బికినీలు వద్దు.. ధోతిలే ముద్దు! | Anti-bikini minister Sudin Dhavalikar wants Goans to wear dhotis | Sakshi
Sakshi News home page

బికినీలు వద్దు.. ధోతిలే ముద్దు!

Published Tue, Jul 22 2014 6:40 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

Anti-bikini minister  Sudin Dhavalikar wants Goans to wear dhotis

పానాజీ: గోవా బీచ్ ల్లో బికినీలు ధరించడానికి వీల్లేదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన గోవా మంత్రి సుదీన్ ధావల్కర్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గోవా ప్రజలు సంప్రదాయ పద్దతిలో ధోతిలు ధరించాలని సుదీన్ పిలుపునిచ్చారు. 
 
ధోతి ధరించే భారతీయ సాంప్రదాయం ప్రపంచంలోనే గొప్ప సంస్కృతి అని అన్నారు. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ శాసన సభ్యుడు విష్ణు వా ధోతి ధరించడంపై సుదీన్ స్పందించారు. విష్ణును స్పూర్తి తీసుకుని అందరూ థోతి ధరించాలన్నారు. 
 
యువతులు నైట్ క్లబ్ లో స్కర్టులు ధరించడం వల్ల గోవా సంస్కృతికి ముప్పు వాటిల్లుతోందని సుధీన్ ఇటీలవ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement