మావ రచ్చకి అందరూ పరుగెత్తుకొచ్చినారు. ‘‘మీరు ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు, ఇడ్లీలు ఉడికించేటప్పుడు, ఇడ్లీలు జనాలకు పెట్టేటప్పుడు చూసుకోవద్దా? చూడండి! ఇడ్లీలో వెంట్రుక వచ్చింది. మేము ఈ భూమిపైన వుండాల్నా పోవాల్నా’’ అని ఊగిఊగి అరిచినాడు. హోటలోళ్లంతా భయపడి గుంపు చేరినారు. మావని సముదాయిస్తూ మావా అల్లుళ్లిద్దరినీ ప్రక్క గదిలోకి తీసుకొనిపోయినారు. ఒక్కసారిగా మావ అక్కడ హీరో లెక్కన మారిపోయినాడు. తప్పు జరిగిందని ప్రాధేయపడినారు. నేతి ఇడ్లీలు తెప్పించి, అలసంద వడలు వేయించి, ఫిల్టర్ కాఫీ తాగించి డబ్బులేవీ తీసుకోకుండా సాగనంపినారు. గుట్టురట్టు చేయవద్దని చేతులు పట్టుకున్నారు. తాంబూలం తీసుకొమ్మని పుత్తూరు వక్కపొడి చేతినిండా పోసినారు. మావా అల్లుళ్లిద్దరూ చంకలు గుద్దుకున్నారు. వాళ్లు హోటల్ మెట్లు దిగతా వుంటే పాండిచ్చేరి పకోడి మాష్టార్ ‘ఒరే కోలాటం రొంబ కొండాట్టం’ అనడం వారికి వినిపించింది. మావ డ్రామా చూడటానికి భలేముచ్చటేసింది మేనల్లుడికి. ‘‘కనబడడు కానీ మావలో ఎన్ని వయ్యారాలో ... పైసా సెలవకాకుండా ఇద్దరికీ కడుపునిండా టిఫినీలు తినిపించిన మావ రుణం ఎట్టా తీర్చేదబ్బా’’ ... ఆలోచించినాడు రాత్రంతా. అగ్గి తొక్కేరోజు సాయంత్రం అయిదింటికంతా బయలుదేరి ద్రౌపదమ్మ గుడి కాడికి చేరినారు. అగ్గి తొక్కేటోళ్లు సిద్దంగా వున్నారు. ఒకరి వెనకాల ఒకరు నిలబడి వున్నారు. ఎనబైమంది దాకా వున్నారు. వారిముందు తిరుత్తణి మేళం జట్టు డప్పులు వాయిస్తోంది. పసుపు నీళ్లల్లో అద్దిన పంచె, బన్నియను వేసివున్నారు అగ్గితొక్కేటోళ్లు. వేప మండలు చేత పట్టుకొని, ముఖానికి కాళ్లకి గరువాయూరు గంధం, కంచి కుంకుమలు పూసి వున్నారు. ఎడమచేతికి గుండు మల్లెలు చుట్టినారు. కుడి చేతికి అగ్గి కంకణం కట్టినారు. మెడలో తురక చామంతుల మాలవేసినారు. భక్తిగా గోవిందలు పలుకుతున్నారు. పిల్లా జల్లా అగ్గి తొక్కేటోళ్ల వారి కాళ్లపైన పడి దండాలు పెట్టినారు. బిడ్డలు లేని మొగుడూ పెళ్లాలని వీధుల్లో పనబెట్టి అగ్గితొక్కేటోళ్ల చేత దాటించినారు. పలకలోళ్లు పలకలు వాయిస్తున్నారు. గెరిగెలు ఎత్తుకొని ఊరేగుతున్నారు. మీసాలొస్తున్న పిలకాయలు, మీసాలొచ్చిన పిలకాయలు, ఈలలు, ఊలలు వేస్తున్నారు. పెద్ద పూజారి పసుపు జండా ఊపినాడు. దబదబమని పరుగులు తీసినారు అగ్గితొక్కేటోళ్లు. ఊరంతా తిరిగి ఊరి బయటవున్న అనంతరాజు బావి, మిషను బావి, రామన్న బావి, జయన్న బావి, సూర్యనారాయణ బావి, కోమటోళ్ల బావి, నడిపక్క బావి....ఈ మాదిరి పదహారు బావుల్లో దూకిదూకి ఒళ్లంతా తడిచేసుకొని చివరిగా అగ్గితొక్కుతారు. అగ్గితొక్కినాక పాల్లో కాళ్లు పెట్టాలి. దీంతో అగ్గితొక్కడం అయిపోయినట్లే. ‘‘మావా! టిఫిన్ చేసిపోదాం. ఈరోజు ఉభయం నాది, నిన్న నాకు బంగారం లాంటి ఇడ్లీలు తినిపిస్తివి. నేను మాత్రం తక్కవా? నీకు ఈరోజు మసాలా దోశెలు తినిపిస్తా మావా’’ అని చెప్పినాడు పాండురంగడు. మావకి నోట్లో చక్కెర పోసినంత సంబరమయినాది. తన మేనల్లుడు తన ట్రైనింగుతో స్టెప్పు బై స్టెప్పు ఎదగతా వుండాడని మురిసిపోయినాడు. వాడిని అక్కడే ఎత్తుకొని గిరగిరా తిప్పదామనిపించింది ‘కానీ మోకాళ్లనొప్పులొకటి వచ్చినాయి కదా ప్రాణానికి’ అని ఊరుకున్నాడు. నిన్న తుంబూరా హోటల్లో తినినాం కదా. ఈసారి కొత్తగా మండీవీధిలో తిరపతా హోటల్లో తిందామని బయలుదేరినారు. చక్కగా చేతుల్ని మెడిమిక్సు సోపుతో రుద్దిరుద్ది కడిగినారు. అడిగి ఫ్యాను వేయించుకొని ఫ్యానుకింద కుర్చీలో కూర్చున్నారు. సర్వర్‌ని పిలిచి మసాలా దోశె ఒకటి తెమ్మని ఆర్డరిచ్చినాడు పాండురంగడు. ‘నీకు స్పెషల్ మసాలా దోశెలు తినిపిస్తా కాసేపు వుండు మావా’ అన్నట్లుగా వున్నాయి వాడి చూపులు. మేనల్లుడి తెలివితేటలకి ముచ్చటపడినాడు సుందరం మావ. ముద్దు మీద ముద్దు పెట్టాలనిపించింది. వాడికున్న నోరుపుండు గుర్తొచ్చి గమ్మున వుండినాడు. మసాలా దోశె వచ్చింది. తినడం ప్రారంభించినాడు పాండురంగడు. కుర్మాలోని ఉల్లిపాయ, పచ్చిమిరప, అల్లం, జీడిపప్పులను ఏరిఏరి కసాకసా తింటా వుండాడు. పొద్దుపోక సుందరం మావ హోటలోళ్ల తెలుగు పేపరుని కూడికూడి చదవతా వుండినాడు. సినిమా బొమ్మల్ని కసితీరా చూసినాడు. సగందోశె తినినాక పాండురంగడు చిన్నచిన్నగా తన చొక్కా జేబులో పెట్టకచ్చిన పొట్లం బయటికి తీసినాడు. రామక్కవ్వ పొడగాటి తెల్లనల్ల వెంట్రుకని తీసినాడు. చిన్నగా కుర్మా మధ్యలో దోపినాడు. నాటకం ప్రారంభించినాడు. ‘‘ బుద్ధి వుందా లేదా మీకు! వంటల్లో వెంట్రుకలు వచ్చేది చూసుకోరా? ఎట్టంటే అట్ట పెట్టేస్తారా? మేము ప్రాణాలతో వుండాల్నా? లేక పైకి పోవాల్నా? అంటూ పూనకం వచ్చినోడి లెక్కన వీరావేశంతో అరిచినాడు. హోటల్‌కి తినను వచ్చినోళ్లు, సర్వర్లు ఏం జరుగుతోందోనని ఎగాదిగా చూస్తా వుండారు. సుందరం మావ సస్పెన్స్ సినిమా చూసేవాడిలాగా కనుగుడ్లు పెద్దవిగాచేసి చూస్తా వుండాడు. సుందరం మావ భుజంపైన తువ్వాలును తీసి తలకు బిగించి కట్టినాడు. ఇంతలో మెరుపులాగా దూసుకొచ్చినాడు గల్లాపెట్టెకాడి గణేశం దబీదబీమని కొట్టినాడు పాండురంగడిని. అడ్డుపడదామని సుందరం మావ లేచినాడు. పటపటమని సుందరం మావనీ కొట్టినాడు గల్లాపెట్టె గణేశం. బెదిరిపోయిన మావ ‘ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకవచ్చు’ అని పంచె ఎగ్గట్టుకొని తలపైన తువ్వాలు పెరికేసి పరుగులెత్తినాడు. పరిగెత్తి పరిగెత్తి ఈశ్వరుని గుడికాడి కానగ సెట్టుకింద కూలబడినాడు. పాండురంగడిని సర్వర్లు తన్నుకుంటూ వంటగదికి తీసుకెళ్లినారు. వంటగాళ్లంతా గుండ్రంగా నిలబడినారు. తలా ఒక ఏటు ... ధర్మ ఏట్లు.... దండిగా పడినాయి. కట్టెల పొయ్యిలోని కట్టెతో వాతలు పెడతారేమోనని భయపడినాడు పాండురంగడు. వేడివేడి గంజి ముఖంపైన పోస్తారేమోనని బిత్తరపోయినాడు. సలసలకాగే నూనె తీసి నోట్లో పోస్తారేమోనని బిగసకపోయినాడు. కూరగాయల కత్తితో గొంతు కోసేస్తారేమోనని బెంబేలు ఎత్తినాడు. అలాంటిది ఏమీ జరుగలేదు కానీ కాఫీ మాస్టరు కన్నడ తిట్లు, తమిళ వంటవాడు తమిళ తిట్లు, దోశెల మాస్టారు మళయాళ తిట్లు, కోస్తా కుర్రాడి మసాలా తిట్లు పడ్డాయి. అందరికీ దండాలు పెట్టి కళ్ల నీళ్లు పెట్టుకొని జారుతున్న పంచెని ఎగ్గట్టుకొని బయటపడినాడు. రోడ్డుమీదకొచ్చి అట్టాయిట్టా చూసినాడు. దూరంగా కానగ సెట్టుకింద బిత్తర బిత్తరగా చూస్తూ దాక్కొని వున్న మావ కనబడినాడు. చిన్నచిన్నగా అడుగులేసుకుంటూ మావని చేరినాడు. ‘ఏమయ్యిందిరా మేనల్లుడా’ అని వాటేసుకున్నాడు మావ. ‘‘మావా! తిరపతామె హోటల్లో కెమెరాలు వుండాయి మావా. గల్లా పెట్టెకాడి కెమెరాలో అంతా కనబడతాది మావా. గల్లాపెట్టె గణేష్గాడు వెండితెరపైన బొమ్మ చూపిస్తా నన్ను జాంజాంమని కొట్టినాడు మావా. అడిగినోళ్లకంతా నా పొట్లం కథ ‘‘ఝూం’’ చేసి చూపిస్తా వుండాడు మావా’’. అంతే! అక్కడే నిలబడి వుంటే మళ్లీమళ్లీ పిలిచి కొడతారేమోనని మావా అల్లుళ్లిద్దరూ పరుగులు తీసినారు. పరిగెత్తి పరిగెత్తి అగ్గితొక్కేటోళ్ల గ్రూపులో చేరినారు. నిప్పుల్లో నడిచినారు. పాలల్లో కాళ్లు పెట్టినారు. గోవిందులు పలికినారు. వారికి ఎక్కడో పలకలు మోగుతున్నట్లుగా వినిపించింది. అంబికాపురం అంకడు ఈలలు వేయడం లీలగా కనిపించింది. - ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
పంచె కంటే పాతది ప్యాంటుకట్టు
పంచె పాతదా? ప్యాంటు పాతదా? అంటే పంచెకట్టే పాతదని ఠక్కున చెప్పేస్తాం. అంతేకాదు, పంచెకట్టే వాళ్లకు ఫ్యాషన్ తెలియదని కూడా పెదవి విరిచేస్తాం. వాళ్లను పాతకాలం మనుషులుగా తీసిపారేస్తాం. అయితే, ఈ అభిప్రాయం సరికాదు. నిజానికి పంచెకట్టు కంటే ప్యాంటుకట్టే ఏజ్ ఓల్డ్ ఫ్యాషన్. మరోలా చెప్పాలంటే ప్యాంటుకట్టుతో పోలిస్తే, పంచెకట్టే లేటెస్ట్ ఫ్యాషన్. చరిత్రను తవ్వితీస్తే బయటపడిన విశేషమిది. ఉత్తర ఇటలీ ప్రాంతంలో పర్యటిస్తున్న ఇద్దరు జర్మన్ పర్యాటకులకు 1991లో ఒక మంచుమనిషి మమ్మీ కనిపించింది. ఆ మంచు మనిషి మమ్మీకి తోలుతో తయారు చేసిన ప్యాంటులాంటి వస్త్రవిశేషం, నడుముకు బెల్టులాంటి పట్టీ ఉన్నాయి. లాబొరేటరీల్లో పరీక్షలు జరిపితే, ఆ మంచుమనిషి మమ్మీ సుమారు క్రీస్తుపూర్వం 3300 సంవత్సరాల నాటిదని తేలింది. - పన్యాల జగన్నాథదాసు -
బికినీలు వద్దు.. ధోతిలే ముద్దు!
పానాజీ: గోవా బీచ్ ల్లో బికినీలు ధరించడానికి వీల్లేదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన గోవా మంత్రి సుదీన్ ధావల్కర్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గోవా ప్రజలు సంప్రదాయ పద్దతిలో ధోతిలు ధరించాలని సుదీన్ పిలుపునిచ్చారు. ధోతి ధరించే భారతీయ సాంప్రదాయం ప్రపంచంలోనే గొప్ప సంస్కృతి అని అన్నారు. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ శాసన సభ్యుడు విష్ణు వా ధోతి ధరించడంపై సుదీన్ స్పందించారు. విష్ణును స్పూర్తి తీసుకుని అందరూ థోతి ధరించాలన్నారు. యువతులు నైట్ క్లబ్ లో స్కర్టులు ధరించడం వల్ల గోవా సంస్కృతికి ముప్పు వాటిల్లుతోందని సుధీన్ ఇటీలవ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. -
తమిళనాట దోవతీ పంచాయతీ!
-
'ఊడిపోతాయనే లుంగీలను అనుమతించలేదు'
లుంగీ కట్టుకు వచ్చారని ఏకంగా ఒక హైకోర్టు జడ్జినే అనుమతించకుండా బయటకు పంపేసిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ క్లబ్బు.. ఇప్పుడు తన డ్రెస్ కోడ్‌ను మరోసారి పరిశీలించుకోడానికి సిద్ధమైంది. పూర్తి ప్యాంటు, షర్టు లేదా కాలర్ ఉన్న టీషర్టు, లెదర్ బూట్లు ధరించిన వారికి మాత్రమే తమ క్లబ్బులోకి ప్రవేశం అంటూ చాలా కాలంగా ఈ వ్యవహారం కొనసాగిస్తోంది. అయితే.. ఈనెల 11వ తేదీన ఓ పుస్తకావిష్కరణకు వచ్చిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిపరంధామన్ సంప్రదాయ పద్ధతిలో లుంగీ కట్టుకుని రాగా, ఆయనను వెక్కి పంపేశారు. 'స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా ఈ వివక్ష కొనసాగడాన్ని నేను అంగీకరించలేను. వాళ్ల సభ్యులకైతే నిబంధనలు పెట్టుకోవచ్చు గానీ, ఆహ్వానం మీద వచ్చినవాళ్లకు కాదు' అని ఆయన మండిపడ్డారు. దీనిపై తాజాగా క్లబ్బు యాజమాన్యం వివరణ ఇచ్చింది. న్యాయమూర్తిని అడ్డుకున్న సభ్యుడు తమకు క్షమాపణలు చెప్పారని, ముందుగా న్యాయమూర్తికి డ్రస్ కోడ్ గురించి చెప్పకపోవడం తప్పేనని తెలిపింది. అయితే.. మరో సీనియర్ సభ్యుడు మాత్రం అసలు విషయం చెప్పారు. తాగిన మత్తులో లుంగీ జారిపోతే బాగోదు కాబట్టే లుంగీలను నిషేధించామని, కానీ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేమని ఆయన అన్నారు.